అదాని కంపెనీ ఊరికే ఆంధ్రప్రదేశ్ కి రాలేదు. దీని వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కష్టం ఎంతో ఉంది. లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తా అన్నప్పుడు తలా తోక లేని రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాల అని ఎద్దేవా చేసిన వారు ఎందరో. కానీ ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోవడానికి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు లోకేష్. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనే విధంగా లోకేష్ పనిచేసారు. గత సంవత్సరం దావోస్ పర్యటన లో అదాని గ్రూప్ ముఖ్యులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితులుని వివరించిన మంత్రి నారా లోకేష్. ఆ తరువాత ఫిన్ టెక్ ఫెస్టివల్ సందర్భంగా మరో సారి అదాని బృందంతో భేటీ అయ్యి అదాని గ్రూప్ తో చర్చలు జరిపారు.

lokesh 10012019

అదాని గ్రూప్ డేటా సెంటర్ల బిజినెస్ లోకి అడుగుపెడుతుంది అని తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. స్వయంగా ఆయనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్లౌడ్ హబ్ పాలసీ గురించి వివరించి అదాని గ్రూప్ ని ఒప్పించారు. అనుమతులు,అనువైన భూమి ,మౌలిక వసతుల కల్పన,వివిధ శాఖలతో అనుసందానం ఇలా అన్ని తానై అదాని గ్రూప్ ఆంధ్రా కి వచ్చే విధంగా మంత్రాంగం నడిపించారు. ఇతర రాష్ట్రాల నుండి ఉన్న పోటీ నేపధ్యంలో ఎక్కడా సమాచారం బయటకి రాకుండా జాగ్రత్త పడుతూనే పని చక్కబెట్టారు లోకేష్. కేవలం మూడు నెలల్లో వారికి కావాల్సిన అనుమతులు, రాయితీలు,భూమి ఇలా అన్నింటి పై స్పష్టత వచ్చే లా చేసి స్వయంగా గౌతమ్ అదాని అమరావతిలో అడుగు పెట్టే విధంగా చేసారు.

lokesh 10012019

ఆంధ్రప్రదేశ్‌లో డేటా పార్క్‌, సోలార్‌ పార్క్‌ల ఏర్పాటుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ, అదానీ గ్రూప్‌ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. రాబోయే 20 ఏళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు వీలుగా రూ.70వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో ఒక గిగా వాట్‌ డేటా సెంటర్‌ (మూడు కేంద్రాలు) ఏర్పాటు చేస్తుంది. 5 గిగా వాట్స్‌ సోలార్‌ పార్క్‌ను కూడా నెలకొల్పుతుంది. ఈ డేటా కేంద్రాన్ని ఇంటర్నెట్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌తో అనుసంధానించడం ద్వారా మెరుగైన ఇంటర్నెట్‌ సేవలు అందించే కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సంక్రాంతి పండుగకు ముందు నవ్యాంధ్రకు అతి పెద్ద ‘పెట్టుబడి పండుగ’ వచ్చింది. భారత పారిశ్రామిక దిగ్గజం ‘అదానీ’ ఏపీలో దేశంలోనే అతిపెద్దదైన ‘డేటా సెంటర్‌’ ఏర్పాటు చేయనుంది. విశాఖ సమీపంలో 500ల ఎకరాల్లో... ఏకంగా 70వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో అదానీ సంస్థ చైర్మన్‌ గౌతమ్‌ అదానీతో ఐటీ శాఖ లోకేశ్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన తర్వాత కుదిరిన అత్యధిక పెట్టుబడి ఒప్పందం ఇదే. దీని ప్రకారం... అదానీ సంస్థ దేశంలోనే ఎక్కడా లేనంతస్థాయిలో 5జీడబ్ల్యూ సామర్థ్యంతో విశాఖలో డేటా సెంటర్‌ పార్కులను ఏర్పాటు చేస్తుంది.

aadani 10012019 2

ఈ పార్కుల్లో 20 ఏళ్ల కాలంలో రూ.70వేల కోట్లను పెట్టుబడిగా పెడుతుంది. డేటా సెంటర్‌ ద్వారా రూ.40వేల కోట్లు, సోలార్‌ పార్కుల ద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఫలితంగా 1.10లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...ఈ ప్రాజెక్టు తొలిదశ 18నెలల్లో పూర్తవుతుందన్నారు. భవిష్యత్తులో డేటా ద్వారానే సంపద సృష్టి జరుగుతుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు, భావి ఫలితాలు ప్రతిదీ సమాచారంపైనే ఆధారపడి ఉంటాయని, ఐటీకి డేటా సెంటర్‌ అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేశామని, ఇప్పుడు ఏపీని డేటా హబ్‌గా మారుస్తున్నామన్నారు.

aadani 10012019 3

ప్రపంచంలోనే తొలిసారిగా... వందశాతం పునరుత్పాదక ఇంధనంతో నడిచే డేటా సెంటర్‌ పార్కులు ప్రపంచంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పడబోతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వీటిద్వారా ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ స్టార్ట్‌పలు రాష్ట్రానికి తరలొస్తాయన్నారు. రాబోయే ఐదేళ్లలో డేటా వినియోగం వందశాతం పెరుగుతుందని, సమాచార నిల్వ కీలకంగా మారుతుందన్నారు. సమాచార వినియోగం జపాన్‌లో 8.3జీబీ ఉంటే ఇండియాలో 8.8జీబీ ఉందన్నారు. భారత్‌లో ఉన్నంతమంది 4జీ వినియోగదారులు మరెక్కడా లేరని, జపాన్‌లో వీరు 6.5శాతం మంది కాగా, ఏపీలో 18శాతం అని వివరించారు. భవిష్యత్తులో వర్జీనియాకు దీటుగా విశాఖ రూపొందుతుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా డేటా అనలిటిక్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, ఏఐకు బాటలు పడతాయన్నారు. ఎంత త్వరితగతిన డేటా సెంటర్లను అభివృద్థి చేస్తారోనన్న ఆసక్తి తనకు కూడా ఉందన్నారు. ఏపీని ఎంపిక చేసుకున్న గౌతమ్‌ అదానీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భావనపాడు ఓడరేవు ద్వారా శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందని, ఇకపై ఉత్తరాంధ్ర వలసలకు ఈ పోర్టు అడ్డుకట్టగా ఉంటుందన్నారు.

ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు అంచనాలను వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి బీజేపీ నేతలకు మంచి జోష్‌ను అందించారు. తాజాగా రాష్ట్రంలో బీజేపీతో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై సర్వే నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు గురించి తెలుసుకుంటున్నారు.

bjpsurvey 09012019

వీటితో పాటు 24 గంటలు విద్యుత్ సరఫరా జరుగుతోందా, తాగునీటి సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, రేషన్ సరఫరాకు సంబంధించిన పలు అంశాలు, ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగుందా.. అని తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అవినీతి, స్వచ్ఛ్భారత్, దేశ రక్షణ, ఆర్థిక పరిస్థితులు, వౌలిక సదుపాయాల కల్పన, ప్రతీ ఇంటికి విద్యుత్తుతో పాటు పొత్తులపై కూడా అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఒక ఓటరుగా నిరంతర విద్యుత్, పరిశుభ్రత, ఉద్యోగం, విద్య, లా అండ్ ఆర్డర్, ధరలు, అవినీతి, రైతు సంక్షేమం ఇలా ఏది చూసి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు.

bjpsurvey 09012019

ఇక రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ముగ్గురు బీజేపీ నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదే విధంగా పార్లమెంటు నియోజకవర్గం నుండి రాష్ట్రంలో ముగ్గురు నేతల పేర్లను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్వే చేపడుతున్నారన్న విషయం తెలుసుకున్న నేతలు తమ వర్గాలకు సమాచారాన్ని అందించి తమ పేర్లను ప్రతిపాదించాలని చెబుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా జగన్ వౌనం వహించడానికి కారణం సీబీఐ కత్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో మంగళవారం జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్రం చేస్తున్న అన్యాయంపై రాష్ట్రంలో అందరూ ప్రశ్నిస్తున్నారని, అయితే ఒక్క జగన్ మాత్రం మోదీని పల్లెత్తుమాట అనడం లేదన్నారు. పైగా తమ ప్రభుత్వంలో రూ. 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌కు మించి అవినీతి ఎలా జరుగుతుందో జగనే చెప్పాలని చంద్రబాబు అన్నారు. తాను గానీ, తన కుటుంబం గానీ అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమకు ఉన్న పరిశ్రమలతో ఆదాయం సమకూరుతోందని, ప్రజల సొమ్ము కోసం కక్కుర్తిపడాల్సిన అవసరం లేదన్నారు.

modijagan 09012019

ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజల కళ్ల ముందే, వారి సమక్షంలోనే జరుగుతున్న విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గద్దెనెక్కాలి, ఉన్న కొద్దిపాటి ప్రజల సొమ్మును మింగేయాలన్న లక్ష్యంతో మొన్నటి వరకు కోడి కత్తి డ్రామా ఆడారని మండిపడ్డారు. జగన్‌కు అంత కంటే పెద్ద కత్తి సీబీఐ రూపంలో వెంటాడుతోందన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే తక్షణం జగన్ జైలులో ఉంటారని చంద్రబాబు అన్నారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, రాష్ట్రానికి మోదీ చేస్తున్న అన్యాయంపై జగన్ నోరు మెదపడం లేదన్నారు.

modijagan 09012019

కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు రూ.85 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో మేధావులు తేల్చి చెప్పారని, ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు. వారు అన్ని శాఖల రికార్డులను పరిశీలించి కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట నిజమేనని తేల్చారని, బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని వారు పేర్కొన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క జగన్ మినహా అందరూ కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తున్నారని ఆయన మాత్రం సీబీఐ కేసుల దెబ్బకు భయపడి వౌనంగా పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌పై నమోదైన కేసుల నుంచి కాపాడే శక్తి మోదీకి లేదన్నారు. జగన్ పాల్పడిన అవినీతికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read