'నువ్వు కొట్టినట్టు నటించు - నేను ఏడ్చినట్టు నటిస్తాను' అనే సామెత విన్నారా ? దీని గురించి బెస్ట్ ఉదాహరణ కావలి అంటే, నిన్న తెలంగాణాలో మోడీ-కేసీఆర్ ఎన్నికల ప్రచారం చూస్తే అర్ధమైపోతుంది. ఇంతకంటే ముందు మనం మరో విషయం చెప్పుకోవాలి.. మోడీ గారు గుజరాత్ లో ఎన్నికల వేళ చేసిన ప్రచార సభలు 34, కర్నాటకలో 21, ఛత్తీస్గఢ్ 7, మధ్య ప్రదేశ్ 11. అదే తెలంగాణలో మాత్రం ఒక్కటంటే ఒక్కటి.. అంటే ఇక్కడే అర్ధమవుతుంది, కేసీఆర్ తో ఉన్న అవగాహన ఎలాంటిదో. మోడీ ఎక్కువ ప్రచారం చేస్తే, ఓట్లు చీలేది కేసీఆర్ దగ్గర నుంచే. అందుకే పాపం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టకుండా, బీజేపీ జాగ్రత్త పడుతుంది. మళ్ళీ అసలు విషయానికి వద్దాం. నిన్న మోడీ, కేసీఆర్ ఎన్నికల ప్రచారం చూస్తే వీళ్ళు ఎంత కామెడీనో అర్ధమవుతుంది.
కేసీఆర్ సారు...మోదీ సారు రహస్య అవగాహన నేపధ్యంలో ఏమి మాట్లాడతారు అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకుంది.... తెలంగాణ లో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఏకారణంగానో చూస్తే...డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు..ఇంటికో ఉద్యోగం... దళితులకు మూడెకరాల భూమి...నిరంకుశత్వం... నిర్భంధం... ఏక పక్ష ధోరణి...ఫామ్ హౌస్ పాలన..రైతుల ఆత్మహత్యలు..రైతులకు బేడీలు...టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దందాలు...ఇవి ముఖ్యంగా కొన్ని... నిజంగా కేసీఆర్ ని గద్దె దించాలనుకుంటే...టీఆర్ఎస్ ని ఓడించాలనుకుంటే.....వీటి మీద విమర్శచేయాలి..ప్రశ్నించాలి... ఘనత వహించిన మోదీ గారు...ఇవన్నీ విడచి పెట్డి కేసీఆర్ కు ఏది మంచిందో అదే చేసారు.
అప్పు చేసో సప్పు చేసో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తుంటే దానిమీద మాట్లాడతారు... పూజలు ..యాగాలు గురించి మాట్లాడతారు.. కుటుంబ పాలన గురించి మాట్లాడతారు...మనదేశంలో వ్యక్తులకే కాదు కుటుంబాలకు కూడా ఆరాధకులుంటారు... ఈ విమర్శలు అన్నీ కేసీఆర్ విజయవంతంగా తిప్పి కొట్టగలిగిన వే... పైగా కాంగ్రెస్ తో అవగాహన అంటారు...ఎంత అవగాహన లోపం ఉన్నా ఇటువంటి మాటలు మాట్లాడరు...ఇద్దరి మధ్య అవగాహన ఉంటే తప్ప.. మోదీ గారు బంతిపూల యుద్దం చేస్తారు...కేసీఆర్ ఎంతో ఆవేదనతో..ఆవేశంగా కనకాంబరాలతో కొడతాడు... ఎంత బాగా రక్తి కట్టించారు...మెలోడ్రామా ని.. బీజేపీ కేడరు చస్తున్నారు...విశ్లేషణ చేయలేక సమర్దించలేక..ఊరకే ఉండలేక... మోదీ విపక్షాలకే కాదు స్వపక్షానికి కూడా ఝలక్ ఇవ్వగలరు... అయితే జనం మీరనుకున్నంత ... కేసీఆర్ ..మోదీ స్నేహాన్ని చాన్నాళ్ళనుండి గమనిస్తున్నారు... మోదీ ...కేసీఆర్... మీ కధ ముగిసింది...కలచెదిరింది...కధ మారింది...ఫామ్ హౌసే మిగిలింది...