జగన్ మోహన్ రెడ్డి ఏమి చేసినా, అద్భుతం, మహా అద్భుతం, అసలు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే జరగలేదు అని చెప్పే బ్లూ మీడియా, అలాగే పేటీయం బ్యాచ్ చేసే హడావిడి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా అలాంటి డబ్బానే మళ్ళీ మొదలు పెట్టారు. ఈ రోజు ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను ప్రకటించారు. మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ కాగా, మొత్తం నాలుగు స్థానాలు వైసీపీకే వచ్చాయి. అయితే ఈ నాలుగు స్థానాల పేర్లు చూసి, బిత్తరపోవటం, రాష్ట్ర ప్రజల వంతు అయ్యింది. ఒకటి విజయసాయి రెడ్డికి ఇచ్చారు. ఇది ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే, ఇవ్వక పోతే, కేసులతో ముడి పడి ఉన్న వ్యవహారం. పదవి లేకపోతే, రేపు కోర్టులో మినహాయింపులు, వగైరా వగైరా చేయటానికి వీలు ఉండదు. జగన్ కేసులతో ముడి పడిన అంశం కాబట్టి, ఇవ్వక తప్పదు. ఇక మరో స్థానం, నిరంజన్ రెడ్డి. ఈయన జగన్ కేసులు వాదించే లాయర్. జగన్ అక్రమ ఆస్తులు కేసులో, ప్రతి రోజు వాదించేది ఈయనే. కాబట్టి ఈయనకు కూడా ఇవ్వక తప్పదు. అంటే ఇక్కడ నాలుగు స్థానాలు ఉంటే, రెండు రెడ్లకే ఇచ్చేసారు జగన్ రెడ్డి. జనాభాలో 4శాతం ఉన్న కులానికి, 50% స్థానాలను కేటాయించారు. అదేమని ప్రజలు, విపక్షాలు అడుగుతారు కాబట్టి, మిగతా రెండు బీసీలకు ఇచ్చేస్తున్నాం అంటూ, దాన కర్ణుడిలా ప్రకటించారు.

ali 17052022 2

అందులో ఒకరు బీదా మస్తాన్ రావు అనే వ్యాపారవేత్త. మరోకాయినా తెలంగాణాకు చెందిన ఆర్.కృష్ణయ్య. ఇదే కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అమ్మనా బూతులు తిట్టిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి మరో టికెట్ ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు బీసిలే లేరు అనే విధంగా, పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి పదవి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో, దేని కోసం ఇచ్చారో, ఎలా ఇచ్చారో అందరికీ తెలిసిందే. ఇలా రెడ్లకు 50% ఇచ్చి, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేస్తున్నా అంటూ డబ్బా కొట్టారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినీ నటుడు ఆలీని నాలుగు నెలల క్రిందట, జగన వద్దకు పిలిపించారు. ఆయన తన భార్యతో కలిసి వచ్చారు. ఆలీకి రాజ్యసభ సీటు ఇస్తున్నారు అనే ప్రచారం జరిగింది. ఆలీకి గుడ్ న్యూస్ త్వరలోనే అని జగన్ కూడా చెప్పి పంపించారు. ఇప్పుడు రాజ్యసభ ఇవ్వకుండా, రెండు రెడ్లకు ఇచ్చి, మైనారిటీకి వెన్నుపోటు పొడిచారు. మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్ల ఎంపికలో, మంత్రి వర్గం లాగే గందరగోళం చేసి పడేసారు.

ఎన్నికల ముందు వరకూ జగన్ మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లో చెప్పిన మాట, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకుని వస్తాను, 25 ఎంపీ సీట్లు నాకు ఇవ్వండి, నేను ఢిల్లీలో అందరి మెడలు వంచేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. విభజన హామీలు, నిధులు, స్పెషల్ స్టేటస్, ఇలా అన్నీ మెడలు వంచి తెచ్చేస్తాను అని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. నిజంగానే జగన్ మెడలు వంచి తెస్తారేమో, నిజంగానే మనకు ఉద్యోగాలు, జిల్లాకో హైదరాబాద్ అవుతుంది ఏమో అని ప్రజలు అనుకుని, జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. అయితే తన అవసరం తీరగానే, జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాలు చూసుకోవటం మొదలు పెట్టారు. మెడలు వంచటం తరువాత, మోడీ కనిపిస్తే ఆయన కాళ్ళ మీద పడిపోవటం దగ్గర నుంచి మొదలైంది జగన్ మోహన్ రెడ్డి, మెడలు వంచే ప్రయాణం. ఇక్కడితో అయిపోలేదు, మెడలు ఎప్పుడు వంచుతున్నారు అని అడిగితే, ఏంటి వంచేది, ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప, మనం పీకేది ఏమి లేదని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అడుగుతూనే, అడుక్కుంటూనే ఉండాలి అని ఆయన చెప్పారు. దీనికి ప్రధాన కారణం, నరేంద్ర మోడికి, కేంద్రంలో బలం ఉందని, ఆయనకు మన సపోర్ట్ అవసరం లేదని, మన సపోర్ట్ అవసరం అయితే, మెడలు వంచే వాడిని అని చెప్పారు.

modi 16052022 2

అయితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు జగన్ మోహన్ రెడ్డి అవసరం, మోడీకి లేదేమో కానీ, ఇప్పుడు నరేంద్ర మోడీకి, జగన్ మోహన్ రెడ్డి అవసరం వచ్చి పడింది. ఒక విధంగా చెప్పాలి అంటే, ఇది జగన్ మోహన్ రెడ్డికి ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. అదే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక. కేంద్రంలో బీజేపీ అంత బలంగా ఉన్నా, రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం, బీజేపీ బలం సరిపోవటం లేదు. రాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 10,98,903 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఎంపీకి ఓటు విలువ ఉంటుంది. బీజేపీకి దాని మిత్రపక్షాలు కలిపి, 5,37,126 ఓట్లు అవుతాయి. అయినా కూడా 9,194 ఓట్లు తక్కువ అవుతాయి. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేడీ, జగన్ పార్టీ మాత్రమే, ఇవి భర్తీ చేయగలదు. టీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి ఓటు వేయదు. దీంతో, ఇప్పుడు జగన్ ఒక్కడే మోడీకి కీలకం అవుతారు. మరి ఇంత కీలకమైన జగన్, మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే, మీకు ఓటు వేస్తాను అని చెప్పే దమ్ము ఉందా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం, జగన్ మోహన్ రెడ్డి ఇంత సాహసం చేయగలరా ? జగన్ కు ఇంతకంటే మంచి చాన్స్ ఉండదు, మరి ఏమి చేస్తారో చూడాలి మరి.

తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పటుగా, అప్పట్లో మంత్రిగా పని చేసిన నారాయణతో పాటుగా, మొత్తం 14 మంది పై, నిన్న జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది. సిఐడి నమోదు చేసిన ఈ కేసులో భాగంగా, సిఐడి అధికారులు హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబు, నారాయణ కాకుండా, ఈ కేసుల్లో ఉన్న మిగతా వారి ఆచూకీ కనుక్కునే ప్రయత్నంలో సిఐడి ఉంది. సిఐడి అధికారుల బృందం, ఈ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబు, ఏ2గా ఉన్న నారాయణను మళ్ళీ అరెస్ట్ చేస్తారు అంటూ పుకార్లు వస్తున్నాయి. ముఖ్యంగా బ్లూ మీడియాలో ఈ లీకులు ఇస్తున్నారు. నారాయాణకు ఈ రోజు ఉదయం చిత్తూరు కోర్టు, రిమాండ్ ని తిరస్కరించింది. ఆయన పై ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, కోర్టు తిరస్కరించింది. అయితే నారాయణకు ఆ కేసులో బెయిల్ రాగానే, సిఐడి కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ, ప్రచారం జరిగింది. అయితే బెయిల్ వచ్చిన వెంటనే, నారాయణ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన ఈ రోజు కుప్పం పర్యటనకు వస్తున్నారు. హైదరాబద్ నుంచి కుప్పం రానున్నారు. అయితే చంద్రబాబుకి ఈ లోపే నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ, న్యాయ నిపుణులు మాత్రం ఏకీభవించటం లేదు. ఈ కేసులో నోటీసులు ఇవ్వకుండా, అదుపులోకి తీసుకొచ్చారని చెప్తున్నారు.

cbn 11052022 2

చంద్రబాబు పై పెట్టిన కేసులో, పదేళ్ళకు పైగా శిక్ష పడే సెక్షన్ లు కావటంతో, నోటీసులు ఇవ్వనవసరం లేదని, నేరుగా అరెస్ట్ చేయవచ్చు అని చెప్తున్నారు. అయతే చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రత, ప్రతిపక్ష నేత కావటంతో, అయనకు నోటీసులు ఇచ్చే చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే జగన్ విఖరి తెలిసిన వాళ్ళు మాత్రం, నోటీసులు ఇవ్వకుండానే చంద్రబాబుని అరెస్ట్ చేసే అవకాసం ఉందని చెప్తున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు, వీటిని లెక్క చేసే పనిలేదని, ఏదైతే అది అవుతుందని, అరెస్ట్ చేసే చేసుకోనివ్వండి అంటూ, కుప్పం పర్యటనకు బయలుదేరారు. తప్పు చేయనప్పుడు, వీళ్ళకు భయపడేది ఏంటి అంటూ చంద్రబాబు మొండిగా, ఈ రోజు పర్యటనకు వస్తున్నారు. అయితే చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, ఏమి జరుగుతంది అనేది చూడాల్సి ఉంది. అసలు భూసేకరణ, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో, కేసు పెట్టటమే ఒక కామెడీ అని అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఘాటు లేఖ పంపింది. అప్పులపై పూర్తి వివరాలు అందించాలని, రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులకు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తాజాగా రాసిన లేఖ, ఇప్పుడు రాష్ట్ర ఆర్ధిక శాఖ వర్గాల్లో గుబులు రేపుతుంది. దీని పై ఆందోళన కూడా ఆర్ధిక శాఖ అధికారులలో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్లు, సొసైటీల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి, చేస్తున్న అప్పులకు సంబంధించిన, వివరాలు పంపాలని చెప్పి, కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులతో పాటుగా, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కూడా రాష్ట్రా ఆర్ధిక శాఖకు లేఖ రాసింది. దీంతో పాటు, ఈ అప్పులు అన్నిటినీ , రాష్ట్ర ప్రభుత్వ అప్పులగా పరిగణిస్తామని కూడా చెప్తున్నారు. వీటి అన్నిటికీ మించి, కేంద్ర ఆర్ధిక శాఖలోని వ్యయ నియంత్రణా విభాగం, రాష్ట్ర ఆర్ధిక శాఖకు ఒక లేఖ రాసింది. రాష్ట్రంలో FRBM పరిమితికి మించిన తీసుకున్న అప్పులు, రాష్ట్రంలో అప్పులు, ఆదాయం, అప్పులకు సంబంధించిన వివరాలు పంపాలని, 26 పేజీల లేఖ రాయగా, ఆ లేఖ కు సమగ్ర సమాచారం రాష్ట్రం వైపు నుంచి ఇవ్వక పోవటంతో, కేంద్ర ఆర్ధిక శాఖ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.

modi 14052022 2

అయితే తాజాగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన కొత్త లేఖలో, ప్రధానంగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పై, అంటే బడ్జెట్ లో లేని, అప్పులు ఏవి అయితే ఉన్నాయో, కార్పోరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు ద్వారా అప్పులు తీసుకుని వస్తున్నారో, వేటికి అయితే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి అప్పులు తెస్తుందో, వాటి వివరాలు కావాలని కేంద్రం ఆదేశించింది. ఒక వేళ వివరాలు రాష్ట్ర ఆర్ధిక శాఖ పంపించకపోతే మాత్రం, బ్యాంకుల నుంచి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం, వాటిని తీప్పించుకునే అవకాసం ఉండటంతో, రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులలో టెన్షన్ ప్రారంభం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తున్న అప్పుల గుట్టు, అడ్డ దిడ్డంగా చేస్తున్న అప్పు గుట్టు ఇవి మొత్తం ఇప్పుడు బయట పడే టైం వచ్చింది. కేంద్రం ఒక్కో స్క్రూ గట్టిగా బిగిస్తూ వస్తుందని, త్వరలోనే సీన్ క్లైమాక్స్ కు వచ్చేస్తుందని, రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పుకు, తాము బలి కాబోతున్నారని భయపడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read