పదవులొద్దు.. ప్రజల ఆకాంక్షలే తనకు ముఖ్యమని తేల్చి చెప్పిన వంగవీటి వారసుడికి అరుదైన గౌరవం కలిపించింది టీడీపీ. తెలుగు దేశం స్టార్‌ క్యాంపెయినర్‌ గా రాధాకు అవకాశం కలిపించింది. దీంతో టీడీపీ తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారు వంగవీటి రాధా. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, టీడీపీతో జరగబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే..వైసీపీలో వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు రాధా. వాస్తవానికి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసింది టీడీపీ. కానీ, పార్టీ ఆఫర్ ను రాధా సున్నితంగా తిరస్కరించటంతో..కోరుకున్న చోట సీటు కేటాయిస్తామని ప్రతిపాదించింది. అయితే…రాధా మాత్రం తాను పదవులు ఆశించి పార్టీలో చేరలేదని తేల్చి చెప్పేశారు.

radha 19032019

ప్రజల ఆశయాలతో పాటు తన తండ్రిని అవమానించిన వైసీపీ ఓటమే తన లక్ష్యమని క్లారిటీ ఇచ్చారాయన. రంగా ఆశయాల సాధన కోసం…రాష్ట్ర పగతి కోసం టీడీపీకి తోడుగా ఉంటానని అంటున్నారు. విజయవాడలో పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు అందించటం రంగా కలని గుర్తు చేసిన రాధా..తన తండ్రి కల వాస్తవ రూపంలోకి రావాలంటే టీడీపీ అధికారంలోకి రావటం తప్పనిసరి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా తాను టీడీపీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని చంద్రబాబును కోరారు. రాధా విన్నపంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు వంగవీటి రాధాను టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించారు.

radha 19032019

రాధా ఎన్నికలకు దూరంగా ఉంటూనే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి జగన్ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. సామాజిక సమీకరణాల నేపధ్యంలో వంగవీటి రాధా ప్రచారం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణా జిల్లాలోనూ రెండు భిన్న ధ్రువాలు ఏకం కానున్నాయి. ఈ ప్రభావం టీడీపీ విజయానికి దోహదం చేస్తుందని పార్టీ భావిస్తోంది. రాధా ప్రధానంగా కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో పక్క, విజయవాడలో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న విభేదాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం ఇరు కుటుంబాల వారసులు వంగవీటి రాధా, దేవినేని అవినాష్ లు ఇద్దరూ ఒకే వేదిక పైకి వచ్చారు.

రాష్ట్రంలో రాజకీయం చెయ్యలేక, బీహార్ నుంచి అరువు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ముఖ్యంగా కుల గొడవలు పెట్టటం, ఫేక్ న్యూస్ వ్యాప్తి చెయ్యటం, అనుమానాలు వచ్చేలా చెయ్యటంతో, ఈ బీహారీ బాబు దిట్ట.. బీహార్ లో ఏ విధంగా అయితే ఇది వరకు కుల గొడవలు పెట్టి, రాజకీయ లబ్ది పొందే వారో, అదే స్ట్రాటజీ ఇక్కడ మన రాష్ట్రంలో ప్రయోగించాలని, ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు ప్రశాంత్ కిషోర్. మొన్నటికి మొన్న, చింతమనేని పై ఫేక్ వీడియో తిప్పారు. అలాగే గుంటూరులో రైతు చనిపోతే, పోలీసులు కొట్టి చంపారు అంటూ, హడావిడి చేసారు. పసుపు కుంకుమ అప్పు అంటూ, పుకార్లు పుట్టించారు. ఇలా అనేక విధాలుగా ప్రశాంత్ కిషోర్ టీం, మన రాష్ట్రంలో ప్రశాంత లేకుండా చేస్తుంది.

radha 19032019

ఈ నేపధ్యంలో, ప్రశాంత్ కిషోర్ పై, జగన్ పై, చంద్రబాబు విమర్శలు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ లో కూర్చుని, వీళ్ళ రాజకీయం కోసం, ఏపిలో ఎలాంటి పనులు చేస్తున్నారో విమర్శిస్తూ వస్తున్నారు ప్రతి మీటింగ్ లో, ప్రశాంత్ కిషోర్ నిర్వాకాలు చెప్తూ వస్తున్నారు. అయితే, పాపం ప్రశాంత్ కిషోర్ ఈ మాటల పై హార్ట్ అయ్యారో, లేక తన గుట్టు అంతా చంద్రబాబు విప్పుతున్నారు, ఎప్పటికప్పడు, తనని దోషిగా ప్రజల ముందు నిలబెడుతున్నారు అనే అసహనంతో, ఈ రోజు చంద్రబాబు పై ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్ చేసారు. రాజకీయ కాంట్రాక్టు చేసుకునే ఒక బీహార్ వ్యక్తి, జగన్ అండ చూసుకుని, చంద్రబాబుని విమర్శించే స్థాయికి వచ్చాడు అంటే, బ్యూటీ అఫ్ డెమోక్రసీ అనుకోవటమే.

radha 19032019

ఓటమి దగ్గరపడినప్పుడు ఎంతటి అనుభవజ్ఞడైన రాజకీయ నేతయినా సరే వణికిపోతాడని.. కాబట్టి చంద్రబాబు ప్రేలాపనలు తనకు పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించడం లేదని అన్నారు. బీహారీ బంధిపోటు అంటూ తనను అమర్యాదపూర్వకంగా సంబోధించడం.. బీహార్‌పై మీ చెడు దృక్పథాన్ని బయటపెడుతోందంటూ విమర్శించారు. అయితే, ఇక్కడ తను చేసే లత్కోర్ పనులకు చంద్రబాబు విమర్శ చేస్తుంటే, ప్రశాంత్ కిషోర్ మాత్రం, బీహార్ మొత్తాన్ని చంద్రబాబు అంటున్నారు అంటూ, కొత్త పల్లవి అందుకున్నారు. అయినా చంద్రబాబు తాను ఏమి చేసింది, గంటన్నర చెప్పే, ఏ విమర్శ అయినా చేస్తారు. చంద్రబాబు చెప్పే అభివృద్ధి ప్రతి రోజు ప్రజలు వింటుంటే, ఈ బీహారీ బాబు సలహాలు చంద్రబాబుకు అవసరమా ? చేసే పనులు మంచివి అయితే, ప్రశాంత్ కిషోర్ ని కాని, జగన్ ని కాని, ఏమి అనరు కదా..

ఒకప్పుడు కంచుకోటగా వుండి దాదాపు పదేళ్లుగా పట్టు చిక్కకుండా పోయిన పుంగనూరు నియోజకవర్గంపై టీడీపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఆనవాయితీకి భిన్నంగా ఎన్నికలకు ఆరు నెలల ముందటే అభ్యర్థిని ఎంపిక చేసింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీటైన అభ్యర్థిగా అనీషారెడ్డిని తెరపైకి తెచ్చింది. మంత్రి అమరనాథరెడ్డి సోదరుడు, పుంగనూరు టీడీపీ సమన్వయకర్త ఎన్‌.శ్రీనాథరెడ్డి సతీమణి అయిన ఎన్‌.అనీషారెడ్డి న్యాయశాస్త్రం చదివారు. రాజకీయ కుటుంబానికి కోడలుగా రావడంతో పాటు తొలినుంచీ రాజకీయాలపై ఆమె అవగాహన కలిగి వున్నారు. అభ్యర్థిగా ఖరారు చేసిన రోజు నుంచి విశ్రాంతి లేకుండా భర్త శ్రీనాథరెడ్డితో కలసి నియోజకవర్గంలో అనీషారెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. గ్రామగ్రామానా టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. తనను గెలిపిస్తే పుంగనూరులో ప్రశాంత రాజకీయాలు ఉంటాయని, దౌర్జన్యాలుండవని ప్రజలకు భరోసా ఇస్తున్నారు.

radha 19032019

జనవరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ లేదని వైసీపీ నేతలు అనీషారెడ్డిని వేదిక మీదకు రాకుండా అడ్డుకోవడంతో ఆమె ప్రజలే తనకు ప్రోటోకాల్‌ అంటూ వేదికల ముందు నేలపై కూర్చుని ప్రసంగించడంతో ప్రజల నుంచి సానుభూతి లభించింది. మరోవైపు మంత్రి అమరనాథరెడ్డితో పాటు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తదితరులు నియోజకవర్గంలో పర్యటించి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇటీవల నియోజకవర్గంలో పారుతున్న హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కూడా టీడీపీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది.

radha 19032019

ఇక పెద్దపంజాణి మండలం దాసర్లపల్లెకు చెందిన బి.రామచంద్రయాదవ్‌కు జనసేన పార్టీ టికెట్‌ ప్రకటించింది. కొంతకాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న రామచంద్రయాదవ్‌కు వైద్యరంగానికి సంబంధించిన పరిశ్రమలు, ఆస్పత్రులు ఉన్నాయి. వైసీపీకి మద్దతుగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఈయన వెంట నడుస్తున్నారు. పుంగనూరు బీజేపీ అభ్యర్థిగా సోమలకు చెందిన గన్నా మదనమోహన్‌బాబును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆర్మీలో రిటైరయ్యాక రాజకీయాలపట్ల ఆసక్తి ఉండడంతో ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఈయన సోమల మండలంలో కొంతమంది యువకులతో కలిసి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. రాష్ట్ర విభజనతో అడ్రస్‌ గల్లంతైన కాంగ్రెస్‌ పార్టీకి సరైన నాయకులు, క్యాడర్‌ లేదు.

 

 

వైకాపా అధ్యక్షుడు జగన్‌, మాగుంట కలిసి ఉన్న ఫొటోకు విజయ్‌మాల్యా ట్విటర్‌లో లైక్‌ కొట్టడంతోనే వారి మధ్య ఉన్న సంబంధాలు బహిర్గతం అయ్యాయని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకరన్‌ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ సంబంధాలకు ఈ ట్వీట్‌ నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు ముందుచూపు వల్లే రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరుగుతోందన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని చెప్పారు.

radha 19032019

ఇది ఇలా ఉంటే, ఎన్నికలా ప్రచారంలో, జగన పై విమర్శలు ఎక్కుపెట్టారు చంద్రబాబు. ‘‘అవినీతి లేని పాలన అందిస్తానని జగన్‌ అంటున్నారు. ఆయన అవినీతి ప్రపంచానికంతా తెలుసు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో జగన్‌ అవినీతిపై కేస్‌స్టడీ ఉంది. నాపై నమ్మకం ఉంచిన రాజధాని రైతులు భూములు ఇచ్చారు. అదే జగన్‌ వస్తే ఆ భూములను కొట్టేసి మళ్లీ జైలుకు వెళ్తారు’ అని సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం జరిగిన తెదేపాఎన్నికల సన్నాహక సభలో చంద్రబాబు ప్రసంగించారు. అయిదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయాలని ప్రజలను కోరారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా కార్యకర్తలకు ఆయుధాలను ఇచ్చానని, వాటితో జనంలోకి వెళ్లి ఓట్లు వేయించాలని సూచించారు. ఐటీ కేసులకు భయపడి పార్టీని వదిలారని మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఒంగోలు గిత్తల్లా మారి ఆ నమ్మక ద్రోహులను కుమ్మాలని అన్నారు.

radha 19032019

‘‘దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటారు, కానీ ఆ ఫ్రంట్‌లో ఉన్నది ఇద్దరే. 16 సీట్లు గెలిస్తే దేశంలో చక్రం తిప్పుతారట. వాటితో బేరం కుదుర్చుకుని తెలుగుజాతిని అమ్మేస్తారు’ అంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. జగన్‌, కేసీఆర్‌ కలిశాక చేసిన మొదటి పని పోలవరంపై కేసులు వేయడం. ఫిబ్రవరి 23న పోలవరంపై రిట్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై మీ సమాధానం ఏంటో? జగన్‌, కేసీఆర్‌లు చెప్పాలి. ‘‘నేను కేసీఆర్‌ను మూడు వేల సార్లు తిట్టానట. నాకు తిట్లు రావు. గట్టిగా, పౌరుషంగా చెప్తానంతే.. నువ్వు రుబాబు చూపిస్తే నేను భయపడాలా? నేను ఎంత కసిగా ఉండాలి? తెలంగాణ కంటే ఏపీలో మంచి అభివృద్ధి జరిగింది.. అది చూసి ఓర్వలేకనే ఇలా కేసులు వేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లో కూడా తెలుగువారు ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో వ్యాపారం చేస్తే వారికి బెదిరింపులు, కేసులు.. నీ తాటాకు చప్పుళ్లకు మేం భయపడం. అమరావతి శంకుస్థాపనకు వచ్చి కేసీఆర్‌ రూ. 500 కోట్లు ఇస్తానన్నారు, కానీ, మోదీ ఏమనుకుంటాడనో ఇవ్వలేదు. ఇప్పుడు మనకు రావాల్సిన ఆస్తులూ ఇవ్వడం లేదు’’ అని చంద్రబాబు చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read