ఢిల్లీలో స్క్రిప్ట్, ఏపిలో ఆక్టర్స్... అది కూడా తెలంగాణా నుంచి అరువు తెచ్చుకున్న సరుకు... తమని ఎదురించిన చంద్రబాబు పై కక్ష తీర్చుకోవటానికి, ఢిల్లీ పెద్దలు తయారు చేసిన బకరాలు, బకరాలు అవుతూనే ఉన్నారు కాని, ప్లాన్ మాత్రం వర్క్ అవుట్ అవ్వటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలన పై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. అవినీతి ముద్ర వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి, రూపాయి కూడా అవినీతి చూపించలేక పోయారు. అందుకే ప్రజల్లో అలజడి రేపి, కుల గొడవలు పెట్టి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చెయ్యాలని ప్రయత్నాలు ఎప్పటి నుంచో మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కులంతో ప్రజలను విడదీసి, రాష్ట్రాన్ని నాశనం చయ్యవచ్చు అనుకుంటున్నారు.
కాని, ఇక్కడ అంత ఖాళీగా ప్రజలు లేరు అనే విషయం, గ్రహించలేక పోతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద బ్రతికే వాడు, కులం పులుముకుని తిరగటం లేదు. ముందు రాష్ట్రం, తరువాతే, కులమైన, మతమైనా, ప్రాంతమైనా, అనే మూడ్ లో ఉన్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ లు, బెంగుళూరులు, అమెరికాలు పోయిన వాళ్ళకే కుల పిచ్చి ఎక్కువై, సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు కాని, ఏపిలో నివసించే ప్రజలకి, కులమే ఎజెండా కాదు. అయితే, చంద్రబాబుని దెబ్బ తియ్యాలి అంటే, కులమే ఆయుధం అనే ఐడియాకు వచ్చారు. అందుకే పవన్ కళ్యాణ్ చేత, ముందుగా చంద్రబాబుని అనరాని మాటలు అనిపించారు, కాని ఇటు వైపు నుంచి ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. తరువాత లోకేష్ బాడీ పై కూడా, ఎంతో జుబుక్సాకరంగా, మీటింగ్‌లలో పవన్ హేళన చేసారు. అయినా ఇటు వైపు ఎవరూ రియాక్ట్ కాలేదు. పవన్ రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పారే కాని, కులం వైపు వెళ్ళలేదు.
అందుకే ఇప్పుడు ఏకంగా బాలయ్య మీద పడ్డారు. బాలయ్య ఎప్పుడో సంవత్సరాల క్రితం చేసిన కామెంట్స్ పట్టుకుని, నాగబాబు చేత డ్రామా ఆడిస్తున్నారు. బాలయ్యను టార్గెట్ చేస్తే, ఒక సామాజికవర్గం రెచ్చిపోతుంది, చలి కాచుకోవచ్చు అనుకున్నారు. కాని బాలయ్య ఒక్క మాటలో నో కామెంట్ అని తీసి పడేసారు. నాగబాబుకి తన పక్కన కూర్చుని ఎకిలించే రోజా అన్న మాటలు గుర్తు లేవు, కేసీఆర్, కేటీఆర్, కవిత అన్న మాటలు గుర్తు లేవు, చివరకు శ్రీరెడ్డి అన్న మాటలు గుర్తు లేవు కాని, ఎప్పుడు చెప్పిన బాలయ్య మాటలకు ఇప్పడు రియాక్ట్ అయ్యాడు. అయినా, ఇటు వైపు నుంచి రియాక్షన్ లేదు. అందుకే ఇప్పుడు ఏకంగా పవన్ రంగంలోకి దిగాడు. ఎన్టీఆర్ బయోపిక్ మానియాలో ప్రజలు ఉంటే, ఆ మహోన్నత వ్యక్తి జీవిత చరిత్ర తెలుసుకుంటుంటే, ఎన్టీఆర్ ని కించ పరుస్తూ, ఎప్పుడు ఎన్టీఆర్ అన్న మాటలు ప్రస్తావిస్తూ, ఈ టైంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు పవన్. ‘‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ అన్నారు. అసలు ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలకు అర్ధమే లేదు. ఎన్టీఆర్ తో పవన్ పోల్చుకోవటమే ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాంటిది, ఎదో ఒక చిన్న నెగటివ్ పట్టుకుని, ఎన్టీఆర్ కంటే నేను గొప్పవాడిని, అనే సంకేతం ఇస్తూ, ప్రస్తుతం, ఎన్టీఆర్ గురించి ఆయన ఎలా పైకి వచ్చారో సినిమా ద్వారా ప్రజలు తెలుసుకుంటున్న వేళ, ఇలా ఆయన గురించి నెగటివ్ గా చెప్తూ, ఫాన్స్ ని రెచ్చగొట్టి, కుల గొడవలు రేపే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు నాగబాబు స్థాయికి పవన్ దిగజారాడు. తన అన్న పార్టీ పెట్టి చేసిన ఘనకార్యాలు ప్రజలకు గుర్తుండవు అని పవన్ ఆలోచన కాబోలు...