అంబ పలుకు..ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ పలుకు అంటున్నారు తెలుగు ప్రజలు. రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారు న్యూస్ పేపర్ చదవగలిగే వారు రాధాకృష్ణ పలుకు తప్పనిసరిగా చదువుతారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారం వారం తన పత్రికలోనూ, చానల్లోనూ వినిపించే కొత్త పలుకు ఇప్పుడు అత్యంత విశ్వసనీయమైనది నిలిచింది. ఆంధ్రజ్యోతి అంటే అక్కసు వెళ్లగక్కేవారు సైతం ఆర్కే కొత్త పలుకుకి అభిమానులైపోతున్నారు. ఆయన చెప్పినది ఏ ఒక్కటీ తప్పుకాలేదు. రాసిన ప్రతీది అక్షరసత్యమైంది. మే 7వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో అరబిందో శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చేందుకు జగన్ రెడ్డి ఒప్పుకున్నారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. సరిగ్గా నెలరోజులు తిరగకముందే అక్షరం పొల్లు పోకుండా ఏబీఎన్ ఆర్కే చెప్పినట్టే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిపోయారు. బాబాయ్ హత్యకేసులో అడ్డంగా సీబీఐకి బుక్కయిన కడప ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు తానూ ఈ కేసు నుంచి బయటపడటానికి ఏం చేయాలో చెప్పాలంటూ జగన్ రెడ్డి కేంద్రంలో పెద్ద తలకాయ కాళ్లపై పడ్డారని, మీరేమి చెప్పినా చేస్తానని తన తలని ఆ పెద్దకి అప్పగించేశారని సమాచారం. తన విధేయత, ఇప్పటివరకూ చేసిన సాయం గుర్తుంచుకుని సీబీఐ కేసునించి తమ్ముడిని, తనని బయటపడేస్తే చాలు విశ్వాసిగా పడి ఉంటానని సరెండర్ అయిపోయాడు జగన్. ఇదే విషయాన్ని ఆర్కే తన కొత్త పలుకులో రాశారు. ఆయన రాసి నెలరోజులు కాలేదు. సీబీఐ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా వెసులుబాట్లు ఇస్తూ, ముందస్తు బెయిల్ వచ్చేందుకు కావాల్సిన సమయం ఇచ్చిందనే ఆరోపణలున్నాయి. అటు అవినాష్ రెడ్డికి రిలీఫ్ లభించగానే ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారుతున్నట్టు ప్రకటించారు. అటు అవినాష్ రెడ్డిని బయటపడేసేందుకు విజయసాయిరెడ్డి అల్లుడి అన్నని లిక్కర్ స్కాములో బలిపశువుని చేయడానికి అందరినీ ఒప్పించుకున్నారని ప్రచారం సాగుతోంది. తాను సేఫ్ అనీ, సాయిరెడ్డి ఆయన కుటుంబం ఆ లిక్కర్ కేసునించి బయటపడే దారి వారికి వారే చూసుకుంటారనే ధోరణిలో జగన్ రెడ్డి ఉన్నారని సమాచారం.
news
కడప గడపల్లో అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ నినదించిన లోకేష్
బాబాయ్‌ని చంపాం..బెయిల్ తెచ్చుకున్నామని సంబరాలు చేసుకుంటున్న అబ్బాయిలకి నారా లోకేష్ చుక్కలు చూపిస్తున్నాడు. సొంత బాబాయ్‌ని చంపేసి, నారాసుర రక్తచరిత్ర అంటూ తమకి రక్తం అంటించే కుతంత్రాలని అప్పట్లోనే ఎండగట్టిన నారా లోకేష్ తాజాగా తన యువగళం పాదయాత్ర వేదికగా అబ్బాయిల రక్తచరిత్రని కడప గడపలకి తీసుకెళుతున్నాడు. ప్రొద్దుటూరు పాదయాత్రలో హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు టిడిపి కేడర్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిఎస్పీ వచ్చి ప్లకార్డులు పట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎందుకు అని నిలదీసిన నారా లోకేష్ తో డిఎస్పీ వాగ్వాదానికి దిగారు. దీంతో అబ్బాయిలే బాబాయ్‌ని చంపారనే ప్లకార్డులు లోకేష్ పట్టుకుని మరీ చూపించారు. హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్ ని లేపేసింది ఎవరు అంటూ ప్రజలని అడుగుతుంటే, అబ్బాయిలే చంపేశారనంటూ జనం రియాక్షన్స్‌తో యువగళం దద్దరిల్లిపోయింది. అదే ప్రొద్దుటూరులో వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని వైకాపా ఉత్సవాలు చేసింది. అదే ప్రొద్దుటూరులో బాబాయ్‌ని చంపింది ఎవరంటూ జనం నుంచే అబ్బాయిలే అని సమాధానంతో కడప గడపల్లో అబ్బాయిల నేరచరిత్రని బట్టబయలు చేయడంలో లోకేష్ మొండిగా మరో అడుగు ముందుకేశాడు.
వరుసుగా వైసీపీ నాయకులతో కలిసి పెడుతున్న ప్రెస్ మీటలు దేనికి సంకేతం ?
విజయవాడ ఎంపీ కేశినేని నాని గత కొంతకాలంగా వైకాపా నేతలని పొగుడుతూ వారితో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. టిడిపి ఎంపీగా గెలిచినా, టిడిపికి కార్యక్రమాలకు దూరం పాటిస్తూ వస్తున్న కేశినేని నాని అధిష్టానంపై అప్పుడప్పుడు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. టిడిపి పెద్దలు కేశినేని నానిని గౌరవిస్తూనే ఆయన అసహనం వెనుక వ్యూహాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వస్తోంది. ఎన్నికల మూడ్ రాష్ట్రంలో నెలకొన్న వేళ, కేశినేని నాని బయటపడిపోయారు. పూర్తిగా వైకాపా నేతలతో తన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలలో వైకాపా ఎమ్మెల్యేలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, నా రాజకీయం ఇలాగే ఉంటుంది, నచ్చిన వాళ్ళతో కలిసి పని చేస్తానని, రాజకీయం ఎప్పుడూ చేయకూడదని, ఎన్నికల సమయంలోనే చేయాలని చెప్తున్నారు. నాని మాటలతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడుతూ వచ్చిన టిడిపి, ఇప్పుడు కేశినేని నాని మాటలను గమనిస్తుంది. వైసీపీతో విజయవాడ ఎంపీ టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరో పక్క, కేశినేని నాని వైఖరితో ఇప్పటికే ప్రత్యామ్నాయం కోసం టిడిపి ఆయన తమ్ముడు చిన్నిని టచ్‌లో పెట్టుకుందని తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటులో అభివృద్ధి కోసం గొంగళి పురుగుని ముద్దు పెట్టుకుంటానంటూ చెప్తున్న కేశినేని నాని...విజయవాడ మెట్రో రైలుని వైకాపా సర్కారు ఎత్తేస్తే నోరు మెదపకపోవడం వెనుక, విమర్శలు వస్తున్నాయి. టిడిపి విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టలదొరకైనా ఇచ్చుకోవచ్చంటూనే, తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాననడం కేశినేని నాని తన అహంకార ధోరణిని మరోసారి బయట పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. మొన్న మొండితోక, నిన్న వసంతతో కలిసి ప్రెస్ మీట్ లు పెడుతున్న నాని నేడో రేపు ఊహించని నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
జగన్ కు కలిసి షాక్ ఇవ్వటానికి రెడీ అవుతున్న, షర్మిల, సునీత
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా బీజేపీ మనిషి అని తేలిపోయింది. బీజేపీ కోసం ఏం చేయడానికైనా వైకాపా రెడీ అయ్యింది. వైసీపీ నేతల్ని కేసుల్నించి కాపాడటం, అప్పులు ఇప్పించడం వంటి బాధ్యతలు కేంద్రంలో పెద్దలు చూసుకుంటున్నారు. వైఎస్ జగన్ రెడ్డి బీజేపీ అనుబంధం అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ కి చాలా ప్రతిబంధకంగా మారింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా బీజేపీ పోల్ మేనేజ్మెంటు కోసం ఏపీ నుంచి వైఎస్ జగన్ రెడ్డి నిధులు సర్దుతున్నారని కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. వైకాపా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని, ఏపీలో వైసీపీ ఓటుబ్యాంకు క్యాప్చర్ చేసేందుకు కాంగ్రెస్‌కి అనువైన పరిస్థితులున్నాయని హస్తం పెద్దల ఆలోచన. ఈ దిశగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గద్దెనెక్కించిన డీకే శివకుమార్‌ని ఏపీ-తెలంగాణలో హస్తం హవా సాగించేలా పావులు కదపాలని బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నా..వచ్చే ఎన్నికల నాటికి ఏపీ కాంగ్రెస్‌కి షర్మిలని పెద్ద దిక్కుగా పెట్టి వైసీపీ ప్లేసులోకి రావాలని ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు షర్మిల, ఇటు సునీత ఇద్దరి చెల్లెళ్లను చేరదీసి కాంగ్రెస్‌లో కీలకపదవులు కట్టబెట్టి బీజేపీ పావుగా వాడుతోన్న అన్న జగన్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహం దిశగా అడుగులు పడుతున్నాయని డీకే శివకుమార్ ఎత్తుగడలు స్పష్టం చేస్తున్నాయి