తిరుమల అంటే ప్రతి ఒక్కరకీ ఎంతో పవిత్రమైన స్థలం... ఆ వెంకన్నను దర్శించుకుని, జీవితంలో ముందుకు పోతూ ఉంటాం... అలాంటి తిరుమలని అప్రతిష్టపాలు చెయ్యటం ప్రారంభించిన వైఎస్ఆర్ దగ్గర నుంచి ఆయన వారసుడు జగన్ తో పాటు, ఆయన పార్టీ నాయకులు కూడా, తిరుమల వచ్చిన ప్రతి సారి, ఎదో ఒక రచ్చ చేసి కాని వెళ్ళరు... నెలకి ఒకసారి వైసీపీ ఎమ్మల్యే రోజా, అలాగే తిరుమల వెళ్ళిన ప్రతి సారి జగన్, ఇలాంటి రచ్చ చేస్తారు. అయితే ఈ రోజు కూడా జగన్ తిరుమల వచ్చారు. తన పాదయాత్ర పూర్తయిన సందర్భంలో, జగన్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే, జగన్ ప్రతి తిరుమల పర్యటన లాగే, ఈ పర్యటన కూడా వివాదాల మధ్యే నడించింది...
జగన్ బ్యాచ్ అంతా హడావిడి చెయ్యటంతో, తిరుమల శ్రీవారి ఆలయంలో గందరగోళం నెలకొంది. తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ పార్టీ అధినేత జగన్‌తోపాటు పార్టీ కార్యకర్తలు లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో గందరగోళం ఏర్పడింది. టోకెన్ లేకుండా క్యూ కాంప్లెక్స్‌లోకి కార్యకర్తలు ప్రవేశించారు. అక్కడ సిబ్బంది ఎంత అడ్డుకున్నా, తోసుకుని వెళ్ళిపోయారు. దీంతో వైసీపీ కార్యకర్తలపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలినడక మార్గంలో పలు చోట్ల జై జగన్, సీఎం జగన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. వారిని వైసీపీ నాయకులు, టీటీడీ సిబ్బంది వారించారు. అయినా ఆపలేదు. గోవింద నామస్మరణ ఉండాల్సిన చోట, సియం జగన్, జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చారు.
నిజానికి జగన్ కు, ఆలయాల్లో ఎలా ఉండాలి అనే నియమాలు తెలీవు... తను క్రీస్టియన్ కనుకే, హిందువుల వోట్లు తనకి పడట్లేదు అని, అందుకే హిందువులను మంచి చేసుకోవటానికి, అలాగే ఆర్ఎస్ఎస్ నేతలను మచ్చిక చేసుకోవటానికి, జగన్ ఈ గుడులు, స్వామీజీల కాళ్ళ మీద పడటం లాంటి పనులు చేస్తున్నారు... భారత దేశంలో ఏ మతం వారైనా, వెంకన్నను దర్శించుకోవచ్చు కాని, అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి. అన్యమతస్థులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అంటే, ముందుగా శ్రీ వారి పట్ల మాకు నమ్మకం ఉంది అని, డిక్లరేషన్ ఇవ్వాలి... ఎంత పెద్ద వారు వచ్చినా అది ఆనవాయతీ... జగన్ ఎప్పుడూ అవి పాటించలేదు. జగన్ శ్రీ వారి పట్ల, నమ్మకం ఉంది అని సంతకం పెట్టటానికి, బాధ ఏంటో ఎవరికీ తెలియదు. దీనికి తోడు, ఈ జై జగన్ నినాదాలు ఒకటి...