ఎప్పుడూ స్లో గేర్ లో ఉండే చంద్రబాబు, ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్నారు. ఒక పక్క జాతీయ స్థాయిలో మోడీ, షా లకు చుక్కలు చూపిస్తూనే, రాష్ట్రంలో కోడి కత్తి పార్టీ, కోతి మూక పార్టీకి చెక్ పెడుతున్నారు. వీళ్ళనే కాదు, సొంత పార్టీ నేతలను కూడా చంద్రబాబు ఒక రేంజ్ లో ఏసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన రెండు రోజుల పర్యటన శనివారం ముగిసింది. సాయంత్రం వరకూ పార్టీ సమీక్షలు జరిపారు. తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలవరకూ పార్టీ నేతలతో మాట్లాడారు. పనితీరు సరిగా లేని నాయకులను మందలించారు.

cbn 04112018 2

ఐక్యంగా పనిచేయాలని, పక్క నియోజకవర్గాలనూ పట్టించుకోవాలని హితవు పలికారు. కొందరు నాయకుల పేరు చెప్పకుండానే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే వారిని మార్చేస్తానని స్పష్టం చేశారు. నాయకుల పనితీరు మొత్తం నాకు తెలుసు. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో అక్కడ ఉంచుతా అని అన్నారు. జిల్లాను పట్టించుకోవడం లేదంటూ మంత్రులకు చురకలంటించారు. ‘మంత్రి శిద్దా రాఘవరావు తన వర్గానికి ప్రాధాన్యమిస్తారు. ఇన్‌ఛార్జి మంత్రి నారాయణకు మొహమాటం ఎక్కువ.. ఈ ఇద్దరూ సీరియస్‌గా తీసుకోని కారణంగా జిల్లాలో విభేదాలు పెరుగుతున్నాయి’ అని అధినేత వ్యాఖ్యానించారు.

cbn 04112018 3

మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డిని మందలించారు. ‘మీకు చాలాసార్లు చెప్పా, మారడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా అక్కడి ఎమ్మెల్యే స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లను మందలించారు. ‘ఒకసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన మహా నాయకులు అయిపోతున్నారా? ప్రధాని అయిన తర్వాత మోదీకి అహం పెరిగిందని స్పష్టమవుతోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందరినీ ఒకేలా చూడాలి. అహం చేరకూడదు. నేను ఒక్క ప్రకటన చేస్తే మీరు కింద కార్యకర్తల పక్కన కూర్చుంటారు’ అని హెచ్చరించారు. ఇకనైనా మారాలని, లేకుంటే తానే మారుస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

దాదపుగా సంవత్సర కాలంగా, అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతికి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ రానుందని సమాచారం. సినిమాలు, సీరియళ్లు, మ్యూజిక్‌ తదితర రంగాల్లో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అగ్రగామిగా ఉంది. మన దేశంలో ముంబై కేంద్రంగా సినిమాలు, సీరియళ్లను నిర్మిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో సోనీ అంటే ఒక బ్రాండ్‌. అంత పెద్ద బ్రాండ్‌ రాష్ట్రానికి వస్తే అది గేమ్‌ చేంజర్‌గా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

sony 04112018 2

ఎప్పటి నుంచో ఈ సంస్థను తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ నెలలోనే మరోసారి ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. ఈసారి ఏదో ఒక ఒప్పందం జరిగే దిశగా చర్చలు ఉంటాయని తెలుస్తోంది. అమరావతిలో ఒక స్టూడియో నిర్మిస్తే, దానికి పూర్తి సహకారం అందించేందుకు సోనీ ఆసక్తి కనబరుస్తోంది. సాంకేతికంగా, వ్యాపారపరంగా అవకాశాలను తీసుకొచ్చేందుకు సహకరిస్తానంటోంది. ముంబై స్టూడియోల్లో తమ సంస్థ నిర్మిస్తున్న సినిమాలు, సీరియళ్లను కూడా ఇక్కడికే తీసుకొస్తామంటోంది.

sony 04112018 3

సోనీ లాంటి సంస్థ వ్యాపార అవకాశాలు ఇచ్చేందుకు, సాంకేతిక సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే...స్టూడియో నిర్మాణం తాము చేపడతామని తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు ముందుకొస్తున్నట్లు తెలిసింది. మరో పక్క గన్నవరం మేథాటవర్స్‌లో ప్రారంభించిన హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ర్టీట్‌ నెలరోజుల్లోనే విస్తరణకు సిద్ధమైంది. ప్రారంభ సమయంలో సుమారు 900 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ క్రమంలో చాలా త్వరలోనే అది విస్తరణ బాటకు సిద్ధమైంది. మరో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు త్వరలోనే నియామకాలు చేపడతామని ప్రభుత్వానికి మాటిచ్చింది.

2014 ముందు వరకు, తాగేందుకు నీళ్ళు కూడా లేని జిల్లా అది. తర తరాలుగా కరువుతో అల్లాడే జిల్లాగా పేరుంది. అలాంటి జిల్లాలో చంద్రబాబు చొరవతో, పాతాళ గంగ ఉప్పొంగింది. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు రావటంతో, కృష్ణా జలాలు అన్నీ ఇటు వైపు మళ్ళాయి. దీంతో ఒకప్పుడు తాగటానికి నీళ్ళు లేని చోట, ఇప్పుడు బోటు షికార్ జరుగుతుంది. అనంతపురం జిల్లాలో ఎప్పుడు చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. తాగు, సాగునీటి కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలే తగువులాడుకుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లో ఉన్న జిల్లాలో బోటు షికార్లు ఏమిటా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ అక్కడి దృశ్యాలు చూస్తే మాత్రం "ఔరా!'' అని మీరు ఆశ్చర్యపోక తప్పదు.

boat 03112018 2

నీటి కొరతగా పేరున్న జిల్లా అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బోటు షికారును ప్రారంభించారు. అనంతపురం నగర నడిబొడ్డు నుంచి మిడ్ పెన్నార్ దక్షిణ కాలవ పులివెందులకు వెళుతుంది. కాలువకు ఆనుకొని అనంతపురం శిల్పారామం ఉంది. తడకలేరు వాగుమీద రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌.. షార్ట్‌కట్‌లో చెప్పాలంటే ఆర్‌డీటీ సహకారంతో కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద చెక్‌డ్యామ్ నిర్మించారు. హెచ్ఎల్‌సీ నీరు శింగనమల చెరువుకు ఈ చెక్‌డ్యామ్ నుంచి వెళుతుంది. ఈ నేపథ్యంలోనే అనంత ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ఓ ఆలోచన చేశారు. అనంత ప్రజలకు ఆటవిడుపునిచ్చే పిక్నిక్‌ సెంటర్లు లేవు. కనుక కొన్ని బోట్లు రప్పించి చెక్‌డ్యామ్‌లో వేయించారు.

boat 03112018 3

వీటిలో షికారు చేసే అవకాశం ప్రజలకు కల్పించారు. ఇటీవలే ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్‌ స్వరూప, డిప్యూటీ మేయర్‌ గంపన్న ఈ ఆహ్లాదకర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి బోటు షికారు చేస్తూ సెల్‌ఫోన్‌లో పరిసరాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. "ఎమ్మెల్యే మంచి ఆలోచన చేశారు. బోటు షికారు వల్ల ప్రజలకేమో ఆటవిడుపు. వసూలు చేసే రుసుము వల్ల సర్కారుకి ఆదాయం'' అంటూ కొందరు ప్రభాకర్‌చౌదరిని అభినందిస్తున్నారు. అనంతపురం వాసుల మదిని గెలిచే ఆలోచనలు చేయడం ద్వారా ప్రభాకర్‌ చౌదరి తన ఓట్‌బ్యాంక్‌ని పెంచుకుంటున్నారని పరిశీలకులు కూడా అంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రేమికులు, యువత ఆయన పనులను ప్రశంసిస్తున్నారు.

తెలుగు ప్రజలందరికీ నమస్కారములు... మోడీ నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందాం..

మోడీ నియంతృత్వ విధానాల వల్ల నేడు దేశం విపత్కర పరిస్తితులను ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ కూనీ అవుతోంది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటున్నది. వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. డీమానిటైజేషన్‌ వల్ల రెండు కోట్ల మందికి ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారు. సెక్యులరిజం ప్రమాదంలో పడింది. రాష్ట్రాల హక్కులన్నీ కేంద్రం హరిస్తోంది. విభజన చట్టంలోని 18 అంశాలను అమలు చేయలేదు. ప్రత్యేక హోదాను నిరాకరించింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ఇచ్చిన రూ.350కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను అణగదొక్కుతూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది.

తెలుగువారి హక్కుల పరిరక్షణ కోసం, దేశ రక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సెక్యులర్‌ వ్యవస్థ సంరక్షణకోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నడుంబిగించారు. రెండు దఫాలు ఢిల్లీకి వెళ్లి మోడీ నియంతృత్వాన్ని వ్యతిరేకించే జాతీయ, ప్రాంతాయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందనతో తెలుగువారి ప్రతిష్ట దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. వైఎస్‌ఆర్‌ పార్టీ, జనసేన మోడీ నియంతృత్వాన్ని వ్యతిరేకించకపోగా.. ఆ రెండు పార్టీలు తెలుగుదేశంపై చేస్తున్న దాడి మోడీ నియంతృత్వానికి వంతపాడటం కాదా.?

1. సేవ్‌ నేషన్‌, సేవ్‌ డెమోక్రసీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించారు. 2. మోడీ నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని దేశంలోని ప్రధాన పక్షాలన్నీ స్వాగతిస్తుంటే.. వైసీపీ, జనసేన ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. మోడీతో వారి లాలూచీకి ఇది తాజా నిదర్శనం కాదా.? ఈ పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టవా.? కేవలం వారి పార్టీ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలే ముఖ్యమా.? 3. తెలుగుదేశం పార్టీ ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాదు. పార్టీలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలు, స్వలాభం కోసం పుట్టిన పార్టీలు, పుఘలో పుట్టి మఘలో మాయమయ్యాయి. విధానాలు, ప్రజా ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీలు మాత్రమే సుధీర్ఘకాలం మనగలిగాయి. తెలుగుదేశంపై ఎన్నో దాడులు చేసినప్పటికీ గత 36ఏళ్ల నుంచి దినదినాభివృద్ధి చెందుతోందంటే కారణం.. తెలుగుదేశం విధానాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పుట్టిందని రుజువవుతోంది.

4. తెలుగుదేశం.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సమగ్రాభివృద్ధి కోసం, కేంద్రం యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. నాడు తెలుగువారిని కేంద్ర ప్రభుత్వం వీపుమీద కొడితే.. నేడు మోడీ ప్రభుత్వం తెలుగువారి కడుపు కొడుతున్నది. 5. స్వర్గీయ ఎన్టీరామారావు గారి విధానాలను నేడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ.. మోడీ నియంతృత్వంపై పోరాడుతున్నారు. 6. కాంగ్రెస్‌తో కలిసి ఉద్యమించటాన్ని.. ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తోందని బీజేపీ, వైసీపీ, జనసేన నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌లో అవినీతి చక్రవర్తి అయిన కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షుడిగా పెట్టుకున్న బీజేపీ.. తెలుగుదేశానికి నీతి బోధ చేయటం హాస్యాస్పదం. ఎన్టీఆర్‌ను హింసించి అవమాన పరిచిన వైఎస్‌ కుమారుడి పార్టీలో లక్ష్మీపార్వతి చేరడం వల్ల ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తోంది. 7. పురందేశ్వరిగారు కాంగ్రెస్‌ పార్టీలో చేరినపుడు ఎన్టీఆర్‌ ఆత్మక్షోభించలేదా.? కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న పురందేశ్వరిని బీజేపీలో చేర్చుకున్నపుడు ఎన్టీఆర్‌ ఆత్మగుర్తుకు రాలేదా.?

8. దేశరక్షణ వ్యవస్థతో సహా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీబీఐ లాంటి వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. న్యాయవ్యవస్థల్లోను రాజకీయ జోక్యం చేసుకున్నారు. మీడియాపై అజమాయిషీ చేస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించిన రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులపై ఐటీ దాడులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. 9. ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని క్యాబినేట్‌ మంత్రులే మనీ లాండరింగ్‌ అన్నారు. డిమానిటైజేషన్‌తో వందలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. అస్తవ్యస్థమైన జీయస్‌టీతో వేలాది కంపెనీలు మూతబడి లక్షలాది యువత ఉపాధికి గండి కొట్టారు. 10. కర్నాటక ఎన్నికల్లో గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఢిల్లీలో గవర్నర్‌ జనరల్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసిన తీరును కోర్టు తప్పుపట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో చూశాం.

11. సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల్లో అవినీతి లొసుగులున్న నాయకులతో అనైతిక పొత్తు పెట్టుకొని రాజకీయంగా లబ్దిపొందేందుకు బీజేపీ వెంపర్లాడుతుంది. 12. కేంద్రంలోని బీజేపీకి న్యాయస్థానాలంటే లెక్కలేదు. ఎన్నికల కమిషన్‌ అంటే గౌరవం లేదు. అవినీతిని పెంచి పోషిస్తున్నారు. 13. విదేశాల్లో దాకున్న ధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు. ఆ పని చేయకపోగా.. బ్యాంకులకు టోకరా పెట్టిన వ్యక్తులకు అండగా నిలిచి విదేశాలకు పంపిస్తున్నారు. 14. రాఫెల్‌ డీల్‌లో కుంభకోణం జరిగిందని బీజేపీ నాయకులే చెప్పారు. పేదవారికి అండగా నిలవాల్సిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యవస్థలను పెంచి పోషిస్తోంది. 15. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రస్తుతానికి 15 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టే బాధ్యతను చంద్రబాబు నాయుడు తీసుకోవటాన్ని దేశ ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు.

మోదీ చెప్పిన అచ్చేదిన్‌ బీజేపీ నాయకులకు, బ్యాంకుల నుంచి వేల కోట్లు దోచుకుని పారిపోయిన అవినీతి పరులకు తప్ప ప్రజలకు రాలేదు. దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకువస్తున్నారు. మోడీ పాలనకు చరమగీతం పాడి దేశాన్ని రక్షించుకుందాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. లౌకిక వ్యవస్థను నిలబెట్టుకుందాం. రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకుందాం. దిగజారిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం.

Advertisements

Latest Articles

Most Read