యోగి మోడల్ అంటూ హడావిడి చేసే బీజేపీ బ్యాచ్, ఇప్పుడు యోగి చేస్తున్న పని గురించి ఏమంటారో. లేక అదే మంచిదని, భజన చేస్తారో. ఇక విషయానికి వస్తే, ఉత్తర ప్రదేశ్‌లో ఆవుల సంరక్షణ కోసం కొత్తగా పన్నును విధించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. ‘గో సంరక్షణ సెస్‌’ పేరుతో దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆవుల సంరక్షణకు పట్టణ, గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా ‘గోవంశ్‌ ఆశ్రయ్‌ ఆస్థల్‌’లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటికే ఉన్న పన్నులకు తోడు, ఈ కొత్త పన్ను పై ప్రజలు భగ్గు మంటున్నారు.

modi yogi 02012019

అలాగే, అన్ని గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక్కో షెడ్డులో వెయ్యి పశువులకు ఆశ్రయం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్సైజ్‌, టోల్ ట్యాక్స్, ఇతర లాభదాయ కార్పొరేషన్స్‌పై ‘గో సంరక్షణ సెస్‌’ విధించనున్నట్లు తెలిపారు. చాలా మంది రైతులు తమ పశువులను వదిలేస్తున్నారని.. ఇలాంటి షెడ్ల వల్ల వాటికి ఆశ్రయం లభిస్తుందని, రోడ్లపై తిరిగే పశువులకు కూడా ఆశ్రయం కల్పించినట్లవుతుందని చెప్పారు. సంబంధిత విభాగాలు పరస్పర సహకారంతో ఆవుల సంరక్షణ చేస్తారని వెల్లడించారు.

modi yogi 02012019

ఇప్పటికే యూపీ ఎక్స్‌ప్రెస్ వే, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ, యూపీ రాష్ట్ర నిర్మాణం, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, యూపీ స్టేట్ బ్రిడ్జి కార్పొరేషన్, మండి పరిషత్, యూపీఎస్ఐడీసీలు గో సంరక్షణ కోసం ఒకశాతం సెస్ వసూలు చేస్తున్నాయి. ఈ సెస్ ను 2 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఈ సెస్ నిధులతో ప్రతీ జిల్లాలో వెయ్యి ఆవులను ఉంచేందుకు వీలుగా షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిధులతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో గోసంరక్షణాలయాలు నిర్మించనున్నారు. ఈ సెస్ తోపాటు ఎమ్మెల్యే, ఎంపీల్యాడ్స్ నిధులతో కూడా ఆవుల కోసం షెల్టర్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించారు. అయితే, గోవుల సంరక్షణ మంచేదే అయినా, అంత పెద్ద రాష్ట్రం సొంతగా ఖర్చు పెట్టచ్చు కదా, దాన్ని ప్రజల మీద భారం వెయ్యటం ఏంటి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సూపర్ మోడల్ అంటూ, దేశ వ్యాప్తంగా కూడా ఇలా చేస్తారేమో అనే విమర్శలు వస్తున్నాయి.

నిన్న ప్రధాని మోదీ చంద్రబు ఆక్రోశంలో ఉన్నారని వ్యాఖ్యానించడం పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గుజరాత్‌ను, ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడ మించిపోతుందో అనే ఆక్రోశం మోడీకే ఉందని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ఆ కారణం తోనే మన రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అడ్డు పడుతూ, అక్కసు వెల్లగక్కుతున్నారని విమర్శించారు. మోడీ, నేను సియంలుగా పనిచేశామని, ఆయన అహ్మదాబాద్‌కు చేసిందేమీ లేదు అని, తాను హైదరాబాద్‌ను ఎలా అభివృద్ది చేశానో ప్రపంచమంతా తెలిసుని చంద్రబాబు అన్నారు. మన రాష్ట్రానికి సహకరిస్తే, మనం అభివృద్ధిలో గుజరాత్ ని మించిపోతామనే భయం మోడీకి పట్టుకుందని దుయ్యబట్టారు. కనీస హుందాతనం అనేది లేకుండా మోడీ వ్యాఖ్యానించారని, ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారని మోడీ పై మండిపడ్డారు. ఈ రోజు ఉదయం పార్టీ నాయకులతో ‘జన్మభూమి-మా ఊరు’ చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

modi 02012019

ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యాలని, ఈ 10 రోజులు అందరూ గ్రామాలు, వార్డుల్లోనే ఉండాలని చెప్పారు. అన్ని వైపుల నుంచి దుష్టశక్తులు రాష్ట్రం పై కక్ష కట్టాయని, అభివృద్ధి ఆగిపోవాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, అందరూ ఇది కీలక సమయంగా భావించి తెలుగుదేశాన్ని మళ్ళీ గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్‌ ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉందని, ఇప్పుడు పనులు అన్నీ ఆగిపోతే, ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 14 వరకు ఉన్న పరిస్థితులు వస్తాయని అన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన కరెంట్‌ డబ్బులు చెల్లించరు గానీ పొరుగు రాష్ట్రం ప్రకటనలు ఆంధ్రలో, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా జీరో అని.. మోదీ, అమిత్‌ షా, ముగ్గురు సీఎంలు, 13మంది కేంద్రమంత్రులు ప్రచారం చేసినా తెలంగాణలో ఒక్క సీటు మాత్రమే గెలిచారని దుయ్యబట్టారు. తెలంగాణలో కూటమి విఫలం అని భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భాజపాయేతర కూటమికి బీటలు పడ్డాయని జైట్లీ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.

modi 02012019

నాలుగు రోజులు కూడా గడువివ్వకుండా హైకోర్టును తరలించారని విమర్శించారు. ఏపీలో తెదేపా గెలిస్తే తన అసమర్ధత బైటపడుతుందని కేసీఆర్‌ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసుల మాఫీ కోసం జగన్‌కు అధికారం కావాలని, అందుకే మోదీ, కేసీఆర్‌తో జట్టుకడుతున్నారని అన్నారు. ఎవరైతే మనకు అన్యాయం చేశారో వాళ్లపై మనం పోరాడుతున్నామని, అలాంటి వారితో జగన్ స్నేహం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, జగన్‌, కేసీఆర్ ముగ్గురూ ఏపీపై పగబట్టారని, ముగ్గురు మోదీలతో మనం పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రజల్లో పట్టుదల పెరగాలని, అందరూ కసితో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో ఏమీ చేయని కేసీఆర్‌ 80కి పైగా సీట్లలో గెలిచారని, అన్నీ చేసిన మనం ఇంకా ఎక్కువ స్థానాల్లో గెలవాలని నేతలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. మత వ్యవహారాల్లో భాజపా జోక్యం చేసుకుంటోందని ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో ఒకలా.. శబరిమలలో ఇంకోలా భాజపా కుట్రలు చేసిందని చంద్రబాబు విమర్శించారు. విభజించి పాలించాలని ఆ పార్టీ చూస్తోందని మండిపడ్డారు. వారి కుట్రలను తిప్పికొట్టాలని నేతలకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో అంతర్గతంగా ఉన్న విభేదాలు బయట పడుతున్నాయా? నాయకత్వ మార్పును కోరుకుంటున్నాయా? ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇన్నాళ్లూ జిల్లా కేంద్రానికే పరిమితమైందన్న అసమ్మతి ఇపుడు నియోజకవర్గాలకూ విస్తరిస్తోంది. పార్టీలో సీనియర్‌ నాయకుడిగా.. వైసీపీని బలోపేతం చేసిన వ్యక్తిగా పేరున్న సాంబశివరాజును నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్‌ పదవి నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఆ నియోజకవర్గంలోని పాత బృందమంతా ఏకమయ్యేందుకు మంతనాలు సాగిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ సీనియర్‌ నాయకుడు పెనుమత్స సాంబశివరాజును నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్‌ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఆ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయడుకు అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ycp 02012019 2

ఈ పరిణామంతో జిల్లా వైసీపీలో ఓ కుదుపు వచ్చినట్లు అయింది. వైసీపీలో ఎప్పటికప్పుడు కన్వీనర్ల మార్పు కారణంగా పార్టీలో పెద్ద దుమారమే రేగుతోంది. ఇన్నాళ్లూ పార్టీకోసం కష్టపడి నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి చివరి దశలో కన్వీనర్‌ను మార్చేస్తున్న కారణంగా జిల్లా వైసీపీ నాయకుల్లో అసంతృప్తి రేగింది. నిరాశలో ఉన్న నాయకులంతా ఏక తాటిపైకి వచ్చి తమ సత్తా ఏమిటో తెలియ జేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సాంబశివరాజు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఐదేళ్ల పాటు పనిచేశారు. అలాగే పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగానూ బాధ్యతలు చూశారు. అలాంటి నేతను నియోజవర్గానికి కన్వీనర్‌గా కూడా కాకుండా చేయడాన్ని మిగతావారు జీర్ణించుకోలేకోతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఏకతాటిపైకి వచ్చి తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ycp 02012019 3

వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా ఉండటమే కాకుండా రాజు నాయకత్వంలోనే గత ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు, కురుపాం ఎమ్మెల్యే స్థానాలను గెలిపించారు. అయితే తన కుమారుడు పెనుమత్స సురేష్‌బాబును నెల్లిమర్లలో గెలిపించుకోలేక పోయారు. రెండేళ్ల కిందటి వరకు ఈ నియోజకవర్గంలో సురేష్‌బాబే వైసీపీ కన్వీనర్‌గా ఉండే వారు. సాంబశివరాజుకే నెల్లిమర్ల టిక్కెట్టు ఇవ్వాలని భావించి నియోజకవర్గ కన్వీనర్‌ బాధ్యతలను అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో నిధుల ఖర్చుకు తూగలేరని భావించి పెనుమత్సను పక్కన పెట్టినట్లు సమాచారం. ఏదైనాగాని ఈ నిర్ణయం సరికాదని అసమ్మతి నాయకులంతా సాంబశివరాజుకు సంఘీభావం తెలుపుతూ టచ్‌లో ఉన్నారని, భవిష్యత్‌ కార్యా చరణకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. నియోజకవర్గ కన్వీనర్లను మార్చటం జిల్లాలో ఇది నాల్గోసారి.

 

ఉక్రెయిన్‌లో పుట్టి బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల కేంద్రంగా పనిచేసే డీఎఫ్‌ గ్రూప్‌ అధినేత దిమిత్రొ ఫిర్తా్‌షకు చెందినదీ సంస్థ. ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నది బోయింగ్‌ విమానయాన సంస్థ. ముడుపుల బాగోతంలో నిందితుడు కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. ఈ వ్యవహారం గతంలోనే బయటపడినా ఇందుకు సంబంధించిన వివరాలేవీ బయటకు పొక్కలేదు. తాజాగా బోయింగ్‌ కోసం పనిచేసిన వ్యాపార సలహా సంస్థ- మెకిన్సే అండ్‌ కంపెనీ ఆనాడు ఇచ్చిన నివేదికలో కొన్ని భాగాలు ఇపుడు బయటకొచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ ఈ విషయం పై సమగ్ర కధనం ప్రసారం చేసింది (https://www.nytimes.com/2018/12/30/world/mckinsey-bribes-boeing-firtash-extradition.html?). 2006లో బోయింగ్‌ ప్రారంభించదల్చుకున్న డ్రీమ్‌లైనర్‌ విమానాలకు తేలికపాటి టైటానియం స్పేర్‌పార్టుల కొరత ఏర్పడింది. అప్పట్లో టైటానియం ధరలు విపరీతంగా ఉండడం, విమానాల ప్రారంభతేదీ దగ్గరపడుతుండడంతో.. బోయింగ్‌.. మెకిన్సేను ఆశ్రయించింది. వాణిజ్యపరమైన వివరాలందివ్వడమే కాదు, ప్రభుత్వాలకు ఎలా గాలం వేసి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చో చెప్పడంలో మెకిన్సేది అందెవేసిన చెయ్యి.

new 02012019 1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని చాలా మండలాల్లో టైటానియం నిక్షేపాలున్నట్లు అప్పటికే గుర్తించడం జరిగింది. వీటిని వెలికితీస్తే తమకు లాభదాయకమవుతుందని బోయింగ్‌ అంచనా. ఏటా 500 మిలియన్‌ డాలర్లు (రూ 3487 కోట్లు) వ్యాపారం, ఆదాయం దీని ద్వారా జరుగుతుందని ఆ సంస్థ ఆనాడు అభిప్రాయపడింది. అక్రమమార్గాలలో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో దిట్ట అయిన దిమిత్రో ఫిర్తాష్‌ను ఇందుకోసం ఎన్నుకుంది. ఆనాడు 8 మంది భారతీయ కీలక అధికారులకు ముడుపులు చెల్లించిన మాట వాస్తవమని మెకిన్సే నివేదిక ద్వారా తెలుస్తోంది. అయితే ఆ పేర్లను న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో అన్నింటికీ కేంద్రబిందువు అయిన కేవీపీ ద్వారా ఈ కథ నడిచినట్లు వెల్లడయింది. లైసెన్సుల మంజూరు, ఏయే అధికారులకు ఎంతెంత ఇవ్వాలన్నది కేవీపీ ద్వారానే ఖరారైందని.. ఆయనతో పెరియసామి సుందరలింగం అనే దళారీ సంప్రదింపులు జరిపాడనీ అమెరికాలోని ఇల్లినాయి నార్ద్రర్న్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో సాగిన ఓ కేసులో ఫెడరల్‌ జ్యూరీ ఆరోపించింది.

new 02012019 1

ఫిర్తాష్‌, కేవీపీ, సుందరలింగం సహా ఏండ్రాస్‌ నాప్‌, సురెన్‌ గెవర్గాన్‌, గజేంద్ర లాల్‌ అనే ఎన్‌ఆర్‌ఐలు ఈ కేసులో దోషులని పేర్కొంది. మైనింగ్‌ ప్రాజెక్టు అంతిమంగా 2014లో రద్దయినప్పటికీ నాటి ముడుపుల బాగోతం వెన్నాడుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఫిర్తాష్‌ సన్నిహితుడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రచార సారథిగా పనిచేసిన పాల్‌ మన్‌ఫోర్ట్‌కు కూడా సన్నిహితుడు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయముందని, ట్రంప్‌కు రష్యన్‌ గూఢచార సంస్థలు సహకరించాయని, డెమొక్రాట్ల వ్యూహాల లీక్‌లో పుతిన్‌ టీమ్‌ హస్తం ఉందని ఆరోపణలు రావడం, వాటిపై రాబర్ట్‌ మ్యూలర్‌ ఆధ్వర్యంలో విచారణ సాగుతుండడం తెలిసిందే. ఆనాడు ట్రంప్‌ రష్యా లింకుల్లో ఫిర్తాష్‌ ఓ కీలక వారధి అని ఎఫ్‌బీఐతో పాటు అమెరికా రాజకీయ సంస్థలు అనుమానిస్తున్నాయి. బోయింగ్‌ అక్రమ వ్యవహారాల కేసులో ఫిర్తా్‌షను తమకు అప్పగించాలని షికాగోలోని ఓ కోర్టు కోరుతోంది. ఓస్ట్‌కెమ్‌ హోల్డింగ్‌ ఏజీ అనే సంస్థ అక్రమ లావాదేవీలపై ఫిర్తా్‌షను ఆస్ట్రియా ప్రభుత్వం నిర్బంధించి 174 మిలియన్‌ డాలర్ల పూచీకత్తుపై విడుదల చేసింది. ఆ సొమ్ము ఏర్పాటుచేసినది పుతిన్‌కు సన్నిహితుడైన మరో వ్యాపారవేత్త. భారత్‌లో (ఏపీలో) లంచాలు ఎరవేసి ఓ ప్రాజెక్టును సాధించడానికి ఫిర్తాష్‌ ప్రయత్నించాడని, ఆయన చాలా ప్రమాదకారి అనీ ఆస్ట్రియా ప్రభుత్వానికి ఈమెయిల్‌ సందేశం రావడంతో ఆయనను దేశం విడిచిపోనివ్వకుండా కట్టడి చేసింది. ఇప్పటికే ఈ అవినీతి భాగోతం అంతా, కేసు స్టడీగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో పాఠాలుగా చెప్పబడుతున్న రాజశేఖర్ రెడ్డి ,కేవీపీ రామచంద్రరావుల అవినీతి చరిత్ర ఈ కింద లింక్ లో ఉంది. http://fcpa.stanford.edu/enforcement-action.html?id=499

Advertisements

Latest Articles

Most Read