'నువ్వు కొట్టినట్టు నటించు - నేను ఏడ్చినట్టు నటిస్తాను' అనే సామెత విన్నారా ? దీని గురించి బెస్ట్ ఉదాహరణ కావలి అంటే, నిన్న తెలంగాణాలో మోడీ-కేసీఆర్ ఎన్నికల ప్రచారం చూస్తే అర్ధమైపోతుంది. ఇంతకంటే ముందు మనం మరో విషయం చెప్పుకోవాలి.. మోడీ గారు గుజరాత్ లో ఎన్నికల వేళ చేసిన ప్రచార సభలు 34, కర్నాటకలో 21, ఛత్తీస్గఢ్ 7, మధ్య ప్రదేశ్ 11. అదే తెలంగాణలో మాత్రం ఒక్కటంటే ఒక్కటి.. అంటే ఇక్కడే అర్ధమవుతుంది, కేసీఆర్ తో ఉన్న అవగాహన ఎలాంటిదో. మోడీ ఎక్కువ ప్రచారం చేస్తే, ఓట్లు చీలేది కేసీఆర్ దగ్గర నుంచే. అందుకే పాపం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టకుండా, బీజేపీ జాగ్రత్త పడుతుంది. మళ్ళీ అసలు విషయానికి వద్దాం. నిన్న మోడీ, కేసీఆర్ ఎన్నికల ప్రచారం చూస్తే వీళ్ళు ఎంత కామెడీనో అర్ధమవుతుంది.

governer 28112018

కేసీఆర్ సారు...మోదీ సారు రహస్య అవగాహన నేపధ్యంలో ఏమి మాట్లాడతారు అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకుంది.... తెలంగాణ లో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఏకారణంగానో చూస్తే...డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు..ఇంటికో ఉద్యోగం... దళితులకు మూడెకరాల భూమి...నిరంకుశత్వం... నిర్భంధం... ఏక పక్ష ధోరణి...ఫామ్ హౌస్ పాలన..రైతుల ఆత్మహత్యలు..రైతులకు బేడీలు...టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దందాలు...ఇవి ముఖ్యంగా కొన్ని... నిజంగా కేసీఆర్ ని గద్దె దించాలనుకుంటే...టీఆర్ఎస్ ని ఓడించాలనుకుంటే.....వీటి మీద విమర్శచేయాలి..ప్రశ్నించాలి... ఘనత వహించిన మోదీ గారు...ఇవన్నీ విడచి పెట్డి కేసీఆర్ కు ఏది మంచిందో అదే చేసారు.

governer 28112018

అప్పు చేసో సప్పు చేసో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తుంటే దానిమీద మాట్లాడతారు... పూజలు ..యాగాలు గురించి మాట్లాడతారు.. కుటుంబ పాలన గురించి మాట్లాడతారు...మనదేశంలో వ్యక్తులకే కాదు కుటుంబాలకు కూడా ఆరాధకులుంటారు... ఈ విమర్శలు అన్నీ కేసీఆర్ విజయవంతంగా తిప్పి కొట్టగలిగిన వే... పైగా కాంగ్రెస్ తో అవగాహన అంటారు...ఎంత అవగాహన లోపం ఉన్నా ఇటువంటి మాటలు మాట్లాడరు...ఇద్దరి మధ్య అవగాహన ఉంటే తప్ప.. మోదీ గారు బంతిపూల యుద్దం చేస్తారు...కేసీఆర్ ఎంతో ఆవేదనతో..ఆవేశంగా కనకాంబరాలతో కొడతాడు... ఎంత బాగా రక్తి కట్టించారు...మెలోడ్రామా ని.. బీజేపీ కేడరు చస్తున్నారు...విశ్లేషణ చేయలేక సమర్దించలేక..ఊరకే ఉండలేక... మోదీ విపక్షాలకే కాదు స్వపక్షానికి కూడా ఝలక్ ఇవ్వగలరు... అయితే జనం మీరనుకున్నంత ... కేసీఆర్ ..మోదీ స్నేహాన్ని చాన్నాళ్ళనుండి గమనిస్తున్నారు... మోదీ ...కేసీఆర్... మీ కధ ముగిసింది...కలచెదిరింది...కధ మారింది...ఫామ్ హౌసే మిగిలింది...

దేశంలోని ప్రతి వ్యవస్థని మోడీ సర్కార ఎలా నిర్వీర్యం చేస్తుందో చూస్తున్నాం. ఆ కోవలోదే గవర్నర్ వ్యవస్థ కూడా. గవర్నర్ ని అడ్డం పెట్టుకుని, కొన్ని రాష్ట్రాలలో దొడ్డి దారిని అధికారంలోకి వచ్చింది బీజేపీ, రావటానికి ప్రయత్నించి విఫలం అయ్యింది. ఇప్పుడు తాజాగా, అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా రావటానికి చూసి భంగ పడింది. ఈ విషయం జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ స్వయంగా చెప్పారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని ఉన్నపళంగా రద్దు చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న గవర్నర్ సత్యపాల్ మలిక్.. వారంరోజుల్లోనే మరోసారి వివాదానికి తెరలేపారు. కేంద్రం చెప్పినట్లు తాను చేయలేనని, ఒకవేళ అలా చేస్తే చరిత్రలో అవినీతిపరుడిగా మిగిలేవాడినంటూ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ మాలిక్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

governer 28112018

‘అప్పటి పరిస్థితుల్లో నేను దిల్లీ(కేంద్రం) వైపు చూసుంటే.. భాజపా మద్దతిస్తున్న పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజాద్‌ లోన్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటూ బలవంతంగా పిలవాల్సి వచ్చేది. కేంద్రం సాయంతో సజాద్‌ లోన్ ఎలాగొలా తన బలాన్ని నిరూపించుకునేవారు. అప్పుడు చరిత్రలో నేను అవినీతిపరుడిగా, నిజాయతీలేని వాడిగా మిగిలిపోయేవాడిని. కానీ నేను దాన్ని జరగనివ్వలేదు. అసెంబ్లీని రద్దు చేశాను. నన్ను తిట్టాలనుకునేవారు తిట్టండి కానీ నేను సరైన పనే చేశాను’ అని గవర్నర్‌ మాలిక్‌ చెప్పుకొచ్చారు. అంతేగాక.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఒమర్‌ అబ్దుల్లా సీరియస్‌గా ప్రయత్నించలేదని ఆయన ఆరోపించారు.

governer 28112018

గతవారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దుచేస్తున్నట్టు గవర్నర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో తాను ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు సిద్ధమంటూ... పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముందుకొచ్చిన కొద్దిసేపటికే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. గవర్నర్ అకస్మిక నిర్ణయంపై అటు జమ్మూ కశ్మీర్‌లోనూ, ఇటు ఢిల్లీలోనూ ప్రత్యర్ధి పార్టీ పరస్పరం కత్తులు నూరుకున్నాయి. గవర్నర్ నిర్ణయం ‘‘అప్రజాస్వామికమనీ, రాజ్యాంగ విరుద్ధమని’’ ఆరోపిస్తూ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోశాయి. అయితే రాష్ట్ర ప్రయోనాలను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకున్నారంటూ బీజేపీ గవర్నర్‌ను వెనకేసుకొచ్చింది.

మాట్లాడితే నేను హైదరాబాద్ ను ఎక్కడికో తీసుకువెళ్ళాను అంటూ ట్విట్టర్ లో డబ్బా కొట్టే కేటీఆర్ కి, షాక్ ఇచ్చారు మహానటి డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌. తన స్నేహితుడుకి జరిగిన ఘటన కేటీఆర్ కు ట్వీట్ చేసి, ఇది హైదరాబాద్ లో ఉన్న దుస్థితి అంటూ బాధపడ్డారు. హైదరాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. కెమెరామెన్‌గా పనిచేస్తున్న ఆయన స్నేహితుడు ఒకరు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారట. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అతను చనిపోయారు.

ktr 27112018 2

దీంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేస్తూ అశ్విన్‌ తన స్నేహితుడి పట్ల జరిగిన దారుణాన్ని వివరించారు. ‘ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నా స్నేహితుడు చనిపోయాడు. అతనికి ప్రమాదం జరిగినప్పుడు చికిత్స నిమత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆ రోజు ఆదివారం కావడంతో ఎవరూ అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారు. ఆ సమయంలో గాంధీ ఆస్పత్రిలో కాకుండా మరేదన్నా ఆస్పత్రికి తీసుకెళ్లినా నా స్నేహితుడు బతికేవాడు."

ktr 27112018 3

"తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించి మనుషులు ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేం? ప్రభుత్వాస్పత్రి అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి కేటీఆర్‌ సర్‌. వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు ఈ రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్‌. దీని గురించి నాకు ఎవర్ని ప్రశ్నించాలో అర్థంకావడంలేదు సర్‌. అనవసరంగా అలా వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు అశ్విన్‌. ఈ విషయంపై కేటీఆర్‌ స్పందించాల్సి ఉంది.

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, కేసీఆర్ ప్రధాన అజెండాగా తీసుకుంది చంద్రబాబుని. చంద్రబాబుని ఒక శత్రువుగా, ఒక బూచిగా తెలంగాణా సమాజానికి చూపిస్తున్నారు. చంద్రబాబు కూడా ముందుగా తెలంగాణా ఎన్నికలకు వెళ్ళద్దు అనే అనుకున్నారు. కాని కేసీఆర్ పదే పదే కావాలని, చంద్రబాబుని ఎదో శత్రువుగా చూపిస్తున్నారు. ఇవన్నీ తిప్పికొట్టటానికి చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. అసలు కేసీఆర్ చంద్రబాబుని ఎందుకు తిడుతూన్నాడు ? చంద్రబాబు ప్రచారాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో తెలుసుకుంటే, తెలంగాణా ఉద్యమం నడిచిందే నీళ్లు - నిధులు - నియామకాల కోసం... వీటిలో కేసీఆర్ తెలంగాణాలో ఏమి చేసారు ? ఆంధ్రాలో చంద్రబాబు ఏమి చేసారు అనే చర్చ మొదలైతే ? అదే కేసీఆర్ భయం..

telangana 27112018 2

నీళ్లు : చంద్రబాబు వచ్చి, పట్టిసీమ కట్టి డెల్టాకు నీళ్లిచ్చి, కృష్ణ నీళ్లు రాయలసీమకిచ్చి , పురుషోత్తపట్నంతో ఉత్తరాంధ్రకు నీళ్లిచ్చి, వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసాడో చెపుతాడు... భగీరథ కాకతీయ పేరుతో కేసీఆర్ ఎంత దోచుకున్నాడో తెలంగాణా సమాజానికి కనిపిస్తూనే ఉంది.. అలాగే కేసీఆర్ ఎగువ రాష్ట్రంగా ఉండి, చంద్రబాబు నీళ్లు ఆపుతున్నాడు అని అంటే, రైతులు నమ్ముతారా ? ఈ మాటలు వింటే, రైతులు కేసీఆర్ కు ఓట్లేస్తారా?.... నిధులు : వేల కోట్ల లోటు బడ్జెట్టుతో, ఆదాయం లేని, రాజధాని లేని రాష్ట్రంలో, తాను అద్భుతంగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురుంచి చెపుతాడు. శుభ్రమైన పరిసరాల్లో ఆహారం పెట్టె అన్న కాంటీన్ల గురించి చెపుతాడు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసిన రోడ్ల గురుంచి ఇతర మౌలిక సదుపాయాల గురుంచీ చెపుతాడు, అప్పుడు హైదరాబాద్ రోడ్లు గురించి ప్రజలు ఆలోచించరా ?. రాజధాని భూసేకరణనీ, మల్లన్న సాగర్ భూదోపిడీనీ పోలుస్తాడు. టెక్నాలజీని ఏ విధంగా వాడుతున్నాడో అవినీతిని ఎలా తగ్గించగలిగాడో చెపుతాడు. ఇవన్నీ విన్న ప్రజలకి, కేసీఆర్ ఎన్ని రకాలుగా విఫలం అయ్యాడో అర్ధం కాదా ? కేసీఆర్ కి ఇంకా ఓటేస్తారా?

telangana 27112018 3

నియామకాలు : ఖజానా ఖాళీ అయినా, ఎన్ని వేల మందికి ఉద్యోగాలిచ్చాడో చెపుతాడు, ఎన్ని సార్లు డీఎస్సీ ఇచ్చింది చెప్తాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని కేసీఆర్ కి ఏ విద్యార్థయినా నిరుద్యోగయినా ఓటేస్తాడా? అలాగే...కియా లాంటి వేల కోట్లు పెట్టుబడి పెట్టె కంపినీలని తెచ్చి లక్షల ఉద్యోగాలు సృష్టించిన విషయం చెపుతాడు. మరిన్ని లక్షల మందికి స్వయంఉపాది చూపించిన విషయం చెపుతాడు. ఇది విన్నాక, కేసీఆర్ తెచ్చిన ఒక్క కంపెనీ ఏంటి అని ప్రజలు ఆలోచించరా ? ఏ తెలంగాణా యువకుడన్నా ఫార్మ్ హౌస్ లో నాలుగేళ్ళ నుంచీ పడుకున్న కేసీఆర్ కి ఓటేస్తాడా? భావోద్వేగాలు వదిలేసి...వాస్తవిక దృక్పధంతో చంద్రబాబు చెప్పే మాటలు కనీసం 70 శాతం మంది తెలంగాణా ప్రజానీకం వింటది. ఒక నిర్ణయం తీసుకుంటది. కేసీఆర్ అడ్రస్ గల్లంతవుతది. అందుకే చంద్రబాబు ప్రచారాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నాడు... అయినా, చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. బరాబర్ వస్తున్నాడు కేసీఆర్.. తెలంగాణాలో సామాజిక ఆర్ధిక మార్పులకు తెలుగుదేశం ఎలా కారణమో చెప్తాడు... గాజులు అమ్మే హైదరాబాద్ లో, సైబెరాబాద్ సిటీ సృష్టించాను అని చెప్తాడు... నీ దొరల అహంకారం గురించి, నీ కుటుంబం చేసిన దోపిడీ గురించి చెప్తాడు.. ఢిల్లీ అహంకారులతో, ఎలా కుమ్మక్కు అయ్యావో చెప్తాడు.. కాంగ్రెస్ తో ఎందుకు కలిసారో చెప్తాడు... బంగారు తెలంగాణా కావలి అంటే, ఏమి చెయ్యాలో చెప్తాడు... బరాబర్ వస్తాడు... రేపే వస్తున్నాడు... ఖమ్మం గడ్డ మీద అడుగు పెడుతున్నాడు...

Advertisements

Latest Articles

Most Read