‘‘కేసీఆర్‌ జగన్‌కు రెండు వేల కోట్లు పంపించి... ఏపీకి రావాల్సిన లక్ష కోట్ల ఆస్తిని ఎగవేద్దామనుకుంటున్నారు! దుష్టశక్తులన్నీ ఏకమై నాపైనా, రాష్ట్రంపైనా దాడి చేస్తున్నాయి. మనకు పౌరుషం లేదా! రాష్ట్రంపై దాడి చేస్తే ఊరుకుంటామా! ఏపీని హైదరాబాద్‌ నుంచి పాలిస్తే సహిస్తామా?’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. ఇప్పటిదాకా జిల్లాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన... బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అసలైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారి పొడవునా జరిగిన రోడ్‌షో నిర్వహించారు. భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌లపై విరుచుకుపడ్డారు. అంతకుముందు విజయవాడలో జరిగిన మరో సభలోనూ మాట్లాడారు.

aadala 16032019

‘‘ఆంధ్రాకు వస్తామని కేసీఆర్‌ అంటున్నారు. రావయ్యా రా... అటో ఇటో తేలిపోతుంది!’’ అని సవాలు విసిరారు. తెలంగాణలోని ఆస్తులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను భయపెడుతున్నారని తెలిపారు. ‘‘ఏదో లిటిగేషన్‌ సృష్టించి బెదిరిస్తున్నారు. వైసీపీతో కలిసి పోవాలంటున్నారు. ఇదేం న్యాయం? మా ఇల్లు మీకెంత దూరమో... మీ ఇల్లు మాకూ అంతే దూరం. ఈ విషయం మరిచిపోవద్దు. ప్రాణాలు పోయినా సరే! పోరాటం ఆపేదిలేదు. నాతో పెట్టుకోకండి. ఖబడ్దార్‌. మీరు ఒక్క రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తే... ఇక్కడున్న మా వాళ్లు వంద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడకుండా టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందని, అన్ని రకాల ఆర్థిక మూలాలపై దాడి చేసి తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా, వారిని లొంగదీసుకునేనా ఒత్తిడి తెస్తోందని తెలిపారు. పోలవరంపై కేసీఆర్‌ సుప్రీం కోర్టుకు వెళ్లారని తెలిపారు.

aadala 16032019

జగన్‌కు ఓటేస్తే వీధికో రౌడీ పుట్టుకొస్తారని, రాష్ట్రం రౌడీ రాజ్యమవుతుందని తెలిపారు. ఆయనకు ఓటేస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్లు అవుతుందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ హత్యా రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. జగన్‌ అది చేసా, ఇది చేస్తా అంటున్నారని... అసలు ఆయన ఏం చదువుకున్నారో చెప్పరని చంద్రబాబు విమర్శించారు. ‘నేను ఎం.ఏ. ఎనకనిక్స్‌ చేశారు. మరి... మీరేం చదివారు’ అని జగన్‌ను ప్రశ్నించారు. నేరస్తుడైన జగన్‌ అధికారంలోకి వస్తే... రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని అడిగారు. ‘‘ఐదేళ్లు కష్టపడ్డాం. అందరూ సహకరించారు. ఇప్పుడు మీ ఓటు అడుగుతున్నా. పులివెందులలో సైతం మనమే గెలవాలి’’ అని పిలుపునిచ్చారు.

కర్నూలు లోక్‌సభ సెగ్మెంట్‌ అనగానే గుర్తుకొచ్చేది కొండారెడ్డి బురుజు. 1952లో కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం దివంగత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆరు పర్యాయాలు ఎంపీగా ఎన్నికై కేంద్రంలో పలు మంత్రి పదవులు చేపట్టారు. 2009లో పునర్విభజన తర్వాత మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా చేరింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అధినేతలు బీసీలకే టికెట్‌ ఇచ్చారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడును టీడీపీ బరిలో దింపితే, చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను వైసీపీ పోటీలో పెట్టింది. ఈ ఎన్నికల్లో బుట్టా రేణుక విజయం సాధించారు.

aadala 16032019

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఆమె వైసీపీనీ వీడి టీడీపీలో చేరడం జరిగింది.. ఈసారి కూడా ఆమెకే టికెట్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. పార్టీలో చేరే సమయంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనకు రెండు ఎమ్మెల్యే సీట్లు, కర్నూలు పార్లమెంట్ స్థానం కావాలని చంద్రబాబును కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉండటం, సీనియర్ నేత కావడంతో.. కర్నూల్ ఎంపీ టిక్కెట్ కోట్ల సూర్య ప్రకాశ్‌కే కేటాయించారు. కర్నూల్ ఎంపీ స్థానం బదులు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం కేటాయిస్తానని చంద్రబాబు.. బుట్టాకు చెప్పగా దానికి ఆమె ఒప్పుకోలేదు.

aadala 16032019

చివరికి ఆమె పార్టీ మారీ వైసీపీ గూటికి చేరారు. వైసీపీ అయినా తనకు టిక్కెట్ ఇస్తుందని ఆమె ఆశపడ్డారు.. కానీ జగన్ కూడా ఆమెకు టిక్కెట్ కేటాయించలేదు. వైసీపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి బీవై రామయ్య, ఆయుష్మాన్‌ ఆసుపత్రి డాక్టర్‌ సంజీవ్ కుమార్‌ టికెట్లు ఆశించారు. అధిష్టానం సంజీవ్ కుమార్‌కే టిక్కెట్ కేటాయించింది. కానీ కోట్లను సంజీవ్ కుమార్ ఎంత వరకు పోటీ ఇవ్వగలరో త్వరలో తేలనున్నది.

‘మా’ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్‌కు మద్దతిచ్చి తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్ నాగబాబుపై ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నాగబాబు తనకు ఎన్నో ఏళ్లుగా మిత్రుడని చెబుతూనే.. ఆయన తనకు గిఫ్ట్ ఇచ్చారని, త్వరలోనే ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ప్రకటించి శివాజీరాజా సంచలనం సృష్టించారు. అయితే మెగా బ్రదర్ అయిన నాగబాబును ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని శివాజీరాజా ఏం చేయగలరని చాలామంది లైట్ తీసుకున్నారు. ఓటమి బాధలో శివాజీరాజా అలా మాట్లాడి ఉంటారని అనుకున్నారు. అయితే ప్రస్తుతం శివాజీరాజా అడుగులు చూస్తుంటే నాగబాబు కోసం నిజంగానే రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

aadala 16032019

‘మా’ ఎన్నికల్లో ఓటమిపాలైన శివాజీరాజా.. రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని సమాచారం. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 24న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ సమయంలో జగన్‌ను శివాజీరాజా కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. అంతేకాకుండా నర్సాపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ తరపున శివాజీరాజా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారట. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున నాగబాబు రంగంలోకి దిగడం వల్లే శివాజీరాజా వైసీపీలోకి వెళ్లి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. మొదటిసారి ఎన్నికల బరిలో నిలబడిన నాగబాబును ఓడించి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని శివాజీరాజా భావిస్తున్నారట. నాగబాబు ఇచ్చిన గిఫ్ట్ ఫలించినట్లుగా శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్ ఫలిస్తుందో లేదో వేచిచూడాలి.

 

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల, ప్రచార హడావుడిలో బిజీగా ఉండగా.. ఆయా పార్టీల తరపున ప్రయివేటు ఏజన్సీల సర్వే బృందాలు జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సర్వే టీమ్‌లు కాకినాడ, రాజమహేంద్రవరంలలో మకాం వేసి ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. ఏ సంస్థ ఏ పార్టీ తరపున సర్వే నిర్వహిస్తుంది? అనేదానిపై బయటకు తెలియకపోయినా, ప్రధానంగా వైసీపీ, టీడీపీల తరపునే ఎక్కువ సంస్థలు సర్వేలు చేపట్టాయి.

aadala 16032019

సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్‌ ఎంత? టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలపై ప్రజలలో ఏ మేరకు ప్రభావం ఉంది? సానుకూలత ఏమేరకు ఉంది? అనే అంశంపై ప్రతిష్టాత్మక సర్వే సంస్థ నాలుగు రోజులుగా జిల్లాలో ఆరా తీస్తోంది. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, యువనేస్తం, పదిరెట్లు పెంచిన పింఛను.. ఇలా పేదల కోసం పెట్టిన పలు పథకాల ప్రభావం ఏ మేరకు సానుకూలత తెస్తుంది? అనేదానిపై తటస్థులైన వివిధ వర్గాల వారిని సర్వే చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యోదంతం తర్వాత పరిస్థితి? వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చిన్నాన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలపై ప్రజల్లో ఏ అభిప్రాయం ఉంది? సామాన్యులు ఏమనుకుంటున్నారు? ఈ ఘటనలో సీఎం చంద్రబాబుపై జగన్‌ వేసిన నిందలపై సానుకూలత వచ్చిందా? రివర్స్‌ అయిందా? అనేదానిపై సర్వే బృందాలు లోతుగా ఆరాతీస్తున్నాయి.

aadala 16032019

జగన్‌కి అధికారం కట్టబెడితే ఎదురయ్యే పరిస్థితులపై జనంలో ఏ మేరకు భయాందోళనలు నెలకొన్నాయి? అనేదానిపై ప్రశాంత్‌ కిషోర్‌ బృందం ప్రత్యేక ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కొన్ని సీట్లలో జనసేన చీల్చే ఓట్ల ప్రభావం ఏ పార్టీపై ఉంటుందనేదానిపైనా ఒకటి, రెండు సంస్థలు లోతుగా సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీలలో జనసేన అభ్యర్థులకు ఎంత శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది? ఆ పర్సెంటేజీ వల్ల వైసీపీ, టీడీపీలలో ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అవుతుందనేదానిపైనా సర్వే సంస్థలు తర్జనభర్జనపడుతున్నాయి. అలాగే కోనసీమ, రాజమహేందవ్రరం పరిధిలోనూ జనసేన ఎఫెక్ట్‌ ఎంత ఉంటుందనేదానిపై సర్వే సంస్థలు ప్రత్యేకంగా ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యాయి.

Advertisements

Latest Articles

Most Read