సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. తన అనుచరులు, అభిమానులతో చర్చించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఆయన మంగళ, బుధవారాల్లో గ్రామీణ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారితో చర్చలు జరపనున్నారు. అనకాపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలు; బుధవారం పాయకరావుపేట, ఎలమంచిలి, తదితర నియోజకవర్గాల నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి సంబంధించి కొంత కాలంగా టీడీపీ, వైసీపీల వైపు నుంచి జరుగుతున్న పరిణామాలు, ఏ పార్టీలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి, తదితర అంశాలను తన అనుచరులకు వివరించే అవకాశం ఉంది.

konatla 26022019 2

అయితే తన నిర్ణయానికి అనుచరుల ఆమోద ముద్ర తీసుకుంటారా? లేక అనుచరుల అభిప్రాయాల మేరకు తగిన నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచి చూడాలి. విశాఖలో సోమవారం కొంత మంది ముఖ్య అనుచరులతో కొణతాల సమావేశమై రెండు రోజులపాటు అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీలో చేరే విషయమై ఆయన ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారని స్వయాన మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా వెల్లడించారు. ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి నుంచి అందిన ఆహ్వానం మేరకు 28న అమరావతిలో చంద్రబాబును కలవనున్నారు. అదే రోజు పార్టీలో చేరికకు సూచనగా చంద్రబాబు చేత పార్టీ కండువా కప్పించుకుని, త్వరలో అనకాపల్లిలో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని తెలిసింది.

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కేటాయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ను కేటాయించాలని అందులో కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, గత నాలుగున్నరేళ్లుగా రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు. వాల్తేరు డివిజన్ ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. వాల్తేరు డివిజన్‌ను వదులుకోవడానికి ఒడిశా సిద్ధంగా లేదు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు డివిజన్‌ మీద ఈస్ట్‌కోస్ట్ రైల్వే పట్టుబట్టడంతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యం అవుతోంది.

modi 26022019

మార్చి ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటిస్తున్నారు. నగరంలో జరిగే ఓ సభలో పాల్గొంటారు. ఆ రోజు విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మొన్నటి దాకా, ఈ విషయంలో కేంద్రం, వెటకారం చేస్తూ వచ్చింది. రైల్వే జోన్ పై, పరిశీలించమని చట్టంలో ఉంది, మేము పరిశీలిస్తూనే ఉంటాం అంటూ, వెటకారంగా సమాధానం చెప్పారు. అయితే, నోటిఫికేషన్ వచ్చే వారం రోజులు ముందు, మోడీ వైజాగ్ వచ్చి, కొత్త డ్రామా ఆడనున్నారు అనే సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారం రోజులు ముందు, మోడీ రైల్వే జోన్ ప్రకటించనున్నారు అని లీక్లు ఇస్తున్నారు. అంటే, కనీసం ఉత్తర్వులు ఇచ్చే టైం కూడా ప్రభుత్వానికి ఉండదు.

modi 26022019

అయినా ప్రజలను మభ్యపెట్టటానికి, ఈ డ్రామా ఆడనున్నారు. ఇన్నాళ్ళు ఒక చిన్న నిర్ణయంతో ఏర్పాటు అయ్యే రైల్వే జోన్ విషయంలో, ఏపి మీద కక్షతో, ఇది దూరం పెట్టింది. అయితే వైజాగ్ ఎంపీ సీటు పై కన్ను వేసిన మోడీ, ఇక్కడ ప్రజలను బకరాలను చెయ్యటానికి, ఈ వ్యుహ్యం పన్నారు. వాల్తేరు డివిజన్‌ను తీసేసి మిగిలిన విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కలిపి విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే, విశాఖకు రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర వాసుల కల. ఏపీకి రైల్వేజోన్ అంటే.. అది విశాఖ కేంద్రంగానే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మోదీ ఎలాంటి కొత్త డ్రామా ఆడతారో చూడాలి.

200 కోట్లతో బెంగుళూరు యలహంక, హైదరాబాద్ లోటస్ పాండ్ మాయా మహల్ ని తలదన్నే విధంగా అమరావతి లో జగన్ మహల్ నిర్మాణం జరిగింది. సియం కుర్చీ మీద ఉన్న ఇష్టంతో, ముందుగానే సీఎం క్యాంపు ఆఫీస్ సైతం నిర్మించుకున్నారు జగన్. 2 ఎకరాల్లో భారీ నిర్మాణాలు జరిగాయి. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ లో సిఎంఓ ఆఫీస్ సిబ్బంది కి క్యాబిన్లు, ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది.  ఇంట్లో అత్యాధునిక సదుపాయాలు,అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు, మినీ థియేటర్,లైబ్రరీ,జిమ్, తదితర సౌకర్యాలుఉన్నాయి. ఇటలీ నుండి దిగుమతి చేసుకున్న ఫర్నిచర్ కూడా ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ధనం లూటీ చేసి ఐఎఎస్ అధికారులను జైలుకి పంపి తాను మాత్రం విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు జగన్.

jaganmahal 26022019

ఒక దానిని మించి మరొకటి...బెంగుళూరు యలహంక ప్యాలస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. 32 ఎకరాల్లో అక్షరాల 1000 కోట్లతో ఆ ప్యాలస్ నిర్మించారు జగన్. అక్కడ లేని సదుపాయాలు అంటూ ఉండవు. అన్న గాలి జనార్ధన్ రెడ్డి హెలికాప్టర్ లో దిగడానికి హెలిప్యాడ్ సైతం నిర్మించారు. ఆ తరువాత లోటస్ పాండ్ లో మాయా మహల్ నిర్మాణం సుమారుగా 350 కోట్ల తో 60 రూముల భవనం అది. అత్యాధునిక లిఫ్టులు,ఎక్సలేటర్లు,200 మంది సినిమా చూసే మినీ థియేటర్,జిమ్,స్క్వాష్,టెన్నిస్,వాలీ బాల్ కోర్టులు ,రాజస్థాన్ మార్బుల్ ఇలా 42 వేల చదరపు అడుగులో లోటస్ పాండ్ మాయా మహల్ నిర్మాణం జరిగింది.... ఇప్పుడు అమరావతిలో కూడా జగన్ తన మార్క్ భవనం ఉండాలి అని డిసైడ్ అయ్యారు.రెండు ఎకరాల్లో ఈ భావనలు రెడి అయ్యాయి 200 కోట్ల తో అత్యాధునిక భవనాలు నిర్మాణం పూర్తి అయ్యింది.

jaganmahal 26022019

అయితే నేనే సియం అనే భ్రమలో, ఇంకా ఎన్నికలు కాక ముందే జగన్ తాను సీఎం అయిపోతాననే కాన్ఫిడెన్సు లో ఉన్నారు. అందుకు అనుగుణంగా సీఎం క్యాంపు ఆఫీస్ కూడా నిర్మించుకున్నారని తెలుస్తుంది. నేనే సీఎం అనే అన్న ధీమా తో ముందే ముఖ్యమంత్రి కార్యాలయం,ఐఏఎస్ అధికారులకు చాంబర్స్ ఇలా అన్ని నిర్మాణం అయ్యాయి.అలాగే ఇక్కడ దీని పక్కనే పార్టీ ఆఫీస్ కూడా పూర్తి అయ్యింది.స్విమ్మింగ్ పూల్,సినిమా థియేటర్,జిమ్ ఇలా అన్ని సదుపాయాలు ఆ ఇంటి సొంతం.అమరావతిలో అన్ని నిర్మాణాలు ఆగిపోవాలి,ఎక్కడ ఏమి అభివృద్ధి జరగడం లేదు అంటూ తన పత్రికలో డబ్బా కొట్టే జగన్ అమరావతిలో 200 కోట్ల తో ఇల్లు కట్టాడు అని తెలుసుకొని వైకాపా పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నిజానికి జగన్ ఉండేది హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే, అక్కడ నుంచే, కేసీఆర్ తో కలిసి అన్ని కుట్రలు పన్నుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను సియం అయిపోతున్నాని, చంద్రబాబు కట్టించిన సెక్రటేరియట్ నుంచి పని చెయ్యటం ఇష్టం లేక, ఇక్కడ కట్టే ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా వాడుకుంటూ, కేసిఆర్ లాగ ఫాం హౌస్ పరిపాలాన సాగించాలని జగన్ ఆలోచన. అందుకే ముందుగానే, ఈ ఇంటినికి క్యాంప్ ఆఫీస్ లాగా తయారు చేసుకున్నట్టు చెప్తున్నారు.

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. సౌమ్యంగా, హుందాగా రాజకీయాలు నడపడం ద్వారా పాతతరం నేతలు ఈ నియోజకవర్గానికి గుర్తింపు తెచ్చారు. మరో దశలో చంద్రబాబు నాయకత్వంలో సాంప్రదాయ రాజకీయాన్ని తుడిచిపెట్టి చైతన్యంతో కూడిన కొత్తతరం రాజకీయం ఆవిష్కృతమైంది. అలాంటి చోట ఇపుడు జరుగుతున్న రాజకీయ విన్యాసాలు సామాన్య జనానికి వెగటు పుట్టిస్తున్నాయి. ఇక్కడ నుంచీ గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకునేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. క్రికెట్‌ పోటీలను నిర్వహించి, యువతకు క్రికెట్‌ కిట్లు, నగదు బహుమతులు ఇవ్వడం వరకూ సరే. వినాయక చవితికి అడిగినా అడగకపోయినా ప్రతి గ్రామానికీ వినాయకుని ప్రతిమలను అందించడమూ ఓకే.

chevireedy 26022019

పండుగలప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఇళ్ళకు తన కుటుంబసభ్యుల ద్వారా స్వీట్లు, బట్టలు పంపడమూ మంచి సాంప్రదాయమనే అనుకోవచ్చు. అయితే కొద్ది నెలల కిందట టీడీపీ ఇన్‌ఛార్జిగా పులివర్తి నానీ రంగప్రవేశం చేయడంతో పరిస్థితి మారింది. గ్రామస్థాయిలో టీడీపీ వర్గాన్ని పటిష్టం చేసుకునేందకు నానీ ప్రయత్నించడంతో వైసీపీ నుంచీ ప్రతిఘటన ఎదురవుతోంది. ఆ మేరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా తనదైన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. దీనికి తోడు జగన్ సలహాలు. దాంతో, ఎప్పటికప్పుడు పంధా మార్చుకుంటూ వస్తున్నారు. వైసీపీ నేతల ప్రయత్నాలు రానురానూ వివాదాస్పదమవుతున్నాయి. ప్రతి దాన్ని వివాదం చెయ్యటం, గొడవలు పెట్టటం, కొట్టటం, చివరకు అరెస్ట్ అవ్వటం, రెండు రోజులుకు ఒకసారి, ఇదే పని చేస్తున్నారు చెవిరెడ్డి.

 

chevireedy 26022019

ఉద్రిక్తతల సంగతి పక్కన పెడితే వీళ్ళు చేపడుతున్న ప్రలోభాల పర్వంతో జనం ఆత్మాభిమానం దెబ్బ తింటోంది. ఎన్నికల నేపధ్యంలో జనం మద్దతు పొందేందుకు బహిరంగంగా ప్రలోభాలకు గురి చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ సంబంధం లేకుండా, సందర్భం అసలే లేకుండా కొందరు తమ తలుపు తట్టి బహుమతులు ఇవ్వడం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని కొందరు అభ్యంతరంతో పాటు ఆగ్రహావేశాలూ వెలిబుచ్చుతున్నారు. ఇదిలా వుంటే ఇంత తరచుగా వైసీపీ నేతలు నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి ఇంటి తలుపూ తట్టి కానుకలు అందజేయడానికి అంత భారీగా నిధులు ఎక్కడ నుంచీ తెచ్చి ఖర్చు చేస్తున్నారనేది అంతుపట్టని ప్రశ్నగా మారుతోంది. మొన్నే కేసీఆర్ పంపించిన గడియారాలు కూడా పెద్ద వార్తా అయిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read