'తిత్లీ' తుఫాను బాధితుల వైపు కనీసం కన్ను ఎత్తి చూడకుండా, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విన్యాసాలు అందరూ చూస్తూనే ఉన్నారు. దసరా పండగకు మూడు రోజులు సెలవు తీసుకుని హైదరబాద్ చెక్కేసిన జగన్, కనీసం ఒక్క రోజు కూడా శ్రీకాకుళం రావాలనే ధ్యాస లేదు. అయితే, పెద్ద ఎత్తున దీని పై విమర్శలు రావటంతో, వైసీపీ కవర్ చెయ్యలేక ఇబ్బంది పడుతుంది. 'తిత్లీ' బాధితులను మరో పది రోజుల్లో వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని ఆ పార్టీ నేత భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. తిత్లీ తుఫాన్‌ను రాజకీయాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాడుకుంటున్నారని కరుణాకరరెడ్డి ఆరోపించారు. బాధితులకు సేవ చేయాల్సిన తరుణంలో తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ రోజు ధర్మాన ప్రసాద్ రావు ప్రెస్ మీట్ చూస్తుంటే, బీజేపీతో ఎలాంటి కుమ్మకు రాజకీయం చేస్తున్నారో అర్ధమవుతుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.3,460 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని... కేంద్ర ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రమే భరించాలన్నారు. అంటే కేంద్రం ఏమి ఇవ్వకపోయినా, మొత్తం రాష్ట్రమే భరించాలి అంట.. వీళ్ళు మాత్రం మోడీని ఒక్క మాట కూడా అనరు అంట.. ఎందుకు మా రాష్ట్రాన్ని ఆదుకోవటం లేదు అని కేంద్రాన్ని ప్రశ్నించరు అంట. ఇంత స్పష్టంగా వీళ్ళ కుమ్మక్కు రాజకీయం బయట పడుతుంది.
అంతే కాదు ధర్మాన మాట్లాడుతూ, తుఫాన్ ప్రాభావిత ప్రాంతాలలో పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తుఫాన్ బాధితులను కలుస్తారని తెలిపారు. ఈ లోపు జగన్ అక్కడకు వెళ్ళటం కుదరదని స్పష్టం చేసారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించిన ధర్మాన... బాధితులకు వైసీపీ సానుభూతిని తెలియజేస్తోందన్నారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో వైసీపీ అందరికంటే ముందుందని అన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి కేంద్రం ఇచ్చినా ఇవ్వకోయినా, రాష్ట్ర నిధుల నుంచే నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధారణంగా కేంద్ర విపత్తుల నిర్వహన కోసం నిధులిస్తోందని అవి ఉపయోగించకుండా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెట్టే ప్రయత్నంచేస్తోందని, కేంద్రాన్ని వెనకేసుకుని వచ్చారు.