మంగళగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. జగన్ మెప్పు కోసం ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెయ్యని ప్రయత్నమే లేదు. చీటికీ మాటికీ కోర్ట్ లో కేసులు వేసి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే డ్యూటీ తీసుకుని, ప్రతిసారి జగన్ దగ్గర మార్కులు కొట్టేస్తూ ఉంటాడు. అయితే ప్రతి సారి, కోర్ట్ ఆ కేసులు కొట్టేసింది అనుకోండి అది వేరే విషయం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అమరావతి దగ్గర నుంచి, ఫైబర్ గ్రిడ్ దాకా, అన్నిటి పై, కోర్ట్ ల్లో కేసులు వేసి, కావాలని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పార్టీకి, జగన్‌కు ఆర్కే తొలి నుంచి వీరవిధేయుడుగా వ్యవహరిస్తూ వచ్చారు.

alla 01032019

ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్‌ను నీడలా వెన్నంటి పయనించారు. అంతేకాదు, ఏ మాత్రం రాజీ పడకుండా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ విషయం వచ్చే సరికి, మొదట్లో తానే ఈ సారి పోటీ చేయలేనని, కొంత ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని జగన్‌కు చెప్పగా, జగన్ ఏ మాత్రం మాట్లాడకుండా, మౌనం వహించడమే తప్ప తిరిగి పోటీ చేయాలని ఒత్తిడి చేయలేదు. ఆర్కే మాత్రం, జగన్ ఏమన్నా సహాయం చేస్తాడేమో అని అనుకున్నాడు. కాని, జగన్ మాత్రం మొండి చెయ్య చూపించాడు...

alla 01032019

దీంతో, జగన్ ని నమ్ముకుంటే పని అవ్వడాని, అప్పో సొప్పో చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకున్న ఆర్కే, కొద్ది రోజుల క్రితం తిరిగి తాను పోటీకి సిద్ధమని చెప్పగా, నీ పై నియోజకవర్గంలో అసమ్మతి ఉంది, వారందరినీ కలుపుకొని వస్తేనే టిక్కెట్‌ ఇస్తానంటూ పరోక్షంగా టిక్కెట్‌ లేదని చెప్పేసినట్లు తెలిసింది. ఈ కధ నడుస్తూ ఉండగానే, ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవమానం జరిగింది. ఆర్కేకు సమాచారం లేకుండా వైసీపీలో మంగళగిరి టీడీపీ, బీజేపీ నేతలు చేరారు. దీంతో ఆర్కే అనుచరులు తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి వైదొలగాలని ఒత్తిడితో రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. జగన్ కోసం ఎంతో చేసానని, రాష్ట్రానికి, చంద్రబాబుకి వ్యతిరేకంగా కేసులు కూడా వేసి, రాష్ట్ర ద్రోహిగా ముద్ర పడినా, జగన్ కోసం భారించానని, ఇప్పుడు జగన్ ఇలా చెప్పాపెట్టకుండా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, మనస్తాపానికి గురయ్యారు.

వాల్తేరు డివిజన్‌పై మొదటి నుంచీ పెత్తనం చలాయిస్తున్న ఒడిసా, మరోసారి కేంద్రంలో చక్రం తిప్పింది. ఏకంగా డివిజన్‌ను రద్దు చేయించింది. కొత్తగా రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేయించుకుంటోంది. ఈ విషయంలో ఒడిసా బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు మాత్రం జోన్‌ ప్రకటిస్తే చాలనే హడావుడిలో వాల్తేర్‌ డివిజన్‌ రద్దు ముప్పునే పట్టించుకోలేదు. వారు కోరుకొన్న ప్రకటనను బుధవారం రాత్రి రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చేశారు. దక్షిణకోస్తా రైల్వే పేరిట విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ప్రకటించిన కేంద్ర మంత్రి, అదే నోటితో వాల్తేరు డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. చిరకాల కల నెరవేసిందని సంతోషించిన ఉత్తరాంధ్ర వాసులు, మంత్రి పెట్టిన మెలికతో హతాశులయ్యారు.

zone 01032019

ఈ ప్రకటనను విశాఖవాసులు, ప్రజాసంఘాలు, వాల్తేర్‌ డివిజన్‌ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రం ఇంద దాగా చేస్తుందని అనుకోలేదని వాల్తేరు డివిజన్‌ పరిధిలోని ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ‘‘125 ఏళ్ల చరిత్ర గల వాల్తేర్‌ డివిజన్‌ రద్దు చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కసి ఉంటే తప్ప 18వేలమంది ఉద్యోగులతో కూడిన డివిజన్‌ను రద్దు చేయడం జరగదు’’ అని వారు మండిపడుతున్నారు. ఇది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసిన తప్పిదం (బ్యూరో, పొలిటికల్‌ బ్లండర్‌)గా అభివర్ణిస్తున్నారు. విశాఖ రైల్వేజోన్‌ కోసం కేంద్రంపై ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీనిపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేయడంతో ఒడిసా అప్రమత్తమైంది. సహజంగా చిన్నపాటి డిమాండ్‌ సాధించుకోవాలంటేనే అక్కడి ప్రజలు రైల్వే ట్రాక్‌లపైకి వచ్చి మెరుపు ఆందోళనలు చేస్తుంటారు. అయితే భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా నుంచి కొంత భాగం వేరుచేసి విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటన చేసినా, ఒడిసా నేతలు, ప్రజలు మౌనంగా ఉండడం నాలుగేళ్ల వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జోన్‌ తప్పదని సంకేతాలు రావడంతో ఒడిసా నేతలు అప్రమత్తమై వాల్తేర్‌ డివిజన్‌ రద్దుకు వ్యూహం పన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

వాల్తేర్‌ డివిజన్‌కు ఆయువు పట్టులాంటి కేకే లైన్‌, కేఆర్‌ లైన్‌ డబ్లింగ్‌ పనులు వేగవంతం చేశారు. కిరండోల్‌, బచేలి ప్రాంతాల నుంచి ఇనుమఖనిజం తరలింపు మరింత పెంచేందుకు రెండోలైన్‌ నిర్మాణం జరుగుతోంది. ఇది త్వరలో పూర్తికానున్నది. అలాగే, రాయగడ, కోరాపుట్‌ పరిసరాల్లో పలు స్టేషన్ల అభివృద్ధి, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం భారీగా చేపట్టారు. ఇలా అన్ని హంగులున్నాయి కాబట్టి ఈ రెండు సరుకురవాణా లైన్లు రాయగడ పరిధిలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఒడిసా బీజేపీ నేతలు చడీచప్పుడు లేకుండా తెరపైకి తెచ్చి సాధించుకున్నట్లు తెలుస్తోంది. తూర్పుకోస్తా రైల్వేకు వచ్చే అనేక ప్రాజెక్టులు మొదటి నుంచీ ఒడిసాకే పరిమితం చేస్తూ వస్తున్నారు. సంబల్‌పూర్‌, వాల్తేర్‌ డివిజన్‌ల పరిధిలోని ఒడిసా ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు మంజూరు చేయించుకున్నారు. చివరకు కొత్తగా ర్యాకులు వచ్చినా వారికి కేటాయించగా మిగిలితేనే వాల్తేరుకు ఇచ్చేవారు. అంత వివక్ష చూపే ఒడిసా బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయడానికి రాయగడ డివిజన్‌ను తెరపైకి తెచ్చి రూ.వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే సరుకు రవాణా లైన్లను తీసుకుపోతున్నారు. ఫలితంగా ఉత్తరాంధ్ర మూడు ముక్కలై కొంతభాగం విజయవాడ, ఎక్కువ భాగం రాయగడ, కొంతభాగం ఖుర్దా డివిజన్‌లో ఉంటుంది. ఇలాంటి జోన్‌ ప్రకటనతో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యకమవుతోంది. కాగా, నూతన రైల్వేజోన్‌ ప్రకటనతో విజయవాడ డివిజన్‌ పరిధి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నౌపాడ వరకు విజయవాడ డివిజన్‌లో కలవనున్నదని తెలుస్తోంది. మొత్తం 250 కిలోమీటర్ల మేర మెయిన్‌ లైన్‌ విజయవాడ డివిజన్‌ పరిధిలోకి వస్తుందని ప్రాథమికంగా తెలియవస్తోంది.

తన ఫాన్స్ ని ఎదో రంజింపచెయ్యటానికి, ఎదో ఎచ్చు కోసం మాట్లాడిన మాటలు, ఇప్పుడు పవన్ మెడకు చుట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, ప్రతి విషయం మాట్లాడుతూ, నాకు ముందే తెలుసు, నాకు వాళ్ళు చెప్పారు, నాకు వీళ్ళు చెప్పారు అని పవన్ కళ్యాణ్ అంటూ ఉండటం మనం చూసాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పై పవన్ మాట్లాడిన మాటలు, ఇప్పుడు పాకిస్తాన్ మీడియాకి ఆయుధం అయ్యింది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు ముందు పాక్‌తో యుద్ధం జరుగుతుందని బీజేపీ తనకు రెండేళ్ళ కిందటే చెప్పినట్లు సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ "డాన్" తన వెబ్‌సైట్‌లో ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి క్లుప్తంగా సమాచారం ఇస్తూ మనదేశానికి చెందిన ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని లింక్ చేసింది.

pk 010322019 1

పవన్ వ్యాఖ్యలు ఇవేనంటూ డాన్ వెబ్‌సైట్ వాటిని ప్రత్యేకంగా హైలైట్ చేసింది... "యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ళ కిందటే చెప్పారు. దీన్ని బట్టి మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందన్నది అర్థం చేసుకోవచ్చు"... జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్... కడప జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు డాన్ వెబ్‌సైట్ లింక్ చేసిన భారతీయ మూల ఇంగ్లీష్ వెబ్‌సైట్ కథనం పేర్కొంది. అంతేగాక పవన్ కల్యాణ్‌కు గతంలో బీజేపీతో సంబంధాలున్నాయని కూడా తెలిపింది. బీజేపీ నేతలు మాత్రమే దేశభక్తులన్నట్లుగా చెప్పుకుంటున్నారని, దేశభక్తి కేవలం బీజేపీ హక్కు కాదని, వారికంటే తాము 10 రెట్లు దేశభక్తులమని పవన్ పేర్కొన్నట్లు ఆ కథనం వెల్లడించింది. భారత్‌లోని ముస్లింలు వారి దేశభక్తిని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సమాజంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు జరిగే ప్రయత్నాలను విఫలం చెయ్యాల్సిందిగా జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చినట్లు ఈ కథనం తెలిపింది.

"భారతదేశంలో ముస్లింలకు సమాన హక్కులున్నాయి. పాకిస్తాన్‌లో హిందువుల స్థితి ఏమిటో నాకు తెలియదు కానీ, భారత్ మాత్రం ఎప్పుడూ ముస్లింలను అక్కున చేర్చుకుని ఆదరిస్తూనే ఉంది. అందువల్లే అజహరుద్దీన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయ్యారు, అబ్దుల్ కలాం ఈ దేశ రాష్ట్రపతి అయ్యారు" అని పవన్ తన ప్రసంగంలో చెప్పినట్లు ఈ కథనం తెలియజేసింది. ఇదిలా ఉంటే, ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా పవన్ చేసిన వ్యాఖ్యల గురించి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు. యుద్ధం పేరుతో బీజేపీ చివరి క్షణంలో జిమ్మిక్కులు చేస్తుందని కొద్ది నెలల క్రితమే తాను హెచ్చరించానంటూ తాను చెప్పిన విషయాన్నే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ధృవపరిచారన్నారు. అయితే మొన్న చంద్రబాబు పై విష ప్రచారం చేస్తూ, అనని మాటలు, అన్నట్టు, "ఇమ్రాన ఖాన్ ఆధారాలు అడుగుతున్నారు చూపించండి" అంటూ మోడీని ప్రశ్నించినట్టు, బీజేపీ చేసిన విష ప్రచారానికి, జనసేన, వైసీపీ చేసిన హంగామా తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇలాంటివే వాళ్లకు ఎదురైంది.

కనిగిరి మాజీ శాసనసభ్యుడు, ఉగ్రసేన అధ్యక్షుడు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం తెలుగుదేశంలో చేరనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి అందిన సమాచారం మేరకు నియోజకవర్గంలోని వేలాదిమంది అనుచరగణంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారు. తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయ సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి కనిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన అనంతరం కూడా ఆ పార్టీలోనే కొనసాగారు. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆరేడు మాసాల క్రితం ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రె్‌సకు దూరమయ్యారు.

congress 01032019

ఉగ్రసేన పేరుతో కనిగిరి నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. కొంతకాలంగా టీడీపీకి దగ్గరయ్యారు. ఉగ్ర సేవా కార్యక్రమాలను, రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్న తీరును గమనించిన చంద్రబాబు గత మూడు నెలలుగా ఆయనను ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్‌ ఉగ్ర సిఫార్సుల మేరకు సీఎం సహాయనిధిని మంజూరు చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఉగ్రనరసింహారెడ్డిలతో ముఖ్యమంత్రి మాట్లాడి ఒకరు ఎమ్మెల్యేగా పోటీచేస్తే మరొకరికి ఎమ్మెల్సీ ఇస్తానని ప్రతిపాదించారు. రెండు రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఐవీఆర్‌ఎస్‌ ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి పార్టీశ్రేణులు, సాధారణ ప్రజల నుంచి మద్దతు లభించినట్లు తెలిసింది.

congress 01032019

దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి వెంటనే ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరమని సూచించారు. తాను తన అభిమానులు, అనుచరులతో కలిసి చేరతానని ఉగ్ర తెలిపారు. అందుకు అనుగుణంగా తాడేపల్లి సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. కాగా గురువారం మధ్నాహ్నం నుంచి నియోజకవర్గంలోని అనుచరులు, అభిమానులు కార్యక్రమానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇతర ప్రాంతాలలో ఉన్నవారు కూడా హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా డాక్టర్‌ ఉగ్ర ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు ఫోన్‌ చేసి కార్యక్రమాన్ని తెలియజేసి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే నియోజవర్గంలో టీడీపీ ముఖ్యనాయకులకు ఫోన్‌ చేసి ఆహ్వానిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read