తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని, గురువారం ఉదయమే, ఏపి సిఐడి పోలీసులు అరెస్ట్ చేసారు. ఉదయం 3 గంటలకే, వందలాది మంది పోలీసులు అయ్యన్న ఇంటిని చుట్టు ముట్టి, అరెస్ట్ చేసారు. ముందుగా అయ్యన్న కుమారుడు రాజేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత అయ్యన్నకు నోటీసులు ఇచ్చి, వెంటనే అరెస్ట్ చేసారు. ఇంటిగోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు ఇచ్చారు అంటూ, అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టుకుని మరీ అరెస్ట్ చేసారు. దీని పై అయ్యన్న అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇంత హంగామా ఎందుకని, నేనే వచ్చి అరెస్ట్ అయ్యే వాడిని కదా అని, అయ్యన్న చెప్తున్నా వినకుండా, అయ్యన్నని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. అయితే ఇవన్నీ నాన్ బెయిలబుల్‌ సెక్షన్ల అని, ఏలూరు కోర్టులో అయ్యన్నని హాజరు పరుస్తాం అని పోలీసులు చెప్తున్నారు.

గత కొంత కాలంగా అమరావతి రైతుల చేస్తున్న పాదయత్రని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తున్న కొంత మంది వైసీపీ పెద్దలకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ రోజు అమరావతి రైతుల పాదయాత్రని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలి అంటూ, ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖు చేసింది. అలాగే అమరావతి రైతులు కోర్టు ఆదేశాలు పాటించటం లేదని కోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వం వేసిన ఈ పిటీషన్ ని హైకోర్టు కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. అలాగే సంఘీభావం తెలిపే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ, అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తెలపగా, దానికి కూడా స్పస్టమైన ఆదేశాలు ఇచ్చింది. సంఘీభావం ఏ రూపంలోనైనా తెలపవచ్చని, గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని చెప్పింది. పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని, వారికి పోలీసులు వెంటనే ఐడి కార్డులు ఇవ్వాలని తెలిపింది. అమరావతి రైతుల పాదయాత్రను గతంలో మానవేంద్రరాయ్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే కొనసాగించేలా ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి రైతులు పాదయాత్ర చేసుకునే తప్పుడు వేరే ఎవరు వీళ్ళకి అడ్డంకులు కలిగించకుండా పోలీసులు తగు జాగ్రత్తులు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ పర్యటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా ఉద్రిక్త వాతవరణం మధ్యే పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ ఉంది. జనవాణి కార్యక్రమాన్ని కూడా పవన్ రద్దు చేసుకున్నారు. మరో పక్క పోలీసులు కూడా పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి వెళ్లిపోతారని పోలీసులు భావించారు. పవన్ మాత్రం, ఏమి చెప్పకుండా ఇంకా విశాఖలోనే ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిని వదిలి పెట్టాలని పవన్ డిమాండ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగితే పరిస్థితి చేయి దాటి పోతుందని, పోలీసులు భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ ను బలవంతంగా తరలిస్తారని భావించారు. కొంత మంది అయితే అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం చేసారు. ఈ మొత్తం ఎపిసోడ్ నేపధ్యంలో, పవన్ కళ్యాణ్ ఇంకా నోవాటెల్ హోటల్‍లోనే ఉన్నారు. నోవాటెల్ హోటల్‍లో చుట్టూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. పవన్ స్ట్రాటజీ ఏంటో పోలీసులకు కూడా అంతుబట్టటం లేదు. నోవాటెల్ హోటల్‍ దగ్గర, భారీ స్థాయిలో పోలీసులను పెట్టారు. దాదాపుగా 00 మంది పోలీసులతో సిద్దంగా ఉన్నారు. ఏ క్షణం ఏమి జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.

 

అమరావతి పాదయత్ర 36వ రోజు కొనసాగుతుంది. అయితే రాజమండ్రి బ్రిడ్జి పై నుంచి, ఈ రోజు అమరావతి పాదయత్ర వెళ్ళాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ బ్రిడ్జిని మూసేయటంతో, ఈ రోజు గామన్ బ్రిడ్జి పై నుంచి అమరావతి పాదయాత్ర వెళ్లనుంది. ఈ రోజు దాదాపుగా 50 వేల మంది, పాదయాత్ర జరుగుతుందని, బ్రిడ్జి మొత్తం ప్రజలతో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ రోజు, అమరావతి పాదయాత్రకు సంఘీభావం తెలపటానికి, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు, వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్, గంటి హరీష్‍ రాజమండ్రి చేరుకున్నారు. అమరావతి పాదయాత్రలో పాల్గునటానికి వెళ్తూ ఉండగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. పాదయత్రకు వెళ్ళటానికి వీలు లేదని, పోలీసులు ఆంక్షలు పెట్టారు. కారుకి అడ్డంగా పోలీసులు నుంచున్నారు. కారును అనుమతించకపోవడంతో బీఆర్ నాయుడు ఆటోలో వెళ్ళారు. దీంతో పోలీసులు ఖంగుతిని, వారిని కార్ లో వెళ్లేందుకు అనుమతి ఇవ్వటంతో, బీఆర్ నాయుడు, వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్‍, గంటి హరీష్ పాదయాత్ర ప్రదేశానికి వెళ్లారు.

Advertisements

Latest Articles

Most Read