ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో బీజేపీ ఏపీ కో ఇంచార్జ్ సునీల్ దియోధర్, వైసిపి ప్రభుత్వం చేస్తున్న పనులను తీవ్రంగా తప్పు బట్టారు. నందిగామలోని టిడ్కో ఇళ్లను పరిశీలించిన ఆయన ,అక్కడ జరుగుతున్నది చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రజలకు టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పి రూ.లక్షల్లో వసూలు చేసి, ఇప్పుడు భాద్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, సునీల్ దియోధర్ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను, ప్రజలు కట్టిన డబ్బులు కూడా వృధా చేసారని, నందిగామ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెడతానని ఆయన చెప్పారు. అంతే కాకుండా అనుమతులు లేకుండా ఇలా కొండలు తవ్వటమేంటని, ఈ అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి అని ఆయన డిమాండ్ చేసారు..
news
మంత్రి కాకాని పై చెన్నై సిబిఐ టీం ఫోకస్.. రంగంకి చెన్నై సిబిఐ టీం..
వైసిపి మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి కి హైకోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నిందితుడిగా ఉన్న డాక్యుమెంట్ల చోరీకేసును సీబీఐ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు లోని హైకోర్టు ఆదేశాలతో కోర్టులో చోరీ ఘటనపై చెన్నై సీబీఐ కేసు నమోదు చేసింది. వైసిపి మంత్రి కాకాణి నిందితుడిగా ఉన్న ఈ డాక్యుమెంట్ల చోరీ కేసు ఏప్రిల్ 14వ తారీఖున చిన్నబజారులో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ కేసులో మొదట సయ్యద్ హయ్యత్, ఖాజారసూల్‍ని పోలీసులు నిందితులుగా చూపించారు. ఆ తరువాత టూటౌన్లోని పీఎస్‍లో ఈ ప్రాపర్టీ ఉన్నట్టు జిల్లా జడ్జి యామిని హైకోర్టుకి నివేదిక అందించారు. ఈ కేసుని ఇండిపెండెంట్ సంస్థతో విచారణ జరిపించాలని జిల్లా జడ్జి యామిని హైకోర్టుకు విజ్ఞప్తి చేసారు. ఆ తరువాత హైకోర్ట్ ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. తదుపరి విచారణలో హైకోర్టు ఈ కేసులో మంత్రి కాకాణి పేరు కూడా చేర్చడం జరిగింది. తాజాగా నవంబర్ 24న ఈ కేసుని సీబీఐ విచారణకి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జరీ చేసింది. ఇప్పుడు చెన్నై టీం రంగంలోకి దిగింది.
ఈ రోజు నీలాకాశంలో అద్భుతం.. చూడటానికి ఆసక్తి చూపుతున్న ప్రజలు...
ఈ రోజు విశ్వంలో ఒక అద్భుతం జరగబోతుంది. అదేంటంటే, నీలాకాశంలో కాంతులు వెదజలల్లే జెమినిడ్స్ ఉల్కాపాతం. ఈ మిరుమిట్లు గొలిపే ఉల్కాపాతం, ఈ రోజు రాత్రి 9 గంటల తరువాత వీక్షించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇక్కడ నిరాస పరిచే విషయం ఏంటంటే దీన్ని మామూలు కంటితో చూడలేమని ప్లానెటరీ సొసైటీ వెల్లడించింది. ఈ జెమినిడ్స్ ఉల్కాపాతం భూవాతావరణం తాకి కాంతిజ్వాలగా మారనున్న ధూళి రేణువులని వారు చెబుతున్నారు. ఈ జెమినిడ్స్ ఉల్కాపాతం 17 వరకు కొనసాగుతుందని తెలిపారు. దీంతో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. దగ్గరలో ఉన్న ప్లానిటోరియంకు వెళ్లి, ఈ అద్భుతాన్ని చూడనున్నారు. ప్రజల కోసం తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
పల్నాడులో టెన్షన్ టెన్షన్... కాసు సవాల్ కు యరపతానేని సై..
పల్నాడులో వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి, టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు మధ్య వార్ ఒక రేంజ్ లో జరుగుతుంది. బీసీలకు ఇచ్చే పదవులపై ఇద్దరు నేతల మధ్య తీవ్రంగా మాటల యుద్ధం జరుగుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఒక్కటే పదవి ఇచ్చారని, వైసిపిప్రభుత్వం వచ్చాక ఎనిమిది మంది బీసీలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని, అంతే కాకుండా బీసీలకు, రాష్ట్ర, నియోజకవర్గ పదవుకూడా వైసిపి ప్రభుత్వం ఇచ్చిందని ,మేము బీసీలకు అండగా ఉన్నామని, అందుకే వైసీపీ రాష్ట్రస్థాయి బీసీ సదస్సు కూడా నిర్వహించిందని ఆయన చెపారు. ఇది చూసే టిడిపి వాళ్లు పల్నాడులో బీసీ సదస్సు నిర్వహిస్తున్నారని కాసు మహేష్ రెడ్డి, టిడిపి నేత యరపతినేని పై రెచ్చిపోయారు. దానికి, యరపతినేని కూడా ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీలు నిరసనలు చేస్తున్నారని, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురజాలలో బీసీలను హ-త్య చేసారని యరపతినేని విరుచుకుపడ్డారు.
బీసి లకు ఎవరు ఏమి చేసారో తేల్చుకుందాం అంటూ ఇరువురు నేతలు సవాళ్ళు విసురుకున్నారు. అయితే వాస్తవంలో మాత్రం, టిడిపి బీసీ నేతలు పల్నాడులో హ-త్యకు గురయ్యారు. జల్లయ్య లాంటి నేతలను టిడిపి కోల్పోయింది. బలమైన బీసీ నేతలు టార్గెట్ అయ్యారు. దీంతో పల్నాడులో ప్రతి రోజు టెన్షన్ గానే సాగుతుంది. గత నెలలో కూడా ఇరువు నేతలు పల్నాడు అభివృద్ధి పై సవాళ్ళు విసురుకున్నారు. బహిరంగ చర్చల వరకు ఈ సవాళ్ళు వెళ్ళాయి. అయితే అప్పట్లో కుదర లేదు. చంద్రబాబు మొన్న గుంటూరు జిల్లాలో పర్యటన చేయటంతో, మళ్ళీ పొలిటికల్ హీట్ రాజేసుకుంది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండటంతో, పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. రోజురోజుకి వీళ్ళ మద్య వైరం తీవ్ర స్థాయికి చేరుకోవడం తో పల్నాడు అంత ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎన్నికలు మరో ఏడాది ఉన్న సమయంలో, ఈ పొలిటికల్ హీట్ రోజు రోజుకీ పెరుగిపోతుంది. రాజకీయం వరకు ఉంటే పరవాలేదు కానీ, ఇవి ఎటు దారి తీస్తాయో అని ప్రజలు భయ పడుతున్నారు.