ఓటు.. సామాన్యుడి పాశుపతాస్త్రం.. ప్రజాస్వామ్యానికి మూలాధారం. అలాంటి ఓటు హక్కును ప్రతి భారతీయుడు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభ్యర్థిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేలా చూడాలని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు మోదీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ్‌బంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేసీఆర్‌, చంద్రబాబు, జగన్ సహా ట్విటర్‌ వేదికగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభ్యర్థించారు.

police 13032019

‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేలా ఓటర్లను ప్రోత్సహించాలని రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీ, శరద్‌ పవార్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, స్టాలిన్‌ తదితరులను కోరుతున్నా. దేశవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను పెంచాలి. రాష్ట్రాల్లో పోలింగ్‌ బూత్‌లకు ఎక్కువ మంది వచ్చేలా కృషి చేయాలని కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌, కుమారస్వామి, చంద్రబాబు, జగన్‌, నితీశ్‌ కుమార్‌ తదితరులను కోరుతున్నా’ అని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ప్రజల ఆలోచనలపై మీడియా పెను ప్రభావం చూపుతోందని, అలాంటి మీడియా సంస్థలు ఓటు హక్కుపై విస్తృత ప్రచారం కల్పించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

police 13032019

రాజకీయ నాయకులనే కాదు సినీ, క్రీడా ప్రముఖులను కూడా మోదీ అభ్యర్థించారు. ‘మోహన్‌లాల్‌, నాగార్జున గారు.. మీ ప్రదర్శనలతో కోట్ల మంది అభిమానులను ఆనందపరుస్తున్నారు. అందుకు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. మీ లాంటివారు ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని మరో ట్వీట్‌లో మోదీ కోరారు. షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, క్రీడా ప్రముఖులు సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లే, క్రికెటర్లు ధోనీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఫోగట్‌ సోదరీమణులు గీతా, బబిత, విన్నేశ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు దీపికా పదుకొణె, ఆలియా భట్‌, అనుష్క శర్మ, అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, షారూక్ ఖాన్‌, కరణ్‌ జోహార్‌ తదితరులను మోదీ అభ్యర్థించారు.

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్‌సభ టీడీపీ అభ్యర్థి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అక్కడి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకే సీఎం చంద్రబాబు మరోసారి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై సీఎం చంద్రబాబు కసరత్తు కొనసాగుతోంది. గెలిచే అభ్యర్థుల్నే ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాయపాటి సాంబశివరావును కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎంపీ రాయపాటి సాంబశివరావు.. తన కుమారుడుకు సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. తనకు ఎంపీ సీటుతో పాటు కుమారుడు రంగబాబుకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే రంగబాబు సీటు విషయాన్ని సీఎం చంద్రబాబు సందిగ్ధంలో పెట్టినట్లు తెలుస్తోంది.

police 13032019

సీఎం చంద్రబాబుతో మంత్రి శిద్దా రాఘరావు భేటీ అయ్యారు. ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు శిద్దాకు సూచించారు. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు శిద్దా విముకుత చూపినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ‘‘ నియోజకవర్గ కార్యకర్తలు ఎంపీగా పోటీ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందున ఎమ్మెల్యే గానే పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను. బుధవారం మరోసారి మాట్లాడుదమన్నారు. ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే కుటంబ సభ్యులు అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.’’ అని అన్నారు.

police 13032019

మరో పక్క, సీఎం చంద్రబాబును ఎంపీ ఎస్పీవై రెడ్డి కలిశారు. నంద్యాల పార్లమెంట్‌ స్థానానికి తన కూతురుకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అయితే మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ ‘‘మేం ఎంపీ టికెట్‌ మాత్రమే అడుగుతున్నాం. నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. మహిళా కోటాలో నంద్యాల ఎంపీ టికెట్‌ నా కూతురికి అడిగాను. బుధవారం మరోసారి సీఎం చంద్రబాబును కలిసి ఎంపీ టికెట్‌ అడుగుతా.’’ అని ఎస్పీవై రెడ్డి అన్నారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి బాలకృష్ణ చిన్నల్లుడి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో టీడీపీలో చేరనున్నారు. దీంతో ఆమెకు తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని అధిష్టానం ఖరారు చేసింది.

తెలుగు రాజకీయాల్లో లగడపాటి రాజగోపాల్ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. వ్యాపారవేత్తగా ఎంతో అనుభవం ఉన్న లగడపాటి రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేశారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన రాజకీయాలకు వీడ్కోలు చెప్పారు. కానీ కొన్నిరోజులుగా లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని, టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను ఎక్కడా పోటీ చేయడం లేదని, రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. నరసరావు పేట ఎంపీగా పోటీచేస్తున్నానని జరుగుతున్న ప్రచారం నిజంకాదని అన్నారు. ప్రస్తుత రాజకీయాలతో తనకు సంబంధంలేదని అన్నారు. ఎవరైనా సన్నిహితులు అడిగితే మాత్రం సలహాలు, సూచనలు ఇస్తున్నానని లగడపాటి తెలిపారు.

police 13032019

అప్పట్లో తాను మెదక్ ఎంపీగా పోటీచేస్తానని చెప్పడాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్రంలో మొదటి దశలోనే ఎన్నికలు రావడం శుభపరిణామం అని పేర్కొన్నారు లగడపాటి. కాగా, గత ఎన్నికల సమయం నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వేలు చేయిస్తూ అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకుంటున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో ఆయన సర్వేలు దారుణంగా తప్పడంతో మనస్తాపానికి గురయ్యారు. గతంలో తన సర్వేలు వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండడంతో ఆర్జీ ఫ్లాష్ టీమ్ కు మంచి పేరొచ్చింది. కానీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభంజనాన్ని ఊహించడంలో ఆయన బొక్కబోర్లాపడడంతో మొదటిసారి లగడపాటి సర్వేల విశ్వసనీయతపై సందేహాలు మొదలయ్యాయి. అందుకే ఈసారి ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తర్వాతే సర్వే ఫలితాలు ప్రకటిస్తానని లగడపాటి చెబుతున్నారు.

police 13032019

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదన్నారు. ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. పోలింగ్‌ ముగిసిన తర్వాతే తన సంస్థ సర్వే ఫలితాలను వెల్లడిస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా అనేది ఈ ఎన్నికల్లో ఒక అంశం మాత్రమేనని చెప్పారు. వైరుధ్యాలున్న నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకతాటిపైకి తేవడం మంచిపరిణామమన్నారు. ఎల్లప్పుడూ వైషమ్యాలతో ఉండాలని ఎవరూ కోరుకోరని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేయబోనని, ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్టు స్పష్టంచేశారు. విభజన తర్వాత రాష్ట్రం అనేక కష్టాలను ఎదుర్కొందని, ఆర్థికలోటులోనూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని లగడపాటి వ్యాఖ్యానించారు.

వైసీపీ అధినేత జగన్ విషయంలో టీడీపీ మరో బాంబు పేల్చింది. జగన్ క్విడ్ ప్రోకోకు సంబంధించిన ఆధారాలను వెలికితీసింది. సీబీఐకి అప్పటి ఈడీ డైరెక్టర్ రాసిన లేఖను బయటపెట్టింది. 2017లోనే జగన్ అక్రమాలను నిర్ధారించినా... విచారణను తొక్కిపెట్టినట్టు ఆ లేఖలో ఉన్నట్టు తెలిపింది. విచారణ నుంచి తప్పించుకునేందుకే మోదీకి జగన్ సరెండర్ అయ్యారని మండిపడింది. టీడీపీ ఇప్పుడు బయటపెట్టిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. 8 సంస్థలతో జగన్ కు క్విడ్ ప్రోకో ఉందని అప్పటి సీబీఐ డైరెక్టర్ ఆస్థానాకు అప్పటి ఈడీ డైరెక్టర్ కర్నాల్ సింగ్ లేఖ రాశారు. జగన్ కేసుల్లో మరింత స్పష్టమైన విచారణ జరపాలని... అప్పుడే పూర్తి వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. ఈ లేఖనే ఇప్పుడు టీడీపీ బయటపెట్టింది. ఈడీ లేఖ రాసినప్పటికీ... సీబీఐ పట్టించుకోలేదని... విచారణ ముందుకు సాగలేదని ఆరోపించింది.

police 13032019

సండూర్ పవర్ కంపెనీ, కార్మెల్ ఇండియా, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్ తో జగన్ కు క్విడ్ ప్రోకో ఉందని లేఖలో కర్నాల్ సింగ్ తెలిపారు. క్విడ్ ప్రోకో ఆధారాలు లేవని సీబీఐ ఎలా చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి మెమోను కోర్టులో ప్రవేశపెట్టడం వల్ల... ఈడీ చేసిన దర్యాప్తును కూడా నిలిపివేయాలని జగన్ న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. క్విడ్ ప్రోకోకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

police 13032019

రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2009లో ఇందూ గ్రూపుకు దాదాపు 100 ఎకరాల భూమిని ఇచ్చారని... వాటిలో 11 ఎకరాలను జగన్ బినామీ సంస్థలకు ఇందూ గ్రూపు ఇచ్చిందని కర్నాల్ సింగ్ పేర్కొన్నారు. కూకట్ పల్లిలో ఉన్న ఈ స్థలం ఇప్పటికీ జగన్ అధీనంలో ఉందని తెలిపారు. క్విడ్ ప్రోకోకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read