కర్నూల్ సభ ముగిసిన తరువాత, చంద్రబాబు వరుస సమావేశాలతో పార్టీలో జోష్ పెంతున్నారు...ఇందులో భాగంగానే ఈరోజు టిడిపి అద్యక్షుడు  చంద్రబాబు సమక్షంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.  ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశంలో టిడిపి పార్టీ ని ప్రజల్లోకి  మరింత బలంగా  తీసుకెళ్లడంపై, పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు...పార్టీ ని మరింత పటిష్టం చేయడానికి, దాని కోసం చేపట్టాల్సిన చర్యల పై కూడా నిర్ణయాలు  తీసుకోనున్నారు...అంతే కాకుండా , ప్రభుత్వ వైఫల్యాలను , ప్రజల్లోకి తీసుకకెల్లాడానికి, “ఇదే కర్మ ” అనే పేరుతో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు...ఈ కార్య క్రమం 45 రోజుల పాటు జరుగుతుందని నిర్ణయించారు.. ఈ 45 రోజులు పార్టీ శ్రేణులందరూ గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసు కోవాలని చంద్రబాబు ఆదేశించారు...

హెటిరో  డ్రగ్స్ కి సంబంధించిన కేసులో ఏపీ సీఎం జగన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసు సిబిఐ కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ అక్రమాస్తుల కేసు దాఖలు చేసినప్పుడు హెటిరో కు సంబంధించిన కేసు కూడా చేర్చడం జరిగింది. హెటిరో కంపెనీ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం వలనే, ఈ కంపనీకి వెంటనే80 ఎకరాల ల్యాండు ఎలాట్ చేశారనేది అభియోగం. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ కోసం ఎన్నో కంపెనీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అప్పటికి ఇంకా కంపెనీ కూడా మొదలుపెట్టని , ఈ హెటిరో కంపెనీకి  80 ఎకరాల ల్యాండు రాజ శేఖర్ రెడ్డి ఉన్న టైం లోనే  ఎలాట్ చేశారు.   కేవలం 350 షేర్లు పెట్టుబడి పెట్టడంతో వెంటనే ఈ కంపెనీకి ఈ ల్యాండ్ ఎలాట్ చేయడం జరిగింది. అయితే ఇదే కంపెనీ, వెంటనే జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. ఈ అన్ని కేసులకు సంభందించి సిబిఐ ఛార్జిషీట్ గట్టిగానే దాఖలు చేసింది. కాబట్టి జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో దాఖలు చేసినటువంటి కేసుని కొట్టివేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించడం జరిగింది. మరో వైపు హెటిరో కంపెనీ కూడా తమ న్యాయవాదులతో తమ వాదనను వినిపించాయి. కంపెనీ మొత్తాన్ని, ఎఫ్ఐఆర్లో చేర్చడం, కంపెనీ మొత్తాన్ని నిందితుల జాబితాలో చేర్చడం అనేది సబబు కాదని, ఆ కంపెనీలో పనిచేసే కొంతమంది వ్యక్తులను  జాబితాలో చేర్చాలని, అంతేకానీ కంపెనీ మొత్తాన్ని చార్జ్షీట్ లో చేర్చడం  సబబు కాదు అని  కంపెనీ తరుపున న్యాయవాదులు తమ వాదన  వినిపించారు. ఈ హెటిరో  కంపెనీకి , కింద కోర్టు హైకోర్టులో కూడా  ఇలాగే చుక్కెదురవడంతో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కాని సుప్రీం కోర్టులో కూడా ,ఈ హెటిరో కంపనీని చార్జ్ షీట్ నుంచి తొలగించడం కుదరదని సుప్రీం కోర్ట్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అంతే కాదు, ఇక్కడ క్విడ్ ప్రో కో జరిగిందని, స్పష్టంగా తెలుస్తుందని, సిబిఐ అన్నీ పక్కాగానే చేసిందని కామెంట్ కూడా చేసింది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్ట్ పై, తెలుగుదేశం పార్టీ వేగంగా స్పందించింది. ఈ రోజు ఉదయమే, టిడిపి , ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.  ఈ లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దీని పై కొద్ది సేపట్లో వాదనలు జరగనున్నాయి. అయ్యన్నపాత్రుడ్ని అక్రమంగా అరెస్ట్ చేసారని, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. దీంతోపాటు అయ్యన్న పత్రుడిని అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా న్యాయవాదులు ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. ఫోర్జరీ చట్టం మోపినా కూడా, ఆ సెక్షన్ విధించటానికి ఉన్న గ్రౌండ్ ఉందా లేదా అనేది పోలీసులు పరిశీలన చేసి, ఆ సెక్షన్ పెట్టాలని, గతంలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు గురించి న్యాయవాదులు చెప్తున్నారు. అటువంటి సెక్షన్ ఉన్నా కూడా, ముందస్తు నోటీసులు ఇవ్వాలని, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని, ఇలాంటివి ఏమి ఇవ్వకుండా, అరెస్ట్ చేసారని, న్యాయవాదులు పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై, మధ్యానం తరువాత విచారణకు రానుంది.

విశాఖపట్నంలోని రుషికొండలో జరుగుతున్న అక్రమ తవ్వకాల పై, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమ తవ్వకాలకు సంబంధించి, రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభం అయిన సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఒప్పుకుంది. ఇప్పటికే అక్కడ చెప్పిన దాని కంటే, 3 ఎకరాలు అదనంగా తవ్వము అని చెప్పి, కోర్టుకు తెలిపింది. అయితే దీని పై పిటీషనర్ అభ్యంతరం చెప్పారు. అక్కడ 3 కాదని, ఏకంగా 20 ఎకరాలు ఎక్కువ తవ్వేసారని, అందులోనే నిర్మాణాలు జరుగుతున్నాయని, అక్కడ తీసిన వ్యర్ధాలు అన్నీ సముద్రంలో వదులుతున్నారని, పిటీషనర్ తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇరు పక్షాలు తలో వాదన చెప్పటంతో, అసలు అక్కడ వాస్తవాలు నిగ్గు తేల్చాలని, ఎంత వరకు అక్రమ తవ్వకం జరిగిందో, నిగ్గు తేల్చలాని, అప్పుడే అక్రమ తవ్వకాల పై ఒక తీర్పు ఇస్తామని చెప్పింది. ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిగాయి, పర్మిషన్ ఎంత వరకు ఇచ్చింది, ఎంత తవ్వారు అనేది,  కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారులు తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారే చేసింది.  సర్వే నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందానికి హైకోర్టు ఆదేశిస్తూ. విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

Advertisements

Latest Articles

Most Read