సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. నిన్న ఆహా ఈవెంట్ కి బాలయ్య విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం బాలయ్య, దుర్గమ్మని దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం, వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని, మీడియా పాయింట్ వద్ద బాలయ్య మాట్లాడటానికి వచ్చారు. ఈ సందర్భంగా అయన ఇబ్బంది పడ్డారు. మీడియా పాయింట్ ప్రభుత్వ శాఖ అయిన, సమాచారశాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రజాప్రతినిధులు, హీరోలు, ఇతర విఐపిలు దర్శనం అనంతరం వచ్చి, మీడియాతో మాట్లాడుతూ ఉండే వారు. అయితే బాలయ్య వస్తున్నారని తెలిసినా, మీడియా పాయింట్ దగ్గర సమాచారశాఖ నిర్ల్యక్షం ప్రదర్శించింది. ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా, అక్కడ మైక్ పెట్టలేదు. మీడియా పాయింట్ వద్ద మైక్ లేకపోవటంతో, బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేసారు. అక్కడ భక్తులు అరుపులు, కేకల మధ్యే బాలయ్య మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీసులు అందరి పై ఉండాలని అమ్మ వారిని కోరుకున్నా అని చెప్పిన బాలయ్య, రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
news
తెలుగుదేశం పార్టీ బిజెపితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటే కారణాలేంటి...?
తెలుగుదేశం పార్టీ బిజెపితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటే కారణాలేంటి...??
ఓట్ల కోసమా ? కాదు బిజెపికి ఈ రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంక్ లెస్ దేన్ 1%
పోనీ సీట్ల కోసమా ? కానే కాదు బిజెపికి ఓట్లే లేనప్పుడు సీట్లు రావు
పోనీ చంద్రబాబు గారి మీద ఉన్న కేసుల మాఫీ కోసమా...?? ఆయన మీద కేసులే లేవు
పోనీ చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరన్నా హత్య కేసుల్లో ఇరుక్కున్నారా...?? వారిని బయట వేయడం కోసం పొత్తుకు వెళ్తున్నాడా అంటే అది లేదు
పోనీ ఆయనకి వ్యక్తిగతంగా ఏమన్నా పదవుల కోసం వెళ్తున్నాడా...?? గతంలో దేశ స్థాయిలో వచ్చిన ఎన్నో అవకాశాలను రాష్ట్రం కోసం వదులుకున్నాడు, కాబట్టి ఆయనకు ఆ అవసరం కూడా లేదు
పోనీ ఆయన కులం కోసం బిజెపితో పొత్తుకు వెళుతున్నాడా...?? కానే కాదు. చిన్నప్పటి నుండి చూస్తున్నాము కమ్మ సామాజిక వర్గం వలన తెలుగుదేశం పార్టీకి లాభం కానీ, తెలుగుదేశం పార్టీ వలన కమ్మ సామాజిక వర్గం లాభం ఏమీ లేదు
మరి ఓట్ల కోసం కాదు, సీట్ల కోసం కాదు, కేసుల రక్షణ కోసం కాదు, కుటుంబ సభ్యుల కోసం కాదు మరి దేని కోసం...??
ఇక్కడ పోలవరాన్ని ATM అన్నారు అదే నిజమైతే ఇప్పటివరకు బిజెపి వారు మౌనంగా ఉండేవారా...??
ఇదే పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రం పార్లమెంట్ లో చెప్పింది, సుప్రీంకోర్టులో ఆఫిడవిట్ కూడా దాఖలు చేశారు.
2019 ఎన్నికలకు ముందు బిజెపి మాట్లాడింది, వైసిపి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే. అది మొత్తం అబద్ధం అని తెలియడానికి ఈ మూడు సంవత్సరాల మూడు నెలల కాలంలో జగన్ పరిపాలనే సాక్ష్యం
అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు రుజువు చేయలేమని ఫిక్స్ చేసింది వైసిపి, బిజెపి లే
ఇన్ని నేపద్యాల నడుమ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బిజెపితో కలవాలను కుంటున్నారు...??
మరి ఆయన కులం కోసమా అంటే తెలుగు యువత BC కిచ్చాడు, తెలుగు మహిళ SC కిచ్చాడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి BC కిచ్చాడు, తెలంగాణా అధ్యక్ష పదవి SC కిచ్చాడు ఈ నాలుగు కీలక పదవుల్లో కమ్మోళ్ళు ఉన్నారా...?? లేరు కదా
వీటన్నిటి నేపథ్యంలో మరి ఎందుకు బిజెపితో చంద్రబాబు కలవాలను కొంటున్నాడు అంటే
ఒక చారిత్రాత్మక సంక్షోభంలో ఎనిమిది సంవత్సరాల పసికూన ఆంధ్రప్రదేశ్ ఉంది. కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విధ్వసాన్ని ఆపడానికి అయ్యుండొచ్చు.
ఎనిమిది సంవత్సరాల కొత్త రాష్ట్రానికి చంద్రబాబు వేసిన పునాదులు కాపాడడానికి అయ్యుండొచ్చు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తుకు వెళ్లడం వలన ఎన్నికలు సజావుగా జరిగి, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను, విద్వాంసాన్ని ఆపడానికి అవకాశం ఉంటుందని కావొచ్చు
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇన్ని విధ్వంశాలు, అరాచకాలు, అక్రమాల నడుమ కేంద్రంలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వెళ్లక తప్పని పరిస్థితి కాబట్టే చంద్రబాబు ఈ స్టాండ్ తీసుకొని ఉండవచ్చు
ఇక్కడ తగ్గిన వాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. చంద్రబాబు ఒక మెట్టు దిగినంత మాత్రాన వారి గౌరవానికి ప్రతిష్టకు వచ్చిన నష్టం ఏమీ లేదు
కానీ చివరకు ఏది జరిగినా, కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి రాష్ట్రానికి, రావాల్సిన దాని పై, ఒక స్పష్టత ముందే తీసుకోవాలి.
ఒక వేళ, కేంద్రంలో బీజేపీ సహకరించకపోయినా, చంద్రబాబు ఒక్కడు చాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి
తెలుగుదేశం బిజెపి కలిసి వెళ్లినంత మాత్రాన అది, రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే
అని అందరూ అర్థం చేసుకోవాలి...
అసలు మీ పనులు ఏమిటో అర్ధం కావటం లేదు ? హేతుబద్ధత లేదా ? జగన్ ప్రభుత్వం పై హైకోర్ట్ ఆగ్రహం...
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల పై హైకోర్టు ఆశ్చర్య పోయింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం పై విరుచుకు పడింది. రేషన్ దుకాణాల ద్వారా కాకుండా, ఇంటికి రేషన్ సప్లయ్ చేసే విధానం, దాని ద్వారా జరుగుతున్న నష్టం పై, రేషన్ షాపులు డీలర్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచనాలో పడేసలా ఉన్నాయి. మీ ప్రభుత్వం విధానం ఏమిటో అర్ధం కావటం లేదు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఒక పక్కన ఇంటి పక్కనే రేషన్ షాపు ఉన్నా సరే, మొబైల్ వ్యాన్లు వేసుకుని మరీ వచ్చి ఇంటికి వచ్చి, రేషన్ సప్లయ్ చేస్తున్నారు. మరో పక్క, స్కూల్స్ విలీనం పేరుతో, చిన్న పిల్లలను మూడు నాలుగు కిమీ వెళ్లి మరీ చదువుకునే పరిస్థితి తీసుకుని వచ్చారు. ఈ నిర్ణయాలు ఏంటి ? మీ విధానం ఏమిటి ? మీరు తీసుకునే నిర్ణయాల్లో హేతుబద్ధత ఏది ? అంటూ హైకోర్టు ప్రభుత్వం పై విరుచుకు పడింది. తమకు కుదిరిన సమయంలో, రేషన్ షాపుకు వెళ్లి, సరుకులు తెచ్చుకునే పరిస్థితిలో, ఈ రాష్ట్రంలో ప్రజలు లేరని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. డీలర్లు ద్వారా రేషన్ సరఫరా చేయటానికి, వాహనాల ద్వారా సరఫరా చేయటానికి, ఎంత అదనపు ఖర్చు అవుతుందో తెలుసు కదా అని వ్యాఖ్యానించింది.
ఇంత ఖర్చు చేసినా, మీరు ఏ ఉద్దేశంతో డోర్ డెలివరీ చేయాలని అనుకున్నారో, అది నెరవేరటం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పధకం కోసం 92 వేల మందిని పెట్టుకున్నారని, వారికి 21 వేలు ఇస్తున్నారని, అలాగే 600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసారని, ఇంత డబ్బుతో, పేదలకు మరింత ఎక్కువ రేషన్, ఎక్కువ సరుకులు ఇవ్వొచ్చు కదా, మీరు చేసేది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా అని కోర్టు ప్రశ్నించింది ? గతంలో పేద ప్రజలు, తమకు తోచిన సమయంలో వెళ్లి సరుకులు తెచ్చుకునే వారని, ఇప్పుడు ఎప్పుడు ఆ బండి వస్తుందో తెలియక, పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండలేక, అటు పని మానేయటమో, లేదా ఇంట్లో లేక సరుకులు తీసుకోలేక పోవటమో చేస్తున్నారని, రేషన్ కోల్పోవాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ రేషన్ కోసం కేంద్రం కూడా వాటా ఇస్తుందని, డోర్ డెలివరీ గురించి కేంద్రం వద్ద అనుమతి తీసుకున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో డోర్ డెలివరీ చేసారంటే అర్ధం ఉంది కానీ, ఇలా ఇంటి పక్కన రేషన్ షాపు ఉన్నా డోర్ డెలివరీ ఏంటో అర్ధం కావటం లేదని పేర్కొంది. కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
జగన్ ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ఆగ్రహం.. రెండు వారల టైం ఇచ్చిన సుప్రీం..
కేంద్రం అండ చూసుకునో, లేక కేంద్రంలో ఉన్న అధికారులను ఏమార్చవచ్చు అనో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వివాదాస్పదం అవుతున్నాయి. చట్టబద్ధత లేని నిర్ణయాలతో కోర్టులలో చీవాట్లు పడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు కోసం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం అప్పులు చేస్తుంది, మద్యం ఆదాయం తాకట్టు పెడుతుంది, భూములు అమ్ముతుంది, భూములు తాకట్టు పెడుతుంది, ఇలా అనేక రూపాల్లో డబ్బులు కోసం నానా తిప్పలు పడుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యక విషయం ఏమిటి అంటే, కేవలం తను అనుకున్న నవరత్న పధకాలకు డబ్బులు ఇస్తే, దాని కోసం బటన్ నొక్కితే చాలు అనేది ఏపి ప్రభుత్వం వైఖరిగా కనిపిస్తుంది. అందు కోసం మిగతా అవసరాల కోసం ఉపయోగించాల్సిన డబ్బులు కూడా అక్కడ ఉపయోగించకుండా, ఇక్కడ పధకాల కోసం ఇచ్చేస్తే చాలు, ప్రజలు వాటికే సంతృప్తి చెందుతారు అనేది ప్రభుత్వ వైఖరిగా ఉంది. అందుకే రాష్ట్ర విపత్తు నిధుల నుంచి, డబ్బులు మళ్ళించింది. రాష్ట్ర విపత్తుల నిధిలో డబ్బులు ఉంటే, ఇప్పుడు వరదల సమయంలో ఎంతో ఉపయోగ పడేది. అలాంటి విపత్తుల నిధుల నుంచి డబ్బులు మళ్ళించింది.
దాదపుగా రూ.1100 కోట్లను దారి మళ్ళించి, పీడీ ఖాతాలలో వేసుకుంది. అయితే ఈ డబ్బు కొవిడ్ బాధిత కుటుంబాలకు పరిహారంగా ఇవ్వాల్సిన డబ్బు. మన రాష్ట్రంలో అనేక మంది కోవిడ్ బారిన పడి చనిపోయిన సంగతి తెలిసిందే. ఒక్కొకరికీ 50 వేలు ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి నుంచి ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అనూహ్యంగా మన రాష్ట్రంలో మాత్రం, ఒక్కరికి కూడా ఇవ్వకుండా, ఆ నిధులు దారి మళ్ళించారు. దీని పైన టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సుప్రీం కోర్టులో పిటీషన్ వేసారు. దీని పై విచారణ చేసిన సుప్రీం కోర్ట్, నిన్న ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ విషయం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులను రెండు వారాల్లో మళ్ళీ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి జమ చేయాలని, అలాగే అందరికీ కవిడ్ పరిహారం ఇవ్వాలని, ఎవరికైనా నిధులు రాలేదని ఫిర్యాదు వస్తే, నాలుగు వారాల్లో పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.