ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలలో మోసం జరిగే ఆస్కారం ఉన్నందున వచ్చే ఎన్నికల్లో వీవీప్యాట్‌ చీటీలు 100% లెక్కించే విధంగా కేంద్ర ఎన్నికలసంఘంపై ఒత్తిడి తీసుకురావాలని... కోల్‌కతాలో సమావేశమైన విపక్ష నేతలు నిర్ణయించారు. దీనిపై ఒక కార్యాచరణ రూపొందించుకొని అన్ని పార్టీల నేతలూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించారు. దీనిపై ఒక నివేదిక రూపొందించేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చే నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. కమిటీలో అభిషేక్‌ మనుసింఘ్వీ (కాంగ్రెస్‌), అఖిలేష్‌ యాదవ్‌ (ఎస్పీ), సతీష్‌ మిశ్ర (బీఎస్పీ), కేజ్రీవాల్‌ (ఆప్‌) సభ్యులుగా ఉంటారు.

kolkata meet 20012019

శనివారం మమతాబెనర్జీ నేతృత్వంలో బహిరంగసభ ముగిసిన తర్వాత అన్ని పార్టీలనేతలూ అక్కడి ఓ హోటల్‌లో సమావేశమై సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈనెల 31న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నందున ఆలోపు దిల్లీలో ఒకసారి అన్నిపార్టీల నేతలూ కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. ప్రధానమంత్రి అభ్యర్థి గురించి ఎన్నికల అనంతరమే ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దేశ ప్రయోజనాలకోసం తామంతా ఒక్కటిగా ఉన్నామని, ప్రధానమంత్రి పదవి కంటే దేశ భవిష్యత్తే తమకు ముఖ్యమన్న సందేశాన్ని ప్రజలకు చెప్పాలని తీర్మానించారు.

kolkata meet 20012019

ఈ సభ విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ప్రతిపక్షాలపై మరింత కక్షపెంచుకొనే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కొందరు నేతల్లో వ్యక్తమైంది. ఇప్పటికే అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌లాంటి వారిపై కేసులు పెట్టి వేధిస్తున్న అంశంపై చర్చించారు. ఇకమీదట ఎవరిమీద కేసులుపెట్టినా అంతా సంఘటితంగా పోరాడటంతోపాటు, అండగా నిలవాలని నిర్ణయించారు. ప్రతిపక్ష నాయకులపై కక్షపూరితంగా ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని, సాధారణ ఎన్నికల సమయంలో వాటికి అవకాశమివ్వరాదంటూ... సంబంధిత విభాగాల బాధ్యుల్ని కలిసే అంశంపై కూడా దిల్లీలో జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ) ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించి శనివారం రోజున ‘యునైటెడ్ ఇండియా ర్యాలీ’ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. మరీముఖ్యంగా ముందుగా అనుకున్నదానికంటే భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలిరావడం గమనార్హం. ర్యాలీ అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రముఖులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీని టార్గెట్ చేస్తూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో సభ ముగిసిన అనంతరం.. ప్రభుత్వ అతిథి గృహంలో వివిధ పార్టీల నేతలకు సీఎం మమతా బెనర్జీ తేనీటి విందు ఇచ్చారు.

kolkata 20012019 2

ఈ విందుకు అంతా తానై స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే పర్యవేక్షించడం విశేషం. ఇక్కడ నేతలందరూ కలిసి తదుపరి వ్యూహం కోసం చర్చించారు. మోడీ, అమిత్ షా చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, తదుపరి అడుగులు ఏమిటి అనేదాని పై చర్చలు జరిపారు. భారీ ర్యాలీలో, బహిరంగ సభలో.. చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే వక్తలు తమ ప్రసంగాల్లో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడం ఆయన దక్కిన గౌరవమనే చెప్పుకోవచ్చు. భిన్న పార్టీలను ఏకం కావడంతో చంద్రబాబు భూమికను నేతలు అభినందించారు.

kolkata 20012019 3

సభలో బాబు స్పీచ్ హైలైట్స్..! రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను జంతువుల్లా కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌షాలను కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు.

ఈ నెల 22న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లి వెళ్లనున్నారు. అమరావతిలో హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి సుప్రీం కోర్టు సీజేఐని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతిలో హైకోర్టు (తాత్కాలిక) నిర్వహణ కోసం నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చేతుల మీదుగా ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఫిబ్రవరి 4 లేదా 5 తేదీల నుంచి హైకోర్టు కార్యకలాపాలు జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే జరుగుతాయని అంటున్నారు. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన హైకోర్టు ప్రస్తుతం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

cbn delhi 20012019

జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను 4ఎకరాల్లో 2.35 లక్షల చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొత్తం 23 కోర్టు హాళ్లు ఉంటాయి. రూ.161కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో సుమారు 90శాతం పనులు చివరి దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హైకోర్టు రోజువారీ కార్యకలాపాలకు వీలుగా సకల ఏర్పాట్లు కొలిక్కి వస్తున్నాయని, మిగిలిన 10 శాతం పనులు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేస్తామంటున్నారు. మరోవైపు, అమరావతిలో ఐకానిక్‌ భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ హైకోర్టు కార్యకలాపాలు జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే జరుగుతాయి.

cbn delhi 20012019

అలాగే 23న ఢిల్లిలో జరిగే ఎన్డీయేతర పార్టీల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణను నేతలు ఖరారు చేయనున్నారు. కోల్‌కతా తర్వాత జాతీయ స్థాయి సభ అమరావతిలో నిర్వహించాలని నేతలు నిర్ణయించనున్నారు. అమరావతిలో జాతీయ స్థాయి సభ నిర్వహించే తేదీని ఢిల్లి భేటీలో నేతలు ఖరారు చేయనున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయి సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు సభల షెడ్యూల్‌ను ఆయా పార్టీల అగ్రనేతలు ఖరారు చేయనున్నారు. కోల్‌కతా తరహా సభల నిర్వహణకు కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లి సీఎం కేజ్రీవాల్‌, శరద్‌ పవార్‌, తేజస్వి యాదవ్‌లు ముందుకువచ్చారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని నేతలు నిర్ణయించారు. జాతీయ స్థాయిలో ఎన్డీయే సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు.

ఎన్నికల ప్రచారానికి తెదేపా సంసిద్ధమవుతోంది. అందుకు ప్రచార రథాలను సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రచార రథాన్ని శనివారం గుంటూరు నగరం మణిపురం సమీపాన జయలక్ష్మి డిజైనర్స్‌ ఆవరణలో ప్రదర్శించారు. రోడ్‌షోలకు అనువుగా దీనిని తయారు చేశామని జయలక్ష్మి డిజైనర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్నీ నారయ్య చౌదరి వెల్లడించారు. త్వరలో ఈ వాహనాన్ని సీఎంకు అందజేస్తామన్నారు. ఈ వాహనంలో సీసీ కెమెరాలు, లైవ్‌ కెమెరాలతోపాటు తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వీడియో ప్రదర్శనకు హైడెఫినేషన్‌తో కూడిన ఎల్‌ఈడీ వాల్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేశామని వివరించారు.

radham 20012019

వాహనంలో అభ్యర్థ్ధితోపాటు 30 మంది ఉండొచ్చన్నారు. ఇవేకాకుండా సులువుగా ఎక్కేందుకు మెట్లు, కార్డ్‌లెస్‌ మైక్‌, 10వేల మెగావాట్ల సౌండ్‌బాక్స్‌లు వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఎన్నికల ప్రచార రథాలను తయారు చేయడంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న గుంటూరులోని జయలక్ష్మీ మోటార్స్‌ ఈ పనుల్లోనే నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌తోపాటు మరో 25 మంది ఎంపీ అభ్యర్థులు వాహనాల తయారీ కోసం ఈ సంస్థకు ఆర్డర్లు ఇచ్చారు. జయలక్ష్మీ డిజైనర్స్‌ అధినేత నారయ్య చౌదరి ఆధ్వర్యంలో డిజైనర్‌ అట్లూరి ప్రసాద్‌ ఈ వాహనాల తయారీలో బిజీగా ఉన్నారు. సీఎం చంద్రబాబు కోసం భారీ ఐషర్‌ వాహనాన్ని ప్రచార రథంగా సిద్ధ్దం చేస్తుండగా.. టీడీపీ ప్రకాశం జిల్లా నాయకుడు గొట్టిపాటి రవికుమార్‌ కోసం పూర్తి ఎలక్ర్టానిక్‌ ఎల్‌ఈడీ ప్రచార రథాన్ని తొలిసారి సిద్ధం చేస్తున్నారు.

radham 20012019

ఇవీ ప్రత్యేకతలు.. ఇప్పటి వరకు చిన్న చిన్న వాహనాలనే ప్రచార రథాలుగా సిద్ధం చేస్తున్న జయలక్ష్మీ డిజైనర్స్‌ తొలిసారిగా భారీ ఐషర్‌ వాహనాన్ని ప్రచార రథంగా సిద్ధ్దం చేసింది. ఈ వాహనానికి ఇరువైపులా నాలుగు అడుగుల వెడల్పు, మూడు అడుగుల ఎత్తు కలిగిన ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వీడియోలను ప్రసారం చేయొచ్చు. వాహనానికి నాలుగు వైపులా అత్యాధునిక సౌండ్‌ సిస్టమ్స్‌ ఉంటాయి. వాహనం చుట్టూ ఈ నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాల, సంక్షేమ పథకాల చిత్రాలను ముద్రించారు. వాహనం మీద ఉన్న వారికి కింద ఉన్నవారు రాత్రి వేళ సైతం స్పష్టంగా కనిపించేలా భారీ ఎల్‌ఈడీ ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ స్ర్కీన్లకు, ఫ్లడ్‌ లైట్లకు విద్యుత్‌ అందించేందుకు అత్యంత సామర్థ్యం కలిగిన జనరేటర్‌ ఉంటుంది. వాహనంపైకి తేలిగ్గా ఎక్కేందుకు రెండు అంచెలుగా మెట్లు ఏర్పాటు చేశారు. వాహనంపై ఒకేసారి 25-30 మంది నిలబడేలా స్థలం ఉంటుంది.

Advertisements

Latest Articles

Most Read