తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయాల్లో జోకర్‌గా మారిపోయారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. కేసీఆర్‌ బతుకేంటని, రాజకీయ జీవితం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. తాగుడు, వాగుడు తప్ప కేసీఆర్‌కు ఉన్న అర్హత ఏంటి? కాల్వ మండిపడ్డారు. చంద్రబాబు పెంచితే కేసీఆర్‌ నాయకుడు అయ్యారని తెలిపారు. టిక్కెట్ల కోసం చంద్రబాబు చుట్టూ తిరిగిన నేత కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. మోదీ బిస్కెట్లకు ఆశపడి కేసీఆర్‌ తమపై మొరుగుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ వల్ల కావడం లేదని మోదీనే కేసీఆర్‌ను తమపైకి వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నాడు చంద్రబాబు ఇచ్చిన సీట్ల వల్లనే టీఆర్‌ఎస్‌ బతికిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

kalva 30122018

ఏపీలో జగన్‌, తెలంగాణలో కేసీఆర్‌ మోదీకి బీటీమ్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుడని, తెదేపాను రాజకీయంగా ఆయన ఎదుర్కోలేకపోతున్నాడనే ఉద్దేశంతో మోదీ దించిన రెండో కృష్ణుడు కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి అమరావతిలో కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏదో చేస్తారని మోదీ భ్రమపడుతున్నట్టు ఉన్నారన్నారు. కేసీఆర్‌ కలిసిన తర్వాత ఉన్నఫళంగా హైకోర్టు వెంటనే ఏర్పాటు కావాలని నోటిఫికేషన్‌ ఇచ్చారని, హైకోర్టుపై నోటిఫైకి ముందు నెల సమయం ఇస్తే బాగుండేదన్నారు. కనీసం నెల సమయమైనా తమకు ఇచ్చి ఉంటే సౌకర్యాలు సమకూర్చుకొని ఉండేవాళ్లమని చెప్పారు. ఆర్థిక నేరగాళ్లకు త్వరితగతిన శిక్షలు వేసేందుకు ప్రయత్నిస్తామని గతంలో ప్రధాని మోదీ అన్నారని, ఆయన చెప్పిన మాటలకు, చేసిన వ్యవహారాలకు పొంతన ఉండటంలేదని విమర్శించారు. దీంతో జగన్‌ కేసుల విచారణ జాప్యం జరిగే అవకాశం ఉందని తాము స్పష్టంగా అభిప్రాయపడుతున్నామన్నారు.

kalva 30122018

ఏపీలో హైకోర్టు ఏర్పాటు కాకూడదనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఈ గడ్డపై హైకోర్టు కార్యకలాపాలు జరగాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారని కాల్వ చెప్పారు. కేసీఆర్‌ వాడిన భాష చాలా బాధాకరమన్నారు. చంద్రబాబు పెట్టిన భిక్షతోనే తెలంగాణలో తెరాస బతికిందని, ఆయనే చేయూతగా నిలవకపోతే కేసీఆర్‌ సేద్యం చేసుకునేవారని అన్నారు. జగన్‌, కేసీఆర్‌ లాంటి వాళ్లు ఎందరు వచ్చినా, విడివిడిగా వచ్చినా.. కలివిడిగా వచ్చినా చంద్రబాబును, తెదేపాను ఏమీ చేయలేరని సవాల్‌ విసిరారు. మోదీ ప్రాపకం కోసమే కేసీఆర్‌ చంద్రబాబును ఆడిపోసుకుంటున్నారని విమర్శించారు. భాజపాయేతర, కాంగ్రెస్సేతర పార్టీలను ఏకం చేస్తామని కేసీఆర్‌ అంటున్నారని, దేశ రాజకీయ ముఖచిత్రంపై భాజపా, కాంగ్రెస్‌ లేకుండా మూడో ప్రత్యామ్నాయం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేనప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటున్నారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు.

‘‘నాలుగు ముక్కలు ఇంగ్లిష్ రాదు.. రెండు ముక్కలు హిందీ రాదు. ఢిల్లీలో ఏం చక్రం తిప్పుతారు’’ అంటూ చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్లే స్కూల్‌కి వెళుతున్న తన మనవడు ఇంగ్లిష్ మాట్లాడుతుంటే.. తాను అర్థం చేసుకోలేపోతున్నానని... అంత మాత్రానా ముఖ్యమంత్రిని చేస్తామా అని ప్రశ్నించారు. చిన్న చిన్న అటెండర్లు కూడా అద్భుతంగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారన్నారు. ‘‘అది కాదు కావలసింది ... మనం మాట్లాడింది అర్థం చేసుకుంటే చాలు. మీరు గొప్ప ప్రసంగీకులు.. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలలో బాగా మాట్లాడతారు. అంతగొప్పగా మాట్లాడే మీరు.. తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? కష్టాల్లో ఉన్న ఏపీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

somireddy 30122018

అనుభవం, ముందుచూపు ఉన్న మహానాయకుడు చంద్రబాబు అని గతంలో మహబూబ్‌నగర్‌లో కేసీఆర్‌ పొగిడారని, ఈ రోజు తిడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. ఆయన మాటలు దారుణంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ హయాంలో బడ్జెట్‌ గొర్రెతోక అని ఆనాడు కేసీఆర్‌ చెప్పారు. ఉమ్మడి ఏపీ బడ్జెట్‌ను రూ.50వేల కోట్లకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబు తెచ్చిన సంపదను వైఎస్‌ఆర్‌ వాడుకున్నారని, తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌ వాడిన భాష సరికాదని గతంలో కేసీఆరే అన్నారు. వైఎస్‌ఆర్‌ వాడిన భాష సరికాదని చెప్పిన కేసీఆర్‌ ఈ రోజు అలా..ఎలా మాట్లాడతారు? మాయ మాటలు చెప్పేవారికే ప్రజలు బోల్తా పడుతున్నారు. కరీంనగర్‌ను న్యూయార్క్‌, వరంగల్‌ను లండన్‌, హైదరాబాద్‌ను డల్లాస్‌, యాదాద్రిని వాటికన్‌ సిటీ చేస్తానని కేసీఆర్‌ అన్నారు... ప్రజలు ఏమైనా ఇవన్నీ అడిగారా? నాలుగేళ్లలో వృద్ధి రేటులో అన్ని రంగాల్లో 10.5 శాతం వృద్ధితో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెరాసను కాంగ్రెస్‌లో కలిపేస్తానని కేసీఆర్‌ అన్నారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా?

somireddy 30122018

ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు పొందినంత మాత్రాన గొప్పకాదు. తెలంగాణలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తే.. ఏపీలో రూ.1.5లక్షలు చేశాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణ కంటే వృద్ధి సాధించాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీశ్‌రావే గతంలో మాట్లాడారు. ఈ రోజు కేసీఆర్‌ ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. చంద్రబాబు చేసిన మోసం ఏంటో కేసీఆర్‌ చెప్పాలి. సీనియర్‌ రాజకీయ నాయకుడైన కేసీఆర్‌ వాడిన భాష వింటుంటే బాధ కలుగుతోంది. రెండోసారి సీఎం అయిన తర్వాత చులకనైన భాష వాడే ఏకైక సీఎంగా కేసీఆర్‌ నిలిచిపోతారు’’ అని సోమిరెడ్డి మండిపడ్డారు.

సీఎం చంద్రబాబు మీద ఘాటు విమర్శలు చేసిన కెసిఆర్ మీద టీడీపీ మంత్రులు విరుచుకుపడుతున్నారు. మంత్రులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశాలు పెట్టి చెడామడా ఏకిపారేయగా మరో మంత్రి నక్కా ఆనందబాబు కూడా కెసిఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కెసిఆర్ బాష చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చీదరించుకుంటున్నారన్న నక్కా కెసిఆర్ కు రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబేనన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. కెసిఆర్ మోడీకి అద్దె మైకు, జగన్ రెడ్డి సొంత మైకులా తయారయ్యారని అన్నారు. కేసీఆర్ భాషను చూసి ఆ రాష్ట్ర ప్రజలు ఛీదరించుకుంటున్నారని ఏపీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు.

nakka 30122018

కెసిఆర్ ఏపీలో జగన్ తో కలిసి కుట్రల చేయాలని చూస్తున్నారని ఎవరు ఎంత ప్రయత్నాలు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. కెసిఆర్ అవాకులు, చవాకులు దారుణమైనవని.. చంద్రబాబు పెంచితే కెసిఆర్ నాయకుడయ్యారన్న నక్కా.. కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు. సిఎం చంద్ర‌బాబు పై వాడిన భాషకు కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు. ఏపిలో జగన్‌తో కలిసి కుట్రలు చేస్తే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. తాము శ్వేత పత్రాలు విడుదల చేసుకుంటే కేసీఆర్ కు సంబంధం ఏంటని అసలు కేసీఆర్ కు విలువ ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అసలు సిగ్గు ఉందా అంటూ నిలదీశారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్, ఆ తర్వాత 2009లో చంద్రబాబు కాళ్లు పట్టుకుని తెలుగుదేశంతో పొత్తుకోసం వెంపర్లాడింది నిజం కాదా అని ప్రశ్నించారు.

nakka 30122018

ఉడత ఊపులకు చింతకాయలు రాలవన్నట్లు కేసీఆర్ వల్ల ఏపీలో ఏమీ జరగదన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే ఏపీలో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తన తాబేదార్ వైఎస్ జగన్ తో కలిసి పోటీ చేస్తాడో, బీజేపీతో కలిసి పోటీ చేస్తాడో దమ్ముంటే ఏపీలో పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మరోక రాష్ట్రముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ వాడుతున్న భాషను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. ముందు బాష నేర్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడుకు పదేపదే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ చెప్తున్నాడని ఆయన ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్, జగన్, బీజేపీ ముగ్గురు కలిసినా తెలుగుదేశం పార్టీ గెలుపును ఆపలేరని మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. "అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారో గుర్తుందిగా.. ‘తల్లి కడుపులో నుంచి ఎందుకు బయటకు వచ్చామా? అని బాధపడేలా చేస్తా’ అన్న ఆయన ఏమయ్యారో తెలుసుగా.." అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాక్షాత్తు నీ కుమారుడు కేటీఆర్ గారు.. ఈ రాష్ట్రానికి ఐటీ తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. నేడు ప్రత్యేక హోదాకు సపోర్టని మీరు చెబుతున్నారు. మీ సపోర్ట్ ఎక్కడ? మొన్న ఎన్నికల ప్రసంగంలో మీ అల్లుడు హరీష్ రావు ‘ప్రత్యేక హోదాకు వ్యతిరేకం’ అన్నారు. ఈ మాటలన్నీ మరచిపోయి ప్రధాని మోదీగారు ఏదైతే రాసిచ్చారో అదే ఈరోజు మాట్లాడారు. చాలా తప్పు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా నీలాంటి వ్యక్తి మాటలు విని సిగ్గు పడుతున్నారు.

buddha 30122018

పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులెవరూ ఏపీ గురించి మాట్లాడటం లేదు. తెలుగువాడివయ్యుండి.. సహకరించాల్సింది పోయి మోదీ చెప్పినట్టు మాట్లాడుతున్నావు. 2009లో నీకొచ్చిన సీట్లు చంద్రబాబు నాయుడిగారి దయాదాక్షిణ్యాలపై వచ్చినవి కావా? నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు నీ పార్టీని సర్వ నాశనం చేసి.. విలీనం చేసుకుందామనుకుంటే మీరు భయపడి.. చంద్రబాబు నాయుడిగారి కూటమిలో జాయిన్ అయ్యారు. కేటీఆర్‌గారు మొదట సిరిసిల్లలో మహాకూటమి కారణంగానే ఎమ్మెల్యే అయ్యారు. మీరా చంద్రబాబు నాయుడి గారి నాయకత్వం గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ కోసం పోరాడారు. రెండు రాష్ట్రాలకూ న్యాయం చేయమని చెప్పారు కానీ తెలంగాణ ఇవ్వొద్దని చెప్పలేదు. మోదీకి ఉన్న అక్కసంతా నేడు మీ మాటల్లో కక్కించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టుపెట్టారు. కేసీఆర్, వైసీపీ అధినేత జగన్.. మోదీ మోచేతి నీళ్లు తాగి ఈ రాష్ట్రం మీద విషం కక్కుతున్నారు.

buddha 30122018

1996-99 మధ్యలో జరిగిన టీడీపీ శిక్షణ తరగతుల్లో మీరేం చెప్పారో గుర్తు చేసుకోండి. శిక్షణ తరగతులు నడిపించిందీ.. చంద్రబాబు నాయుడుగారి గురించి గొప్పగా చెప్పింది మీరు కాదా? అలాంటి మీరు మోదీ గారు ఏదో రాసిస్తే వచ్చి దానిని చదివి వినిపిస్తారా? ఈ ఐదు రోజులు ఎక్కడెక్కడ తిరిగారు? ఏం చేశారు? అనేది చెప్పాల్సిన మీరు చంద్రబాబుగారిని విమర్శిస్తారా? అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారో గుర్తుందిగా.. ‘తల్లి కడుపులో నుంచి ఎందుకు బయటకు వచ్చామా? అని బాధపడేలా చేస్తా’ అని, ఆయన ఏమయ్యారో తెలుసుగా? చంద్రబాబుగారు.. రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆయన నిజాయతీ గల వ్యక్తి. ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇవ్వాళ ఎన్నికలు అయిపోయాయి.. ఒడ్డున కూర్చున్నాం కాబట్టి ఏమన్నా చెల్లుతుందనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇకనైనా మోదీ ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడటం మాని చేస్తే చేతనైన సాయం చేయండి.. లేదంటే నోరు మూసుకుని కూర్చోండి కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అవాకులు, చవాకులు పేలితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావని కేసీఆర్ గారికి తెలియజేస్తున్నా’’ అంటూ బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read