అమిత్ షా.. ఈయన ఒక రాజ్యసభ ఎంపీ.. ఒక పార్టీకి అధ్యక్షుడు.. మరి ఏ అధికారంతో అన్నారో కాని, ఏకంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక రాష్ట్ర ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు. మీ ప్రభుత్వాన్ని కుల్చేస్తాం జాగ్రత్తా అంటూ హెచ్చరించారు. శబరిమల ఆలయంలో జరుగుతున్న గొడవలని, బీజేపీ తన హిందుత్వ అజెండాకు అనుకూలంగా మార్చుకుంది. ప్రజల ఎమోషన్స్ ని, రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ‘‘శబరిమలపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలన్న కేరళ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన అయ్యప్ప భక్తుల అరెస్టులు ఇలాగే కొనసాగితే మేం(బీజేపీ) ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హెచ్చరించారు.

amitshah 28102018 2

కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న సీఎం విజయన్‌ నిప్పుతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆరెస్సెస్‌, బీజేపీ, ఇతర సంఘాలకు చెందిన 2వేల మందికి పైగా భక్తులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిందని షా ఆరోపించారు. శనివారం కన్నూర్‌లో జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గున్న ఆయన, ఈ వ్యాఖ్యలు చేసారు. ఓ వైపు కేరళలలో సీన్‌ హీటెక్కుతుంటే.. అమిత్ షా పర్యటన మరింత సెగ రాజేసింది. ఆందోళనకారులకు అడ్డుగోడగా బీజేపీ ఉంటుందన్నారు అమిత్ షా. కేరళ సీఎం విజయన్‌ను తీవ్రంగా హెచ్చరించారు.

amitshah 28102018 3

అమిత్‌ షా వార్నింగ్‌లకు అంతే ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు కేరళ సీఎం విజయన్‌. అమిత్ షా వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందన్నారు. షా కామెంట్స్‌ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ దయాదాక్షిణ్యాలతో తాము అధికారంలోకి రాలేదని, ప్రజలు ఎన్నుకుంటే వచ్చామని చెప్పారు విజయన్‌. అయితే అసలు అమిత్ షా ఎవరని ? ఏ హోదాలో ఈ వ్యాఖ్యలు చేసారని విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు. ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్నే కుల్చేస్తాం అని హెచ్చరించటం పై అభ్యంతరం చెప్తున్నారు. డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్ అంటూ చంద్రబాబు నిన్న ఢిల్లీలో ఆందోళన చేసింది ఇందుకే అని అన్నారు.

సీబీఐలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై ఆరా తీసేందుకు దిల్లీకి చెందిన బృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న బృందం శుక్రవారం కాకినాడలో, శనివారం రాజమహేంద్రవరంలో పర్యటించిందన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం ఉదయం కాకినాడలోని సానా సతీష్‌బాబుకు చెందిన అతిధిగృహంలో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. గెస్ట్ హౌస్ లోనేగాక ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరిపారు. సీబీఐ డైరెక్టర్ల మధ్య చిచ్చుకు సతీష్‌బాబు వాంగ్మూలం కారణమైందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సోదాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లో ఉంటున్న సాన సతీష్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా, డీఎస్పీ దేవేంద్రకుమార్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

cbi 28102018 2

ఫిర్యాదు ఇచ్చిన సతీష్‌బాబు ఎవరు? ఆయనకు రాజకీయ, ఇతర పెద్దలతో ఏమైనా పరిచయాలున్నాయా? గత చరిత్ర తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సీబీఐ బృందం పర్యటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. కాకినాడకు చెందిన సాన సతీష్‌బాబు తండ్రి విద్యుత్‌శాఖలో ఏఈగా పనిచేస్తూ మరణించారు. పాలిటెక్నిక్‌ డిప్లొమో చదివిన సతీష్‌బాబుకు కారుణ్య నియామకం కింద అదే శాఖలో సబ్‌ఇంజినీరు ఉద్యోగం లభించింది. కాకినాడలో పనిచేస్తూ 2004లో దీర్ఘకాలిక సెలవు పెట్టారు. 2005లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం గుత్తేదారుగా మారి పలు వ్యాపారాలు చేశారు. పలు సంస్థలకు డైరెక్టర్‌గానూ వ్యవహరించారు.

cbi 28102018 3

ఉద్యోగం వదిలి 14 ఏళ్ల కిందటే ఆయన హైదరాబాద్‌ వెళ్లారు. 2007 ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శిగానూ వ్యవహరించినందున అప్పట్లో వివాదాస్పద వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలను కూడా సేకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాకినాడలోని పాతబస్టాండు సమీపంలో ఉప్పుటేరుకు అవతల మేడలైన్‌ అనే రెవెన్యూ గ్రామం ఉంది. ఇక్కడ ప్రైవేటుగా సాగిన భూసమీకరణ వ్యవహారంలో ఆయన పాత్ర ఉందా? ఇక్కడ నిర్మిస్తున్న ప్రైవేటు వంతెనకు అనుమతులు ఎలా ఇచ్చారు? తదితర అంశాలపైనా ఆరా తీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

మోడీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి అని అందరూ అంటున్నారు, కాని ఎవరూ ముందుకు రావటం లేదు. దేశ వ్యాప్తంగా మోడీ పై ఉన్న వ్యతిరేకతను, జాతీయ స్థాయిలో, జాతీయ పార్టీలు ఉపయోగించుకోవటం లేదు. మోడీ లాంటి బలమైన శక్తిని, కలిసి డీ కొట్టాలి అనే ఆలోచన మరిచి, ఎవరికీ వారే అన్నట్టు ఉన్నారు. ఇదే అవకాసంగా అమిత్ షా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి, వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో, బీజేపీ గట్టెక్కే ప్లాన్ వేసారు. ఇది గ్రహించిన చంద్రబాబు, నిన్న ఢిల్లీలో వేగంగా పావులు కదిపారు. మళ్ళీ అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేసారు. ఇందులో మాయావతితో మీటింగ్ మాత్రం, ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ అయ్యింది. కాంగ్రెస్ తో కలిసి వెళ్ళేది లేదని, మాయావతి ప్రకటించిన తరువాత, అలా విడి విడిగా పోటీ చేస్తే, ఓట్లు చీలి, బీజేపీ సునాయాసంగా గెలిచి పోతుంది అంటే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

cbn 28102018 2

నిన్న చంద్రబాబుతో కలిసిన తరువాత, దీనిపై పునరాలోచనకు సంసిద్ధత వ్యక్తం చేశారు మాయావతి. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల పరిస్థితిపై 45 నిమిషాలపాటు మాయవతితో చంద్రబాబు చర్చించారు. కాంగ్రెస్ తో పొత్తు తెంచుకుని... బీఎస్పీ విడిగా పోటీ చేస్తే బీజేపీకి భారీ రాజకీయ లబ్ధి చేకూరడం ఖాయం. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని, ఒంటరిగా పోటీ చేస్తామని మాయావతి చెప్పగానే... బీజేపీ ఆనందంలో మునిగిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ అంశాలపై చంద్రబాబు, మాయ మధ్య చర్చ జరిగింది. మాయ ఒంటరిపోరు వల్ల ఆ రాష్ట్రాల్లో బీజేపీకి ఎలా లబ్ధి జరుగుతుందో వివరిస్తూ వచ్చిన మీడియా కథనాలు, పోల్‌ సర్వేలు, ఇతర గణాంకాల ప్రస్తావన వచ్చింది. అయితే, కేవలం కాంగ్రెస్‌ స్థానిక నాయకత్వాలు బీఎస్పీ బలానికి తగినట్టు సీట్లు ఇవ్వలేదని, తమ ప్రాధాన్యాన్ని గుర్తించలేదని... అందుకే ఒంటరిగా పోటీకి దిగాల్సి పరిస్థితి వచ్చిందని మాయావతి చెప్పారు. తగిన ప్రాధాన్యం ఇస్తే కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు సిద్ధమని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

cbn 28102018 3

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీయేతర ప్రతిపక్షాలను కూడగట్టే దిశగా చంద్రబాబు చకచకా అడుగులు వేశారు. తన ఒక రోజు పర్యటనలోనే మాయావతి (బీఎస్పీ), ఫరూక్‌ అబ్దుల్లా (ఎన్సీపీ), కేజ్రీవాల్‌ (ఆప్‌), శరద్‌ యాదవ్‌ (జనతాదళ్‌ యు బహిష్కృత నేత) నేతలతో చర్చలు జరిపారు. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్రమోదీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని, అందుకు అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబు వద్ద నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా సూచించారు. మోదీ అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చారన్నారు. ‘‘దేశం ప్రమాదంలో పడింది. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి. ఇప్పుడు అది ముప్పులో పడింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేదలు మరింత పేదలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత దేశాన్ని కాపాడేందుకు సీనియర్లు కలిసి కట్టుగా కృషి చేయాలి’’ అని చంద్రబాబుతో భేటీ అనంతరం ఫరూక్‌ అబ్దుల్లా విలేకరులకు చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని... ప్రమాదంలో ఉన్న దేశాన్ని కాపాడేందుకు అందరూ తమతమ పాత్ర పోషించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

నాలుగున్నరేళ్ళుగా దేశ వ్యాప్తంగా ప్రధాని మోడి పరిపాలనా విధానం, ఆంధ్రప్రదేశ్‌ పై చూపిస్తున్న వివక్ష, ప్రతిపక్షాలను నిర్వీర్యం చెయ్యటం, కుట్రలు చెయ్యటం వంటి వాటి పై, దేశ వ్యాప్తంగా చెప్పేందుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఢిల్లీ పర్యటన చేసారు. రాష్ట్ర ప్రభుత్వం పై మూకుమ్మడిగా వ్యవస్థలను ఉపయోగించి దాడులు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అందర్నీ సమన్వయం చేసుకుంటూ... విభిన్న వేదికలు... విభిన్నకోణాల్లో దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తూ... ఆలోచన రగిలిస్తూ తన ప్రస్థానాన్ని లక్ష్యం దిశగా తీసుకెళ్తానని శనివారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధీమాగా ప్రకటించారు. ఇది అంతం కాదు.. ఆరంభం అని కుండబద్దలుకొట్టారు.

cbn press meet 28102018 2

కేంద్ర సర్కారు పై నిప్పులు చెరిగారు. 40 ఏళ్లుగా నేను క్రమశిక్షణతో ఉన్నాను. చిల్లర రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుతోందో దేశానికి చెప్పాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. మనది అద్భుతమైన దేశం. అందకే అమరావతిలో ఉండి మాట్లాడితే నేషనల్ మీడియాలో మీరు వెయ్యరని, ఢిల్లీ వచ్చి మాట్లాడుతున్నా అని, అయినా ఇక్కడ కూడా, మిమ్మల్ని ప్రసారం చెయ్యద్దు అంటూ ఆదేశాలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసని చంద్రబాబు అన్నారు. అన్ని వ్యవస్థలతో పాటు, మీడియాని కూడా వారి కంట్రోల్ లోకి తెచ్చుకున్నారని, వారికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న వారి పై కూడా ఐటి, ఈడీ దాడులు చేపిస్తున్నారని, చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అన్నట్టుగానే, నిన్న చంద్రబాబు మాట్లాడిన ప్రెస్ మీట్, నేషనల్ మీడియాలో లైవ్ రాలేదు.

cbn press meet 28102018 3

ఒకటి రెండు ఛానెల్స్ మినహా ఎవరూ లైవ్ ఇవ్వలేదు. చంద్రబాబు మాయావతిని కలవటం దగ్గర నుంచి అప్డేట్స్ మొదలు పెట్టారు. కాని, ఎంతో కీలకమైన ప్రెస్ మీట్ మాత్రం, రాకుండా చేసారు. అయితే, వీటి పై ఢిల్లీలో టిడిపి నేతలు ఆరా తియ్యగా, అమిత్ షా ఆఫీస్ నుంచి, చానల్స్ కు ఫోన్ లు వచ్చాయని, ప్రసారం చెయ్యవద్దు, చంద్రబాబు ఢిల్లీ పర్యటన కవరేజ్ ఇవ్వద్దు అంటూ, ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ఉదాహరిస్తూ, చంద్రబాబు పోయిన సారి ఢిల్లీ వచ్చి, రెండు చానల్స్ లో లైవ్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉండగా, అర్ధాంతరంగా అవి ఆగిపోయాయని, అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని అంటున్నారు. మొన్నటికి మొన్న, పవన్ కవాతు, ఎన్ని గంటలు అయినా లైవ్ ఇవ్వాలి అంటూ, తెలుగు మీడియాకు, రాం మాధవ్ ఫోన్ చేసి చెప్పటం కూడా ఉదాహరిస్తున్నారు. అన్ని వ్యవస్థలతో పాటు, మీడియాని కూడా మోడీ-షా నాశనం చేసారని, ఇది అప్రకటిత కర్ఫ్యూ లాగా ఉందని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read