ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శుక్రవారం మరో ఐదు నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకు నెలాఖరులోగా మిగిలిన ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో జరిగిన కమిషన్‌ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న 109 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-1) పోస్టులు, ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 60 ఈవో (గ్రేడ్‌-3) పోస్టులు, సమాచార, పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న 15 అసిస్టెంట్‌ పీఆర్‌వో పోస్టులు. సీసీఎల్‌ఏ విభాగంలో ఖాళీగా ఉన్న 29 డిప్యూటీ సర్వేయర్‌(క్యారీ ఫార్వర్డ్‌) పోస్టులతో పాటు అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు శుక్రవారం విడుదల చేయాలని కమిషన్‌ నిర్ణయం తీసుకుంది.

appsc 211122018 2

అలాగే ఈ నెల 26వ తేదీన 1067 గ్రూప్‌-3(పంచాయతీ సెక్రెటరీ) పోస్టులకు, 200 జూనియర్‌ లెక్చరర్లు, 308 డిగ్రీ లెక్చరర్లు, 406 పాలిటెక్నిక్‌ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయాలని కూడా నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక గ్రూప్‌-1, గ్రూప్‌-2 సర్వీసుల నోటిఫికేషన్ల విషయంలో మాత్రమే అనిశ్చితి నెలకొంది. గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1లో ‘1బి’ కిందకు తీసుకురావాలని గతంలో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కొత్త నోటిఫికేషన్లకు అమలు చేయాలా? వద్దా? అన్న విషయంలో ఈ సందిగ్ధత ఏర్పడింది.

appsc 211122018 3

నిరుద్యోగుల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో గత నోటిఫికేషన్లకు సదరు ఉత్తర్వులు అమలు చేయకుండా నిలుపుదల చేశారు. అయితే అప్పట్లో ‘ఈ ఒక్కసారికే మినహాయింపు’ అనేలా సంకేతం ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేయాలనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ఈ విషయమై ఏపీపీఎస్సీ తాజాగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా ఇంతవరకు ఎలాంటి సమాచారమూ రాలేదు. గతంలో భర్తీ కాకుండా మిగిలిన (క్యారీ ఫార్వర్డ్‌) పోస్టులను కొత్త నోటిఫికేషన్లలో కలపాలని కూడా కమిషన్‌ సమావేశంలో నిర్ణయించారు. ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించిన తర్వాత ఏపీపీఎస్సీ ఇప్పటి వరకూ ఏఈఈ, ఎఫ్‌ఆర్‌వో, ఏఎంవీఐ, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రకటనలు జారీ చేసింది.

నాలుగేళ్ల ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటుందో, చంద్రబాబు కూడా అన్నీ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆ ఇబ్బందులు ప్రజల నుంచి కాదు, రాష్ట్రం పై పగబట్టిన రాబందుల నుంచి. అన్ని వైపుల నుంచి, రాష్ట్రాన్ని కబళించటానికి ప్రయత్నాలు చేస్తుంటే, చంద్రబాబు వీరి బారిన రాష్ట్రం పడకుండా కాపాడుతూ వస్తున్నారు. విభజన జరిగి, అప్పులతో, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని, అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి సమానంగా చేస్తూ, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చంద్రబాబు ముందుకు తీసుకు వెళ్తుంటే, వెనక్కు లాగే వారు అనేక మంది. పెద్దన్నగా ఆదుకోవాల్సిన కేంద్రం, నమ్మించి మోసం చేసింది. నిర్మాణాత్మకంగా పని చెయ్యాల్సిన ప్రతిపక్షాలు, అసెంబ్లీ కూడా రావటం లేదు.

flex 21122018 2

పైగా సమాజంలో కుల గొడవలు రేపుతూ, ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డం పడుతున్నారు. అటు జగన్, ఇటు పవన్, సమాజాన్ని కులంతో విడదీస్తూ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపాల్సింది పోయి, పక్క రాష్ట్రాల వారితో, ఏపి ద్రోహులతో కలిసి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క హైదరాబాద్ లో తిష్ట వేసిన మీడియా. మీడియా అంటే చంద్రబాబుకు అనుకూలం అనే పేరే కాని, వాళ్ళు కూడా తెలంగాణా భజనలోనే మునిగి తేలుతూ, ఏపి పై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలా అన్ని విధాలుగా, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటే, చంద్రబాబు మాత్రం ముందుకే వెళ్తున్నారు. దీనికి ప్రాధాన కారణం, జన బలం. ప్రజలు చంద్రబాబు వెంట ఉంటూ ఆయనకు ఇస్తున్న బలం.

flex 21122018 3

దీనికి బలం చేకూరుస్తూ, విజయవాడలో ఫ్లెక్సీలు వెలిసాయి. ‘కేంద్రం నీపై కక్ష గట్టింది. పక్కరాష్ట్ర నాయకులతోపాటు స్వరాష్ట్ర ప్రతిపక్ష నాయకులూ ఒక్కటయ్యారు. అవినీతిపరులకు, నేరగాళ్లకు నువ్వంటే పడదు. సినీ పరిశ్రమ తమ స్వార్ధం చూసుకుంటుంది. మీడియా కూడా విషయాలు చెప్పదు. ఇప్పుడు నువ్వు ఒంటరివి, కానీ నేను మాత్రం నీవైపే ఉన్నాను. నా పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలి. నేను గర్వంగా తలెత్తుకు తిరగాలి. నా రాష్ట్రానికి నువ్వు కావాలి’ అంటూ విజయవాడ ఇందిరాగాంధీ కాంప్లెక్స్‌ సమీపంలో ఏర్పాటైన ఫ్లెక్సీ నగర వాసులను ఆకర్షిస్తోంది. భావిశెట్టి భాను అనే వ్యక్తి ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీ అందరినీ ఆలోచింపజేసేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటులో లీడర్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో నిలబడగా, తెలంగాణ చివరి స్థానంలో నిలిచింది. ఈమేరకు గురువారం ఢిల్లిలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ పాలసీ మరియు ప్రమోషన్‌ (డిఐపీపీ) దేశవ్యాప్త ర్యాంకులను ప్రకటించింది. గత ఏడాది రూపొందించిన స్టార్టప్‌ పాలసీ ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. బెస్ట్‌ పెర్ఫార్మర్‌ విభాగంలో మొదటి స్థానాన్ని గుజరాత్‌ దక్కించుకుంది. టాప్‌ పెర్ఫార్మర్స్‌గా వరుసగా కర్నాటక, రాజస్థాన్‌, ఒడిశా, కేరళ రాష్ట్రాలు నిలిచాయి. వివిధ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధికోసం స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్న తీరు, తీసుకుంటున్న చర్యల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చినట్లు డీఐపీపీ ప్రకటించింది. ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విధంగా ఆరు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చినట్లు పేర్కొంది.

ap top 21122018 2

మొత్తం ఆరు కేటగిరీల్లో ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చారు. వీటిలో బిగినర్స్‌, ఎమర్జింగ్‌ స్టేట్స్‌, వర్సిటీ లీడర్స్‌, లీడర్స్‌, టాప్‌ పెర్ఫార్మెన్స్‌, బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ కేటగిరీలున్నాయి. బుధవారం విడుదల చేసిన జాబితాలో బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్‌ జాబితాలో నూరు శాతం మార్కులు సాధించి గుజరాత్‌ చోటు దక్కించుకుంది. టాప్‌ ఫెర్ఫార్మెన్స్‌ విభాగంలో 85 శాతానికిపైబడి, నూరు శాతానికి లోబడి మార్కులు తెచ్చుకుని కర్నాటక, కేరళ, ఒడిశా, రాజస్థాన్‌లు చోటుదక్కించుకున్నాయి. అలాగే 75 శాతానికి పైబడి, 85 శాతానికి లోబడి మార్కులు తెచ్చుకుని లీడర్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి వరుసలో నిబడగా బీహార్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు వరుసగా ఆతర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. 50 శాతానికిపైబడి, 75 శాతానికి లోబడి మార్కులు సాధించి యాస్పరెంట్‌ లీడర్స్‌ విభాగంలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ చోటు దక్కించుకున్నాయి.

ap top 21122018 3

ఇక 25 శాతానికిపైబడి 50 శాతానికిలోబడి మార్కులు సాధించి ఎమర్జింగ్‌ స్టేట్స్‌ విభాగంలో అస్సాం, ఢిల్లిd, గోవా, జమ్ము, కాశ్మీర్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు నిలచాయి. ఇక చివరిగా 25 శాతానికి లోబడి మార్కులు సాధించి బిగినర్స్‌ విభాగంలో చత్తీస్‌గఢ్‌, మణిపూర్‌, మిజోరామ్‌, నాగాలాండ్‌, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు నిలచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో డీఐపీపీ ఏడు విభాగాల్లో 38 అంశాల్లో వివిధ రాష్ట్రాలు పారిశ్రామిక అభివృద్ధికోసం తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసింది. 2016, జనవరి 16న స్టార్టప్‌ ఇండియా ఇనిషియేటివ్‌ కార్యక్రమం కింద 19 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా 801 సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయితే, ప్రారంభంలో దేశంలోని 18 రాష్ట్రాలు మాత్రమే స్టార్టప్‌ కంపెనీల ప్రారంభ కార్యాచరణను పాటించాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 27కు చేరింది. వీటితోపాటు మరో మూడు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా చేరాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో 14,600 స్టార్టప్స్‌ ప్రారంభమయ్యాయని డీఐపీపీ తెలిపింది. రాష్ట్రాలకు ర్యాంకింగ్‌లు ఇవ్వడంలో చొరవ తీసుకోవడానికి సంబంధించిన ఏడు అంశాలను, 38 కార్యాచరణకి సంబంధించిన అంశాలను తీసుకున్నామని అందులో విధానపరమైన మద్దతు, ఇంక్యుబేషన్‌ సెంటర్లు, సీడింగ్‌ ఫండింగ్‌, వెంచర్‌ ఫండింగ్‌, నిబంధనలను సరళృకృతం చేయడం ఉన్నాయన్నారు.

మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో ఎంత మంది ఓట్లు లేపెసారో చూసాం. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ లో, రాజకీయ పార్టీలకు, ఈ ఓట్లు లేపెయ్యటం కూడా ఒక భాగం అయ్యింది. ఎప్పటికప్పుడు మన ఓటు ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే పోలింగ్ జరిగే రోజు, అక్కడకు వెళ్లి మీ ఓటు లేదని అవాక్కవ్వల్సిందే. ఓటరు జాబితాలో మీ పేరున్నదీ లేనిదీ ఇప్పుడే పరిశీలించుకోవచ్చు. ఇందుకు నాలుగు మార్గాలున్నాయి. ఆ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. చివరి నిమిషంలో నిరాశ చెందకుండా.. మీ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ముందుగా పేరు ఉందో లేదో చూసుకోండి, పేరు లేకపోతే ఫారం-6లో దరఖాస్తు చేసుకుని ఇప్పటికైనా ఓటరుగా చేరొచ్చని స్పష్టం చేస్తోంది.

vote 2122018 2

ఫారం-6లో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని వాటిని బూత్‌ స్థాయి అధికారులకు అందివ్వాలి. అలాగే సీఈవోఆంధ్ర, ఎన్‌వీఎస్‌పీ వెబ్‌సైట్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ విడుదలై, నామినేషన్ల స్వీకరణ గడువు చివరి రోజు వరకూ కొత్తగా ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం ఎన్నికల సంఘం వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. విజయవాడలోని భారతీనగర్‌లో రాష్ట్ర స్థాయి కాల్‌సెంటర్‌ను ప్రధాన ఎన్నికల అధికారి ఆర్‌.పి.సిసోడియా గురువారం ప్రారంభించారు. దీనికి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎప్పుడైనా ఫోన్‌ చేసి జాబితాలో మీ పేరు ఉందా? లేదా? అనేది అడిగి తెలుసుకోవొచ్చు. రాష్ట్ర, జిల్లా స్థాయి కాల్‌ సెంటర్ల నంబర్లను ప్రధాన ఎన్నికల అధికారి ఆర్‌.పి.సిసోడియా వెల్లడించారు.

vote 2122018 3

ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనేది తెలుసుకోవడం ప్రతి ఓటరు ప్రాథమిక బాధ్యత. సంక్షిప్త సందేశాలు పంపించడం ద్వారా, వెబ్‌సైట్‌ల్లో చూసుకోవడం, రాష్ట్ర, జిల్లా స్థాయి కాల్‌సెంటర్‌లకు ఫోన్‌ చేయడం ద్వారా జాబితాలో పేరుందా? లేదా అనేది తెలుసుకోవొచ్చు. పోలింగ్‌ కేంద్రాల్లో నుంచి కూడా జాబితాలు చూసుకుని తనిఖీ చేసుకోవచ్చు. పేరు లేకపోతే తక్షణమే ఫారం-6లో దరఖాస్తు చేసుకోండి. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకూ ఈ అవకాశం ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇంకా సందేహాలు ఉంటే ఈ 94911 11091 నెంబరుకు ఫోన్‌ కాల్స్‌ ద్వారా కూడా సంక్షిప్త సందేశం లేదా వాట్సాప్‌ సందేశం పంపించి నివృత్తి చేసుకోవచ్చు. వాటికి నేనే నేరుగా స్పందిస్తా. త్వరలోనే ప్రత్యేక యాప్‌ను కూడా ప్రారంభం కానుంది. మెసేజ్ ద్వారా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలి అంటే, AP Space VOTE Space VOTER ID NUMBER ని 9223166166 లేదా 51959 నెంబర్ కు sms చెయ్యండి. రెండో విధానం, www.ceoandhra.nic.in, www.nvsp.in వెబ్సైటు లో చెక్ చేసుకోవటం, మూడో విధానం, కాల్ సెంటర్ కు ఫోన్ చెయ్యటం 94911 11091 , నాలుగో విధానం, నేరగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి చూడటం. ప్రతి శనివారం, మీ పోలింగ్ కేంద్రంలో ఈ జాబితా ఉంటుంది. ఇలా నాలుగు విధాలుగా, మీ ఓటు ఉందో లేదో తెలుసుకుని, అప్రమత్తంగా ఉండవచ్చు.

Advertisements

Latest Articles

Most Read