వైఎస్ వివేకా హత్య కేసులో, అవినాష్ రెడ్డి పాత్ర గురించి, సిబిఐ ఎన్ని ఆధారాలు ఇచ్చినా, గూగుల్ టేక్ అవుట్ తో చెప్పినా, ఫోన్ కాల్స్ వివరాలతో కోర్టు ముందు పెట్టినా, అవేమీ నిలబడలేదు. తెలంగాణా హైకోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించ లేదు. అవినాష్ రెడ్డి రక్తం మరకలు తుడిపించాడని, అలాగే చంపించిన వారు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని, ఆ రోజు రాత్రి అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ చేసారని, ఇలా మొత్తం ఆధారాలు సిబిఐ కోర్టు ముందు పెట్టింది. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తే, సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పింది. అలాగే అవినాష్ రెడ్డి విచారణలో సహకారం అందించటం లేదని కూడా చెప్పింది. అరెస్ట్ చేయటానికి వెళ్తే, కర్నూల్ హాస్పిటల్ ముందు ఆడిన డ్రామా వివరించింది. అయితే ఇవేమీ హైకోర్టు విశ్వసించినట్టు కనిపించ లేదు. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ, హైకోర్టు భారీ ఊరట ఇచ్చింది. అవినాష్ రెడ్డికి హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం విచారణకు రావాలని ఆదేశించింది. ఈ వాదనల సమయంలో హైకోర్టు అడిగిన ప్రశ్నలు, సిబిఐ సరిగ్గా సమాధానాలు చెప్పలేక పోయింది. అప్పుడే హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తుందని, న్యాయ నిపుణులు ఊహించారు. అందరూ అనుకున్నట్టే బెయిల్ వచ్చింది. మరి సిబిఐ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తుందా, లేదా అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచి వదిలేస్తుందా అనేది చూడాలి. సిబిఐ వెళ్లకపోయినా, సునీత మాత్రం, సుప్రీం కోర్ట్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

ఐపీఎల్ ఎల్లో ఆర్మీ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎగ‌రేసుకుపోయింది. ఉత్కంఠ‌పోరులో చివ‌రి బంతికి విజ‌యం సాధించి ఐదోసారి ఐపీఎల్ కింగ్స్ తామేన‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ నిరూపించింది. ఐపీఎల్లో ప‌సుపు ప‌తాకం రెప‌రెప‌లాడింది. అదే స‌మ‌యంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మ‌హానాడు వేదిక నుంచి ధోనీలాగే మిస్ట‌ర్ కూల్ టిడిపి కెప్టెన్ సీబీఎన్ కూడా సిక్స‌ర్ కొట్టారు. మిని మేనిఫెస్టోతో విడుద‌ల చేసిన ఆరు హామీలు ఏపీఎల్‌(ఆంధ్ర‌ప్ర‌దేశ్ పొలిటిక‌ల్ లీగ్‌)లో ఎల్లో ఆర్మీని తిరుగులేని జ‌ట్టుగా నిలప‌నున్నాయ‌ని వైబ్రేష‌న్స్ చూస్తే ఇట్టే అర్థం అయిపోతోంది.  నాలుగేళ్ల వైసీపీ పాల‌న‌లో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పున‌ర్మిర్మాణం బాధ్య‌త తీసుకుంటాన‌ని, ప్ర‌జ‌ల భ‌విష్య‌త్త‌కు భ‌రోసాగా నిలుస్తాన‌ని మినీ మేనిఫెస్టో చంద్ర‌బాబు విడుద‌ల చేశారు.  ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో  ప్రకటించిన చంద్రబాబు మహిళల కోసం ‘మహాశక్తి’  ప్ర‌క‌టించారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తామ‌న్నారు. ‘తల్లికి వందనం’ కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామ‌ని, ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌న్నారు. ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అంద‌జేస్తామ‌ని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం ప‌థ‌కం ప్ర‌క‌టించారు. యువత కోసం ‘యువగళం’ కార్యక్రమం కింద  యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతి అంద‌జేస్తామ‌ని, 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. రైతుల కోసం ‘అన్నదాత’ కార్యక్రమం ప్ర‌క‌టించిన బాబు రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామ‌ని, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చి సుర‌క్షిత తాగునీరు అందిస్తామ‌ని, బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామ‌ని మ‌హానాడు వేదిక‌గా ప్ర‌క‌టించారు. పేద‌ల‌ని సంప‌న్నులుగా తీర్చిదిద్దే బాధ్య‌త వంటి ఆరు హామీలు సీబీఎన్ కొట్టిన సిక్స‌ర్ అనీ, ఇవి తిరుగులేని విజ‌యం సాధించి పెడ‌తాయ‌ని టిడిపిలో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌జ‌లు కూడా మెరుగైన సంక్షేమం త‌మ‌కు అందుతుంద‌నే ఆనందంలో ఉన్నారు. అధికార పార్టీ స్పంద‌న చూస్తుంటే..ఏపీఎల్ ఎల్లో పార్టీ టిడిపి ఎగ‌రేసుకుపోవ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం అవుతోంది. ఎల్లో ఆర్మీ చెన్నై సూప‌ర్ కింగ్స్‌ని..ధోనీ ముందుండి విజ‌యం వైపు న‌డిపించ‌గా, ఎల్లో పార్టీ టిడిపిని విజ‌న‌రీ లీడ‌ర్ సీబీఎన్ అంతా తానై గెలుపు తీరం చేర్చే దిశ‌గా న‌డిపిస్తున్నారు.

టిడిపి అధినేత చంద్ర‌బాబు ప్రాణాల‌కు ముప్పు పొంచి వుంద‌నే సంకేతాలు మ‌రోసారి వెలువ‌డ్డాయి. ఈ సారి ఆషామాషీ వ్య‌క్తి కాదు. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌వి స్పీక‌ర్ స్థానంలో వున్న వ్య‌క్తి..చంద్ర‌బాబుని ఫినిష్ చేస్తామంటూ హెచ్చ‌రించ‌డం రాష్ట్రంలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే బ‌హిరంగ‌స‌భ‌ల‌లో చంద్ర‌బాబుపై రాళ్ల‌తో ఎటాక్ చేసిన ఆగంత‌కులు, సెక్యూరిటీ సిబ్బంది ర‌క్ష‌ణ‌గా నిల‌వ‌డంతో సేఫ్ అయ్యారు. జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త ఉన్న బాబుపైకి గూండాల్ని పంపి రాళ్లు వేయించే ముఠా ఎవ‌రో చెప్పాల్సిన ప‌నిలేదు. చంద్ర‌బాబు భ‌ద్ర‌తాధికారులు రెండుసార్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. బాబుని కాపాడారు. ఎన్ఎస్జీ క‌మాండోలు, భ‌ద్ర‌తాసిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుల‌పై నేటికీ చ‌ర్య‌ల్లేవు. అంటే ఎవ‌రు ఇవి చేయించారో తెలిసిపోతోంది. చంద్ర‌బాబు ఇంటి మీద‌కి ఏకంగా గూండాల‌తో దాడికి దిగిన ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌పై కేసు పెట్టాల్సిన ఏపీ ప్ర‌భుత్వం మంత్రి ప‌ద‌వి ఇచ్చింది. అంటే చంద్ర‌బాబుకి ప్రాణ‌హాని త‌ల‌పెట్టేవారికి అంద‌లం ఎక్కిస్తున్నారంటే దీని వెనుక ఉన్న‌ది ఎవ‌రో ఇట్టే స్ప‌ష్టం అయిపోతోంది.  స్పీక‌ర్ స్థానంలో ఉన్న వ్య‌క్తి ప్ర‌తిప‌క్ష‌నేత‌ని ఫినిష్ చేస్తామంటూ న‌ర్మ‌గ‌ర్భంగా హెచ్చ‌రించారంటే, ఇప్ప‌టివ‌ర‌కూ చంద్ర‌బాబుపై చేసిన దాడుల‌న్నీ వారు చేయించిన‌వేన‌ని ఒప్పుకున్న‌ట్టే అయ్యింది. చంద్రబాబుకు ఉన్న బ్లాక్ కమాండోల భద్రతను తీసేస్తే ఫినిష్ అయిపోతారని స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వ్యాఖ్య‌లు కామెడీవి కావు. వైసీపీ నుంచి చంద్ర‌బాబుని చంపాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ఉన్న కార‌ణంగా సాధ్యం కావ‌డంలేదని స్పీక‌ర్ మాట‌లే స్ప‌ష్టం చేస్తున్నాయి. బాబుపై చేస్తున్న హ‌త్యాయ‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డానికి అడ్డుగా ఉన్న ఎన్ ఎస్ జీ భ‌ద్ర‌తా సిబ్బంది(బ్లాక్ క్యాట్ క‌మాండోలు)ను తొల‌గించాల్సిందిగా తాను కేంద్రానికి లేఖ రాస్తున్న‌ట్టు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వ్యాఖ్య‌ల‌పై విచార‌ణ జ‌ర‌పాలి. చంద్ర‌బాబు భద్రతను ఉపసంహరించాలని స్పీకర్ హోదాలో కేంద్రాన్ని కోరుతానని త‌మ్మినేని ప్ర‌క‌టించ‌డం, చంద్ర‌బాబుపై జ‌రుగుతున్న ఎటాక్స్ ఒక దానికొక‌టి సంబంధం ఉంద‌ని, దీనిపై లోతుగా ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని టిడిపి డిమాండ్ చేస్తోంది

మంత్రి అంబ‌టి రాంబాబు వ‌య‌స్సు 64 ఏళ్లు. ఆయ‌న ప్ర‌భుత్వ ఉద్యోగి అయితే ఈ పాటికే రిటైర్మెంట్ ఇచ్చి మూల‌న కూర్చోపెట్టేవారు. ఒక్క చాన్స్ లాట‌రీ త‌గిలిన వైకాపా ప్ర‌భుత్వంలో బూతు చేష్ట‌లు, కూత‌లతో మంత్రిగా కూడా ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఈ అహంకారం వ‌ల్ల‌నేమో తాను డెబ్బ‌యి ఏళ్ల‌కి ద‌గ్గ‌ర ప‌డుతున్న ముస‌లాడిన‌ని మ‌రిచిపోతూ నోటికొచ్చిన మాట‌లు పేల‌తారు మంత్రి అంబ‌టి రాంబాబు. 64 ఏళ్ల  పూర్త‌యిన అంబ‌టి రాంబాబు  చంద్రబాబుని వృద్ధుడు అంటాడు. చంద్ర‌బాబు వృద్ధుడు కాక‌పోతే కుర్రోడా అంటూ దీర్ఘాలు తీసే అంబ‌టి తాను వృద్ధుడిని అనే సంగ‌తి త‌ర‌చూ మ‌రిచిపోతుంటారు. ఇది వృద్ధాప్యంలో చాలామందికి వ‌చ్చిన‌ట్టే అంబ‌టికి అల్జీమ‌ర్స్ సోకిన‌ట్టుంది. తాను ముస‌లాడిన‌ని త‌ర‌చూ అంబ‌టి రాంబాబు మ‌రిచిపోయి..క‌న్య‌ల‌తో స‌ర‌స‌లాడే వ‌య‌స్సు గ‌ల బాలాకుమారుడిన‌ని భ్ర‌మించ‌డం వ‌ల్లే ఈ ప్రేలాప‌న‌లు అని వైసీపీలోనే ఓ వ‌ర్గం గుస‌గుస‌లాడుకుంటోంది. చంద్ర‌బాబుపై ప‌డి ఏడ‌వ‌డానికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన‌ట్టు, రోజూ ఆయ‌న‌ని తిట్టి సీఎంని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డ‌మే జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రిగా అంబ‌టి రాంబాబు దిన‌చ‌ర్య అయిపోయింది.

Advertisements

Latest Articles

Most Read