విశాఖను మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటయిన మెడ్‌టెక్ జోన్‌ను రేను రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్క్‌కు సాగర తీరం కేంద్రం కావడం విశేషం. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. మెడికల్ డిస్పోజబుల్స్‌, వైద్య రంగంలో వినియోగించే యంత్ర పరికరాలు, సర్జికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఇంప్లాంట్స్‌, వ్యాధి నిర్ధారణతో పాటు ఆస్పత్రులలో వినియోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇలా అన్నీ ఒకేచోట ఉండటం ఈ పార్కు ప్రత్యేకత. అయితే ఇక్కడే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించింది.120 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇదే సమావేశానికి, అతిధిగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ వచ్చారు. ఆ సమావేశంలో పాల్గున్న తరువాత, అక్కడ ఏర్పాటైన కంపెనీలు గురించి ట్వీట్ చేసారు.

sehwag 19122018 2

ఇది సెహ్వాగ్ ట్వీట్ "AMTZ-Pioneer Medical Equipment industrial park of the world dedicated @ Vizag on 13th Dec... 14 lakh Sq.ft built in 342 days @ 340 sq.ft/hour.. AMTZ-hosts WHO global forum on Med devices 1st time in India with participation of 100 countries-it’s a giant step for Indian MedTech sector"... సూది నుంచి సీటీ స్కాన్‌ వరకు... వైద్యరంగానికి చెందిన అన్ని రకాల ఉపకరణాల తయారీకి ప్రత్యేకించిన ‘మెడ్‌టెక్‌ జోన్‌’, మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలో ఏర్పాటైతే, మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా, అక్కడికి అతిధిగా వచ్చి, మన రాష్ట్రం కాకపోయినా, అక్కడ ఏర్పాటైన కంపనీలు గురించి, అందరికీ తెలిసేలా ట్వీట్ చేసిన సెహ్వాగ్ కు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి.

sehwag 19122018 3

విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మెడ్‌టెక్‌ జోన్‌లో ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభం అయ్యాయి. ఈ జోన్‌లో మొత్తం 250 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అవన్నీ ఏర్పాటైతే మొత్తం 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అంచనా. భారత్‌ ఏటా రూ.30 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని... ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే లక్ష్యంతో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేసారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, విశాఖలో ఫర్మా సిటీ పెట్టి, అనేక కంపనీలను తీసుకొచ్చారు. ఇప్పుడు మెడ్ టెక్ జోన్ తో, అనేక వైద్య పరికరాల తయారీ కంపెనీలు రానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతా, ఏపిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబుని ఇబ్బంది పెడతా, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ ఏపి నాశనం కోరుకుంటున్న కేసీఆర్, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో మోడీ, అమిత్ షా ఆదేశాల ప్రకారం, స్కెచ్ గీసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో నివాసం ఉంటూ, ఏపిలో పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్న పవన్, వీకెండ్ లో హైదరాబాద్ వీల్లి హాజరు వేయించుకునే జగన్, ఇద్దరూ ఏపిలో ప్రతిపక్షంగా ఉన్నారు. ఫ్యామిలీని వదిలేసి, 68 ఏళ్ళ వయసులో, రాష్ట్రాన్ని నెంబర్ వన్ చెయ్యాలని, పోలవరం పూర్తవ్వాలని, అమరావతి నెంబర్ వన్ సిటీ అవ్వాలని, పేదల కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ, హైదరాబాద్ స్కెచ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే, జగన్, పవన్ ని కలిపి, చంద్రబాబు డీ కొట్టాలనే అమిత్ షా స్కెచ్ విఫలమైన సందర్భంలో, కేసీఆర్ రంగంలోకి దిగినట్టు సమాచారం.

kcr 19122018

మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకు, జగన్, పవన్ లని కలిపి, చంద్రబాబుని ఓడించే డ్యూటీ కేసీఆర్ తీసుకున్నారని తెలుస్తుంది. జగన్, పవన్ ఇద్దరికీ కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. కేసీఆర్ ఏపి ప్రజలను కుక్కలు, రాక్షసులు అన్నా సరే, కేసీఆర్ ని చూస్తూ మాత్రం, వీరిద్దరికీ ఎంతో అభిమానం. అందుకే, జగన, పవన్ లను కలిపే డ్యూటీ కేసీఆర్ కు అప్పగించినట్టు తెలుస్తుంది. మోడీ, షా వ్యూహంలో భాగంగా, కేసీఆర్ రంగంలోకి దిగి, ఏపిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జగన్, పవన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న స్ఫర్థలను తొలగించి ఒకే వర్గంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వైకాపా లేదంటే జనసేన పార్టీకి వెళ్లి టీడీపీకి నష్టం చేకూరుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తుంది.

kcr 19122018

వీరిద్దరికి తోడు వామపక్ష పార్టీలను కూడా కలిపి ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ఏర్పాటు చేస్తే చంద్రబాబు ఓటమి ఖాయమని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తన కంట్రోల్ లో ఉంచుకోవచ్చని, అక్కడ మోడీ, షా దగ్గర మంచి మార్కులు కొట్టేయోచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా డైరెక్ట్ గా కేసీఆర్ ఏపి రాజకీయాల్లోకి రావాలని భావించారు. అయితే, కేసీఆర్ నేరుగా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినా ఆ పార్టీ పై ప్రజలు వ్యతిరేకత చూపి ఓటు వేయాలనుకున్న వారు కూడా వేయకపోవచ్చని ఢిల్లీ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో కేసీఆర్ ప్రచారాన్ని వైకాపా, జనసేన అంగీకరించవని వారంటున్నారు. అందుకే కేసీఆర్ ని, జగన్, పవన్ మధ్య స్నేహం కుదిర్చి టీడీపీని ఇరుకునపెట్టే వ్యూహం రచించారు. మోడీ, అమిత్ షా, కేసీఆర్, జగన, పవన్, వీరందరి వ్యూహాలు బాగానే ఉన్నాయి కాని, ఏపి ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారో, ఎవరు ఉంటే వారు సేఫ్ గా ఉంటారో, ఎవరు ఉంటే అమరావతి పూర్తి అవుతుందో, ఎవరు ఉంటే పోలవరం పూర్తి అవుతుందో, తుఫానులు వస్తే వాటిని నుంచి కోలుకునేలా ఎవరు భరోసా ఇస్తారో, ఇవన్నీ ఏపి ప్రజలు బేరీజు వేసుకుంటారని, ఢిల్లీ పెద్దలకు, హైదరాబాద్ బ్యాచ్ కి తెలియాలి. చంద్రబాబుని ఓడించాలాన్నా, గెలిపించాలాన్నా, చెయ్యల్సింది ఏపి ప్రజలు... ఢిల్లీ వ్యూహాలు కాదు...

రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అధునాతన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు నూతన విధానానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వైద్యం అందించే సమయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు, ఆసుపత్రిలో రోగుల రద్దీని తగ్గించేందుకు పేషంట్ యాక్సిస్ కార్డు విధానానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరి నుంచి ఈ విధానాన్ని రాష్టవ్య్రాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఇన్ పేషంట్ రోగులకు ఈ కార్డుల ద్వారా సేవలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ggh 18122018 2

ముఖ్యంగా ఆసుపత్రిలో రోగుల సహాయకుల సంఖ్య తగ్గించడం, పారిశుద్ధ్యాన్ని పెంచడం, వైద్యసేవల్లో అందే జాప్యాన్ని నివారించడం, ఆసుపత్రిలో పిల్లల అపహరణను నిరోధించేందుకు ఈ కార్డు విధానానికి శ్రీకారం చుట్టారు. జనవరి నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ కార్యక్రమానికి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ విధానంలో భాగంగా రోగి ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి అందించే వైద్యసేవలు, వినియోగించే మందులు, వైద్యులు, వార్డు, రోగి వెంట సహాయకులుగా వచ్చిన వారి వివరాలను కార్డులో పొందుపరుస్తారు. రోగికి అందాల్సిన, అందుతున్న వైద్యసేవల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్‌లో నమోదవుతుంది.

ggh 18122018 3

ప్రతి ఆసుపత్రిలో విభాగాల వారీగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఎలక్ట్రికల్ గేట్ సిస్టమ్‌ను ముందుగా ఆయా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. రోగికి అందించిన యాక్సిస్ కార్డును స్కాన్ చేయగానే గేటు తెరుచుకుంటుంది. అనంతరం ఆ వార్డులోని వైద్యులు, సిబ్బంది రోగిని పరీక్షించి అవసరమైన సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుంటూరు వైద్యశాలలో అవసరమైన 10 ప్రదేశాలలో యాక్సిస్ గేట్లు అమర్చేందుకు ప్రణాళికను రూపొందించారు. దీనిపై ఇప్పటికే జిల్లా పరిపాలనాధికారి కోన శశిధర్, జీజీహెచ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఐపీఎల్-12 సీజన్ కోసం ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా ఈరోజు ప్రారంభమైన ఈ వేలం పాట ప్రక్రియ కొనసాగుతోంది. 2019 సీజన్ కు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు తుది వడపోత అనంతరం మిగిలిన 351 మంది నుంచి 70 మందిని లీగ్ లోని 8 జట్లు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన వేలంలో పేసర్ ఉనాద్కట్ ను రూ.8.4 కోట్లతో రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. యువీ కనీస ధర రూ. 1 కోటి ఉండగా అతనిపై ఎవరూ ఆసక్తి చూపలేదు.

ipl 18122018 2

ఇక ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి కనీస ధర రూ.50 లక్షలు ఉండగా రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేయడంతో జాక్ పాట్ కొట్టాడు. హనుమ విహారి స్వస్థలం. .ఏపీలోని కాకినాడ. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టు నుంచి కెరీర్ ప్రారంభించిన విహారి..ప్రస్తుతం ఆంధ్రా జట్టుకు ఆడుతున్నాడు. 2010 నుంచి 2016 వరకు హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016-17 సీజన్‌లో ఆంధ్రా జట్టుకు మారిన తర్వాత విహారి కెరీర్‌ ఊపందుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బ్యాట్‌తో సత్తాచాటిన విహారి 5142 పరుగులు చేశాడు. 15 సెంచరీలతో పాటు 22 అర్ధ సెంచరీలు సాధించాడు. 302 అత్యధిక స్కోరు. 2017-18 సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో టాప్‌-5లో నిలిచాడు.

ipl 18122018 3

ఆంధ్ర క్రికెట్‌ నుంచి భారత టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారిలో ప్రస్తుత జాతీయ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చివరి ఆటగాడు. 1999లో న్యూజిలాండ్‌పై వికెట్‌ కీపర్‌గా అతడు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయిలో అంచనాలు పెంచిన ఆటగాడు ఇప్పటిదాకా లేడు. కానీ 19 ఏళ్ల ఎదురుచూపుల అనంతరం 24 ఏళ్ల హనుమ విహారి ఇప్పుడు భారత టెస్టు జట్టులోకి రావటం, ఇప్పుడు ఏకంగా ఎక్కువ పోటీ ఉండే, ఐపీఎల్ లాంటి చోట, హాట్ ఫేవరేట్ గా ఉన్నాడు. భారత క్రికెట్ జట్టులో రానిస్తున్నట్టే, ఐపీఎల్ లో కూడా, మంచి పేరు తెచ్చి, మన రాష్ట్రం పేరు నిలబెట్టాలని కోరుకుందాం..

Advertisements

Latest Articles

Most Read