రాజమహేంద్రవరం కీర్తి ప్రతిష్టలో మరో వైభవం జత కలవనుంది. రాజమహేంద్రవరం విమానాశ్రయం అతి పెద్ద విమానాశ్రయంగా అవతరించనుంది. కేవలం రెండు, మూడు నెలల్లోనే ఇది అమలులోకి రానుంది. ఇక ప్రపంచ ఎయిర్‌పోర్టుల చార్ట్‌లలో రాజమహేంద్రవరం పేరు గర్వంగా ఉంటుంది. రన్‌వే విస్తరణ ఆదివారం నాటికి పూర్తి కానుంది. కొన్ని అనుమతులు లభించిన వెంటనే ఈ విమానాశ్రయం పెద్ద విమానాశ్రయం అవుతుంది. ప్రస్తుతం 16 విమానాశ్రయాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై సర్వీసులు నడుస్తున్నాయి. విస్తరించిన రన్‌వే ప్రారంభమైన తరువాత ఢిల్లీ, తిరుపతి, ముంబై వంటి ప్రాంతాలకు కూడా విమానాలు నడుస్తాయి. ప్రస్తుతం రోజుకి 1200 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది 3.5 లక్షల మంది ప్రయాణించారు.

rajamundry 13012019 1

ఇక్కడ గతంలో కేవలం 1750 మీటర్ల రన్‌వే ఉండేది. దానిని విస్తరించడంతో దీని పొడవు 3165 మీటర్లకు చేరింది. రన్‌వే వెడల్పు 45 మీటర్లు. దానికి ఇరువైపులా 7.5 మీటర్ల చొప్పున సేఫ్టీ షోల్డర్స్‌ నిర్మించారు. ఈ విమానాశ్రయం అభివృద్ధిని రూ.181 కోట్లతో చేపట్టారు. రన్‌వే విస్తరణ ఒక ప్రత్యేక సమయాల్లో నిర్మించినట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌ కిషోర్‌ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విమానాల రాకపోకలు ఉండడం వల్ల పగటి పూట పని చేయడానికి వీలు లేదు. ప్రతీరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పనులు చేసేవారు. 7 గంటల తరువాత రన్‌వేలో ఏ విధమైన ఆటంకం లేకుండా క్లీన్‌ చేసి విమానాలు తిరగడానికి వీలుగా చేసేవారు. రన్‌వే నిర్మాణం కోసం కాంక్రీట్‌ మిక్చర్‌ మెటీరియల్‌ను కొంత సమయం ముందుగానే రెడీ చేసుకుని రన్‌వే నిర్మించారు.

rajamundry 13012019 1

రన్‌వే పూర్తి అయినప్పటికీ సేఫ్టీ విషయంలో అనుమతి లభించాల్సి ఉంది. సీ17 వంటి పెద్ద విమానాలు కూడా ఇక్కడ దిగే అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదలై ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభానికి సిద్ధమవుతుంది. రన్‌వేతో పాటు కార్గో కూడా మొదలవుతుందని విమానాల్లో బెల్లీ కార్గో సౌకర్యం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీ సమీపంలోనే ఉండటంతో పాటు, ఓఎస్టీసీ గెయిల్, జీఎస్పీసీ వంటి సంస్థలు కేజీ బేసిన్లో కార్యకలాపాలు విస్తరించడంతో ఈ ఎయిర్ పోర్ట్ కు బహుముఖంగా దోహదపడుతోంది. ఒక వైపు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఫ్లొరీ కల్చర్, చేపలు, రొయ్యలు వంటి ఉత్పత్తుల ఎగుమతులకు ఈ విమానాశ్రయం దోహదపడే విధంగా రన్వేను విస్తరించారు.

అమరావతి అంటే జగన్ కు ఎంత ఎలర్జీ అనేది అందరికీ తెలుసు. అమరావతి శంకుస్థాపనకు రాడు, అమరావతి అసెంబ్లీకి రాడు, అమరావతిలో సొంత పార్టీ సానుభూతి పరులైన రైతులు, భోజనానికి పిలిస్తే రాడు, ఆసలు అమరావతి అంటేనే కంపరం. ప్రజలు నిలదీస్తారని, ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు కాని, లేకపోతే అది కూడా ఉండదు. నాలుగు రోజులు పాదయాత్ర చెయ్యటం, హైదరాబాద్ లోటస్ పాండ్ లో రెండు రోజులు రెస్ట్ తీసుకుని, మళ్ళీ రావటం, ఇలా సాగంది పాదయాత్ర. పాదయాత్ర ముందు అయితే, గట్టిగా నెల రోజుల్లో, రెండు మూడు రోజులు మాత్రమె ఏపిలో ఉండేవాడు. అది కూడా ఉదయం ఫ్లైట్ కి వచ్చి, సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవటం. హైదరాబాద్ అంటే ఇష్టమో, లేకపోతే కేసీఆర్ అంటే ఇష్టమో కాని, జగన్ మాత్రం, టైం దొరికితే చాలు హైదరబాద్ లో వాలిపోతూ ఉంటారు.

jagan 13012019 2

దీని పై చంద్రబాబు నిన్న విలేకరులతో మాట్లాడుతూ స్పందించారు. ముగ్గురు మోదీలతో మనం పోరాడుతున్నమాని చంద్రబాబు అన్నారు. ఢిల్లీ మోదీ, తెలంగాణ మోదీ, ఏపీ మోదీలతోనే మన పోరాటమని, 90 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని ఆయన చెప్పారు. జగన్‌ పాదయాత్ర చేసి హైదరాబాద్‌ వెళ్లారని, అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. సీబీఐ కోర్టు ఏపీకి వస్తే అప్పుడు జగన్‌ అమరావతికి వస్తారేమోనన్నారు. ఆయానకు అమరావతిలో ఉండాటానికి బాధ అని అనంరు. ఎన్నికలు సమీపిస్తున్నందున కొందరు ఏపీపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో భూముల ధరలు పెరగడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. ప్రజలు బాగుపడితే వైసీపీకి కడుపు మంటని మండిపడ్డారు. కేంద్రం తీరుతో అందరిలో అసహనం పెరుగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

jagan 13012019 3

జగన్‌ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘విమానాశ్రయ భద్రత కేంద్రానిది కానీ, విచారణ.. దర్యాప్తు అధికారం రాష్ట్రానిదే. రాష్ట్ర సార్వభౌమ అధికారాన్ని ఎలా ధిక్కరిస్తారు. రాష్ట్ర పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయని వ్యక్తికి కేంద్రం ఎలా ఆశ్రయం‌ ఇస్తుంది? వ్యవస్థలపై గౌరవం లేకపోతే పాకిస్థాన్‌, అమెరికా పోయి ఫిర్యాదు చేసి వస్తారా? రఫేల్‌ కేసు ఉందని సీబీఐని అస్తవ్యస్తం చేశారు. అందుకే సీబీఐకి సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకున్నాం. అవినీతి ఆరోపణలు ప్రధానిపై లేవా? రఫేల్‌ మాటేమిటి? మీతో ఉన్నంత వరకూ మాపై దాడులు చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే అకస్మాత్తుగా అవినీతిపరులమైపోయామా? మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతి పరులైపోయారా? నచ్చిన వ్యక్తులను కాపాడుకునే ప్రయత్నం ఇది’’ అని సీఎం చంద్రబాబు విమర్శించారు.

రాష్ట్రంలో అన్ని రకాల పెన్షన్లను అమాంతం పెంచిన చంద్రబాబు, ఇప్పుడు రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయం స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు చేతులు లేని దివ్యాంగులు ఇతరుల పై ఆధారపడి జీవిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారు రెండు వందల నుంచి మూడు వందల మంది ఉంటారని చెప్పారు. రెండు చేతులు లేని దివ్యాంగులను గుర్తించాలని ఈ మేరకు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అయితే, ఈ ఉదయం జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో, చంద్రబాబుకు, విజయవాడ ఎమ్మల్యే గద్దె రామ్మోహన్ ఈ విషయం చెప్పినట్టు తెలుస్తుంది.

cbn pensions 12012019 2

చంద్రబాబు మాట్లాడుతూ "కేంద్రం మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఉంటే మరింత వెసులుబాటు ఉండేది. అడగడానికి వైకాపాకు మనసు రావడంలేదు. ప్రత్యేక హోదా గురించి వైకాపా మాట్లాడటంలేదు. హోదా అంటే మోదీకి కోపం వస్తుందని వారికి భయం. సీబీఐ కత్తి మెడపై ఉంది. టీఆర్‌ఎస్‌ సాయం తీసుకుని ప్రత్యేక హోదా సాధిస్తారట. ఇద్దరు మోదీలు, దిల్లీలో ఉండే మోదీ ముగ్గరూ కలిసి చెప్పాలి ఎప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారో. రాజకీయాలు చేయడం కాదు, పరిపాలనా అనుభవం లేని వారు ఉత్తుత్తి హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రూ.200లు పింఛను ఇచ్చి పదేళ్లు చెప్పుకున్నారు. మేం పదిరెట్లు పెంచాం. రైతులకు రుణమాఫీ సాధ్యం కాదన్నారు.. మేం చేసి చూపించాం. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. ఆదాయపన్నుశాఖ దాడుల గురించి ఎందుకు మాట్లాడరు. దేశమంతా ఛీ కొట్టే పరిస్థితి వచ్చింది."

cbn pensions 12012019 3

‘‘ఆదాయం కోల్పోయిన జనాభాకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. విభజన చట్టంలో పెట్టిన అంశాలేవీ పట్టించుకోకుండా వదిలేశారు. రూ.75వేల కోట్లు రావాలని గతంలో పవన్‌ కల్యాణ్‌ లెక్కగట్టారు. ఆ మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన రూ.3వేల కోట్లు ఇంకా రావాలి. రైతు రుణ మాఫీ, పింఛన్లు ఇచ్చామని ఏపీకి రావాల్సిన లోటును కత్తిరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ సహకారం అందించలేదు. ఇంత చేస్తుంటే మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ధనిక రాష్ట్రాలు కూడా చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.

ఏ ప్రభుత్వం అయినా ఎలా పని చేస్తుందో చెప్పటానికి, ప్రజలే నిర్ణయిస్తారు. వారికి ఉన్న సమస్యల లెక్క తీస్తే, ఆ ప్రభుత్వం ఎలా పని చేస్తుంది అనేది ఇట్టే చెప్పవచ్చు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి సమస్య ఉంది అంటే ఆశ్చర్యం కాదేమో. అందుకే చంద్రబాబు మొదటి సారి జన్మభూమి కార్యక్రమం పెట్టగానే, సమస్యలు వచ్చి పడ్డాయి. అన్నీ ఇన్నీ సమస్యలు కాదు, ఏకంగా 40 లక్షల సమస్యలు. ఇందులో రేషన్ కార్డు లేదని, పించన్ రావటం లేదని, ఇల్లు కావాలని, ఇలా అనేక వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టాయి. అప్పుడే ఏర్పడిన రాష్ట్రం, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే, చంద్రబాబు, వీరికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

cbn 13012019 2

తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అర్హులైన అందరికీ ఆయా సమస్యలు తీర్చారు. అలా, ప్రతి సంవత్సరం జన్మభూమి పెడుతూ, ఇప్పటి వరకు ఆరు విడతలు పెట్టారు. అందరి సమస్యలు తీరుస్తూ వస్తున్నారు. తాజగా జరిగిన ఆరవ విడత జన్మభూమిలో కూడా వినతులు వచ్చాయి. అయితే, క్రితం సంవత్సరాలతో పోల్చుకుంటే, అవి చాలా వరకు తగ్గిపోయాయి. 2014లో 40లక్షల వినతులు వస్తే, ఇప్పుడు మాత్రం, కేవలం 5.6 లక్షల వినతులు వచ్చాయి. అంటే దాదాపుగా 80 శాతం ప్రజల కష్టాలు తీరిపోయాయి. ఇవి కూడా ఎక్కువ పధకాలు పెట్టటం వల్ల, అనేక మంది కొత్తగా లబ్దిదారులు అవ్వటం, వలన వచ్చిన వినతులు. ఒక పక్క సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తూనే, మరో పక్క, రోడ్లు, డ్రైనేజిలు, ఇలా అన్ని చోట్లా మౌలిక సదుపాయాలు కూడా మెరుగు పరుస్తున్నారు.

cbn 13012019 3

జన్మభూమి ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘జన్మభూమిలో ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాం. మండల స్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవోలతో కలుపుకొని పనిచేశాం. జన్మభూమిలో 1800 మండల బృందాలతో కలిసి పనిచేశాం. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు చేపట్టాం. నాలుగేళ్లపాటు చేసిన అభివృద్ధి పనులను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. జన్మభూమిలో 1.28లక్షల మంది అధికారులు 1.70లక్షల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ, వార్డు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశాం. జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో డిజిటల్‌ పెయింటింగ్స్‌ వేయిస్తున్నాం. రాష్ట్ర, జిల్లా అభివృద్ధి ప్రణాళిక త్వరలో తయారు చేస్తాం. జన్మభూమిలో పది రోజుల్లో 61.13 శాతం మంది పాల్గొన్నట్లు చెప్పారు. సుస్థిర అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చ జరిగిందని 83శాతం మంది చెప్పారు. జన్మభూమి కార్యక్రమం బాగుందని 77.97 శాతం మంది చెప్పారు. జన్మభూమిలో 5.60లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో 33వేలకు పైగా రియల్‌టైమ్‌లో పరిష్కరించాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read