రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఒటమి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసిపి చిత్తుగా ఓడిపోవడం వందకు వెయ్యి శాతం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని అభిప్రాయ పడ్డారు. ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఇదేం ఖర్మ అంటూ భయటకు వచ్చి తమ సమస్యలపై చర్చిస్తున్నారని అన్నారు. రివర్స్ పాలనపై నేడు యావత్తు రాష్ట్రమే ఇదేం ఖర్మ అని అవేదన చెందుతోందని...అందుకే పార్టీ తలపెట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి ఈ స్థాయి స్పందన వస్తోందని పేర్కొన్నారు. రోజురోజుకూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం జగన్ రెడ్డికి అర్థం అయ్యిందని...అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కూడా ఆలోచన చేస్తున్నారని అన్నారు. మేలో ఎన్నికలకు వెళ్లాలా, అక్టోబర్ లో వెళ్లాలా....లేక 2024 వరకు ఆగాలా అనే అంశంలో జగన్ ఆలోచనలో పడ్డారని చెప్పారు. తన ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకుండా నిన్న మొన్నటి వరకు జగన్ రెడ్డి భయపెట్టి కొంత మేర ఆపగలిగాడని...అయితే టిడిపి చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలతో పరిస్థితి మారిపోయిందన్నారు. ప్రజలు ఇప్పుడు నిర్భయంగా బయటకు వచ్చి తమ సమస్యలపై గళమెత్తుతున్నారని వివరించారు.

పెన్షన్లు, ఇతర పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లతో బెదిరించినా ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యక్రమాలకు తరలివస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీయడంతో అర్హులకు పెన్షన్లు, ఇతర పథకాలు నిలిపేస్తూ కోతలు పెడుతున్నారన్నారు. నష్టపోయిన వారందరికీ టీడీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నా....ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ విధానాలతో అటు రాష్ట్రం...ఇటు ప్రజలు వ్యక్తిగతంగా అప్పుల పాలయ్యారని అన్నారు. 13వ తేదీ వచ్చినా నేటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి లేదని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదని గుర్తు చేశారు. నాటి టిడిపి ప్రభుత్వం 12 లక్షల ఇళ్లు నిర్మిస్తే.....వైసిపి ప్రభుత్వం మూడున్నరుళ్లలో పేదలకు కేవలం 5 ఇళ్లు మాత్రమే కట్టిన విషయాన్ని ఇదేం ఖర్మ కార్యక్రమంలో ప్రజలతో చర్చించాలని సూచించారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో అన్ని రాష్ట్రాల కంటే ఎపి వెనుకబడి పోవడానికి కారణం జగన్ రెడ్డి విధానాలే అని చంద్రబాబు అన్నారు. జగన్ రెడ్డి వైఫల్యాలు, దోపిడీల కారణంగా ఏ వర్గం ఎలా నష్టపోయిందనే విషయాన్ని ఇదేం ఖర్మ కార్యక్రమంలో చర్చ చెయ్యాలని చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో వెల్దుర్తి గ్రామంలోని  పోలీసుస్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెల్దుర్తి పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయడంతో టిడిపి నేత జూలకంటి బ్రహ్మారెడ్డి  పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిరసన తెలిపారు. మా కార్యకర్తలను  ఆక్రమంగా కేసులు పెట్టి, ఎందుకు అరెస్ట్ చేసారని పోలీసులను గట్టిగా నిలదీయడంతో, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేసారు. జూలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ కార్యకర్తలు కలిసి పోలీస్ స్టేషన్ ను ముట్టడించడంతో, అక్కడ ఉన్న పోలీసులకి , టీడీపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఏపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని హరిజా సొసైటీకి ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన భూమిని తమకు ఇష్టం వచ్చినట్లు స్వాధీనం చేసుకోవడం కుదరదని ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ హరిజన సొసైటీకి ఇచ్చిన స్థలం 48 సంవత్సరాల క్రితందని , ఇప్పుడు ప్రభుత్వం దాన్ని అక్రమంగా స్వాదీనం చేసుకుంటుందని హైకోర్టులో హరిజన సంఘం పిటిషన్ వేసింది. నిరుపేద దళితులకు వారు వ్యవసాయం చేసుకోవడం కోసం ఇచ్చిన పొలాన్ని నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని హరిజన సంఘం హైకోర్టులో పిటీషన్ వేసింది. ఆ పిటిషన్ తరపు లాయర్ శ్రావణ్ కుమార్ తన వాదనలు కోర్ట్ లో వినిపించారు. అయితే వాదనలు విన్న హైకోర్ట్ అక్రమ పద్దతుల్లో భూమిని స్వాదీన పరచుకోవడానికి కుదరదని, ప్రస్తుతానికి ఎటువంటి ఆక్రమణలు చెయ్యద్దని కోనసీమ కలెక్టర్కు , రామచంద్రపురం తహశీల్దారుకు ఆదేశాలు జరీ చేసింది. దీని పై తదుపరి విచారణ హైకోర్ట్ 4 వారాలకు వాయిదా వేసింది.

నెల్లూరు కరకట్ట కమల్ హాసన్ గా పేరుపడిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేత అల్లాబక్షుపై దా-డి తో పాటు మైనార్టీ నేత సాబీర్ ఖాన్ పై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీలు నెల్లూరు విఆర్సి సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హటావో ముస్లిం మైనారిటీ బచావో అని రూరల్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో కు వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యల పై ప్రశ్నించినందుకు, ముస్లిం నేతలపై, దా-డు-లు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. మాట్లాడితే కేసులు పెట్టేస్తారా, ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read