మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. జగన్ మెప్పు కోసం ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెయ్యని ప్రయత్నమే లేదు. చీటికీ మాటికీ కోర్ట్ లో కేసులు వేసి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే డ్యూటీ తీసుకుని, ప్రతిసారి జగన్ దగ్గర మార్కులు కొట్టేస్తూ ఉంటాడు. అయితే ప్రతి సారి, కోర్ట్ ఆ కేసులు కొట్టేసింది అనుకోండి అది వేరే విషయం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అమరావతి దగ్గర నుంచి, ఫైబర్ గ్రిడ్ దాకా, అన్నిటి పై, కోర్ట్ ల్లో కేసులు వేసి, కావాలని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పార్టీకి, జగన్కు ఆర్కే తొలి నుంచి వీరవిధేయుడుగా వ్యవహరిస్తూ వచ్చారు.
ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్ను నీడలా వెన్నంటి పయనించారు. అంతేకాదు, ఏ మాత్రం రాజీ పడకుండా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ విషయం వచ్చే సరికి, మొదట్లో తానే ఈ సారి పోటీ చేయలేనని, కొంత ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని జగన్కు చెప్పగా, జగన్ ఏ మాత్రం మాట్లాడకుండా, మౌనం వహించడమే తప్ప తిరిగి పోటీ చేయాలని ఒత్తిడి చేయలేదు. ఆర్కే మాత్రం, జగన్ ఏమన్నా సహాయం చేస్తాడేమో అని అనుకున్నాడు. కాని, జగన్ మాత్రం మొండి చెయ్య చూపించాడు...
దీంతో, జగన్ ని నమ్ముకుంటే పని అవ్వడాని, అప్పో సొప్పో చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకున్న ఆర్కే, కొద్ది రోజుల క్రితం తిరిగి తాను పోటీకి సిద్ధమని చెప్పగా, నీ పై నియోజకవర్గంలో అసమ్మతి ఉంది, వారందరినీ కలుపుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తానంటూ పరోక్షంగా టిక్కెట్ లేదని చెప్పేసినట్లు తెలిసింది. ఈ కధ నడుస్తూ ఉండగానే, ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవమానం జరిగింది. ఆర్కేకు సమాచారం లేకుండా వైసీపీలో మంగళగిరి టీడీపీ, బీజేపీ నేతలు చేరారు. దీంతో ఆర్కే అనుచరులు తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి వైదొలగాలని ఒత్తిడితో రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. జగన్ కోసం ఎంతో చేసానని, రాష్ట్రానికి, చంద్రబాబుకి వ్యతిరేకంగా కేసులు కూడా వేసి, రాష్ట్ర ద్రోహిగా ముద్ర పడినా, జగన్ కోసం భారించానని, ఇప్పుడు జగన్ ఇలా చెప్పాపెట్టకుండా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, మనస్తాపానికి గురయ్యారు.