టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కి వచ్చింది. దాదాపుగా ఖరారైన టీడీపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా: విజయవాడ- కేశినేని నాని, గుంటూరు- గల్లా జయదేవ్, నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు, బాపట్ల- శ్రావణ్ కుమార్, ఒంగోలు- శిద్దా రాఘవరావు, నెల్లూరు- బీదా మస్తాన్‌రావు, చిత్తూరు- శివప్రసాద్, తిరుపతి- పనబాక లక్ష్మి, కడప- ఆదినారాయణరెడ్డి, హిందూపురం- నిమ్మల కిష్టప్ప, అనంతపురం- జేసీ పవన్, శ్రీకాకుళం- రామ్మోహన్‌నాయుడు, విజయనగరం- అశోక్ గజపతిరాజు, అరకు- కిషోర్ చంద్రదేవ్, అనకాపల్లి- ఆడారి ఆనంద్, కాకినాడ- చలమలశెట్టి సునీల్, ఏలూరు- మాగంటి బాబు, కర్నూలు- కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, అమలాపురం- జీఎంసీ హరీష్, మచిలీపట్నం- కొనకళ్ళ సత్యనారాయణ ...పెండింగ్: విశాఖ- శ్రీభరత్(పెండింగ్), రాజమండ్రి- మాగంటి రూప (పెండింగ్), దఖరారుకాని నరసాపురం, రాజంపేట, నంద్యాల అభ్యర్థులు
మరో పక్క, ఎన్నికల యుద్ధానికి టీడీపీ సైనికులంతా సిద్ధం. ఈ ఎన్నికల్లో మీరే అభ్యర్థులుగా భావించుకోవాలి. మన అభ్యర్థి విజయానికి కలిసికట్టుగా కృషి చేయాలి. మన గెలుపు రాష్ట్రానికి మలుపు’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘టీడీపీ మిషన్-150 ప్లస్’పై శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి పార్టీ బాధ్యులు, బూత్ కన్వీనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘2019-24కి సమర్థ బృందం ఎంపిక చేశాం. టీడీపీని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలి. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ప్రజా విజయం. టీడీపీ గెలుపు రైతుల గెలుపు. టీడీపీ గెలుపు మహిళల గెలుపు. టీడీపీ గెలుపు యువతరం గెలుపు. కార్యకర్తలంతా గెలుపు మంత్రం జపించాలి. మీ అందరికీ ‘మిషన్ 150ప్లస్’ పోటీ పెట్టాం. 150 స్థానాలకు పైగా గెలవాలి. 25 లోక్‌సభ స్థానాలను గెలిపించాలి’ అని సీఎం స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో టీడీపీయే ముందుందని, తొలి జాబితా విడుదల చేశామన్నారు.
టీడీపీ అభ్యర్థుల్ని ఎంపిక చేసింది ప్రజలేనని తెలిపారు. ‘ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా, అనేక మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి.. అందరి అభిప్రాయాలను విశ్లేషించాం. అభ్యర్థుల పనితీరును బేరీజు వేశాం. స్థానాలు మార్చి కూడా కొందరికి న్యాయం చేశాం. మిగిలిన వారికీ తగిన గుర్తింపు, గౌరవం ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. ‘ప్రచారానికి నేను వెళ్లక పోయినా కుప్పంలో అత్యధిక మెజారిటీ వచ్చింది. సేవకుడిగా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు.. రాష్ట్రాన్ని మీరెంత అభివృద్ధి చేస్తే.. మీకంతకు మించిన మెజారిటీ ఇస్తామని ప్రజలంటారు. కుప్పం స్ఫూర్తి అన్ని నియోజకవర్గాల్లో రావాలి’ అని నేతలకు దిశానిర్దేశం చేశారు.