గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ నేతలు చేస్తున్న కార్యక్రమంలో, రోజు రోజుకీ ప్రజల నుంచి నిలదీతలు ఎక్కువ అయ్యాయి. తమ సమస్యల పై ప్రజలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అరకు ఎమ్మెల్యే కాలర్ కూడా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం బయటకు రావటం లేదు. ఎమ్మెల్యేలను మాత్రమే తిరగమని చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యేలకు మాత్రం, ప్రజలు దబిడి దిబిడి చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి వెల్లంపల్లి గడప గడపకూ వెళ్తుంటే, ఒక ఇంజనీర్ చుక్కలు చూపించాడు. మీరు రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అంటూ వెల్లంపల్లిని నిలదీసారు. ఆ  జనీర్ మాటలకు వెల్లంపల్లి ఆయన అనుచరులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తన దగ్గర మీ అవినీతి పై సాక్ష్యాలు కూడా ఉన్నాయని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. అయితే అక్కడే మీడియా ఉండటంతో, వెల్లంపల్లి రెచ్చిపోయారు. అక్కడున్న పోలీసులని పిలిచి, సాక్ష్యాలు తను ఇవ్వకపోతే వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. మరి జగన్ మోహన్ రెడ్డి 6 లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, వెల్లంపల్లి ఎక్కడున్నారో మరి ?

వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, గత రెండేళ్లుగా, సొంత ప్రభుత్వం పై తిరుగుబావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానాల పై రఘురామకృష్ణం రాజు విరక్తి చెంది, ప్రభుత్వంలో జరిగే ప్రతి తప్పుని, మీడియా సమావేశాల్లో ఎండగడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే, రఘురామరాజుకి, జగన్ కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. జగన్ మోహన్ రెడ్డి, రఘురామరాజుని పర్సనల్ గా టార్గెట్ చేసే వరకు వ్యవహారం వెళ్ళింది. రఘురామరాజు పై రాజ ద్రోహం కేసు పెట్టి, ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, గుంటూరుకు తీసుకుని వచ్చి, ఆయన్ను కొట్టి, హింసించారు. ఈ కేసు దేశంలోనే పెద్ద సెన్సేషన్ అయ్యింది. రఘురామరాజు ఒక ఎంపీ కావటంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తరువాత రఘురామరాజు, దీని పై సుప్రీం కోర్టులో పోరాటం కూడా చేస్తున్నారు. ఇక, రఘురామరాజుని ఎలాగైనా పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని జగన్ మోహన్ రెడ్డి ఎత్తులు వేసారు. అయితే అది కూడా ఫ్లాప్ అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి ఎత్తుగడలు ఫలించలేదు. అయితే రఘురామరాజు పై ఏదో ఒక కేసు పెట్టి, ఆయన్ను మళ్ళీ లోపల వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే, రఘురామరాజు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడతారా అని జగన్ మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నారు.

rrr 18062022 2

అయితే గతంలో నాలుగు నెలల క్రితం, రఘురామరాజు, ఆంధ్రప్రదేశ్ రావాలని ప్రయత్నం చేయగా, అయన పై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు. అవి కోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలోనే, వచ్చే నెల 4వ తేదీన, ప్రధాని మోడి, ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజుకి సంబంధించి, జరిగే ఒక ఈవెంట్ లో, ప్రధాని పాల్గుననున్నారు. ఈ సమావేశంలో తాను కూడా పాల్గునాలని రఘురామరాజు భావించారు. అయితే రఘురామరాజు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్న వైసీపీ, ఆ రోజు అరెస్ట్ చేసే ప్లాన్ వేయటంతో, రఘురామరాజు, ఈ విషయం పై తెలివగా, కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. తాను స్థానిక ఎంపీ హోదాలో ప్రధానితో కలిసి కార్యక్రమంలో ఉంటానని, ప్రధాని కార్యాలయానికి చెప్పటం, అలాగే హోం మంత్రి అమిత్ షా దగ్గర నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకోవటంతో, ఆయన ప్రధాని మోడితో కలిసి ఆ రోజు ఏపిలో పర్యటన చేయనున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మోడీ పక్కన ఉండగా, రఘురామరాజు ని అరెస్ట్ చేస్తుందా ? చూడాలి మరి.

ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త బాదుడే బాదుడుకు  జగన్ ప్రభుత్వం సిద్దమయింది. మధ్య తరగతి గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. ఇళ్ళల్లో 500 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ వాడుకునేవారు  కొత్తగా ఏసీడీ ఛార్జీలు కట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు అయితే  కమర్షియల్  వినియోగదారులు  మాత్రమే ఏసీడీ ఛార్జీలు ప్రభుత్వానికి చెల్లించేవారు. కాని ఇక నుంచి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ నుంచి కూడా ఏసీడీ ఛార్జీల వసూలు చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు వచ్చే కొత్త బిల్లులు ఏసీడీ ఛార్జీలతో కలిపి జారీ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే అపార్ట్‌మెంట్లలో కామన్ మీటర్ ఉండేవారికి అయితే భారీగా బిల్లులు వచ్చి పడుతున్నాయి. ఎవరికీ అయితే 500 యూనిట్లపై బడి విద్యుత్ వినియోగిస్తారో వారందరూ ఈ ఏసీడీ ఛార్జీలు కట్టలిందే అని ప్రభుత్వం కొత్త తరహాలో బాదుడు మొదలు పెట్టింది. ఇప్పటికే రోజురోజుకి పెరుగుతున్న  ఖర్చులతో పేద ,మధ్య  తరగతి వారు సతమతమవుతుంటే ,ప్రభుత్వం ఇలా రోజుకొక బాదుడు తో ప్రజల నెత్తిన గుదిబండ పెడుతుంది.

వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై, అనేక సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసుల్లో గతంలో జగన్ మోహన్ రెడ్డి 16 నెలల జైలు శిక్ష కూడా అనుభవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కండీషనల్ బెయిల్ పైన బయట ఉన్నారు. అయితే ఈ కండీషనల్ బెయిల్ పిటీషన్ లో భాగంగా జగన్ మోహన్ రెడ్డి, విదేశీ పర్యటనలకు వెళ్ళ కూడదు అనే షరతు ఒకటి ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్ళాలన్నా, కోర్టు పర్మిషన్ తీసుకుని, విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, తాను విదేశీ పర్యటనకు వెళ్ళాలని, సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. తానూ పారిస్ వెళ్ళాలని, పారిస్ వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వాలి అంటూ సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ విషయం బయటకు రావటంతో, ఇప్పుడు వార్తల్లో టాపిక్ అయ్యింది. వచ్చే నెలలో జగన్ మోహన్ రెడ్డి కుమార్తె గ్రాడ్యూయేషన్ సెర్మనీ పారిస్ లో ఉండటంతో, జగన్ మోహన్ రెడ్డి అక్కడకు వెళ్ళటానికి సిబిఐ కోర్టు పర్మిషన్ అడిగారు. జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె, పారిస్ లోని ఒక బిజినెస్ స్కూల్ లో గ్రాడ్యూయేషన్ చదువుతున్నారు. ఆమె, అక్కడ కోర్స్ పూర్తి చేసుకోవటంతో, ఆ గ్రాడ్యూయేషన్ సెర్మనీకి జగన్ వెళ్తున్నారు.

vijayamma 18062022 2

కుటుంబ సమేతంగా జగన్ మోహన్ రెడ్డి అక్కడకు వెళ్తున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. జగన్ రెండో కుమార్తె లండన్ లో చదువుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయన వెళ్ళిన కాస్ట్లీ ఫ్లైట్ అలాగే, ఆయన దావోస్ కాకుండా, నేరుగా లండన్ వెళ్ళటం, ఇవన్నీ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసాయి. అలాగే మూడు రోజులు దావోస్ లో మీటింగ్ ఉంటే, ఆయన పది రోజులు పాటు అక్కడ ఉండటం, కూడా వివాదాలకు తావు ఇచ్చింది. ఇప్పుడు ఆయన పూర్తిగా వ్యక్తిగత పర్యటనతో వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మరో అంశం తెర మీదకు వస్తుంది. నెల రోజులు క్రితం, షర్మిల కొడుకు, గ్రాడ్యూయేషన్ సెర్మనీ అమెరికాలో జరిగితే, విజయమ్మ అక్కడకు వెళ్లారు. ఇప్పుడు జగన్ తో విజయమ్మకు సరైన సంబంధాలు లేవు అనే ప్రచారం మధ్య, విజయమ్మ ఇప్పుడు జగన్ కూతురు గ్రాడ్యూయేషన్ సెర్మనీకి, పారిస్ వెళ్తారా లేదా అనే చర్చ జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read