మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారిస్తున్నారు. ఈ రోజు పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి ఆయన వచ్చారు. వివేకా హత్యపై అవినాష్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. విచారణకు పిలిస్తే వెళ్లానని, పోలీసులు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పానని అవినాష్ మీడియాకు తెలిపారు. అయితే, వివేకా కేసును స్థానిక సీఐ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా మృతి తర్వాత సీఐతో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ మండిపడ్డారు.

viveka 18032019

వివేకానందరెడ్డి దారుణ హత్య మిస్టరీగానే ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదు బృందాలను నియమించి విచారణ వేగవంతం చేసింది. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పర్యవేక్షణలో మరో ఏడు బృందాలు ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు 20 మంది సాక్షులను విచారించారు. ఏ అంశాన్నీ వదలకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పులివెందుల పోలీసుస్టేషన్‌కు వివేకా దగ్గరి బంధువులు ఆరుగురిని పిలిపించి విచారణ జరిపి వారి నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. నిన్న వివేకా సోదరులు భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి, జగన్ అనుచరుడు శంకర్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు వివేకా బంధువులకు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

viveka 18032019

వివేకా గుండెపోటుతో మరణించారని ఎందుకు చెప్పారు? పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మీరే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? బాత్‌రూంలో పడి ఉన్న వివేకాను ఎందుకు బెడ్ రూంలోకి తీసుకువచ్చారు? రక్తపు మరకలను ఎందుకు తుడిచారు? బలమైన గాయాల వివేకా శరీరంపై ఉంటే గుండెపోటుతో మృతి చెందాడని ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఇలాంటి ప్రశ్నలను సిట్ బృందం వివేకా బంధువులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను గొడ్డలితో నరికి చంపారు. గురువారం రాత్రి మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి వచ్చిన ఆయన... శుక్రవారం ఉదయానికి తన నివాసంలోనే శవంగా కనిపించారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న ఈ సమయంలో జరిగిన హత్య... రాజకీయంగానూ సంచలనం సృష్టిస్తోంది.

గుంటూరు జిల్లా టీడీపీలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ రాయపాటి అలకతో ఈ స్థానంపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. తనకు ఎంపీ టికెట్‌తో పాటు కుమారుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నది రాయపాటి ప్రతిపాదన. అయితే.. జిల్లాలోని దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసిన పరిస్థితి. రాయపాటి లాంటి సీనియర్ నేతను వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఎవరిని పక్కన పెట్టి రాయపాటి కుమారుడికి టికెట్ ఇవ్వాలనే అంశంపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా మరో వాదన కూడా తెరపైకొచ్చింది.

konatala 18032019

నరసరావుపేట పార్లమెంట్ స్థానం సిట్టింగ్ నుంచి ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ, అధిష్టానం మాత్రం మరికొందరి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, భాష్యం రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే నర్సరావుపేట లోక్‌సభ స్థానానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేరు పరిశీలనకు వచ్చింది. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబును గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని ప్రతిపాదన కూడా టీడీపీ అధిష్టానం రాయపాటి ముందుంచినట్లు సమాచారం.

konatala 18032019

ఈ ప్రతిపాదనకు రాయపాటి అంగీకారం తెలిపితే.. గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసిన మద్దాల గిరిని... నర్సరావుపేట అసెంబ్లీకి పంపాలన్న యోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఆలపాటి నర్సరావుపేట లోక్‌సభకు పోటీ చేయనంటే... భాష్యం రామకృష్ణ పేరును పరిశీలించాలని టీడీపీ భావిస్తోంది. దీంతో రాయపాటి సాంబశివరావును ఎంపీ సుజనాచౌదరి పిలిపించి మాట్లాడిట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదన పట్ల తనకు ఆసక్తి లేదని రాయపాటి తేల్చి చెప్పినట్లు సమాచారం.

రాజధాని అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ నుంచి రెండు నెలల కిందటే హైకోర్టు రాజధాని అమరావతికి తరలిం చారు. ఇప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును నిర్వహిస్తున్నారు. ప్రస్తుత అవసరం మేరకు కోర్టు హాళ్లు సిద్ధం చేయటంతో నూతన భవనాలలోనే హైకోర్టు కార్యకలాపాలు జరగనున్నాయి. హైకోర్టుకు సంబంధించిన రికార్డులన్నీ దాదాపుగా అమరావతికి చేరుకున్నట్లు న్యాయవర్గాలు పేర్కొన్నాయి. రాజధానిలో హైకోర్టుకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా బస్సు సర్వీసులను ఆర్టీసీ సోమవారం నుంచి ప్రారంభించనుంది. రాకపోకలపై ఆంక్షలు.. జ్యూడిషియల్‌ కాంప్లెక్స్‌ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నందున కరకట్ట రోడ్దులో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు గుంటూరు రూరల్‌, అర్బన్‌ ఎస్పీలు రాజశేఖర్‌బాబు, విజయరావు ఆదివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.

konatala 18032019

హైకోర్టు జడ్జీలు, రిజిస్ర్టార్‌లు, అడ్వొకేట్‌ జనరల్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు, గవర్నమెంట్‌ ప్లీడర్లు, అడ్వొకేట్‌లు, హైకోర్టు సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య కరకట్టమీదుగా ప్రయాణించి హైకోర్టుకు చేరుకోవాలని సూచించారు. ఆ సమయంలో కరకట్టమీద ఎదురుగా వా హనాలు అనుమతింప బడవన్నారు. ఆ సమయంలో ఆయా వాహనాలు కృషా ్ణయపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా విజయవాడ చేరుకోవాలని కోరారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు హైకోర్టు జడ్జీలు, రిజిస్ర్టార్‌లు, అడ్వొకేట్‌ జనరల్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు, గవర్నమెంట్‌ ప్లీడర్లు, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఎంఎస్‌ఆర్‌ ఆశ్రమం, కరకట్ట మీదుగా ప్రయాణించి లోటస్‌ హోటల్‌ మీదుగా గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరారు.

konatala 18032019

హైకోర్టు అడ్వొకేట్‌లు, హైకోర్టు సిబ్బంది సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఎంఎస్‌ఆర్‌ ఆశ్రమం, కరకట్ట మీదుగా ప్రయాణించి అప్పారావు చెక్‌పోస్టు వద్ద దిగువకు దిగి ఉండవల్లి గుహల మీదుగా స్ర్కూ బ్రిడ్జి చేరుకుని వారి గమ్య స్ధానాలకు చేరుకోవాలని కోరారు. ఈ సమయంలో లోటస్‌ హోటల్‌ నుంచి కరకట్టమీదుగా వాహనాలు అను మతించబడవు. వారు ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా వారివారి గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. వాహనదారుల సౌకర్యార్థం సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు విజయరావు, రాజశేఖర్‌బాబులు తెలిపారు. ఎవరికైనా సమస్య ఏర్పడితే తాడేపల్లి సీఐ వై.శ్రీనివాసరావును 9440796271, తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ ఐ.వెంకటేశ్వరరెడ్డిని 6305957989, లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఏపీలో తమ పాత్ర ఏమీ ఉండదని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాలన తర్వాత చేసింది చెప్పుకోలేకపోతున్నారని, చేసింది చెప్పుకోలేక ఆయన తమపై పడి ఏడుస్తున్నారని ఎద్దేవాచేశారు. ‘ఏప్రిల్ 11 తర్వాత మేం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామా? లేదా? అన్నది తెలుస్తుంది’ అని కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్‌కు వచ్చే సీట్లు జాతీయ పార్టీల కంటే ఎక్కువగా ఉంటాయని, జాతీయ పార్టీ పెట్టొచ్చు...తప్పేముందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టత వస్తుందన్నారు. చంద్రబాబు ఇమేజ్ పాతాళంలో ఉందని కేటీఆర్‌ విమర్శించారు.

ktr 18032019

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆ రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఒక అప్పీల్‌ చేయబోతున్నారని తెలిపిన విషయం తెలిసిందే. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. రాజకీయాల నుంచి చంద్రబాబుకు వీడ్కోలు పలికేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న తమ పార్టీ టీఆర్‌ఎస్‌కు ఏపీలో అడుగుపెట్టాలన్న ఆలోచనలేమీ లేదని చెప్పారు. టీడీపీ, కేసీఆర్‌ మధ్య పోరుగా ఏపీ ఎన్నికలను చిత్రీకరించాలని బాబు ప్రయత్నించడం చాలా విచిత్రంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఏపీలో ఒక్క చోట కూడా పార్టీ కార్యాలయం లేదని, ఎన్నికల్లో కూడా అక్కడ తాము పోటీ చేయడం లేదని చెప్పారు. అయితే కేసీఆర్, కేటీఆర్ మాటిమాటికీ, జగన్ ని గెలిపించాలి, చంద్రబాబుని ఓడించాలి అని ఎందుకు అన్నారో, ఆయనే చెప్పాలి.

 

ktr 18032019

మరో పక్క, చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు. జగన్‌కు ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వం తనకు డబ్బులివ్వడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. నేనూ చూస్తా ఆ డబ్బులు పనిచేస్తాయో? తన విశ్వాసం పనిచేస్తుందోనని అన్నారు. సోమవారం ఒంగోలులో టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ని గెలిపిస్తారా?, వాళ్ల డబ్బులు మనకు కావాలా? అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ఎవరైనా ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకుంటే వదిలేస్తారా? అంటూ చంద్రబాబు అడిగారు. ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బంగారు గుడ్డుపెట్టే బాతుని ఇచ్చినా కేసీఆర్‌ ఏమీ చేయలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏమీ చేయని కేసీఆర్‌కు 88 సీట్లు వస్తే.. రాష్ట్ర అభివృద్ది కోసం 18 గంటలు పనిచేసిన మనకు ఎన్ని రావాలని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read