తొలి శ్వేతపత్రం-పూర్తి సారాంశం యథాతధంగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం మరియు సంబంధిత హామీల అమలుపై శ్వేత పత్రం.. పరిచయం.. 1. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని (2014 లో 6వ చట్టం) 2014 మార్చి, 1న నోటిఫై చేయడమయింది. 2014, జూన్ 2 న ఆవిర్భావ తేదీగా ప్రకటించి, ఆ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడమయింది. 2. ప్రభుత్వం 17-8-2014 తేదీన విడుదల చేసిన శ్వేత పత్రంలో “రాష్ట్ర పునర్ వ్యవస్థీరరణ ప్రభావాన్ని” 5 కోట్ల మంది ఆంధప్రదేశ్ ప్రజల సమక్షంలో ఉంచింది. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం పరస్పర విరుద్ధతలు, తప్పొప్పులు మరియు అసమగ్రతలు అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ యొక్క తీవ్ర ఆర్థిక, మౌలిక సదుపాయ, విద్యా మరియు ఉపాధికల్పనకు సంబంధించిన ప్రతికూలతను తెలియజేసింది. 4 ½ సంవత్సరాల చివరలో 20-2-2014 తేదీన రాజ్యసభలో గౌరవ ప్రధానమంత్రిగారు చేసిన హామీలు/ప్రకటనలతో పాటు 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చేసిన హామీల అమలు స్థితిని నమోదు చేయాలని ప్రస్తుత శ్వేత పత్రం ప్రయత్నిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం : 3. బిల్లు మసాయిదా తయారీలో కీలకమైన భాగస్వాములతో తగినంత విస్తృతమైన సంప్రదింపులు లేకపోవడం కీలకమైన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, పారదర్శకత లోపించడం మరియు పైపై ముసుగు, కఠినమైన విధానం బిల్లు ముసాయిదా తయారీ ప్రక్రియను ప్రతిబింబిచాయి. ప్రజలు వరుసగా ఆందోళనలు చేపట్టినప్పటికీ, వారి యొక్క స్పందనలు/ఆకాంక్షలకు తగినంత దయచూపలేదు. పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ మొత్తంలో పారదర్శక లేకపోవడం అప్పటి యుపిఎ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆవేశపూరితమైన గమనం ఆంధ్రప్రదేశ్ ప్రజలలో తీవ్రమైన భ్రమరాహిత్యానికి కారణమయింది. 4. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కేంద్రాన్ని మరియు సుమారు 7 దశాబ్ధాలు వరుస ప్రభుత్వాలు అభివృద్ధి చేసిన రాజధాని హైదరాబాద్¬ను కోల్పోయింది. పెద్దతరహా పారిశ్రామిక పునాది లేకుండా పోయింది. కేంద్ర సంస్థలు లేవు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపగ్రస్తులయ్యారు. వారి మనసులు గాయపడ్డాయి. రాజధాని లేకుండా నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తీవ్ర వనరుల కొరత ఉంది. న్యాయం మరియు నిష్పాక్షికత విషయంలో నమ్మకాన్ని కోల్పోయారు. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం : ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయం

5. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పరస్పర వైరుధ్యాలు, కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయానికి కారణమయ్యాయి అవి : • ఉమ్మడి రాష్ట్రంలో అంచనా వేసిన ఆదాయంలో 58 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి కేవలం 46 శాతం అందింది. దీనిని 14వ ఆర్ధిక సంఘం కూడా ధృవీకరించింది. • ఆస్తులను అవి ఉన్న ప్రాంతం ప్రాతిపదికన కేటాయించగా అప్పుల చెల్లింపు బాధ్యతలను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేశారు. • విద్యుత్తు రంగంలో, విద్యుత్తు వినియోగాన్ని పంపిణీ ప్రాతిపదికగా స్వీకరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టదాయకమయింది. • పన్నుల రాబడులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేయగా (58.32 : 41.68) నిలిపి వేసిన పన్ను వసూలును ప్రాంతం ప్రాతిపదికన కేటాయించడమయింది. దీని వలన దాదాపు రూ.3800 కోట్లు నష్టం వచ్చింది. • అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరం లేదు. • రూ. 33,478 కోట్లకు పైగా అవిభాజ్య రుణ చెల్లింపును ఆంధ్రప్రదేశ్ ఖాతా పుస్తకాలలో ఉంచారు. రుణం చెల్లింపు విభజన పెండింగులో ఉండటం వలన రాష్ట్రానికి భారమయింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. • సింగరేణి కాలరీస్ 9వ షెడ్యూలులో ఉన్నందున, స్థానిక ప్రాతిపదికపై తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలో 51 శాతం ఈక్విటీని కేటాయించింది. 6. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల అమలు స్థితి (ఎ) 2014, ఏపిఆర్ చట్టంలోని ప్రధాన నిబంధనలు : 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ప్రధాన నిబంధనలలో 14 విభాగాలు ఉన్నాయి. (i) పూర్తిగా అమలు పరచినవి - 0 (ii) పాక్షికంగా అమలు చేసినవి - 5 (7 జిల్లాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి, పోలవరం, విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పన్ను ప్రోత్సాహకాలు, రాజధానికి మద్ధతు). (iii) అమలు చేయనవి - 9 (గ్రేహేండ్స్ : ఏపిఎల్ఎ సీట్లు, ఆంధ్రప్రదేశ్ భవన ఆస్తుల విభజన, పన్ను బకాయిలు, రుణాలు, రీఫండ్ ల కేటాయింపు, షెడ్యూలు-IX ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన; 66 వ విభాగం క్రింద కేంద్ర ప్రభుత్వ నిర్దేశం ; షెడ్యూలు – 10 సంస్థల విభజన ; రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు) గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడం (విభాగం-9) • 4 పథకాలలో 6 నుండి 10 ర్యాంకులు (ఎస్.బి.ఎం గ్రామీణ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్భన్ పథకం, పశువుల జనాభా గణన మరియు ఏకీకృత నమూనా సర్వే మరియు ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ (పిఎంజెవికె) (ఎంఎస్డిపి) ) ముందున్న మార్గం

16. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు మరియు 20-02-2014 తేదీన అప్పటి గౌరవ ప్రధానమంత్రిగారు రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకుంటున్నది. • 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు మరియు గౌరవ ప్రధానమంత్రిగారు ఇచ్చిన హామీలు సాధించేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించడం. • ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయినట్టి పోలవరం సాగునీటి ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి అయ్యేటట్లు చూడటం. • హరిత రాజధాని నగరం – అమరావతి పూర్తి అయేటట్లు చూడడం. • కడప వద్ద ఏకీకృత స్టీలు ప్లాంట్ ను ఏర్పాటు చేయడం. • విశాఖపట్నం వద్ద రైల్వే జోన్ ను ఏర్పాటు చేయడం. • దేశంలోని ఇతర రాజకీయ పార్టీల క్రియాశీల మద్ధతు మరియు సహకారం ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు మరియు హామీలను సంపూర్ణంగా అమలుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం. 17. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే నిర్ణయ కర్తలని ప్రభుత్వం విశ్వసిస్తున్నది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్ని వాగ్ధానాలు మరియు 20-02-2014 తేదీన రాజ్యసభలో గౌరవ ప్రధాన మంత్రి చేసిన హామీలు ఒక నిర్ధిష్ట సమయంలో అమలయ్యేలా చూడటంలో సమాజంలోని అన్ని వర్గాలు అదే విధంగా అన్ని రాజకీయ పార్టీల నుండి నిర్మాణాత్మకమైన సూచనలను మరియు విలువైన సలహాను ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. ఈ సాధకాలు ప్రభుత్వ వ్యూహాలను మందుకు తీసుకొని వెళ్లడంలో దోహదపడగలవు. ఒక్క తలుపు ఏర్పాటుకు 60 రోజులు! ఒక్క తలుపు ఏర్పాటు చేయాలంటే దాదాపు 60 రోజుల సమయం పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. అలాగని మొత్తం 48 తలుపులు ఏర్పాటు చేయడానికి అన్ని రెట్ల సమయం పట్టబోదు. ప్రణాళికాబద్ధంగా ఒకేసారి కొన్ని తలుపులను ఏర్పాటు చేసుకుంటూ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం అన్నీ సిద్ధం.. పోలవరం ప్రాజెక్టులో 48 గేట్ల ఏర్పాటుకు అవసరమైన స్కిన్‌ ప్లేట్లు తయారయ్యాయి. 16 మీటర్లు ్ఞ 20.835 మీటర్లకు అవసరమైనట్లు స్కిన్‌ ప్లేట్లు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుందని చెబుతున్నారు. 48 గేట్లకు సంబంధించిన 576 గడ్డర్లు సిద్ధమయ్యాయి. 96 లూబ్రికెంట్‌ బుష్‌లు జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని సిద్ధంగా ఉంచారు. మొత్తం 96 ట్రునియన్లు అవసరమవుతాయి. ఇందులో 83 ట్రునియన్లను విజయవాడలో సిద్ధం చేయించారు. బ్రాకెట్ల ఫ్యాబ్రికేషన్‌ పని కూడా పూర్తి చేశారు. హైడ్రాలిక్‌ సిలిండర్లు జర్మనీ నుంచి ప్రాజెక్టు గేట్లు విద్యుత్తు సాయంతో హైడ్రాలిక్‌ పద్ధతిలో పని చేస్తాయి. ఇందుకోసం జర్మనీ నుంచి హైడ్రాలిక్‌ సిలిండర్లు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గేట్లు ఏర్పాటు చేసిన తర్వాత చివరి ప్రక్రియలో భాగంగా ఈ సిలిండర్లు అవసరం అవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ కల సాకారమయ్యే క్రమంలో మరో బృహత్తర ఘట్టానికి తెరలేవనుంది. స్పిల్‌ వే నిర్మాణంతో పాటే గేట్ల ఏర్పాటు యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం పోలవరం స్పిల్‌ వేకు గేట్లు బిగించే పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో గేటు ఏర్పాటు చేయడం అంత సులభమైన పనేమీ కాదు. ఒకట్రెండు రోజుల్లో పూర్తవదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 41వ గేటు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినా.. జనవరి నుంచి వేగం సంతరించుకోనుంది.

polavaram 23122018 2

2019 మే నెలాఖరుకల్లా పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణం తప్ప మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో రాబోయే ఆరు నెలలూ ఎంతో కీలకం. ఒకేసారి అన్ని పనులు ముందుకు సాగితేనే ఈ లక్ష్యం సాధించడం సులభం అవుతుంది. ఇటు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం ఒక ఎత్తు. అటు స్పిల్‌ వే నిర్మాణం, కాంక్రీట్‌ పని చేస్తూనే 48 గేట్లు ఏర్పాటు చేయడం మరో ఎత్తు. గోదావరిని మళ్లించే క్రమంలో పైలట్‌ ఛానల్‌ తవ్వకం, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్‌ పనులూ పూర్తి చేయాలి. అదే సమయంలో ఎడమ, కుడి కాలువలను ప్రధాన డ్యాంతో అనుసంధానించే సొరంగాలు, ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. గోదావరి వరద వచ్చే నాటికి జలాశయంలో నీటిని నిలబెట్టేందుకు, అదనపు వరదను మళ్లించేందుకు వీలుగా అన్ని పనులూ పూర్తి చేసే బృహత్తర యజ్ఞం పూర్తి కావాలి.

polavaram 23122018 3

తొలుత అమర్చేది 41వ గేటు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. సోమవారం తొలుత 41వ గేటు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నారు. స్పిల్‌ వే 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల ఎత్తు వరకు గేట్లు ఉంటాయి. రెండు పియర్ల (స్తంభాలు వంటివి) మధ్య ఒక గేటు ఉంటుంది. ఒక్కో గేటు 16 మీటర్ల్ఠు 20.835 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం పియర్స్‌ 36 మీటర్ల ఎత్తుకు సిద్ధం అయ్యాయి. 41వ గేటు వద్ద అడ్డంగా గడ్డర్లు ఏర్పాటు చేశారు. అక్కడ ట్రునియన్‌తో ఈ గడ్డర్లకు తలుపుల స్కిన్‌ ప్లేట్లు ఏర్పాటు చేసి వెల్డింగ్‌ చేస్తారు. వీటికి బుష్‌లు అమరుస్తారు. ఒక తలుపును రెండు భాగాలుగా అమర్చనున్నారు. తలుపులన్నింటినీ స్కిన్‌ ప్లేట్లుగా తయారు చేశారు. మొత్తం 8 ప్లేట్లు కలిపితే ఒక తలుపు అవుతుంది. ఒక్కో ప్లేటు 15 టన్నుల బరువు ఉంటుంది. క్రేన్ల సాయంతో వీటిని స్పిల్‌ వేపై అమర్చి వెల్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక్కో తలుపునకు 8 స్కిన్‌ ప్లేట్లు, 8 గడ్డర్లు వినియోగిస్తున్నారు. కింది భాగంలో నాలుగు ప్లేట్లు, పై భాగంలో నాలుగు ప్లేట్లు ఏర్పాటు చేసి వెల్డింగ్‌ చేసి ట్రునియన్‌కు అనుసంధానిస్తారు. 41వ తలుపు ఏర్పాటు ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని పోలవరం చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌, తలుపుల విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఈఈ సుధాకర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. Source:eenadu

నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ గ్రూప్‌-3 (పంచాయతీ కార్యదర్శి- గ్రేడ్‌-4) ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఆర్థికశాఖ అనుమతించిన 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులతోపాటు అదనంగా 51 (గతంలో భర్తీకాకుండా ఉన్న పోస్టులు) భర్తీ చేసేందుకు శుక్రవారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతోపాటు మహిళా శిశు సంక్షేమశాఖకు చెందిన ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1 ఉద్యోగ నియామకాల ప్రకటనా విడుదలైంది. కమిషన్‌ ఛైర్మన్‌ ఉదయ భాస్కర్‌ వివరాలను వెల్లడించారు.. మహిళా శిశు సంక్షేమశాఖలో ఎక్స్‌టెన్షన్‌: ఆఫీసర్‌-గ్రేడ్‌-1 పోస్టులు: 109, దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 28 నుంచి, దరఖాస్తుకు తుది గడువు: జనవరి 18, ప్రాథమిక పరీక్ష తేదీ: తరువాత ప్రకటిస్తారు, ప్రధాన పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 25

jobs 22122018

ఈ నోటిఫికేషన్లు సిద్ధం... అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనరు (దేవాదాయ), ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ పోస్టుల భర్తీ ప్రకటనలూ సిద్ధంగా ఉన్నాయి. పూర్వ పద్ధతిలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 భర్తీ: గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఉత్కంఠ వీడింది. 2012లో నిర్ణయించిన ప్రకారం గ్రూప్‌-2 కింద గుర్తించిన ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1 పోస్టుల్లో 1బి కింద భర్తీ చేయాల్సి ఉంది. దీనిని అభ్యర్థులు వ్యతిరేకించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి పూర్వ పద్ధతిలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలను (2016) విడివిడిగా భర్తీ చేశారు. ఈ నిర్ణయాన్ని 2016 నోటిఫికేషన్లకే వర్తించేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు.

jobs 22122018

ఈ క్రమంలో కొత్తగా భర్తీ చేయనున్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ నిర్ణయాన్ని కమిషన్‌ కోరింది. పరిశీలన జరిపిన ప్రభుత్వం పూర్వ పద్ధతిలోనే విడివిడిగా భర్తీ చేయాలని శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని కమిషన్‌ సభ్యుడు రంగ జనార్దన వెల్లడించారు. వచ్చేవారం గ్రూప్‌-1, 2, ఇతర ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా గ్రూప్‌-3 పోస్టులు: * శ్రీకాకుళం: 114, * విజయనగరం: 120, * విశాఖపట్నం: 107, * తూర్పుగోదావరి: 104, * పశ్చిమగోదావరి: 25, * కృష్ణా: 22, * గుంటూరు: 50, * ప్రకాశం: 172, * నెల్లూరు: 63, * చిత్తూరు: 141, * అనంతపురం: 41, * కర్నూలు: 90, * కడప: 2 (క్యారీ ఫార్వర్డ్‌)

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. జనవరి 6న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రొటోకాల్‌ ప్రకారం స్వాగతం పలికేందుకు తాను వెళ్లాలా? వద్దా? అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ముఖ్య నాయకులు, కొందరు మంత్రులతో చర్చించారు. విభజన చట్టంలోని అంశాలు, హామీలు నెరవేర్చకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి ప్రధాని ద్రోహం చేశారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు స్వాగతం పలకాల్సిన అవసరం ఉందా? అనేదానిపై పార్టీ నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఒకరిద్దరు నాయకులు మాట్లాడుతూ.. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటించినా స్వాగతం పలకడానికి వెళ్లలేదని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సైతం ఇలాగే చేశారని వివరించారు. దీనిపై మరికొంత చర్చించిన అనంతరం నాలుగైదు రోజుల్లో తుది నిర్ణయానికి రానున్నారు.

cbn 23122018 2

మరో పక్క, మోడీ పర్యటన పై ఇప్పటికే రాజకీయ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. బీజేపీ వాళ్లకి, ముఖ్యంగా మోడీ, అమిత్ షా లకి, ఏమి చెయ్యకపోయినా, అన్ని లక్షల కోట్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్పటం అలవాటు. అందుకే ఈ ప్రచారం తిప్పికొట్టటానికి, ఏపీకి బీజేపీ చేసిన అన్యాయమేమిటో .. కేంద్రం సాయం లేకపోయినా సాధించిన ప్రగతి ఏమిటో శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసేందుకు, చంద్రబాబు కౌంటర్ ప్లాన్ చేసారు. అటు మోడీకే కాదు, ఇటు జగన్, పవన్ ల పిచ్చి ఆరోపణలకు కూడా చెక్ పెట్టే ప్లాన్ వేసారు. శ్వేతపత్రాలతో ప్రతిపక్షాలపై చంద్రబాబు అస్త్రాలను ఎక్కు పెడుతున్నారు. 014లో అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రం ఉన్న పరిస్థితి పై ఆనాడు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, తీసుకువచ్చిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు.

cbn 231220183

ఎన్నికలకు నాలుగు నెలలు సమయం ఉండగానే.. ఎపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య సమరం ప్రారంభమైంది. జనవరి ఆరో తేదీన ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు సభలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన సంస్థలు, నిధుల పై ఆయన ప్రజలకు వివరించడంతో పాటు, బీజేపీ ఎపీ అభివృద్దికి కట్టుబడి ఉందని చెప్పబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 జూన్ లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశంలోనే ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించబోతున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రాంతంలో సభ పెట్టి తెలుగుదేశం పై విరుచుకుపడ్డారు. పాదయాత్రలో జగన్ కూడా ప్రభుత్వం పై అదేపనిగా అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో వీటిని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం ఎన్నికలకు ముందు పెద్ద కసరత్తే ప్రారంభించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పారిశ్రామిక పురోగతి, వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య పరిశ్రమలో సాధించిన అభివృద్ది, రాజధాని, పోలవరం నిర్మాణం, రాయలసీమకు సాగు, తాగు నీరు, రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, రాయలసీమలో పరిశ్రమలు, విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు వంటి పలు అంశాల పై రాష్ట్ర ప్రభుత్వం తాజా గణాంకాలతో శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది.

Advertisements

Latest Articles

Most Read