పెనమలూరు ఎమ్మెల్యే కార్యాలయం, పోరంకి...గత కొన్నేళ్ళుగా ఓ ప్రముఖ పత్రికకు పెనమలూరు మండలంలో కొంత భాగంతో పాటు, మరికొన్ని ప్రాంతాలకు క్రైం రిపోర్టర్ గా పని చేస్తున్న ఓ విలేకరి, అతని వృత్తి నిర్వహణలో భాధ్యతా రాహిత్యం, నోటి దురుసుతనంతో పాటు అవినీతి ఆరోపణల నేపధ్యంలో సంబంధిత యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విధుల నుండి తొలగించిన విషయం స్థానికులకు తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆంద్రప్రభ పత్రికలో ఉద్యోగానికి కుదురుకున్న సదరు విలేకరి రెండు రోజుల క్రితం మరో ముగ్గురితో కలసి ఎమ్మెల్యే వారిని ఇంటి వద్ద కలిసి అనుకూల వార్తలు వ్రాసేందుకు పెద్ద మొత్తం డిమాండ్ చేశారు.
మీడియాలో పెయిడ్ వార్తలు వ్రాయించుకునే స్థాయిలో తన పనితీరు లేదు అని, మీకు అంతగా కావాలంటే ఎన్నికల సమయం కాబట్టి మీ పత్రికకు ప్రకటనలు ఇస్తా అని ఎమ్మెల్యే గారు వారి ప్యాకేజ్ ఆఫర్ ను తిరస్కరించారు. దీనితో ఎమ్మెల్యే గారి ప్రతిష్ట దెబ్బతినేలా, ప్రతిపక్ష నేతలతో ప్యాకేజ్ మాట్లాడుకొని నిన్నటి నుండి పూర్తి నిరాధార ఆరోపణలతో కధనాలను ప్రచురిస్తూ తమ అక్కసు తీర్చుకున్నారు. ఈ విషయమై, సదరు కధనంలో పేర్కొన్న ఆరోపణలను నిగ్గు తేల్చి, భాధ్యులను గుర్తించి శిక్షించాల్సిందిగా బోడె ప్రసాద్ ఫిర్యాదు చేయడం జరిగింది.
సదరు కధనం ప్రతులను, వారు ఇంటికి వచ్చి మాట్లాడిన సిసి రికార్డింగ్ ఫుటేజ్ తో సహా జోడించి, స్థానిక పెనమలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి, పెనమలూరు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మరియు సబ్ కలెక్టర్ మిషా సింగ్ గారికి, పెనమలూరు తహసీల్దారు శ్రీ గోపాలకృష్ణ గారికి, జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ MD ఇంతియాజ్ గారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. అంతే కాకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే, ఈ విషయమై సదరు వ్యక్తులపై, పత్రికపై పరువు నష్టం దావా వేయడంతో పాటు, క్రిమినల్ చర్యలు తీసుకోనబడును అని తెలియచేయడమైనది.