వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో 175 సీట్లూ గెలుస్తామంటూ వైసీపీ లీడర్లకు బహిరంగ వేదికల నుంచే బూస్ట్ అప్ ఇస్తున్నారు. కానీ వైసీపీ కోర్ లీడర్లకి తెలిసిన వాస్తవం ఈ ప్రచారానికి చాలా దూరం అని తెలుస్తోంది. ప్రతిపక్షం ప్రశ్నిస్తుందనే భయం. ఉద్యోగులు తమ ప్రయోజనాలు నెరవేర్చమంటారనే భయం. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అడుగుతారనే భయం..మొత్తానికి జనాన్ని చూస్తే జగన్ భయపడుతున్నాడని పరదాలు, బ్యారికేడ్లు, గృహనిర్బంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ వర్గానికీ మొఖం చూపించలేని జగన్ ..ఎన్నికల భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కోసం పనిచేయడానికి ఇప్పటికే ప్రజాధనంతో పనిచేస్తున్న 2.61 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు.

వీరిపై అపనమ్మకమో ఏమో కొత్తగా ప్రతీ 50 ఇళ్లకు ముగ్గురు గృహసారధులను నియమిస్తామని ప్రకటించారు. అంటే 2.61 లక్షల మంది వలంటీర్లకు తోడు మరో 5.2 లక్షల మందిని ఎన్నికల కోసం జగన్ రెడ్డి వాడుకుంటారు. వీరే కాక మరో 40 వేల మంది కన్వీనర్లు కూడా నియమిస్తారు. వైసీపీకి ఓట్లు వేయించడమే కాదు, టిడిపికి ఓటు వేయకుండా వుండేందుకు పథకాలు తీసేస్తామని బెదిరించడం, ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీకి చేరవేస్తున్న వలంటీర్లకు గృహసారధులు తోడైతే వైసీపీకి అతి పెద్ద సైన్యం సిద్ధం అవుతోంది. జగన్ రెడ్డి బటన్ నొక్కుడు పనిచేస్తే ఇంతమంది పోల్ మేనేజ్మెంట్ కి అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అధికార వైసీపీలో సీట్ల చర్చలు జోరుగా సాగుతున్నాయి. 70 మందికి పైగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని గత సమీక్షలలో సీఎం జగన్ రెడ్డి హెచ్చరించారు. తాజా సమీక్షకు రెడీ అవుతున్న సీఎం ముందు ఐప్యాక్ ఓ నివేదిక ముందు ఉంచిందని వార్తలు వస్తున్నాయి. దీనిప్రకారం 40 మంది ఎమ్మెల్యేల  అస్సలు బాగాలేదని తెలుస్తోంది. వీరందరికీ 14వ తేదీన జరగనున్న సమావేశంలో చివరి హెచ్చరిక జారీ చేయనున్నారని సమాచారం. 151 మందిలో 70 మందికిపైగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలే వున్నారని చేసిన సర్వేలు లీకయ్యాయి. వై నాట్ 175 అంటోన్న సీఎం సొంత సర్వేలో ఇంతమంది ఓడిపోతున్నారని తెలిసినా, ఎందుకీ మేకపోతు గాంభీర్యం అనే అనుమానాలు వస్తున్నాయి.

రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ రెడ్డి పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ ప్రభుత్వం సమైక్య రాష్ట్రం అంటూ ప్రజలను మభ్యపెట్టడం మోసగించడమేనన్నారు. టిడిపి హయాంలో వ్యవసాయ రంగంలో రికార్డులు సాధించామని, వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్లే అన్నదాతల ఆత్మహ-త్యల్లో దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానంలో వుందన్నారు.  ప్రజలు సమస్యల్లో వుంటే పరిష్కరించడం మానేసి సమైక్యాంధ్ర అంటూ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే వైసీపీకే చెల్లుతుందన్నారు.  చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాలని, సత్వరం స్పందించి అన్నదాతలకు అండగా నిలవాలి చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇటీవల వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ పోయిన ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ ``దొంగ ఇంట్లో దొంగ పడినట్టుంది`` అంటూ చమత్కరించారు. ఇప్పుడు వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాక్ కావడంతో లోకేష్ సెటైర్ కి అతికినట్టు సరిపోయింది. వైసీపీ సోషల్మీడియా విభాగం నుంచి ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా టిడిపి, జనసేన సోషల్మీడియా ఖాతాలకు రిపోర్ట్ కొట్టడం, బ్లాక్ చేయించడం, హ్యాకింగ్ ప్రయత్నాలు, మార్ఫింగ్-ఫేక్ పోస్టులకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్. హ్యాకర్లకే హ్యాకర్లులాంటి వైసీపీ హ్యాండిల్ హ్యాక్ చేయడం దొంగ ఇంట్లో దొంగలు పడినట్టుంది అనే సైటెర్లు సోషల్మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఇటీవల టిడిపి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినప్పుడు వైసీపీ సోషల్మీడియా వాళ్లు ట్రోలింగ్ పతాకస్థాయికి చేరింది. శుక్రవారం అర్ధరాత్రి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్నారు. దీంతో టిడిపి, జనసేన సోషల్మీడియా సైన్యం వైసీపీని ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు.

పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ కాపాడుకోలేని వాడు, రాష్ట్రాన్ని ఏమి కాపాడతాడు అని కామెంట్స్ వినపడుతున్నాయి. మరోవైపు సోషల్మీడియా బాధ్యతలు సాయిరెడ్డి నుంచి లాగేసుకుని సజ్జల కొడుకుకి అప్పగించారు. ఇది తట్టుకోలేని సాయిరెడ్డి బ్యాచ్ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేయించిందనే రూమర్లు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రిప్టో కరెన్సీ ప్రమోట్ చేస్తూ, కోతి..చింపాంజీ గిఫ్, ఎమోజీలు పోస్టు చేస్తూ సోషల్మీడియా బాధ్యతలు, రాజ్యసభ ప్యానెల్ చైర్మన్ పోస్టులు కోల్పోయిన వ్యక్తిని ట్రోల్ చేస్తుండడం గమనార్హం.

Advertisements

Latest Articles

Most Read