రాష్ట్రంలో సుమారు 22 లక్షల నిరుపేద వృద్ధులకి పెద్ద కొడుకు అతను... భారమై ఒకరు... మరొక కారణంతో ఒకరు, తమ తల్లి తండ్రులని జీవితపు చరమాంకంలో వదిలేస్తుంటే, వారికి భరోసా అతను.... ఒంట్లో ఓపిక లేని నిరుపేద వృద్ధులకి భారసో అతను... ఒకరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న ఆ పండుటాకులకి భరోసా.... జీతాల మాదిరి, ప్రతినెలా ఒకటో తేదీనే ఆ వృద్ధులకి అందిస్తున్న భరోసా... ఆ భరోసా పేరే నారా చంద్రబాబు నాయుడు... ఆ భరోసానే ఎన్టీఆర్ భరోసా... పేదలకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ తో సంక్షేమానికి సరికొత్త నిర్వచనమిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్ర సంక్షేమ చరిత్రలో కొత్త అధ్యాయన్ని లిఖిస్తోంది. అయితే ఇప్పుడు పింఛన్ల మొత్తాన్ని ఫిబ్రవరి నుంచి రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులకే కాదు, వితంతువులకు, వివిధ వర్గాలకు ఇచ్చే పెన్షన్లు కూడా పెరగనున్నాయి.

pensions 1112019

జనవరి నుంచే పెంపును అమల్లోకి తీసుకురావాలన్న యోచనా చేస్తోంది. అలా అమలు చేసినట్లైతే ఫిబ్రవరిలో జనవరికి సంబంధించిన పెంపు మొత్తం కూడా అందజేస్తారు. 2014కి ముందు నెలకి రూ.200గా ఉన్న అన్నిరకాల పింఛన్లను తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదు రెట్లు పెంచి రూ.1,000 చొప్పున అందించింది. దివ్యాంగులకు, హిజ్రాలకు రూ.1,500 చేసింది. 2017 సెప్టెంబరు నుంచి డయాలసిస్‌ రోగులకు రూ.2,500 చొప్పున పింఛను అందిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లపై సమీక్షించి.. రెట్టింపు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వృద్ధాప్య, వితంతువులకు పింఛను మొత్తం నెలకు రూ.2,000 చెల్లించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లు కలిపి 50,61,906 మందికి పంపిణీ అవుతున్నాయి.

pensions 1112019

వీటిపై నెలకి రూ.560కోట్లు చొప్పున ఏడాదికి రూ.6,720కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అన్నిరకాల పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తే నెలకి రూ.1,120కోట్లు, ఏడాదికి రూ.13,440కోట్లు చొప్పున వెచ్చించాలి. ఇప్పటికే మంజూరై పంపిణీ అవుతున్న పింఛన్లకే ఈ మొత్తం ఇవ్వాలి. డిసెంబర్‌ ఆఖరు నాటికి వివిధ రకాల పింఛన్లు కావాలని కోరుతూ ప్రభుత్వానికి 2.5లక్షల దరఖాస్తులందాయి. తాజా జన్మభూమి గ్రామ సభల్లో తొమ్మిదో తేదీ నాటికి పింఛన్ల కోసం మరో 1.05లక్షల దరఖాస్తులందాయి. ఇతర రూపాల్లో అందిన విజ్ఞప్తులకు మరో లక్ష మందికి ఇవ్వాల్సి వస్తుందనుకున్నా మొత్తం 4.55లక్షల కొత్త పింఛన్లు మంజూరయ్యే వీలుంది. వీటికి సైతం ఫిబ్రవరి నుంచే పెంచిన మొత్తం అందుతుంది. కొత్త వాటినీ కలిపితే మొత్తం పింఛన్ల సంఖ్య 55.16లక్షలకు చేరుతుంది. ఈ మేరకు ప్రభుత్వం వెచ్చించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పింఛన్ల మంజూరుతోపాటు పెంచే మొత్తానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈనెల మూడు, నాలుగో వారంలో వెలువడే అవకాశముందని అధికార వర్గాల సమాచారం.

జగన్ కు, మంత్రుల బహిరంగ లేఖ... మీరు అవినీతి చక్రవర్తి అనేది బహిరంగ రహస్యం. అభివృద్ధి చక్రవర్తి చంద్రబాబు నాయుడిపై మీ బురద జల్లాలని ప్రయత్నిస్తే అది మీ తిరిగి మీ ముఖంపైనే పడుతుంది. రూ.43వేల కోట్ల అవినీతిపై 12 ఛార్జి షీట్లలో ఏ-1 ముద్దాయిగా ఉంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నది వాస్తవం కాదా? సుమారు రూ.2వేల కోట్లు ఆస్తులు జప్తు అయింది వాస్తవం కాదా? లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా.. తనకున్న అనుభవంతో, తనకున్న ప్రతిష్టతో కష్టబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ పథంలో అగ్రస్థానంలో నిలబెట్టారు. అవినీతిని అదుపు చేయడానికి బయోమెట్రిక్స్‌, జీపీఎస్‌, కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశారు. ''ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా-2018'' రిపోర్టు ప్రకారం అవినీతి తక్కువ ఉన్న మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలిచింది. ఇలాంటి ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చడానికి గవర్నర్‌ కార్యాలయంలో గవర్నర్‌ను కలిసిన అనంతరం తెలుగుదేశం ఎమ్మెల్యేలు నాకు టచ్‌లో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలుస్తానని గవర్నర్‌ కార్యాలయం ఎదుటే ప్రకటించడం దుర్మార్గం కాదా. నీ దుర్మార్గాన్ని, దుష్ట రాజకీయాలను భరించలేక.. రాష్ట్రాభివృద్ధి కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం మీ వద్ద నుంచి 23 మంది బయటపడ్డాం. అమ్ముడుపోయే అలవాటు జగన్మోహన్‌ రెడ్డిగా మీకుందిగానీ.. మాకు లేదు. మీరు ఆనాడు బెయిల్‌ కోసం సోనియా గాంధీకి అమ్ముడు పోయారు. ఈ రోజు కాంట్రాక్టుల కోసం కేసీఆర్‌కు అమ్ముడు పోయారు. కేసుల మాఫీ కోసం మోడీకి అమ్ముడు పోయారు. ఇక నుంచైనా మాపై నిందలు మోపడం మానుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయాలనే ఆలోచనలు విడనాడాలి.

ఈ కింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి... 1. వేల కోట్ల అక్రమార్జనతో జైలు పాలైన మీరు.. మీ కేసుల నుంచి బయటపడడానికే అవినీతి సొమ్ముతో పార్టీ స్థాపించారు. మీ నేరాలను ప్రశ్నించే అధికారులపైన, వ్యవస్థలపైన, ప్రత్యర్థులపైన ఎదురుదాడి కోసం అవినీతి పెట్టుబడులతో సాక్షి పత్రిక, ఛానల్‌ పెట్టడం వాస్తవం కాదా.? 2. ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని సుప్రీంకోర్టు, మీ అవినీతికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. అక్రమాలను చూస్తూ ఊరుకోలేం. ఆర్థిక నేరాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని హైకోర్టు వ్యాఖ్యానించి మీ అవినీతిని బట్టబయలు చేయలేదా.? 3. ''జగన్‌ ఓ సైకో. ఓ రోబో. మానవత్వం, జాలి కరుణ లాంటివేమీ లేవు'' అని మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి పేర్కొనడం వాస్తవం కాదా.? 4. నీ సోదరి షర్మిలను ఇంటర్య్వూ చేసిన సాక్షి ప్రతినిధిని ఉద్యోగం నుంచి తొలగించి నీ సైకోయిజాన్ని ప్రదర్శించడం నిజం కాదా.? 5. డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ జ్యోతుల నెహ్రూను మీ ప్రక్క సీటులో కూర్చోవద్దని శాసించి సీనియర్‌ నాయకుడన్న గౌరవం కూడా లేకుండా అవమానించడం మీ సైకో తనానికి నిదర్శనం. 6. కళ్లజోడు, జీన్స్‌ వేసుకుని నా దగ్గరకు వస్తావా అని సినీ నటుడు రాజశేఖర్‌ను అవమానించి పంపించడం వాస్తవం కాదా.? సార్‌ అని పిలిస్తేనే పార్టీలో ఉండాలని సీనియర్‌ నాయకుడు దాడి వీరభద్రరావును అవమానపరిచారు. 7. మీ రాజకీయ అరంగేట్రం కోసం మీ ఒత్తిడి భరించలేక చిన్నాన్న వివేకానందరెడ్డి రాజీనామా చేయడం వాస్తవం కాదా.? జగన్‌ పోరు పడలేకపోతున్నానని విజయమ్మ రోశయ్య వద్ద వాపోయిన మాట వాస్తవం కాదా.? 8. భూ ఆక్రమణలు, రౌడీయిజంతో వైసీపీ కార్యాలయం నిండిపోయిందని, ఫ్యాక్షనిస్టుల అడ్డాగా వైసీపీ మారిందని స్వయానా మీ చిన్నాన్న వైఎస్‌ వివేకానంద పేర్కొనడం నిజం కాదా.? 9. వైఎస్‌ మృతి వెనుక ''జగన్‌'' హస్తం ఉంది అని వ్యాఖ్యానించిన బొత్సను, బహిరంగ సభలో మీ అక్రమాస్తుల చిట్టా విప్పిన ధర్మానను అక్కున చేర్చుకున్న మీకు విలువలెక్కడ.? 10. తండ్రి శవం ఇంటికి చేరకముందే సీఎంను చేసేందుకు మద్దతివ్వాలని కోరారని, అందుకు నేనే ప్రత్యక్ష సాక్షినని నాటి కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి చెప్పడం నిజం కాదా.? 11. ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని అంటున్నావు. కానీ.. మీ దగ్గర నుంచి బయటపడిన మేము కసాయి దగ్గర నుంచి విముక్తి లభించిందని బహాటంగానే చెబుతున్నామంటే మీ నిరంకుశత్వం ఎలా ఉండేదో అర్ధం చేసుకోండి. 12. గవర్నర్‌ బంగ్లాలో కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమైన తర్వాత 21మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, ప్రభుత్వాన్ని కూలగొడతానని ప్రకటించటం నీ అధికార దాహానికి, కుట్ర రాజకీయాలకు నిదర్శనం కాదా.?

13. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నాశనమవుతుందని భావించే మేమంతా బయటపడ్డాం. అందుకు నీ సైకో ప్రవర్తన ప్రధాన కారణం కాదా.? 14. 2011 జులై18న కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం, అమకతాడులో గోపాల్‌ అనే వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లగా.. నా భర్త అనారోగ్యంతోనే చనిపోయాడు మీ ఓదార్పు మాకొద్దని మృతుడి భార్య సావిత్రమ్మ చెప్పడంతో నీ ఓదార్పు యాత్ర షెడ్యూల్‌ మార్చుకున్న మాట వాస్తవం కాదా.? దీని బట్టి సాధారణ మరణాలను కూడా సానుభూతికోసం వాడుకుంటారా.? 15. మీ షెల్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి గనుల శాఖ మంత్రిపై దారుణమైన ఒత్తిడి తెచ్చి ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి జైలు పాలవ్వడానికి మీరు కారణం కాదా.? 16. ఈడీ దాఖలు చేసిన ఛార్జి షీట్లు, ఆస్తుల జప్తు మీ అక్రమార్జనకు, అవినీతికి రుజువులు. అయినా ఆ నడమంత్రపు సిరి మొత్తం సక్రమమేనని చెప్పుకోవడం దుర్మార్గం కాదా.? డబ్బుపై వ్యామోహం లేదంటున్న నీవు రూ.43వేల కోట్ల అక్రమ సంపాదనను ప్రజలకు పంచగలవా.? 17. డబ్బులు ఇవ్వలేదని సత్యం రామలింగరాజుపై దాడికి పాల్పడ్డారు. పరిటాల రవీంద్ర హత్యకు కుట్ర చేసిన పులివెందుల కృష్ణ మీ ప్రధాన అనుచరుడు. పులివెందుల కృష్ణతో కలిసి కడపలో పోలీస్‌స్టేషన్‌పై మీరు దాడికి పాల్పడ్డారు. మీపై కేసు నమోదైనందుకు ఆర్టీ బస్టాండ్‌ వద్ద పులివెందుల కృష్ణ ధర్నా చేయడం మీ రౌడీయిజానికి నిదర్శనం కాదా.? 18. పరిటాల రవి హత్య కేసు నుంచి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని కాపాడడానికి 60 రోజులు కష్టపడ్డానని మీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడం మీ దుర్మార్గానికి, నిరంకుశత్వ, ఫ్యాక్షన్‌ రాజకీయాలకు నిదర్శనం కాదా.? 19. నలుగురు కుటుంబ సభ్యులుండే మీకు బెంగళూరులో 30 ఎకరాల భారీ కోట, పులివెందులలో ప్యాలెస్‌, హైదరాబాద్‌లో రాజమహల్‌ ఎక్కడి నుంచి వచ్చాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఐదెకరాల్లో భారీ నివాస భవనం నిర్మిస్తున్న మాట వాస్తవం కాదా.? 20. ఎన్నికల అఫిడవిట్లో ఇళ్లు, వాహనాలు అసలు నాకు లేవంటూ పేర్కొనడం వాస్తవం కాదా.? విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యు ఎక్స్‌ 5, కారు నెం.ఏపీ 09, బిఎన్‌2345, స్కార్పియో వాహన్‌ ఎపి 09, బివి 1229 మీరుపేరుపై లేవా? 21. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి రోడ్లపై తిరుగుతూ లక్షలాది రూపాయల జీతాలు తీసుకోవడం ప్రజా ద్రోహం కాదా.? 22. 13 జిల్లాల్లో పాదయాత్ర చేసిన నీవు.. కనీసం ఒక్కసారైనా నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసిన ద్రోహం గురించి మాట్లాడావా.? ముగింపు సభలో గంట పాటు మాట్లాడినా విభజన హామీలపై మోడీని ఎందుకు నిలదీయలేకపోయావ్‌.? 23. జయప్రకాశ్‌ నారాయణ, పద్మనాభయ్యతో కూడిన జేఎఫ్‌సీ ఏపీకి రూ.75వేల కోట్లు రావాలని నిర్ణయిస్తే.. పాదయాత్ర మొత్తంలో ఏనాడూ ప్రస్తావించకపోవడానికి కారణమేంటి.? నీ పాదయాత్రలో ఎన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లావ్‌.? ఎన్ని సమస్యలను పరిష్కరించావ్‌.? అమరావతి నిర్మాణానికి అడ్డుతగిలావ్, పోలవరం విషయంలో పక్కరాష్ట్రాలతో కుమ్మక్కై కేసులు వేయాలని చూశావ్, పారిశ్రామిక సదస్సు సమయంలో రాష్ట్రంలో రాద్దాంతం సృష్టించావ్, ఆక్వా, కడప ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తే దానిపైనా విమర్శలు చేశావ్. రాష్ట్రానికి రావాల్సిన వాటి విషయంలో పెగలని మీ నోరు.. అభివృద్ధిపై విమర్శలు చేయడంపై మాత్రమే పెగులుతోంది. ప్రతి పనిని అడ్డుకునేందుకు ప్రయత్నించావే తప్ప.. ఏనాడైనా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించావా? అనునిత్యం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా పని చేస్తూ అభివృద్ధి నిరోధకుడిగా మారావు.

సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన రెండు రోజుల్లోనే మోడీ భయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌ వర్మను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో రెండుసార్లు సమావేశమైన హైపవర్డ్ కమిటీ గురువారం అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ కే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సీబీఐ చీఫ్ విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. అలోక్ వర్మపై ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు హైపవర్డ్ కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. అలోక్ వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ, జస్టిస్ సిక్రి సమర్థించగా, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినట్లు సమాచారం. అలోక్ వర్మను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది.

verma 10012019

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 12 మంది సీబీఐ అధికారులను బదిలీ చేశారు. అయితే రాఫెల్ కుంభకోణం పై, అరుణ్ శౌరీ ఇచ్చిన కంప్లైంట్ పై, అలోక్ వర్మ, ఈ రోజో, రేపో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిబిఐ కేసు నమోదు చేస్తారనే వార్తలు వచ్చాయి. దీంతో మోడీ అలెర్ట్ అయ్యారు. అందుకే ఉన్నట్టు ఉంది, అలోక్ వర్మను తప్పించారని తెలుస్తుంది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

verma 10012019

సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత విధుల్లో చేరిన మరుసటి రోజే ఆయన్ను తొలగిస్తున్నట్లు మోదీ నేతృత్వంలోని కమిటీ ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ నిర్ణయం వెలువడటానికి కొన్ని గంటల ముందు ఐదుగురు సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అస్థానా కేసును విచారిస్తోన్న డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్‌ గౌబా, జేడీ మురుగేశన్‌, ఏడీ ఎ.కె.శర్మను బదిలీ చేశారు. దీంతో పాటు అస్థానా కేసు విచారణను 2006 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన అధికారి మోహిత్‌ గుప్తాకు అప్పగించారు. తాను సెలవులో ఉన్న సమయంలో తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు చేపట్టిన బదిలీలను వర్మ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలోక్‌ వర్మను విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో స్క్రిప్ట్, ఏపిలో ఆక్టర్స్... అది కూడా తెలంగాణా నుంచి అరువు తెచ్చుకున్న సరుకు... తమని ఎదురించిన చంద్రబాబు పై కక్ష తీర్చుకోవటానికి, ఢిల్లీ పెద్దలు తయారు చేసిన బకరాలు, బకరాలు అవుతూనే ఉన్నారు కాని, ప్లాన్ మాత్రం వర్క్ అవుట్ అవ్వటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలన పై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. అవినీతి ముద్ర వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి, రూపాయి కూడా అవినీతి చూపించలేక పోయారు. అందుకే ప్రజల్లో అలజడి రేపి, కుల గొడవలు పెట్టి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చెయ్యాలని ప్రయత్నాలు ఎప్పటి నుంచో మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కులంతో ప్రజలను విడదీసి, రాష్ట్రాన్ని నాశనం చయ్యవచ్చు అనుకుంటున్నారు.

pk 10012019 1

కాని, ఇక్కడ అంత ఖాళీగా ప్రజలు లేరు అనే విషయం, గ్రహించలేక పోతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద బ్రతికే వాడు, కులం పులుముకుని తిరగటం లేదు. ముందు రాష్ట్రం, తరువాతే, కులమైన, మతమైనా, ప్రాంతమైనా, అనే మూడ్ లో ఉన్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ లు, బెంగుళూరులు, అమెరికాలు పోయిన వాళ్ళకే కుల పిచ్చి ఎక్కువై, సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు కాని, ఏపిలో నివసించే ప్రజలకి, కులమే ఎజెండా కాదు. అయితే, చంద్రబాబుని దెబ్బ తియ్యాలి అంటే, కులమే ఆయుధం అనే ఐడియాకు వచ్చారు. అందుకే పవన్ కళ్యాణ్ చేత, ముందుగా చంద్రబాబుని అనరాని మాటలు అనిపించారు, కాని ఇటు వైపు నుంచి ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. తరువాత లోకేష్ బాడీ పై కూడా, ఎంతో జుబుక్సాకరంగా, మీటింగ్లలో పవన్ హేళన చేసారు. అయినా ఇటు వైపు ఎవరూ రియాక్ట్ కాలేదు. పవన్ రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పారే కాని, కులం వైపు వెళ్ళలేదు.

pk 10012019 1

అందుకే ఇప్పుడు ఏకంగా బాలయ్య మీద పడ్డారు. బాలయ్య ఎప్పుడో సంవత్సరాల క్రితం చేసిన కామెంట్స్ పట్టుకుని, నాగబాబు చేత డ్రామా ఆడిస్తున్నారు. బాలయ్యను టార్గెట్ చేస్తే, ఒక సామాజికవర్గం రెచ్చిపోతుంది, చలి కాచుకోవచ్చు అనుకున్నారు. కాని బాలయ్య ఒక్క మాటలో నో కామెంట్ అని తీసి పడేసారు. నాగబాబుకి తన పక్కన కూర్చుని ఎకిలించే రోజా అన్న మాటలు గుర్తు లేవు, కేసీఆర్, కేటీఆర్, కవిత అన్న మాటలు గుర్తు లేవు, చివరకు శ్రీరెడ్డి అన్న మాటలు గుర్తు లేవు కాని, ఎప్పుడు చెప్పిన బాలయ్య మాటలకు ఇప్పడు రియాక్ట్ అయ్యాడు. అయినా, ఇటు వైపు నుంచి రియాక్షన్ లేదు. అందుకే ఇప్పుడు ఏకంగా పవన్ రంగంలోకి దిగాడు. ఎన్టీఆర్ బయోపిక్ మానియాలో ప్రజలు ఉంటే, ఆ మహోన్నత వ్యక్తి జీవిత చరిత్ర తెలుసుకుంటుంటే, ఎన్టీఆర్ ని కించ పరుస్తూ, ఎప్పుడు ఎన్టీఆర్ అన్న మాటలు ప్రస్తావిస్తూ, ఈ టైంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు పవన్. ‘‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ అన్నారు. అసలు ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలకు అర్ధమే లేదు. ఎన్టీఆర్ తో పవన్ పోల్చుకోవటమే ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాంటిది, ఎదో ఒక చిన్న నెగటివ్ పట్టుకుని, ఎన్టీఆర్ కంటే నేను గొప్పవాడిని, అనే సంకేతం ఇస్తూ, ప్రస్తుతం, ఎన్టీఆర్ గురించి ఆయన ఎలా పైకి వచ్చారో సినిమా ద్వారా ప్రజలు తెలుసుకుంటున్న వేళ, ఇలా ఆయన గురించి నెగటివ్ గా చెప్తూ, ఫాన్స్ ని రెచ్చగొట్టి, కుల గొడవలు రేపే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు నాగబాబు స్థాయికి పవన్ దిగజారాడు. తన అన్న పార్టీ పెట్టి చేసిన ఘనకార్యాలు ప్రజలకు గుర్తుండవు అని పవన్ ఆలోచన కాబోలు...

Advertisements

Latest Articles

Most Read