బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే ముందు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల మధ్య బయట పడిన విబేధాలు. వచ్చే ఎన్నికల్లో, బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంది కాబట్టి, పొత్తులో భాగంగా ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరును, బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు నడ్డా ప్రకటించాలని జనసేన డిమాండ్ చేస్తుంది. అయితే జనసేన నేతల ఇచ్చిన అల్టిమేటంపై, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఘాటుగా సమాధానం చెప్పింది. ఇలాంటి అల్టిమేటంలకు బీజేపీ భయపడదని, జనసేనకు కౌంటర్ ఇచ్చింది బీజేపీ. రాష్ట్రంలో పొత్తులు పైన కానీ, పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థిపై కానీ, మా అధ్యక్షుడు నడ్డా పర్యటనలో ఎలాంటి ప్రస్తావన కానీ, ప్రకటన కానీ ఉండదు అని, బీజేపీ స్పష్టం చేసింది. మా బీజేపీలో కూడా చాలా మంది ముఖ్యమంత్రి అవ్వగలితే అభ్యర్ధులు ఉన్నారు అంటూ, జనసేన పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ, మా పార్టీలో ప్రతి కార్యకర్త సమర్ధుడే అంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ, మోడీ విధానాలు నచ్చే కదా, జగన్ మోహన్ రెడ్డి అన్ని బిల్లులకు మద్దతు ఇస్తున్నారని, రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తమకు మద్దతు ఇస్తున్నారని తేల్చి చెప్పారు...

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టెండర్లు వేసేందుకు ఎవరూ రావటం లేదు అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో 1250 పనులకు పంచాయతీ రాజ్ అండ్ ఆర్ అండ్ బీ లో వర్క్స్ కోసం టెండర్ లు పిలిస్తే, అందులో 900 పనులకు కాంట్రాక్టర్ లు ఎవరూ ఒక్క టెండర్ కూడా వేయలేదు. అందుకే ఈ రోజుకీ కూడా రాష్ట్రంలో, పంచాయతీ రాజ్ అండ్ ఆర్ అండ్ బీ లో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇప్పుడు తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ లో ఒక విచిత్ర క్లాజ్ పెట్టింది. అందులో ప్రభుత్వం కాంట్రాక్టర్ లకు డబ్బులు ఇవ్వక పోతే కోర్టుకు వెళ్ళకూడదని, పని పూర్తయినా కూడా బిల్లు వచ్చే వరకూ కూడా, కాంట్రాక్టర్ కానీ, సంబంధిత ఏజెన్సీ కానీ ఎదురు చూడాలని, అందులో పెట్టారు. అలాగే తమకు డబ్బులు రాలేదని కోర్టుకు వెళ్తే మాత్రం, వారు టెండర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే తాము ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే తీసుకోవాలని, డబ్బులు ఇవ్వటం లేదని, కోర్టుకు వెళ్తే కుదరదు అంటూ, అందులో తెలిపిన విషయం చూసి, కాంట్రాక్టర్లు ఆశ్చర్య పోయారు. ఎప్పుడూ లేని విధంగా, ఇదేమి క్లాజ్ అని, ప్రభుత్వానికి డబ్బులు చెల్లించే ఉద్దేశం లేకపోతేనే ఇలాంటివి పెడతారని అన్నారు.

jagan 31052022 2

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బయట పెడుతున్న లెక్కలు కానీ, వివిధ ఆర్టిఐ లెక్కల్లో వస్తున్న వాస్తవాలు కానీ, కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన బిల్లులు లక్ష కోట్లకు పైగా పెండింగ్ ఉన్నాయని, ఈ బిల్లులు నేటి వరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుకి అదనం. ఇక అలాగే నరేగా పనులకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఆపివేయటంతో, 7 వేల కోట్లకు సమబందించి, 500 కేసులు దాఖలు అయి ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుల పై జడ్జిమెంట్ ఇచ్చింది. కేంద్రం ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా, కేంద్రం మేము మొత్తం ఇచ్చేసాం అని చెప్పటంతో, డబ్బులు మొత్తం ఇవ్వాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. దీంతో ఇప్పుడు కొత్తగా పిలిచే టెండర్లలో, ఎవరూ కోర్టుకు వెళ్ళకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ఎత్తు వేసింది. అయితే ఈ టెండర్ లో కూడా, ఈ రోజు గడువు ముగియటంతో, ఒక్కరు కూడా ఈ టెండర్ కూడా వేయలేదని తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల వేట కొనసాగిస్తూనే ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్లు అప్పుని తీసుకుంది. గత వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బండ్లను వేలం వేసి, ఈ నిధులను సేకరిస్తుంది. ఈ రోజు రూ.వెయ్యి కోట్లను 8 ఏళ్ల కాలానికి, 7.63 శాతం వడ్డీతో ఒకటి, అలాగే మరో రూ.వెయ్యి కోట్లను 5 ఏళ్ళ కాలానికి 7.46 శాతానికి సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి, రుణంగా సమీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.36 వేల కోట్లను FRBM కింద రుణ పరిమితి ఇచ్చారు. అయితే ఈ రూ.36 వేల కోట్లలో గత వారం రోజుల్లోనే, రూ.5 వేల కోట్లను సెక్యూరిటీ బండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే ఈ రూ.36 వేల కోట్లలో, ఇప్పటికే రూ.5 వేల కోట్లు తీసుకోవటంతో, ఇంకా రూ.31 కోట్లు మాత్రమే పరిమితి ఉంది. ఒక్కసారి ఈ FRBM పరిధి ముగిసిపోతే, ప్రతి వారం ఢిల్లీ వెళ్లి, ఆర్ధిక మంత్రి, అధికారులు అక్కడకు వెళ్లి, అందరి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రూ.31 వేల కోట్లు గట్టిగా మూడు నెలల్లోనే మనోళ్ళు లాగేస్తారని, ట్రాక్ రికార్డు చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ రూ.31 వేల కోట్లు అయిపోతే, మళ్ళీ మనోళ్ళు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.

rbi 18052022 2

గత ఏడాది కూడా ఇలాగే దాదాపుగా నాలుగు నెలల ముందే రుణ పరిమితి అయిపోవటంతో, ప్రతి వారం కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధిక శాఖ చుట్టూ తిరిగితేనే, ఆ రుణం ముట్టింది. ఈ ఏడాది మాత్రం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి రుణ పరిమితి ఇచ్చే సమయంలో, అన్ని లెక్కలు చెప్పాలని కోరింది. 26 పేజీల లేఖను కేంద్ర ఆర్ధిక శాఖ, రాష్ట్రానికి రాసినా కూడా, రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వలేదు. ఆ తరువాత, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, అంటే బడ్జెట్ లో చూపని అప్పుల వివరాలు కూడా, తమకు సమర్పించాలని, ప్రినిసిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగింది. ముఖ్యంగా కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ద్వారా తీసుకొచ్చిన అప్పులు వివరాలు ఇవ్వాలని లేఖలు రాసింది. అవి ఇస్తేనే, తాము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, ఆదాయ పట్టిక రూపొందించి, అప్పులు ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు, ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. ఆదాయం లేకపోవటంతో, మళ్ళీ అప్పులతో నెట్టుకుని వస్తున్నారు.

వైసీపీ పార్టీ చేస్తున్న గడగడపకూ కార్యక్రమంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురు అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే వారి పరిధిలోని ఓటర్ల ఇళ్ళకు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా, ఇళ్ళకు వెళ్తున్న వారిని, ప్రజలు అనేక సమస్యల పై నిలదీస్తూ, చుక్కలు చూపిస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక, వారి తిట్లు వినలేక, వైసీపీ ఎమ్మెల్యే సతమతం అవుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఎమ్మేలే గ్రంధి శ్రీనివాస్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. ఆయన ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో, ఒక మహిళ ఇటీవల పెంచిన కరెంటు బిల్లులు గురించి ప్రస్తావించింది. కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని తగ్గించాలని ఎమ్మెల్యేని కోరింది. అయితే దీని పైన ఎమ్మెల్యే ఆ మహిళను సముదాయిస్తూ చెప్పిన సమాధానంతో, ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. రాష్ట్రంలో పెంచిన కరెంటు చార్జీలకు కారణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పుకొచ్చారు. అక్కడ నుంచి మనకు బొగ్గు వస్తుందని, ఆ బొగ్గు సరఫరా ఇప్పుడు ఆగిపోవటంతో, వాటి కొనుగోలు వేరే చోటు నుంచి చేయాల్సి వచ్చిందని, అందుకే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్లే, ఇలా కరెంటు చార్జీలు పెంచాల్సి వచ్చింది అంటూ, దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు.

gadpagadapaku 18052022 2

అయితే ఇదే అంశం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో, ఆ వీడియో వైరల్ అయ్యింది. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేల మాటలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయం మోడీకి ఇంకా తెలియదని, ఇలా కూడా చెప్పొచ్చు అని తెలిస్తే, మోడీ కూడా ఇదే ప్రచారం చేస్తారు అంటూ, నార్త్ ఇండియా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే, తమ అసమర్ధతను కప్పి పుచ్చికోవటానికి, ఇలా యుద్ధం పైన తోసేసారు. అసలు మనం ఎప్పుడూ కూడా రష్యా నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్న దాఖలాలు లేవు. జగన్ మోహన్ రెడ్డి ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచితే, ఆ విషయం ప్రజల్లో వ్యతిరేకత ఉందని గమనించి, ఇలా అమాయకపు జనాలను, యుద్ధం వచ్చిందని, అందుకే ఇలా కరెంటు చార్జీలు పెరిగాయని మాయ చేస్తున్నారు. నిన్నటి వరకు, కరోనా సాకు చూపించిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు యుద్ధం సాకు చూపి, ప్రజల్లో తన అసమర్ధతను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అంత పిచ్చోళ్ళు లాగా కనిపిస్తున్నారు మరి ?

Advertisements

Latest Articles

Most Read