సెంటిమెంట్... ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినిపిస్తోన్న మాట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో చర్చకు వస్తున్న అంశం. ఎన్నికల ప్రచారం అంతా సెంటిమెంట్‌ చుట్టూరానే తిరుగుతోంది. అయితే.. సెంటిమెంట్‌ రెండు రకాలుగా ఉంటుందని ఆంధ్రా ప్రజలు ఐదేళ్ల క్రితమే నిరూపించారు. ఒకటి బాహాటంగా ప్రదర్శించే సెంటిమెంట్ అయితే.. రెండోది నిద్రాణంగా ఉంటుంది. ఏమాత్రం అనుమానించే పరిస్థితి ఉండదు. కానీ.. అత్యంత వ్యూహాత్మకంగా ఉంటుంది. ఏ అంశమైనా ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరి ఆలోచన ఎలా ఉంది ? దానిపై ఎవరు ఏం చేస్తారు ? అసలు మనకు ఏం కావాలి ? అన్న విషయాలపై పూర్తి క్లారిటీ ఉంటుంది. ప్రధానంగా ఎవరు చేస్తారు? ఏం చేస్తారు? మనకేం కావాలన్న మూడు అంశాలు అందరికీ తెలుసు. ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో కూడా వాళ్లకు స్పష్టత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నైజం ఇదే. ఇప్పుడు కూడా ఏ పార్టీ ప్రచారంలో ఏం చెబుతున్నా.. ఏపీకి అసలు ఏం జరుగుతోంది? ఏపీకి వ్యతిరేకంగా వ్యవహరించేవాళ్లెవరు ? ఎవరివైపున నిలబడితే.. ఎలాంటి ఫలితాలుంటాయి ? అన్నది ఆల్‌రెడీ ఓటర్లలోకి వెళ్లిపోయింది. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల ఫలితాలను ఈ అంశాలు నిర్దేశించనున్నాయి.

వాస్తవానికి ఢిల్లీలో తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించిన సమయంలో ఆంధ్రా ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. అప్పటికప్పుడు నిరసనలు చేపట్టారు. కానీ.. సాయంత్రానికి శాంతించి తగ్గుముఖం పట్టారు. సైలెంట్‌ అయిపోయారు. ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రతిస్పందన ఇంతేలే అన్న ప్రచారం సాగింది. అప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తంచేసి.. తర్వాత మర్చిపోతారని భావించారు. కానీ.. ఆ ఆగ్రహమంతా నిగూఢంగా దాచుకున్నారు ఏపీ జనం. సమయం కోసం ఎదురుచూశారు. సమయం చూసి రాష్ట్రాన్ని విభజించిన ఏపీని అనాథను చేసిన కాంగ్రెస్‌పార్టీపై చావుదెబ్బ కొట్టారు. మళ్లీ ఇప్పట్లో కోలుకోలేని విధంగా ఆ పార్టీకి తమదైన రుచి చూపించారు. అంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో నిద్రాణంగా దాగుండే సెంటిమెంట్‌ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా బాహాటమవుతుందన్న సత్యం నిరూపితమైంది. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. అప్పటికే ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నీరసపడిపోయిన ఆ పార్టీకి ఒక్కసారిగా మూడంకెల సీట్లు వచ్చాయి.

పైగా.. అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. 150కి పైగా స్థానాల్లో మాత్రమే పోటీ చేసినా.. 103 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. ఒక్కసారిగా ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సెంటిమెంట్‌ ఓటర్లలో బలంగా నాటుకొని పోవడమే ఈ విజయానికి నిదర్శనమన్న విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి. ఈ స్థాయిలో ఓ అధికార పార్టీని చావుదెబ్బ తీసిన ఏపీ ఓటర్ల శైలి అందరికీ తెలిసొచ్చింది. ఇప్పుడు కూడా ఏపీలో దాదాపు అదే పరిస్థితి నెలకొంది. కాకపోతే.. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా.. అప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు మాత్రం.. బీజేపీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తుండగా.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు కూడా కేంద్రం ఏపీకి ఏం చేసిందన్న స్పష్టత ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ఉంది. ఇకపై ఏం చేయగలుగుతుందన్నదానిపైనా ఓ అంచనా ఉంది. పైగా.. ఏపీకి కావాల్సిన ప్రత్యేక తరగతి హోదా గురించి కూడా అందరికీ అవగాహన ఉంది. దీంతో.. ఇప్పుడు కూడా ఏపీ ప్రజలకు సేమ్‌ సిట్యుయేషన్‌ ఎదురయ్యింది. ఎన్నికల్లో ఈవీఎం మీట ఎటువైపు నొక్కాలో కూడా ఓటర్లకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో.. ఎన్నికల ఫలితాలు ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను ప్రస్ఫుటించబోతున్నాయంటున్నారు విశ్లేషకులు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపి తీరాల్సిందేనని తెలంగాణ సర్కారు మళ్లీ మళ్లీ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తూనే ఉంది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన అంశంపై తమ అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదిస్తోంది. తాజాగా మళ్లీ పర్యావరణ ప్రభావ మదింపు, బ్యాక్‌వాటర్‌ ప్రభావ మదింపు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతోంది. గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొని 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చిందని, ఆ తర్వాత కాలంలో డిజైన్లు మార్చిన నేపథ్యంలో గరిష్ఠ వరద ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులకు చేరిందని వివరించింది.

game 27032019

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, అంశాలు, నిబంధనలను అమలు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ప్రతివాదులుగా ఉన్నాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేయనున్న కౌంటర్‌ అఫిడవిట్‌లో ఒక్కో అంశం అమలు స్థితి గురించి పేర్కొంది. నిర్ణీత గడువులోగా చట్టంలో ఉన్నవన్నీ పూర్తి చేయాలని కోరింది. 2017-18తో పాటు ఈ ఏడాదిలోనూ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 100 టీఎంసీల నీటిని మళ్లించిందని, తద్వారా గోదావరి జలాల్లో తమ వాటా పెరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

game 27032019

పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో గోదావరి నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్‌ తీర్పు మేరకు ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 45 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు ఉందని పునరుద్ఘాటించింది. అలాగే రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌) విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, 4.56 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని, దాంతో ప్రాజెక్టును ఆధునికీకరించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని, కానీ ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టకుండా వివాదాలను సృష్టిస్తోందని ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వంటి ముఖ్యమైన డైవర్షన్‌ పాయింట్‌ దగ్గర టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయని కారణంగా కృష్ణా బేసిన్‌కు అధికంగా నీటిని తరలిస్తున్నారని పేర్కొంది.

 

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై తుది నివేదిక సమర్పించకుండా సిట్‌ను ఆదేశించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును అభ్యర్థించారు. వివేకా మృతి సున్నితమైన అంశమైనందున ఎన్నికలు జరుగుతున్న వేళ.. కేసు వివరాలను మీడియాకు వెల్లడించకుండా ఆదేశించాలనీ విన్నవించారు. వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ జగన్‌, వివేకా భార్య సౌభాగ్య వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు ఏవీ శేషసాయి, యు.దుర్గాప్రసాద్‌రావుల ధర్మాసనం మంగళవారం విచారించింది.

game 27032019

ఈ సందర్భంగా జగన్‌ పిటిషన్‌కు ఆయన తరఫు న్యాయవాది అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ.. సాక్షాత్తు సీఎం, సిట్‌ ఉన్నతాధికారులు సైతం కేసును ప్రభావితం చేసేలా మాట్లాడిన తర్వాత దర్యాప్తు సక్రమంగా సాగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. అందుకే ఈ కేసును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఆయన వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

 

game 27032019

అయితే, జగన్ మోహన్ రెడ్డి పిటీషన్ చూసి, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడైనా దోషులు ఎవరో చెప్పండి, దోషులని శిక్షించండి అని అంటారు, అదీ సొంత కుటుంబ సభ్యుడు, సొంత బాబాయి అయితే, ఆ ఆవేదన మరింత ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ జగన్ వైఖరి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. దర్యాప్తు వివరాలు బయటకు పెట్టద్దు, నివేదిక ప్రజలకు చెప్పద్దు అంటూ కోర్ట్ కు ఎందుకు వెళ్ళారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అంటే ఆరోపణలు వస్తునట్టు, వైఎస్ కుటుంబంలోని సభ్యులే ఈ హత్యలో ఉన్నారా, అనే అనుమానాలు బలపడుతున్నాయి. చూద్దాం మరి కోర్ట్ ఏమి చెప్తుందో...

సూళ్లూరుపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభావేదిక సమీపంలో రెండు కత్తులు పోలీసుల కంటపడటంతో ఆందోళనకు గురైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో చెంగాళమ్మ గుడికి సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

game 27032019

బహిరంగ సభావేదిక సమీపంలోని గోశాలవద్ద వాహనాలు రాకుండా బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ఇద్దరు వ్యక్తులు ఓ బైక్‌పై గోశాలవద్దకు వచ్చి బారికేడ్‌ల వద్ద బైక్‌ అదుపు చేయలేక కిందపడ్డట్లు సమాచారం. దీంతో వారి వద్ద ఉన్న రెండు పొడవాటి కత్తులు కిందపడాయని తెలిసింది. అక్కడే ఉన్న పోలీసులు కిందపడిపోయిన బైక్‌ను కత్తులను చూసి ఆందోళన చెందారు. వెంటనే వారిని చుట్టుముట్టి ఆ ఇద్దరి వ్యక్తులను, కత్తులను అదుపులోకి తీసుకొని వారిని పోలీస్‌ స్టేషన్‌కు హుటాహుటిన తరలించినట్లు సమాచాం. ఈ విషయం చర్చనీయాంశమైంది.

game 27032019

కత్తులు కలిగిన ఇద్దరు వ్యక్తులు చిత్తూరు జిల్లా వాసులని, ఓ కేసులో వీరు ముద్దాయిలని, వారు తలదాచుకునేందుకు సూళ్లూరుపేటలోని బంధువుల ఇంటికి వస్తూ ఇలా పట్టుపడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు వీరి నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో పడినట్లు సమాచారం. ముఖ్యమంత్రి బహిరంగసభకు మరి కొద్ది నిమిషాల్లో వస్తున్నారనగా ఇలా ఇద్దరు వ్యక్తులు కత్తులతో పట్టుపడటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సమయంలో, ఈ వార్త బయటకు రావటంతో, తెలుగుదేశం క్యాడర్ షాక్ అయ్యింది. ఒక పక్క, వైసీపీ, పోలీసుల పై కక్ష సాధిస్తూ, సియం భద్రత చూసే, ఇంటలిజెన్స్ అధికారి బదిలీ అవ్వటం, ఇవన్నీ చూసి కంగారు పడుతున్నారు. అయితే, చంద్రబాబు బధ్రతకు వచ్చే ముప్పు ఏమి లేదని, అప్రమత్తంగా ఉన్నామని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి.

 

Advertisements

Latest Articles

Most Read