ఎప్పుడూ గోధుమ రంగు, పసుపు రంగు కాకుండా వేరే రంగు చొక్కా వెయ్యని చంద్రబాబు, వేరే రంగు చొక్కా వెయ్యటం ఇదే మొదటిసారి. మోడీ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి నలుపు రంగు వేసి నిరసన తెలుపుతున్నారు. ఈ నలుపు మోదీ పై రగులుతున్న ప్రతి ఆంధ్రుడి నిరసనకి ప్రతీక. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సీఎం చంద్రబాబు నల్లచొక్కాతో హాజరయ్యారు. త్యేకహోదా, విభజన హామీల సాధన సమితి నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావంగా నల్లచొక్కా ధరించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్లచొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా, కొందరు నల్లచొక్కా, నల్లప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా ప్రయోజనాలు, విభజన హామీల సాధన కోసం చేస్తున్న ధర్మపోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది.

black 01022019 2

ఫిబ్రవరి 11న సహచర మంత్రులతో కలిసి అక్కడ ఒక రోజు దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చయించారు. మర్నాడు 12న రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను అఖిల పక్ష నేతలు కలిసి రాష్ట్రానికి జరిగిన అ న్యాయాన్ని వివరిస్తారు. బుధవారం సచివాలయంలో తన కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వివిధ రూపాల్లో రాష్ట్రంలో నిరసనలు సాగించాలని సీఎం పిలుపిచ్చారు. దీనికోసం అఖిలపక్షం తరపున కమిటీ వేయాలని నిర్ణయించారు. 1వ తేదీన రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన చేపట్టాలని, 11న ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించా రు. ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం తెలిపారు.

black 01022019 3

‘రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ ఆందోళనల్లో 5 కోట్ల మంది ప్రజలను భాగస్వాములను చేయాలి. అన్ని వర్గాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తే అది గొప్ప ప్రజాఉద్యమంగా మారుతుంది. దీనిని రాజకీయ పోరాటంగా భావించకూడదు. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వంపై చేసే పోరాట కార్యక్రమంగానే ఈ ఉద్యమాన్ని తీసుకోవాలి. రాష్ట్రానికి న్యాయం జరగాలి.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. ఆంధ్రతో అనవసరంగా పెట్టుకున్నామనే భయం ఢిల్లీ పెద్దల్లో కలగాలి’ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనకు నేను చేయాల్సిదంతా చేశాను. హోదా చట్టంలో అంశాల అమలుకు విశ్వప్రయత్నాలు చేశాం. చివరకు రెవెన్యూ లోటు భర్తీకి కూడా ఇంతవరకు సరిగా నిధులివ్వలేదు. పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.4,000 కోట్లు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన మోదీ ప్రభుత్వం... చివరి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకొంటామని నాడు హామీ ఇచ్చిన బీజేపీ... ఇప్పటి వరకూ ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లలో రాష్ర్టానికి మొండి చేయే చూపింది. చివరి బడ్జెట్‌లో అయినా కేంద్రం న్యాయం చేస్తుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. విభజన చట్టం ప్రకారం, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను ఇవ్వాలని సీఎం అడుగుతున్నారు. ఇందులో అత్యంత ప్రధానమైంది... ఏపీకి ప్రత్యేక హోదా. రెండోది 2014-15కి సంబంధించిన రెవెన్యూ లోటు. ప్రత్యేక హోదా కింద ఏపీకి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఈఏపీ రుణాల్లో 90శాతం భారం కేంద్రం భరించడం, కేంద్ర ప్రాయోజిత పథకాల్లోనూ 90 శాతం నిధులను కేంద్రమే భరించాల్సి ఉంది. కానీ, ఇందులో ఏ ఒక్క విధానాన్నీ కేంద్రం అమలుచేయడం లేదు.

modi 01022019

2014-15కి సంబంధించి ఏపీ రెవెన్యూలోటు రూ.16,000 కోట్లు ఉంది. ఇందులో ఇప్పటి వరకు రూ.3979 కోట్లుమాత్రమే రాష్ట్రానికి వచ్చింది. మిగిలిన రూ.12,000 కోట్లను ఇవ్వకుండా తప్పించుకోవడానికి కేంద్రం రకరకాల సాకులు చెప్తోంది. విశాఖ రైల్వేజోన్‌కు ఒడిసా అభ్యంతర పెడుతోందంటూ కేంద్రం కారణం చూపిస్తోంది. కానీ, విశాఖ రైల్వేజోన్‌పై తమకెలాంటి అభ్యంతరమూ లేదని ఒడిసా ఇప్పటికే స్పష్టం చేసింది. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్రం ఖర్చుపెట్టిన నిధుల్లో ఇంకా రూ.4,000 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న రూ.350 కోట్లను గత ఫిబ్రవరిలో రాష్ట్రానికి ఇచ్చినట్టే ఇచ్చి కేంద్రం వెనక్కు తీసేసుకుంది. ఆ నిధులను, ప్రస్తుత సంవత్సరానికి ఇవ్వాల్సిన మరో రూ.350 కోట్ల నిధులను ఇవ్వాల్సి ఉంది. వీటిపై చివరి బడ్జెట్‌లో అయినా కనికరిస్తుందో లేదో మరి.

 

modi 01022019

అయితే, ఏపీకి న్యాయం చేస్తారని ఇన్నాళ్లు ఎదురుచూశామని, సహనం నశించి పోయిందని..ఏపీకి మోదీ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఎలక్షన్ మిషన్‌పై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాల దృక్పథం గురించి మోదీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు విశాల దృక్పథమా? అని ప్రశ్నించారు. బీజేపీయేతర పార్టీలే లక్ష్యంగా కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు తెలిపారు. సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమ కేసులు ఎత్తివేశామని చెప్పారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేవారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10, 16 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తిగా ఎన్నికల ప్రచారం కోసమే ఆయన వస్తున్నారని వివరించాయి. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలోను మోదీ కార్యక్రమాలు ఉంటాయని బీజేపీ నేతలు తెలిపారు. దీనికంటే ముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఫిబ్రవరి 4న విజయనగరం వస్తున్నారు. ఉత్తరాంధ్రాలోని 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న ‘శక్తి’ కేంద్రాల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు. అయితే మోడీ రాక సందర్భంగా, ఆయన చేసే విష ప్రచారానికి, అదిరిపోయే కౌంటర్ ప్లాన్ చేసారు చంద్రబాబు. నిజానికి ఇది ప్లాన్ చేసింది కాకపోయినా, అలా కలిసి రావటంతో, మోడీకి మామూలు కౌంటర్ ఉండదు అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు.

modi 311012019

ఫిబ్రవరి 10న మోడీ గుంటూరు వచ్చి, మేము మీకు అన్ని వేల కోట్లు ఇచ్చాం, అన్ని లక్షల కోట్లు ఇచ్చాం, చంద్రబాబు అవినీతి చేసాడు, యుసి లు ఇవ్వలేదు అంటూ, ఎప్పటిలాగే విష ప్రచారం చేస్తారు. అందుకే, ఈ విష ప్రచారం సమర్ధవంతంగా తిప్పి కొట్టటానికి చంద్రబాబు ఢిల్లీనే వేదిక చేసుకున్నారు. మోడీ, ఆ రోజు మాట్లాడే అన్ని అబద్ధాలకు, ఆన్ని ఆధారాలతో ఢిల్లీ వేదికగానే కౌంటర్ ఇవ్వనున్నారు. మోడీ 10న గుంటూరు వస్తే, చంద్రబాబు 11న ఢిల్లీ వెళ్తున్నారు. ఫిబ్రవరి 11న సహచర మంత్రులతో కలిసి అక్కడ ఒక రోజు దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చయించారు. మర్నాడు 12న రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను అఖిల పక్ష నేతలు కలిసి రాష్ట్రానికి జరిగిన అ న్యాయాన్ని వివరిస్తారు.

modi 311012019

మొత్తంగా, అటు ఆందోళన చేస్తూనే, మోడీ అబద్ధపు ప్రచారాలని ఢిల్లీ వేదికగానే, అందరూ చూస్తూ ఉండగా తిప్పి కొట్టనున్నారు చంద్రబాబు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వివిధ రూపాల్లో రాష్ట్రంలో నిరసనలు సాగించాలని సీఎం పిలుపిచ్చారు. దీనికోసం అఖిలపక్షం తరపున కమిటీ వేయాలని నిర్ణయించారు. 1వ తేదీన రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన చేపట్టాలని, 11న ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించా రు. ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం తెలిపారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ ఆందోళనల్లో 5 కోట్ల మంది ప్రజలను భాగస్వాములను చేయాలి. అన్ని వర్గాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తే అది గొప్ప ప్రజాఉద్యమంగా మారుతుంది. దీనిని రాజకీయ పోరాటంగా భావించకూడదు. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వంపై చేసే పోరాట కార్యక్రమంగానే ఈ ఉద్యమాన్ని తీసుకోవాలి. రాష్ట్రానికి న్యాయం జరగాలి.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. ఆంధ్రతో అనవసరంగా పెట్టుకున్నామనే భయం ఢిల్లీ పెద్దల్లో కలగాలి’ అని పేర్కొన్నారు.

ప్రముఖ ఎన్నారై చిగురుపాటి జయరామ్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కోస్టల్ బ్యాంకు చైర్మన్‌‌గా, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేతగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర హైవేపై కారులో జయరామ్‌ మృతదేహం లభ్యమైంది. హైవే పక్కన రోడ్డుకు దిగువలో ఓ కారు ఉండటాన్ని తెల్లవారుజామున కొందరు స్థానికులు గుర్తించారు. ఏం జరిగిందో చూద్దామని వెళ్లి చూస్తే కారు వెనుక సీట్లో మృతదేహం కనిపించింది. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని, ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడు జయరామ్‌గా గుర్తించారు. జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా? లేక హత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు టోల్‌గేట్ల దగ్గర సీసీ టీవీ ఫుటేజ్‌‌లను పోలీసులు సేకరించారు. అయితే కారు డ్రైవర్ ఏమయ్యాడని పోలీసులు ఆరా తీస్తున్నారు.

express 0140202019 1

హైదరాబాద్ నుండి విజయవాడకు ఈయన వెళుతున్నారు. ఫిబ్రవరి 01వ తేదీన శుక్రవారం నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారి పక్కనే కారులో ఇతని డెడ్ బాడీ లభ్యమైంది. ఇతను ఎలా చనిపోయారనే దానిపై క్లారిటీ లేదు. కానీ పక్కా హత్య అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిగురుపాటి తలపై రక్తపు మరకలుండడం, కారు వెనుక భాగంలోని సీటు కింద డెడ్ బాడీ పడి ఉండడం...కారుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఇలా అనేక డౌట్స్ వ్యక్తమౌతున్నాయి. అంతేకాదు...కారులో మద్యం సీసాలు కూడా ఉన్నాయి. కారులో డ్రైవర్ ఉంటే ఎక్కడున్నాడనే సమాచారం లేదు. సూర్యాపేట, చిల్లకల్లు చెక్ పోస్టు సెంటర్లలో సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

express 0140202019 1

ఇక చిగురుపాటి జయరామ్ విషయానికి వస్తే...ఇతను సౌమ్యంగా ఉండే వ్యక్తి..అని తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్ టీవీ ఛానెల్ నడిపే సమయంలో పార్ట్‌నర్‌తో విబేధాలున్నాయా ? లేక ఇతర వ్యాపారాల్లో అనేది తెలియాల్సి ఉంది. కోస్టల్ బ్యాంకు అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీగా సుపరిచితుడు. గుంటూరు జిల్లా తెనాలీలో ఈయన జన్మించారు. ఇతను అమెరికన్ పౌరుడు. ఫ్లోరిడాలో ఆయన భార్య..పిల్లలు నివాసం ఉంటున్నారు. అక్కడ ఓ బ్యాంకులో భాగస్వామి అని తెలుస్తోంది. సామాన్య కుటుంబంలో జన్మించిన చిగురుపాటి అతి కొద్దికాలంలో పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. అనేక కంపెనీలను స్థాపించి వ్యాపారరంగంలో రాణించారు.

Advertisements

Latest Articles

Most Read