ఇటీవల టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డికి టీడీపీ నేతలు, కేడరు ఝలక్‌ ఇచ్చారు. ఈనెల 31న వైసీపీలో చేరుతున్న సందర్భంగా టీడీపీ ముఖ్య నేతలు, కేడరు తన వెంటేనని ప్రచారం చేసిన మేడాకు వారంతా తాము టీడీపీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే సోదరుడు మేడా విజయశేఖర్‌రెడ్డి టీడీపీలోనే కొనసాగేలా ఆ పార్టీ నేతలతో మంతనాలు నిర్వహిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మేడా ఆకేపాటి అమరనాధరెడ్డి చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా 2014లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మనసు వైసీపీతోనే అన్నట్లుగా వ్యవహరించారని మొదటి నుంచి టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.

meda 25012019

కాంగ్రె్‌సలో ఉన్న కేడరును టీడీపీలోకి ఆహ్వానించి పదవులు, పనులు వారికే అన్నట్లు కట్టబెటి ్ట వారే ముఖ్య అనుచరులుగా టీడీపీలో ప్రచారం చేస్తూ వచ్చారు. మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న నేతలు, కేడరు ఎమ్మెల్యే వ్యవహారాలపై విసుగెత్తి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఒకటి, రెండు చోట్ల బహిరంగంగానే ఎమ్మెల్యే విధానాలను వ్యతిరేకిస్తూ పత్రికలకు ఎక్కిన సందర్భాలున్నాయి. టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న మేడా మండలాల వారీగా అనుచరులు, నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నుంచి పిలుపు వచ్చినా మేడా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మేడాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు మంగళవారం ప్రకటించారు. అదే రోజు సాయంత్రం వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన మేడా ఈ నెల 31న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలు, కేడరు వైసీపీలో చేరుతారని మేడా ప్రచారం చేస్తూ వచ్చారు.

meda 25012019

నాలుగున్నరేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన మేడా వివిధ అభివృద్ధి పనులు, పదవులు తన అనుచరులకే ఇప్పించుకున్నారు. వీరంతా తన వెంటే అనుకుని భావిస్తూ వచ్చారు. అయితే, సస్పెన్షన్‌ అనంతరం వైఎస్‌ జగన్‌ను మేడా కలిసినప్పుడు ఆయన బంధువులు తప్ప ముఖ్యమైన టీడీపీ నేతలెవరూ మేడా వెంట వెళ్లలేదు. సుండుపల్లె, వీరబల్లె మండలాల టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరించే ఎమ్మెల్యే మే డా సోదరుడు ( సమీప బంధువు) మేడా విజయశేఖర్‌రెడ్డి (బాబు) బుధవారం రాత్రి రా యచోటి ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ నేతలు, కేడరు ఎవరూ కూడా మేడా వెం ట వెళ్లవద్దని కోరారు. మేడా ఎ మ్మెల్యేగా ఉన్నంత కాలం ఆయన కు చేదోడువాదోడుగా ఉన్న విజయశేఖర్‌రెడ్డి టీడీపీలోనే కొనసాగుతుండడం నియోజకవర్గంలో చర్చనీయంశమైంది. పలువురు మండల పార్టీ అధ్యక్షులు కూడా తాము పార్టీ వెంటే అంటూ 31న మేడా వైసీపీలో చేరే సమయంలో తాము వెళ్లడంలేదని చెిప్పినట్లు సమాచారం.

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పంచాయితీ కొలిక్కివచ్చింది. ఈ అసెంబ్లీ సీటుకు పోటీ పడుతున్న ఇద్దరు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమై రాజీ కుదిర్చారు. కడప జిల్లాలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం కీలకం కావడంతో ఆ సీటు కోసం మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పోటీ పడటం తెలిసిందే. ఇద్దరూ అసెంబ్లీ సీటు తమదే నంటూ ప్రచారం చేసుకోవడంతో టీడీపీ అధిష్ఠానానికి సమస్యగా మారింది. సీట్ల ఖరారు ప్రక్రియ ప్రారంభించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు కూడా అయిన చంద్రబాబుకు ఈ వ్యవహారం సమస్యగా మారడంతో ఇద్దరితో బుధవారం సమావేశమై చర్చించారు. మరోసారి సాయంత్రం చర్చించేందుకు నిర్ణయించినప్పటికీ, రామసుబ్బారెడ్డి రాకపోవడంతో గురువారానికి వాయిదా పడింది. ఉదయం వీరిద్దరితో అసెంబ్లీ సీటు వ్యవహారం ముఖ్యమంత్రి చర్చించారు.

kadapa 25012019

ఇద్దరూ అసెంబ్లీ సీటునే కోరడంతో ముఖ్యమంత్రి కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఎంపీ సీటు ఇచ్చే ప్రతిపాదనకు అంగీకరించి, మళ్లీ అసెంబ్లీ సీటు కోసం పట్టుబట్టడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ అవసరాల దృష్ట్యా కలిసి పని చేయాలని, పార్టీ ఆదేశాలను అనుసరించాలని ముఖ్యమంత్రి నచ్చజెప్పారు. చర్చల అనంతరం వారిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎవరికి సీటు ఇచ్చినా, పార్టీ గెలుపునకు పని చేస్తామని తెలిపారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. త్వరలోనే జమ్మలమడుగు ఎమ్మెల్యే, కడప ఎంపీ సీటును కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్నారు. కాగా, మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా, జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి బరిలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది.

kadapa 25012019

సీఎంతో సమావేశం అనంతరం కడప జిల్లా నాయకులంతా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇద్దరూ జమ్మలమడుగు టిక్కెట్‌ కోసమే పట్టుబట్టాం. చివరకు నిర్ణయాధికారాన్ని ముఖ్యమంత్రికే విడిచిపెట్టాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన నాయకులతోనూ మాట్లాడుకుంటాం. వారంలో అంతా కొలిక్కి వస్తుంది’’ అని మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. ‘‘తెదేపా ఆవిర్భావం నుంచీ మా కుటుంబం పార్టీకి సేవలందిస్తోంది. మా చిన్నాన్న శివారెడ్డి ఎన్టీఆర్‌ హాయంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను. కడప లోకసభ స్థానానికి పోటీ చేస్తే గెలుస్తామా? ఓడిపోతామా? అన్నది సమస్య కాదు. మాకు జమ్మలమడుగు నియోజకవర్గం ముఖ్యం. అదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పాను. ఇప్పుడిక ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మా కార్యకర్తలతో విడిగా సమావేశం ఏర్పాటు చేసుకుని వారిని ఒప్పిస్తాం’’ అని రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.

పసుపు-కుంకుమ క్రింద శుక్రవారం రాష్ట్రంలోని రాజధాని అమరావతి, రాయలసీమలోని కడప, ఉత్తరాంధ్రలోని విశాఖలలో భారీ ఎత్తున డ్వాక్రా మహిళలతో సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం మొత్తం కలియ తిరిగేలా సీఎం చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటనలతో ఒకేరోజు మూడు సభలకు హాజరుకానుండడం విశేషం. శుక్రవారం రాజధాని అమరావతి ప్రాంతంలో నూతనంగా నిర్మించే హైకోర్టు భవనం ఎదురుగా లక్షమంది మహిళలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీ ఎత్తున మహిళలను తరలించేందుకు వెయ్యికిపైగా బస్సులను ఏర్పాటుచేశారు. అదేవిధంగా విశాఖ, కడప, జిల్లాల్లో జరిగే పసుపు-కుంకుమ సభలకు భారీ ఎత్తున మహిళలు హాజరుకానున్నారు.

pasupukunkuma 258012019 2

ఈవారంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో డ్వాక్రా మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించగా శుక్రవారం జరిగే సభలో మహిళలకు పసుపుకుంకుమ క్రింద 10 వేల రూపాయలు కానుక ప్రకటించే అవకాశం ఉంది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ఇప్పటికే పసుపు-కుంకుమ పథకం క్రింద నగదు మొత్తాన్ని అందించిన ప్రభుత్వం మరోసారి డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ. 10 వేలు ఇచ్చేందును నిర్ణయించింది. పాత గ్రూప్‌ సభ్యులకే కాకుండా ఈ మధ్యకాలంలో ఏర్పడిన అన్ని సంఘాలకు, వాటిలోని సభ్యులకు కూడా ఈ నగదు మొత్తాన్ని ఇవ్వనుంది. వచ్చేనెల మొదటివారంలో ఏకకాలంలో చెక్కుల రూపంలో ఈ నగదును అందించి మహిళల మోముల్లో చిరునవ్వులు పుయించనుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ కానుక రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరిల్లో కలిపి సుమారు 94 లక్షల మందికి లబ్ధిచేకూరనుంది.

pasupukunkuma 25801201 9

డ్వాక్రా గ్రూపులు పసుపు - కుంకుమ పథకం కింద రూ.10000 - వివరాలు: - పసుపు-కుంకుమ తొలి విడత కింద రూ.8,604కోట్లు డ్వాక్రా సంఘాలకు, ఒక్కో మహిళకు రూ.10వేల చొప్పున. - ఈ నాలుగేళ్లలో వడ్డీ రాయితీ కింద రూ.2,514కోట్లు ఇచ్చారు. అంటే ఇప్పటికి మొత్తం రూ.11,118కోట్లు. - 2004-09 లో ఇచ్చింది కేవలం రూ.267కోట్లు. - 2009-14, ఇచ్చింది రూ.2,039కోట్లు మాత్రమే. - ఆ పదేళ్ల కన్నా ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం 5రెట్లు ఎక్కువ ఇచ్చింది - మొన్న ఇచ్చిన వడ్డీ మాఫీ రూ.10వేలు కాకుండా ఇప్పుడు మరో రూ.10వేలు పసుపు-కుంకుమ 93.81లక్షల మంది మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు. - అంటే మరో రూ.9,400కోట్లు మహిళలకు ఇస్తున్నారు. - అంటే ఆ వడ్డీ మాఫీ - రూ.10వేలు, ఈ పసుపు కుంకుమ - 10వేలు కలిపి 5 ఏళ్ళల్లో ఒక్కో మహిళకు రూ.20వేలు ఇచ్చినట్లు అన్నమాట. - వడ్డీ మాఫీ కింద ఖర్చు పెట్టింది రూ.11,118కోట్లు, - పసుపు కుంకుమ బహుమతి కింద, రూ.9,400కోట్లు - మొత్తం కలిపి మొత్తం రూ.20,518కోట్లు డ్వాక్రా మహిళలకు ఇంత ఆర్ధికలోటులో కూడా ఇచ్చారు. పసుపు-కుంకుమ కార్యక్రమంతోపాటు పెన్షన్లు పెంపుదల, కాపు రిజర్వేషన్‌, ఆటో – ట్రాక్టర్ల జీవితకాలం పన్ను ఎత్తివేత, చేనేత కార్మికుల జీవితభీమా తదితర సంక్షేమ కార్యక్రమాలు ఆ వర్గాలలో తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల వాతావరణాన్ని కలుగజేసింది. వీటన్నింటిపై వర్గాలవారీగా భారీ ఎత్తున సభలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం కల్పించి తద్వారా ఓటర్లను ప్రభుత్వంలో ఉన్న అధికారపార్టీ వైపు మళ్ళీంచేందుకు కసరత్తు చేస్తున్నారు.

టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇంటికి పోయే టైమ్ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ నినాదం మార్మోగుతోందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను దేశం భరించదని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత బీజేపీ, వైసీపీకి దూరంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, దాని కీలుబొమ్మ పార్టీలకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కలిసికట్టుగా ముందుకు పోవాలని సూచించారు.

cbn jagan 25012019

ఐదేళ్లలో చేసింది గొప్ప చరిత్ర అని..రాబోయే ఐదేళ్లలో చేసేది మరో చరిత్ర అని చెప్పారు. ఇంతకు రెట్టింపు రాష్ట్రాభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్‌కు అలవాటే అని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. దొంగ సర్వేలతో ప్రజాదరణను తారుమారు చేయలేరని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల ముందు ఇలానే తప్పుడు సర్వేలు చేశారని..కానీ టీడీపీ గెలిచిందని ఆయన అన్నారు. జగన్ అహంభావం భరించలేకే వైసీపీకి నేతలు దూరం అవుతున్నారని తెలిపారు. వైఎస్ హయాంలో మహిళలకు ఇచ్చింది రూ.267కోట్లు మాత్రమే అని అన్నారు. ఆర్ధికలోటులోనూ మహిళలకు రూ.20వేల కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

cbn jagan 25012019

చెడు జరగాలి, అభివృద్ది ఆగిపోవాలి అనేదే వైసీపీ పెడధోరణి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సానుకూల నాయకత్వానికి తెలుగుదేశం ఉదాహరణ అయితే ప్రతికూల నాయకత్వానికి జగన్మోహన్‌రెడ్డి రుజువు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షా 16వేల కోట్లు ఇవ్వాలని, నిధులు ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మోదీని జగన్‌ ప్రశ్నించరని మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని అయితే వైసీపీ, బీజేపీకి బాధ్యత లేదని..వారికి ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. డ్వాక్రా సంఘాలకు ప్రాణం పోసింది టీడీపీనే సీఎం తెలిపారు. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10వేలు ఇచ్చామని..మరో రూ.10వేలు ఇస్తామని వెల్లడించారు.

Advertisements

Latest Articles

Most Read