చుక్కల భూముల పేరుతో రాష్ట్రంలో మరో కుట్ర జరగబోతోందంటూ హీరో శివాజీ ఒక్క సారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది అధికారులు చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ను కోరినట్టు, చంద్రబాబును కలిశాక ఈ కుట్ర వెనుక ఎవరున్నారో ఆయనకే చెబుతానంటూ శివాజీ తెలిపారు. అయితే గుంటూరులోని అచ్చంపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఏపీకి అన్యాయం చేస్తోందని కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పవన్‌కల్యాణ్‌ కూడా పోరాడాలని, రాష్ట్రం కోసం పవన్‌ కల్యాణ్‌ తమతో కలిసిరావాలని కోరారు. ఒకరు బీజేపీతో పూర్తిగా కలిసిపోయారని, ఇంకొకరు వన్‌సైడ్‌గా పనిచేస్తున్నారన్నారు. పవన్ కలిసి వస్తారో లేక ఒంటరిగా పోటీ చేస్తారో ఆయన వ్యక్తిగత విషయమన్నారు. అదే విధంగా శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఎస్టేట్‌, కోఆపరేటివ్‌ భూముల సమస్యలను ఈ నెలాఖరులోపు పరిష్కరించాలన్నారు. శివాజీ చెబుతున్నట్లు అధికారులు వ్యవహరిస్తే ఆధారాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటామన్నారు.

sivaji 05012019

దీర్ఘకాలంగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈనెల 24 నాటికి పరిష్కరించాలని ప్రభుత్వం శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తనంతట తానుగా చుక్కల భూములు పునఃపరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. 1954లో భూముల రీసర్వే జరిగినప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సర్వేనంబర్‌ వారీగా ఖాతాదారుల పేర్లు, విస్తీర్ణం నమోదు చేశారు. అయితే ఎవరూ యాజమాన్య హక్కు కోరని భూముల వద్ద రికార్డుల్లో చుక్కలు (డాట్స్‌) పెట్టారు. దీంతో అప్పటి నుంచి ఈ భూములను చుక్కల భూములు (డాటెడ్‌ ల్యాండ్స్‌)గా పిలుస్తున్నారు. 1954 తర్వాత ఆ భూములను సాగు చేసుకునే వారికి ఎటువంటి యాజమాన్య హక్కులూ లేవు. వాటిని బదిలీ చేసుకునే, అమ్ముకునే అవకాశం లేదు.

sivaji 05012019

దాంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూమి హక్కుల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఇది పెద్దసమస్యగా తయారైంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజిస్ర్టేషన్‌ చట్టం-1908లోని 22(ఏ1)లో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి చుక్కల భూములను తొలగిస్తూ 2017 జూలై 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం... రైతుల ఆధీనంలో సాగులో ఉన్న చుక్కల భూములను ప్రైవేటు పట్టాభూములుగా పరిగణిస్తారు. చుక్కల భూములకు సంబంధించిన సర్వేనంబర్లు, ఇతర వివరాలను రెవెన్యూశాఖ ఆయా జిల్లాల్లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు పంపుతుంది. ఆ భూములను స్వాధీనంలో ఉంచుకున్నవారు, సాగు చేసుకుంటున్నవారు ప్రభుత్వం నిర్ణయించిన పత్రాలలో ఏదో ఒకటి చూపిస్తే ఆ భూమి వారికి సంబంధించినదిగా రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. 2017 జూలై 14వ తేదీకి ముందు 12 ఏళ్లు ఆధీనంలో ఉన్నట్లు ఏవైనా ఆధారాలు చూపినా రిజిస్టర్‌లో వారి పేరు నమోదు చేస్తారు.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటన పై కేంద్రం స్పందించింది. కేంద్ర విదేశాంగశాఖ అధికారులతో ఏపీ సీఎంవో చర్చలు జరిపింది. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర విదేశాంగశాఖ కోరింది. దీంతో చంద్రబాబు పర్యటనకు లైన్ క్లియర్ అయింది. చంద్రబాబుతో పాటు 17 మంది బృందం 7 రోజుల పాటు దావోస్‌ వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. నిన్న చంద్రబాబు దావోస్ పర్యటన పై కేంద్రం ఆంక్షలు విధించింది. ప్రతి ఏడాది 14, 15 మంది ప్రతినిధులతో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చంద్రబాబు వెళుతున్నారు. ఈ ఏడాది ఏడు రోజుల పర్యటనను నాలుగు రోజులకు కుదించుకోవాలని కేంద్రం సూచించింది.

davoss 04012019

15 మందికి బదులు ఐదుగురే వెళ్లాలని ఆంక్షలు విధించింది. దీంతో ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్ వెళ్లేందుకు సీఎం కార్యాలయం కేంద్రం అనుమతి కోరింది. కేంద్రం ఆంక్షలు విధించడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అనుమతి కోరాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించే స్వరంతో హెచ్చరించటంతో, ఇలాంటి విషయాలలో ఎక్కువ లాగితే, ఉన్నది కూడా ఊడుతుందని భావించి, కేంద్రం వెనక్కు తగ్గింది. అనవసర గొడవను నెత్తిన పెట్టుకోవటం ఎందుకని, చంద్రబాబు టూర్ కి పర్మిషన్ ఇచ్చింది.

davoss 04012019

ప్రతి సారీ చంద్రబాబుతో పాటు, ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్‌కి వెళ్లడం ఆనవాయితీ. ఈసారి కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఆయనతోపాటు, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌ సహా 14 మంది సభ్యుల బృందం వెళ్లాలన్నది ఆలోచన. ఈ మేరకు రాజకీయ అనుమతుల కోసం కేంద్ర విదేశాంగ శాఖకు దరఖాస్తు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటనకు అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించింది. అయితే ఈ విషయం పై కేంద్రం అతిగా జోక్యం చేసుకోవటంతో, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో కేంద్రం దిగొచ్చి, ఆంక్షలు లేకుండా పర్మిషన్ ఇచ్చింది.

సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన పై కేంద్రం ఆంక్షలు విధించింది. ప్రతి ఏడాది 14-15మంది ప్రతినిధులతో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక చంద్రబాబు సదస్సుకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఏడు రోజుల పర్యటనను 4రోజులకు కుదించుకోవాలని కేంద్రం సూచించింది. 15మందికి బదులు ఐదుగురే వెళ్లాలని ఆంక్షలు విధించింది. దీంతో ఈనెల 20 నుంచి 26వ తేదీవరకు దావోస్‌ వెళ్లేందుకు సీఎం కార్యాలయం కేంద్రం అనుమతి కోరింది. కేంద్రం ఆంక్షలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష్యం పై ఐటీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు వేధిస్తోందని లోకేశ్ ప్రశ్నించారు. ఏపీకి పరిశ్రమలు వస్తే భారత్ కు పరిశ్రమలు వచ్చినట్లు కాదా? అని నిలదీశారు.

lokesh 04012019

స్విట్జర్లాండ్ లో దావోస్ లో ప్రతీ ఏటా జరిగే ప్రపంచ వాణిజ్య సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో చంద్రబాబు పాల్గొనడం వల్ల ఏపీకి చాలా లాభం చేకూరిందని మంత్రి తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు దావోస్ పర్యటనపై అర్థంలేని ఆంక్షలు విధిస్తూ మోదీ ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ వేధింపులకు గురికావడానికి తెలుగువారు చేసిన తప్పేమిటి? అని లోకేశ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఏపీ మంత్రి ట్విట్టర్ లో స్పందించారు. మరో పక్క, ఆంధ్రా మోదీని కాపాడేందుకు దిల్లీ మోదీ సీబీఐని భాజపా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌గా మార్చేశారని లోకేశ్‌ విమర్శించారు. ప్రజాధనాన్ని నిలువునా దోచుకున్న వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌కు కేసుల నుంచి విముక్తి కల్పించి ఏపీని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు.

lokesh 04012019

భాజపా భారతీయ జోకర్స్‌ పార్టీగా మారిందని, ఆంధ్రప్రదేశ్‌కు నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూ, ధైర్యం లేని ఏపీ భాజపా నేతలు ఈ రోజు సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భాజపాను ప్రజలు మట్టిలో కలిపేసే రోజులు దగ్గర పడ్డాయని లోకేశ్‌ ఈ సందర్భంగా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం ద్వారా అధిక నిధులు రావడం చట్టం ద్వారా వచ్చిన హక్కు అని, ఇందులో భాజపా భిక్ష ఏమీ లేదని, చంద్రబాబు కష్టమే ఉందన్నారు. ఉపాధి హామీలో ఎక్కువ నిధులు కేటాయించామని అర్థంలేని చర్చలు చేస్తున్న ఏపీ భాజపా నేతలు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉపాధి హామీ పథకంలో ఎందుకు వెనుకబడి ఉన్నాయో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, 14 మంది టీడీపీ ఎంపీలను సభ నుంచి నిన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీంతో, ఈరోజు వారంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్లకార్డులు పట్టుకుని, ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి వద్దకు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ వచ్చారు. ఎంపీల ఆందోళనకు తన మద్దతు ప్రకటించారు. వారితో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

delhi 04012019

మరో పక్క హక్కుల కోసం పోరాడుతున్న ఎంపీలను సస్పెండ్ చెయ్యటం పై, చంద్రబాబు స్పందించారు. పార్లమెంటు వైపే రాష్ట్రం మొత్తం చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ఎంపీల పోరాటాన్ని 5 కోట్ల ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీ ఎంపీలతో ఆయన ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దిల్లీలో లాఠీఛార్జితో పాటు ఎంపీల సస్పెన్షన్ ప్రతి ఒక్కరూ ఖండించాలని సీఎం అన్నారు. గురువారం 14 మంది తెదేపా ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు రెండు రోజుల్లో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఏంటని నిలదీశారు.

delhi 04012019

భాజసా నేతలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని దుయ్యబట్టారు. దేశం మొత్తం భాజపాకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. దిల్లీలో లాఠీఛార్జి బాధితులను ముఖ్యమంత్రి ఫోన్లో పరామర్శించారు. గాయపడిన వెంకట్‌కు ఫోన్ చేసి చర్యను ఖండించారు. కేంద్రం నిరంకుశ పోకడలకు వెళ్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హోదా సాధన సమితి ప్రతినిధులపై దిల్లీ పోలీసుల దాడి గర్హనీయమన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై లాఠీఛార్జి అమానుషమని, కేంద్రం నిరంకుశ పోకడలకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని ఆక్షేపించారు. భాజపాతో కుమ్మక్కైన పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read