ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి... ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి ఐటీ సోదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు... ఏపీలోని పలువురు టీడీపీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. కొన్ని రోజుల క్రిందట సియం రమేష్ పై దాడులు చేసారు. మొత్తం వాతావరణం అంతా టెన్షన్ లో దింపుతున్నారు. ఆపరేషన్ గరుడలో చెప్పిన ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా, షడ్యుల్ ప్రకారం జరుగుతుంది. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఐటీ దాడులు కాకుండా, ఈ సారి ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి... చంద్రబాబు, తెలుగుదేశం టార్గెట్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏపిలో కాకుండా, తెలంగాణాలో చేసారు.

ed 24112018 2

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని నాగార్జున హిల్స్‌లోగల సుజనాచౌదరికి చెందిన ఇల్లు, ఆయనకుగల రెండు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా... ఈ సోదాలు రెండురోజులపాటు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సోదాల్లో కంపెనీలకు చెందిన కీలక ప్రతాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, మోడీ పై చంద్రబాబు చేస్తున్న రాజకీయ పోరాటంతో, గుజరాత్ బ్రదర్స్ మోడీ, షాలు చంద్రబాబు పై కక్ష పెంచుకున్నారు.

ed 24112018 3

గత మూడు నాలుగు నెలలుగా చంద్రబాబు అంతు చూస్తాం, చంద్రబాబుని జైల్లో పెడతాం, చంద్రబాబుని పదవిలో నుంచి దించేస్తాం అంటూ బహిరంగంగానే బీజేపీ నేతలు మాట్లాడటం చూసాం. దానికి తగ్గట్టుగానే కోర్ట్ ల్లో కేసులు వేసినా, ఏమి లాభం లేకపోవటంతో, ఇప్పుడు తమ చేతుల్లో ఉన్న ఐటి, ఈడీ, సిబిఐ లకు ఢిల్లీ పెద్దలు పని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ మీద డైరెక్ట్ గా దాడి చేస్తే, అది దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యి, అన్ని విపక్షాలు మరింత బలంగా ఏకం అయ్యే అవకాసం ఉండటంతో, తెలుగుదేశం పార్టీలో ఆర్ధికంగా బలంగా ఉన్న నేతల పై, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యాపార వేత్తల పై, దాడులకు ఢిల్లీ నేతలు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా, ఇప్పటికే విజయవాడ, గుంటూరు, వైజాగ్ లో దాడి చేసిన ఐటి అధికారులు, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీల పై పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో, ప్రతి నెల ఎదో ఒక కార్యక్రమం పెడుతూ, ప్రతి రోజు ఎమ్మెల్యేలు ప్రజలు మధ్య ఉండేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామా దర్శిని, నగర దర్శిని, ఇంటింటికీ తెలుగుదేశం, ఇలా ఎదో ఒక కార్యక్రమంతో, ఎమ్మెల్యేలు ప్రజలు చుట్టూ తిరిగి, వాళ్ళ సమస్యలు పరిష్కరించేలా చంద్రబాబు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వీటి పై ప్రతి రోజు సమీక్ష జరుపుతూ, సరిగ్గా పని చెయ్యని ఎమ్మెల్యేలను మందలించే వారు. అయితే చంద్రబాబు మమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతున్నారని, ప్రతి నెల ఎదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండేలా చేస్తూ, ఎక్కడ లోపం జరిగినా మందలిస్తూ, మా పై ఒత్తిడి పెంచుతున్నారని కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసే వాళ్ళు. ఇలాంటి వాళ్లు, ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న సీన్లు చూసి, చంద్రాబాబు చేస్తున్న పని కరెక్ట్ అంటున్నారు.

cbn reveiw 24112018

సమస్యలు పరిష్కరించాలని మీ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు! ఎన్నికలప్పుడే మేం గుర్తుకొచ్చామా? ఏం ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతున్నావ్‌? ... తెలంగాణలో పలుచోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమవున్నాయి. ‘మీరు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నిత్యం ప్రజల్లో ఉంటే తిరస్కారం ఉండదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు పదేపదే చెబుతున్నారు. వెరసి, తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న అనుభవాలు ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నాయి. అంతకుముందుకంటే ఎక్కువ సమయం ప్రజల్లో ఉంటూ... సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే దిశగా జాగ్రత్త చర్యలు మొదలు పెట్టారు. తెలంగాణలో ఎమ్మెల్యేల నిలదీత దృశ్యాలను ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

cbn reveiw 24112018

మరో ఆరు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. నియోజకవర్గాల్లో తాము ఇప్పటిదాకా పెద్దగా వెళ్లని నివాస ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్యేలు లెక్కలు తీస్తున్నారు. ముందుగా అక్కడకు వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కింది స్ధాయి నాయకులతో మాట్లాడుతూ పెండింగ్‌ సమస్యలు ఎక్కడ ఎలాంటివి ఉన్నాయో ఆరా తీస్తున్నారు. సొంత పార్టీలోనే ఉన్నా వివిధ కారణాలతో దూరమైన గ్రామ, మండల స్థాయి నాయకులతో సంబంధాలు మెరుగుపర్చుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా పూర్తిగా నియోజకవర్గ పర్యటనల్లో నిమగ్నమయ్యారు. బాగా ముఖ్యమైన పనిఉంటే తప్ప మెజారిటీ ఎమ్మెల్యేలు సచివాలయానికి కూడా రావడం లేదు. అనేక మంది మంత్రులు కూడా శాఖాపరమైన పనులు తగ్గించుకొని సొంత నియోజకవర్గాలకు, సొంత జిల్లాకు సమయం పెంచడం గమనార్హం.

భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన అగ్రనేత అద్వానీకి తన సొంత ప్రాంతంగా భావించే రాష్ట్రం రాజస్థాన్‌. 1947లో దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఆయన భవిష్యత్తుకు పునాదిపడింది జైపుర్‌ నుంచే. రాజస్థాన్‌లో పర్యటించడం తనకెంతో సంతోషం కలిగిస్తుందని పలు ఇంటర్వ్యూల్లో పెద్దాయన చెప్పారు కూడా. పలు ఎన్నికల సందర్భంగా భాజపా అభ్యర్థుల తరఫున గతంలో ఎన్నోసార్లు రాష్ట్రంలో ప్రచారమూ చేశారు. కానీ... ఇప్పుడు మాత్రం ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ప్రస్తుత నాయకత్వం ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసిందని, కనీసం స్టార్‌ క్యాంపెయినర్‌గానైనా ఆయన సేవలను వినియోగించుకోవడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

adwani 23112018 2

అద్వానీకి అన్యాయం జరుగుతోందంటూ తొలితరం భాజపా మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా. రాజస్థాన్‌లో వసుంధర రాజె సర్కారు పై ప్రజా వ్యతిరేకత ఉన్నా... టికెట్ల కేటాయింపులో మాత్రం ఆమెదే పైచేయి అయింది. తన విశ్వాసపాత్రులకు పట్టుపట్టి మరీ టికెట్లు ఇప్పించుకున్నారామె. ఆ సంగతి ఎలాగున్నా, రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్న అధిష్ఠానం... అక్కడ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకుంది. ప్రాంతాలు, వర్గాల వారీగా ఉన్న ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలనీ... పోలింగ్‌ నాటికి పరిస్థితిని తారుమారు చేసి ఎలాగోలా ఓట్లు కురిపించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. రాజె సర్కారు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్న అధినాయకత్వం... వాటి ఆధారంగా పదునైన రాష్ట్ర ప్రచార ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తోంది.

adwani 23112018 3

పార్టీ రాష్ట్ర శాఖ కూడా ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాల ప్రచారంపైనే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వసుంధర ప్రచార కార్యక్రమాల కంటే మోదీ, షాల ప్రచార సభలు, ర్యాలీల నిర్వహణకే అధిక ప్రాధాన్యమిస్తోంది. కాగా, రాష్ట్రంలో ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాల ప్రచార కార్యక్రమాలు ఖరారయ్యాయి. ఈ నెల 25న అల్వార్‌, భిల్వారా, బేణేశ్వర్‌ ర్యాలీలతో ప్రారంభమయ్యే మోదీ ర్యాలీలు డిసెంబరు 4 వరకూ కొనసాగుతాయి. కీలకమైన కోటా, నాగౌర్‌, భరత్‌పుర్‌, జోధ్‌పుర్‌, హనుమాన్‌గఢ్‌, జైపుర్‌, సికార్‌లలో ఏర్పాటుచేసే భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనే అవకాశముంది.

తెలుగు గడ్డ పై అడుగు పెట్టిన వేళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి, ఆంధ్రాను అన్యాయం చేసిన పాశ్చాత్తాపం సోనియా గాంధీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి, ఏపిలో అడ్రస్ లేకుండా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే సందర్భంలో, కాంగ్రెస్ చేసిన అన్యాయం, మోడీ సరి చేస్తారని ఏపి ప్రజలు నమ్మారు. కాని మోడీ నమ్మక ద్రోహం చేసారు. నమ్మించి గొంతు కోశారు. ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వము అని తేల్చి చెప్పేశారు. రాష్ట్రానికి అన్యాయం చెయ్యటమే కాక, రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలనే కుట్ర కూడా పన్నటంతో, చంద్రబాబు దేశ వ్యాప్తంగా మోడీ పై యుద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంలో, తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సోనియా గాంధీ, ఏపి టాపిక్ తోనే, తన స్పీచ్ మొదలు పెట్టారు.

sonia 23112018 2

ఏపికి అన్యాయం చేసాం, మేము సరిచేస్తాం అనే భావం, ఆమె స్పీచ్ లో కనిపించింది. ‘‘ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్‌లో ప్రకటన చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. ప్రతి తల్లీ తన సంతానం బాగుపడాలని కోరుకుంటుంది. నేనూ అలాగే కోరుకున్నా. కానీ, మీ జీవితాలు, బతుకులు చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది." అంటూ సోనియా చెప్పారు. తెలంగాణా ఇస్తామని మాటిచ్చాం,రాజకీయంగా మాకు నష్టం జరుగుతుంది అని తెలిసినా, ఆ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణా ఇచ్చాం. ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా ఇస్తామని మట్టిస్తున్నాం అని, ఏపి ప్రజలకి సందేశం ఇచ్చారు.

sonia 23112018 3

"తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కష్టతరమైన సమస్య అనిపించింది. అప్పుడు ఆంధ్ర్రా, తెలంగాణ ప్రజల బాగోగులు రెండూ నా కళ్ల ముందు ఉన్నాయి. అంత పెద్ద సమస్య అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆంకాక్షల, స్ఫూర్తి గుర్తించి వారి కలను సాకారం చేశాం. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా మాకు నష్టం జరిగింది. అయినా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్‌లో ప్రకటన చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం.' అని సోనియా గాంధీ చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read