ప్రకాశం జిల్లా ప్రజానీకం కల సాకారమైంది. మహా ప్రకాశం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో కీలకమలుపు తీసుకురానున్న రామాయ పట్నం పోర్టుకు, ఆసియా పల్ప్ సంస్థ ఆధ్వ ర్యంలో భారీ కాగితపు పరిశ్రమకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలోని ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద శం కుస్థాపన చేశారు. మేజర్ పోర్టా, నాన్ మేజర్‌పోర్టా అన్న సంశయాలు అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టును 2022 నాటికి పూర్తిచేస్తామన్నారు. కాగితపు పరిశ్రమలో దిగ్గజమైన ఆసియా పల్ప్ కంపెనీ ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకు రావడం శుభసూచక మన్నారు. పోర్టు, భారీ పరిశ్రమ కలిపి ఏర్పాటు చేయడం ద్వారా ప్రకాశం జిల్లా అభివృద్ధికి హితోధికంగా ఉపయోగపడు తుందని చంద్రబాబు పేర్కొ న్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి పైలాన్‌లను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి భారీ కాగితపు పరిశ్రమకు సంబంధించి అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద నైసర్గికమైన అన్ని అనుకూలతలు ఉన్నాయని, ఇక్కడ పోర్టు నిర్మిస్తే లాభాలు ఆర్జిస్తున్న అనేక పోర్టుల కంటే మెరుగైన పోర్టుగా మారుతుం దని చాలా కాలంగా జిల్లా ప్రజానీకం డిమాండ్ చేస్తోంది.
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన దుగ రాజపట్నం పోర్టుకు సానుకూలత లేదని, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తరుణంలో రామాయపట్నం పోర్టుపట్ల మరింత డిమాండ్ పెరిగింది. రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మి స్తుందని, అందుకు అనుగుణంగా అడ్డంకిగా ఉన్న కృష్ణప ట్నం పోర్టు యాజమాన్య హక్కులు కుదింపు చేస్తూ నవయుగ కంపెనీని చంద్రబాబు అంగీకరింపచేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లతో నిర్మాణం చేయడానికి సంక ల్పించింది. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రకాశం జిల్లా రామాయపట్నం నుంచి నెల్లూరు జిల్లా చెన్నూరు వరకు మూడు వేల ఎకరాల్లో భూసేకరణ పూర్తిచేసి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. తొలివిడత గా 5 బెర్త్‌ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. మేజర్, నాన్‌మేజర్ పోర్టంటూ ప్రతిపక్షాలు గొడవచేసే ప్రయత్నం చేస్తున్నాయని, దీనిని 2022 నాటికి పూర్తిచేస్తామని ప్రకటిం చారు. మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారి జీవనోపాధికి ఎలాంటి సమస్య రాకుండా పోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. సంక్రాంతి వేళ రామాయపట్నం పోర్టు నూతన కాంతు లు తీసుకువస్తుందని సీఎం ప్రకటించారు. పోర్టుతో పాటు భారీ కాగితపు పరిశ్రమ కూడా రావడం జిల్లా ప్రజల అదృష్ట మని పేర్కొన్నారు.
ఆసియా పల్ప్ కంపెనీ రూ. 24,500 కోట్ల పెట్టుబడితో కాగితపు పరిశ్రమ స్థాపిస్తుందని, సుబాబుల్, జామాయిల్ రైతాంగానికి ఈ పరిశ్రమ ఓ వరం కానుందన్నా రు. ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఏపీపీ కంపెనీ ముందుకు రావడం ఓ రికార్డన్నారు. అనంతపురంలో ఏర్పా టైన కియా మోటార్స్ కంపెనీ కూడా రూ. 15 వేల కోట్ల పెట్టు బడి పెట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 కొత్త పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని, వీటన్నింటి ద్వారా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంద బోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు కావాల్సినంత ప్రోత్సాహం ఇస్తుందని స్పష్టం చేశారు. ఇటువంటి పరిశ్రమలు రావడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. పెట్టుబడి పెట్టేవారు ఊరికేరారని వారికి తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. కాగితపు పరిశ్రమ నిర్మాణానికి ఆసియా పల్ప్ కంపెనీ 2.5 సంవత్సరాలు గడువు కోరిందని, అయితే వారి కి 18 నెలల నుంచి 20 నెలలు మాత్రమే గడువు ఇస్తున్నామని, ఈలోగా పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు. ఈ ప్రాజెక్టుకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌ను ప్రత్యేక అధి కారిగా నియమిస్తు న్నా నని, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహ కారం కావా లన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కంపెనీ కూడా అగ్రిమెంట్ చేసుకొని మౌనంగా ఉంటే కుదరదని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు.