మాచర్లలో వైసీపీ శ్రేణులు నిన్న విధ్వంసం చేయటమే కాదు, ఏకంగా లూటీలు కూడా చేసారు. పూర్వపు రోజుల్లో, ఇలాంటి లూటీలు చుసి, ప్రస్తుతం ప్రశాంతమైన బ్రతుకు బ్రతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఈ వార్త నిజంగా ఒక పీడకల లాంటి వార్తే. నిన్న టిడిపి ఇదేమి కర్మ కార్యక్రమం చేస్తుంటే, వైసీపీ శ్రేణులు రెచ్చిపోవటం, అక్కడ నుంచి మాచర్ల మొత్తం మారణ హోమం చేయటం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు, టిడిపి నేతల ఇళ్ళల్లోకి వెళ్లి లూటీలు కూడా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ నేతల ఇళ్ళ పై దా-డి సమయంలో దోపిడీకి పాల్పడ్డారు వైసీపీ శ్రేణులు. టీడీపీ నేత ఇంటి లాకర్ పగలగొట్టి రూ.లక్ష నగదు, 15 సవర్ల బంగారం ఎత్తుకెళ్ళారు. అలాగే, పావనీ అపార్ట్ మెంట్‍లో ఇద్దరు టీడీపీ నేతల ఇళ్లు ధ్వంసం చేసి, బంగారం దొంగతనం చేసారు. తమ జీవితంలో ఇంతటి దుర్మార్గులను చూడలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిన్న మాచర్లలో వైసీపీ చేసిన విధ్వంసంతో, నేడు టిడిపి  చలో మాచర్లకు పిలుపుచ్చింది. ఈ రోజు మాచర్ల వెళ్లి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేయలని ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్నే డీఐజీకి ఫోన్‍లో చంద్రబాబు  నిరసన తెలియజేసారు. మాచర్ల ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ కూడా రాసారు. ఈ మంటలు ప్రభుత్వాన్ని దహించడం ఖాయమంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. ఇక మాచర్ల ఘటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే యోచనలో టీడీపీ ఉంది. ఈ రోజు మాచర్ల పర్యటనకు టీడీపీ నేతలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు.  టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల వద్దకు పోలీసులు వచ్చారు. మాజీమంత్రి నక్కా ఆనంద్‍బాబు, టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్ల వద్ద పోలీసులు పహారా పెట్టారు. టీడీపీ నేతలు పల్నాడు వెళ్తారనే సమాచారంతో ముందస్తు ఆంక్షలు విధిస్తున్నారు.

అప్పట్లో వైసిపి నేతలు గుడివాడలో కొడాలి నాని అనుచురాల ద్వర్యంలో విచ్చలవిడిగా కాసినోలు నడిపిన సంగతి తెలిసిందే.  దీనిపై తెలుగుదేశం పార్టీ ఐటీ శాఖకు ఇచ్చిన  ఫిర్యాదుపై ఐటీ  డిపార్ట్మెంట్ ఇప్పుడు స్పందించింది. గుడివాడలో  క్యాసినో వ్యవహారం పై వల్లభనేని వంశీ , కొడాలి నాని ఈడీ, డీఆర్ఐ, సీబీడీటీ,  కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ డిపార్ట్మెంట్ లకు అప్పట్లో తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని పై ఐటీ డిపార్ట్మెంట్ ఇప్పుడు విచారణ మొదలు పెట్టింది. సమాచారం సేకరణలో భాగంగా ఐటీ డిపార్ట్మెంట్ టిడిపి నేత వర్ల రామయ్యను పిలిచింది . గుడివాడ లో క్యాసినో వ్యవహారం లో  వారి  దగ్గర ఉన్న  సమాచారం మొత్తం అందించాల్సిందిగా టిడిపి నేత వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు పంపించింది. .

పల్నాడు జిల్లాలో మాచర్ల పట్టణం నివురుగప్పిన నిప్పులా ఉంది. నిన్నటి వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండతో ప్రజల్లో భయాందోళనలో ఉన్నారు. టీడీపీ ఆఫీస్‍తో పాటు పార్టీ నేతల ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేసాయి వైసీపీ శ్రేణులు. వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో టీడీపీ ఆఫీస్ పూర్తిగా కాలిపోయింది. టీడీపీ నేతలకు చెందిన పదికి పైగా వాహనాలు ధ్వంసం చేసి రెండు వాహనాలకు నిప్పు పెట్టాయి వైసీపీ శ్రేణులు. మాచర్లలో అదనపు పోలీసుల మోహరించారు. ప్రస్తుతం మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతుంది.

Advertisements

Latest Articles

Most Read