సినీ హీరో మంచు మనోజ్‌ అభిమానులకు ఓ లేఖ రాశారు. తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి షిఫ్ట్‌ అవుతున్నానని తెలిపారు. ‘తన వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకోవడానికి ‘పరుగు’ కూడా ఒక రోజు పరిగెత్తడం ఆపేస్తుంది. ఇవాళో రేపో ప్రతి ఒక్కరికీ ఈ పరిస్థితి తప్పదు. గమ్యంలేని లక్ష్యాలు ఎన్నటికైనా మనశ్శాంతిని దూరం చేస్తాయి. మన ప్రతీ లక్ష్యానికి ఒక గోల్‌ ఉండాలి. ఆ లక్ష్యం మన చుట్టూ ఉండే ప్రజల్ని ఉద్ధరించేలా ఉండాలి. ప్రపంచం మొత్తం తిరిగాను.. అన్ని జాతుల, మతాల, కులాల ప్రజల్ని కలిశాను. ఒక్క చిన్న బ్రెడ్‌ ముక్క కోసం గ్యారేజ్‌లో పనిచేసే వాళ్లను చూశాను."

manchu 22102018 2

"ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాను. స్నేహితుల కోరిక మేరకు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించాను. అన్నీ సంతృప్తితో చేశాను. నా చుట్టూ ఉండే ప్రజల సంతోషం కోసమే ఇవన్నీ చేశాను. ప్రపంచంలోని ప్రతి దిక్కూ తిరిగాను. దేశంలోని ప్రతి మూలా చూశాను. ఆ దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం అద్భుతం, అమోఘం. నేను కోరుకునే మనశ్శాంతి నాకు తిరుపతిలో దొరికిందని కచ్చితంగా చెప్పగలను. నేను పెరిగిన ప్రదేశం, నా ఎదుగుదలకు కారణమైన ప్రదేశం ఇది. స్వేచ్ఛగా ప్రపంచానికి రెక్కలు విప్పుకొని ఎగిరేలా చేసింది ఈ ప్రదేశం. అణువణువు దైవత్వంతో నిండి ఉన్న ఈ తిరుపతి గాలి పీల్చినప్పుడు ఏదో తెలియని శక్తి నన్ను ఆవహిస్తుంది."

manchu 22102018 3

"తిరుపతి నుంచి మొదలయ్యే ఈ సహాయం ప్రపంచమంతా చేరువయ్యేలా తపిస్తాను.. ముందుగా ఇక్కడి యువతకి సహాయపడేలా ఏదైనా చేస్తాను. నా వల్ల ఈ లోకానికి కలిగే ప్రయోజనమేంటో వెతికే క్రమంలో కొన్ని నెలలు తిరుపతికి షిఫ్ట్‌ అవుతున్నాను. రాయలసీమలో ప్రారంభించే నా ఈ సరికొత్త ప్రయాణం ఇక్కడికే పరిమితం కాదు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కూడా ఈ అర్థవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నా సినీ, రాజకీయ జీవితంపై ఎవరు ఎలాంటి తీర్మానాలు చేయవద్దు. సినిమాలపై నాకున్న ఆసక్తి ఎప్పుడూ తగ్గదు.. విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాలనే దాహం ఎన్నటికీ తీరదు. నా జీవితాన్ని ఈ నేల యువతకి అంకితం చేస్తున్నాను. రాయలసీమ వస్తున్నా రాగి సంగటి, మటన్‌ పులుసు సిద్ధంగా పెట్టండి.. మీ మంచు మనోజ్‌’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీంతో మనోజ్‌ నటనకు దూరమవుతున్నారని, రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒకసారి తాను ఇక సినిమాలు చేయబోనని ప్రకటించి, అభిమానుల కోరిక మేరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

రౌడీలు ఏపీ బయటే ఉండాలని, పోలీసుల త్యాగాలకు నిదర్శనమే అమరవీరుల సంస్మరణ దినం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు పేర్కొన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ... ఎర్రచందనం సంపదను ప్రాణాలు అడ్డేసి పోలీసులు కాపాడారని, అలాగే విజిబుల్ పోలీసింగ్.. ఇన్విజిబుల్ పోలీస్ విధానం అవలంభించాలన్నారు. రాజకీయం ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలను అడ్డుకోవడంపై పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, తుని ఘటన, విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనలు అలాంటివేనని సీఎం అన్నారు.

cbn 22102018 2

పోలీసులు తమ జీవితాన్ని దేశం కోసం ప్రజల కోసం అంకితం చేయడం గొప్పసేవానిరతి అన్నారు. పోలీసులకు కుటుంబం కంటే ప్రజాసేవ అంటేనే ఇష్టం అని, అలాగే ‘ప్రజల భద్రతే మా ధ్యేయం.. ఫ్రెండ్లీ పోలీసింగే మా లక్ష్యం’ అని సీఎం అన్నారు. దేశ వ్యాప్తంగా 414 మంది, రాష్ట్రవ్యాప్తంగా 6గురు పోలీసులు విధినిర్వహణలో మరణించారని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. పోలీసు కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని.. ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించే బాధ్యతను పోలీసులు సమర్ధవంతంగా నిర్వహించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు కోరారు.

cbn 22102018 3

రాజకీయ ముసుగులో అరాచకాలు సృష్టించాలనుకునే వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అధునాతన సాంకేతికతను తమకు అనువుగా మార్చుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపట్ల జాగరూకులై ఉండాలని కోరారు. పోలీసు సంక్షేమ నిధికి రూ.15 కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పోలీసు కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసు ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ విరమణలోగా కనీసం ఒక పదోన్నతైనా వచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పోలీస్‌ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని.. త్వరలో 2500 కానిస్టేబుళ్ల నియామకం చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు. హాజరైన వారంతా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

దేశంలో ఎవరికి వారు పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంలో స్వీయ నియంత్రణ విధించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్ని చైతన్యం చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే నిర్దిష్ట కాలపరిమితి చెల్లిన వాహ నాలు కాలుష్యంతో పాటు అధిక ఇంధన వినియోగానికి కారణమౌతున్నందున వాటిని వది లించుకోవాలని కూడా సూచించేందుకు సిద్దమౌతోంది. వ్యక్తిగత వాహ నాల వినియోగాన్ని వీలైనంతగా తగ్గించి ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని కూడా ప్రజల్ని కోరనుంది. ఇందుక్కారణం దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. అదే స్థాయిలో వీటి దిగుమతికి కేంద్రంపై ఆర్ధిక భారం భారీగా పడు తోంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసే పరిస్థితి ఏర్పడుతుంది.

petrol 21102018 2

ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు 17.98 మిలి యన్‌ టన్నులు జరిగాయి. గతేడాది ఆగస్టులో ఇది 16.91 మిలియన్‌ టన్నులు మాత్రమే. సరిగ్గా గతేడాది ఆగస్టుతో పోలిస్తే సుమారు ఐదుశాతం పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో వృద్ది చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ వినియోగం 26మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు లేదా 35.36 బిలియన్‌ లీటర్లకు చేరుకుంది. దేశ జనాభా 132 కోట్లు కాగా సగటున ఏడాదికి ప్రతి వ్యక్తి 26.78 లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తున్నాడు. అలాగే డీజిల్‌ వినియోగం 82మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు లేదా 98.40బిలియన్‌ లీటర్లకు పెరిగింది. ప్రతి వ్యక్తి ఏటా సగటున 74.54లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నాడు. చైనాలో ఇందన సగటు వినియోగం 476లీటర్లుగా ఉంటే భారత్‌లో 175.3లీటర్లే. అయితే చైనాలో వినియోగిస్తున్న పెట్రోలియం ఉత్పత్తుల్లో 49.48శాతం మాత్రమే దిగుమతులు. అదే భారత్‌ కొచ్చేసరికి 78.35శాతం దిగుమతులపైనే ఆధాపడాల్సొస్తోంది.

petrol 21102018 3

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ దిగజారిపోతోంది. ఈ రెండింటి కారణంగా పెట్రోల్‌పై చెల్లించాల్సిన విదేశీ మారకద్రవ్యం పెద్దెత్తున ఖర్చైపోతోంది. ఇది భారత ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పిజిల విక్రయాలపై సబ్సిడీల్ని తొలగించిన ప్రభుత్వం ఇకముందు వీటి వినియోగానికి రేషన్‌ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టమౌతోంది. పెట్రో భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే ప్రధాని సంబంధిత మంత్రులు, అధికారులు, నిపుణుల్తో పలుమార్లు సమావేశాలు జరిపారు. తక్షణం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని అందుబాటులోకి తెచే ఆలోచన చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని వీలైనంత తగ్గించే మార్గాలపై చర్చలు జరిపారు. ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ వాహక వాహనాల్ని పెద్దసంఖ్యలో అందుబాటులో తేవాలని ప్రతిపాదించారు.

ఈ దశలో ప్రజల్ని పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంలో స్వీయ నియంత్రణ పాటించే విధంగా చైతన్యపర్చాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోల్‌, డీజిల్‌లకు రేషన్‌ విధానం పెట్టాలని కూడా ప్రతిపాదించింది. స్కూటర్లు, కార్లు, లారీలు, ఇలా వాహనాన్ని బట్టి నిర్ధిష్ట పరిమాణాన్ని మాత్రమే వినియోగానికి అనుమతించాలని భావిస్తోంది. అలాగే కాలపరిమితి తీరిన వాహనాలు కాలుష్యంతో పాటు ఇంధనాన్ని అధికంగా వినియోగిస్తున్నందున నిర్దిష్ట కాలపరిమితి దాటిన వాహన వినియోగాన్ని కఠినంగా కట్టడి చేయాలని కూడా నిర్ణయించింది. వీటితో పాటు ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలన్న వ్యూహాలక్కూడా పదునెడుతోంది. ఎన్నికల ముందు లేదా ఎన్నికల తర్వాత ఏదో సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంపై ఆంక్షలు, రేషన్‌ విధానం అమల్లోకి తేవాలన్న కృతనిశ్చయంతో ఉంది.

తెలంగాణా ఎన్నికల వాతావరణం వచ్చినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై, కేసీఆర్ ఎలా చిందులు తోక్కుతున్నారో చూస్తున్నాం. తన పాలన గురించి చెప్పుకుని, ఓట్లు అడగటం చేత కాక, చంద్రబాబు పై వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తున్నారు. తెలంగాణా - ఆంధ్రా సెంటిమెంట్ రగిలించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో, చంద్రబాబుని తెలంగాణా ద్రోహిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా, చంద్రబాబుని అనరాని మాటలు అంటున్నారు కేసిఆర్. చివరకు బూతులు కూడా తిడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఈ రకంగా దిగాజరి పోయి మాటల దాడి చెయ్యటం ఎప్పుడూ లేదేమో.

kcr 22102018 2

అయితే ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు సడన్ గా కేసీఆర్ కు చంద్రబాబులోని పోజిటివ్ యాంగిల్ కనిపించింది. అందుకే చంద్రబాబుని చూసి నేర్చుకోండి అంటూ, తన శ్రేణులకి పిలుపిచ్చారు. అంతే కాదు, తాను ఎప్పుడూ పొగిడే జగన్ మోహన్ రెడ్డిలా ఉండద్దు అంటూ తన శ్రేణులకి చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళితే.. జగన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఓటమి పాలయ్యారని, ఇది గుర్తుంచుకోవాలి అంటూ చెప్పారు. ఆనాడు చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలో అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

kcr 22102018 3

చంద్రబాబు ఫార్ములాను, మీరు కూడా ఫాలో అవ్వండి, ఎక్కడా జగన్ లాగ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దు, చంద్రబాబులాగా పధ్ధతిగా కొట్టండి అంటూ పిలుపు ఇచ్చారు కెసిఆర్. ‘‘అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రయోజనం పొందిన ప్రతి లబ్ధిదారుడిని ఆ పార్టీ నేతలు కలిశారు. మొదటి గంటలోనే వారిని పోలింగ్‌ బూత్‌కు రప్పించారు. ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీ శిబిరంపై కన్నేశారు. లబ్ధిదారులందరినీ పోలింగ్‌ బూత్‌కు రప్పించడం ద్వారా ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఇప్పుడు మీరూ అదే వ్యూహాన్ని అనుసరించాలి. ప్రతి ఒక్క లబ్ధిదారుడిని కలవాలి. మొదటి గంటలోనే పోలింగ్‌ బూత్‌కు తీసుకు రావాలి’’ అని పార్టీ అభ్యర్థులకు కేసీఆర్‌ సూచించారు. అప్పట్లో జగన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో వ్యవహరించి ఓటమి పాలయ్యారని, అందువల్ల నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read