వైసీపీ ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అరాచకం చేస్తున్నారు. ఒక పక్క కేంద్రంలో మోడీని అడ్డు పెట్టుకుని, వ్యవస్థలు నాశనం, మరో పక్క బీహార్ ప్రశాంత్ కిషోర్ ఐడియాలతో అరాచాం, ఇలా, రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, వీళ్ళ అరాచకం ఎక్కువై పోతున్నాయి. తాజగా వీళ్ళ సైకో చేష్టలు బయట పడ్డాయి. వైసీపీ కి ఓటు వేయమనిచెప్పినందుకు వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు సిద్దు నాగమణి దంపతులపై దాడి చేశారు. నాగమణి గర్భం పోయే పరిస్థితి వచ్చింది. గర్భవతి అని కూడా చూడకుండా, ఆమెను కొట్టి, జగనన్నకే ఓటు వెయ్యాలి అని బెదిరించారు. అయితే ఈ పెనుగులాటలో, ఆమె గర్భం పొయే పరిస్థితి వచ్చింది.

arachakam 280032019 1

విశాఖ జిల్లా పెదగంట్యాడ లో ఈ వైసీపీ నాయకులు చేసిన అరాచకం. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తామని చెప్పినందుకు వైసీపీ నాయకుడు దాడి చేసి ఆమె గర్భాన్ని కోల్పోయే స్థితికి తెచ్చారు. అధికారంలోకి లేకపోతే నే ఇంత రౌడీయిజం చేస్తున్నారు. నేను ఉన్నాను నేను విన్నాను అనే జగన్ ఏమి విన్నాడు ఎక్కడ ఉన్నాడు? ఇలా అరాచకాలు చేస్తూ, ప్రతి రోజు పెట్రేగిపోతున్నారు. మొన్నటికి మొన్న, ఏకంగా తెలుగుదేశం ఎమ్మల్యే అభ్యర్ధి పైనే దాడి చేసి, కత్తులతో దాడి చేసి, ఆయన ప్రచారం కూడా చేసుకునే అవకాసం లేకుండా చేసారు. ఇప్పుడు ఇలా సామాన్య ప్రజలను కూడా భయపెడుతున్నారు.

రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీపార్వతి కోణంలో వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టిముట్టాయి. ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ.. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి ఆయన్ని మానసిక క్షోభకు గురిచేశారంటూ వేసిన క్యాసేట్టే వేస్తూ, హంగామా చేస్తూ, వాస్తవ ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నానంటూ టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్స్, వీడియోలతో వర్మ వేసిన వేషాలు చూసాం. ఇక ఎన్నికలకు మరో 13 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా పై అనవసర రాద్ధాంతం లేకుండా చూస్తున్నారు.

court 28032019 2

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ న్యాయవాది ఎస్‌ఎస్‌రావు, తెదేపా నేత పి.మోహన్‌రావుల పేరిట దాఖలైన రెండు వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు ధర్మాసనం ప్రాథమిక విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ చిత్రంలో అధికారపార్టీని తక్కువచేసి ఈ సినిమాలో చూపారని, అభ్యంతరకర సన్నివేశాలున్నాయని పేర్కొన్నారు.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. అనంతరం గురువారానికి వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగానే, ఈ రోజు ఈ విషయం పై మంగళగిరి కోర్ట్ తన తీర్పు ఇచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఇంజన్క్షన్ గ్రాంట్ చేసింది కోర్ట్.

court 28032019 3

15 /4 /2019 వరకు సినిమా హాళ్లలో ప్రదర్శన , సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ యూట్యూబ్ , ట్విట్టర్,ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ తదితర మీడియా లలో కూడా ప్రదర్శన పై కూడా ఇంజన్క్షన్ ఆర్డర్ ఇచ్చింది. అంటే, ఏప్రిల్ 15 వరకు ఈ సినిమా విడుదల చెయ్యటానికి లేదు. మరో పక్క, రాంగోపాల్ వర్మ రాకేష్ రెడ్డి , అగస్త్య మంజు తదితరులకు నోటీసులు పంపమని కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి ప్రతికూల అంశాలతో నింపేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలైతే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ సినిమా విడుదలను ఆపేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. ఎన్నికలు తొలిదశ పూర్తయ్యే వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్డుకోవాలని టీడీపీకి చెందిని సాధినేని యామిని తదితరులు ఈసీని కలిసి ఫిర్యాదు చేసిని విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గాయానికి గురయ్యారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం నడుమ ప్రచారరథం నుండి దిగి కాలినడక నడుస్తూ గ్రామంలో పర్యటిస్తుండగా ఆయన కుడికాలుకి గాయం అయ్యింది. దాంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. గాయపడ్డ వంశీకి ప్రస్తుతం చిన్న‌అవుటపల్లిలోని పిన్నమనేని వైద్యశాలలో చికిత్స జరుగుతుండగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద‌ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే గాయం మానాలి అంటే, ఒక నాలుగు రెస్ట్ తీసుకుని, దుమ్ము తగలకుండా చూడాలని డాక్టర్లు సలహా ఇచ్చారు.

vamsi 28032019 2

అయితే, ప్రచారానికి కొద్ది సమయమే ఉండటంతో, గాయంతోనే ప్రచారానికి వెళ్తానని వంశీ చెప్పారు. చెప్పినట్టు గానే, వంశీ ఈ రోజు గాయంతోనే ప్రచారానికి బయలుదేరారు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో ఈ రోజు వంశీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గాయానికి ఒత్తిడి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వంశీ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో, గ్రామాల్లో ఆపార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రజల తరపున ప్రజావిరాళం ప్రభుత్వానికి తానే చెల్లించి అన్నీ గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేయించానన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ను అరెస్టు చేసినట్టు పులివెందుల పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. హత్యానంతరం సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. ఈ నెల 15న ఉదయం స్నానాల గదిలో హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని పడక గదికి తరలించినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్టు భావిస్తున్నారు. ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదనే కారణంతో ఆయన పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

viveka 28032019

ఈ నెల 15న ఉదయం 5.30 గంటలకు తొలిసారి ఇంట్లోకి వెళ్లిన కృష్ణారెడ్డి వివేకా మృతదేహాన్ని చూసినట్టు వెల్లడించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆయన ఇంట్లో ఏం చేశాడనే కోణంలో విచారించారు. స్నానాల గది నుంచి పడక గదికి తరలించడం, రక్తపు మరకలు కడగడం, నుదుటిపై కట్లు కట్టి మృతదేహానికి బట్టలు మార్చడం తదితర వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ప్రధానంగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ రక్తపు మరకలు కడిగాడని పేర్కొన్నారు. సుమారు 12 రోజుల పాటు 50మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టుకు తీసుకొచ్చారు.

viveka 28032019

మరోవైపు, ఈ హత్య ఎవరు చేశారనే దానిపై సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పరమేశ్వర్‌ రెడ్డి, శేఖర్‌ రెడ్డి అనే నిందితులను పోలీసులు తమ అదుపులోనే ఉంచుకొని విచారిస్తున్నారు. ఎర్ర గంగిరెడ్డి సొంతూరు కడప జిల్లా తొండూరు మండలం తేలూరు. గత 30 ఏళ్లుగా వివేకానందరెడ్డి, వైఎస్‌ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. గంగిరెడ్డి అవివాహితుడు. నూనె వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించి ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో వివేకాతో సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో పాటు రాజకీయంగానూ ఎదుగుదల ప్రారంభమైంది. వివేకా హత్య కేసులో సాక్ష్యాల తారుమారు వ్యవహారంలో గంగిరెడ్డినే ప్రధాన అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్టు చేయడం కీలక పరిణామం. మున్ముందు ఎవరెవరి పేర్లు వస్తాయి.. ఈ హత్యకు పాల్పడిందెవరనే అంశంపై అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read