నరేంద్ర మోదీ సర్కారు పాలనలో తమ బతుకు దుర్భరంగా మారిందని దేశంలోని నగర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, ఉపాధి కల్పన విషయాలు వారిని బాగా కలవరపెడుతున్నాయి. ధరల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మరింత పెరగకపోవచ్చనే ఆశ వారిలో తొంగిచూస్తోంది. రిజర్వుబ్యాంకు తాజాగా విడుదల చేసిన కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే ఫలితాలు... ఎన్నికల ముందు అధికార పక్షానికి ఆందోళన కలిగిస్తోంది. భారత ఆర్థిక పరిస్థితి అంచనాకు ఈ సూచీ అత్యంత కీలకం. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరు పట్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారన్నది వినియోగదారుల విశ్వాస సూచీ తెలియజేస్తుంది. జూన్‌- సెప్టెంబర్‌ మధ్య కాలంలో హైదరాబాద్‌ సహా 13 ప్రధాన ప్రధాన నగరాల్లో కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వేను ఆర్‌బీఐ నిర్వహించింది. 5364 మంది గృహస్థుల నుంచి సర్వేలో భాగంగా అభిప్రాయాలను సేకరించింది.

rbi 10102018 2

దీని వివరాలు రాజకీయంగా కీలకమైనవి. నిత్యావసరాల ధరవరలపై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నట్లు సర్వే చెబుతోంది. ఆర్థిక స్థితి ఈ జూన్‌ నెలలో 5.4 శాతం పతనాన్ని చూస్తే ఈ సారి ఏకంగా 10.6 శాతం అధోగతి ప్రయాణాన్ని వెల్లడిస్తోంది. ఇక నిరుద్యోగ విషయంలో యువతలో నిరాశా నిస్పృహలు పెల్లుబుకుతున్నట్లు 10.3 శాతం మేర పడిపోయిన గ్రాఫ్‌ వివరిస్తోంది. ధరవరల విషయంలో మూణ్ణెల్ల కిందటితో పోలిస్తే పతనం స్వల్పమే అయినా మరింత ఎక్కువ మంది ప్రజలు పెదవి విరుస్తున్నట్లు సర్వే బయటపెట్టింది. మొత్తం మీద వినియోగ దారుల విశ్వాసం ఏకంగా 4% పడిపోయింది. జూన్‌లో 98.3 పాయింట్లు కాగా ఇప్పుడు 94,8 పాయింట్లు. ముఖ్యంగా పెట్రోధరల పెరుగుదల, దాని పర్యవసానంగా నిత్యావసరాల పెరుగుదల ప్రజల్లో అసంతృప్తికి కారణమైనట్లు నిపుణుల విశ్లేషణ. అధికార పార్టీ వర్గాలు సర్వేలోని అభిప్రాయాలను తేలిగ్గా తీసుకున్నాయి.

rbi 10102018 3

కానీ ఈ సర్వే ఓటర్లలో ఎక్కువ శాతం ఉండే యువత అభిప్రాయాలకు అద్దం పడుతుందని నిపుణులు అంటున్నారు. 2013 డిసెంబరులో కూడా ఇలాంటి సర్వే చేశారు. 29.1 శాతం మంది మాత్రమే ఉద్యోగాల కల్పన ఏడాది క్రితం కంటే మెరుగుపడిందని అభిప్రాయపడ్డారు. 34.4 శాతం మంది గత ఏడాది కన్నా ఘోరంగా తయారైందని చెప్పారు. తుది ఫలితం -5.3 శాతంగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. 2018 సెప్టెంబరులో చేసిన తాజా సర్వేలో 35.2 శాతం మంది ఉద్యోగాల పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే మెరుగుపడిందన్నారు. 45.5 శాతం మంది గత ఏడాదితో పోలిస్తే దిగజారిందన్నారు. తుది ఫలితం -10.3 శాతం చూస్తే ఉద్యోగ కల్పన విషయంలో ప్రజల్లో ఏ మాత్రం భరోసా లేదని స్పష్టమవుతోంది.

మోడీ నిరంకుశ పాలనకు విపక్షాలు అన్నీ ఏకం అవుతున్నాయి. పెట్రోల్ రేటు పెరుగుదల, రూపాయి పతనం పై, ఇప్పటికే కేంద్రం ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేసింది. రాఫెల్ స్కాం పై నోరు మెదపటం లేదు. ఈ తరుణంలో, ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ప్రదర్శనకు హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. అయితే, వివిధ రాష్ట్రాల బీజేపేతర పార్టీలను ఆహ్వానించిన దీదీ కెసిఆర్ ను మాత్రం పిలవలేదు. కెసిఆర్ ఆడుతున్న నాటకాల పై మమత కోపంగా ఉన్నారని, అందుకే పిలవలేదని తెలుస్తుంది. అయితే ఈ పరిణామంతో, ఇప్పటికే మోడీకి, కెసిఆర్ దగ్గర అనే అభిప్రాయం బలపడుతుందని, ఓటింగ్ పై ప్రభావితం ఉంటుందేమో అని తెరాస ఆందోళన చెందుతుంది.

mamata 10102018 2

ఒకసారి ఫెడరల్ ఫ్రంట్ అని కెసిఆర్, కలకత్తా వెళ్లి, తరువాత మోడీ పంచన చేరటంతో, కెసిఆర్ మోడీ మనిషి అనే విషయం మమతకు అర్ధమైంది. అనేక సందర్భాల్లో మోడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, కెసిఆర్ ఎక్కడా అడ్రస్ లేడు. దీంతో మోడీ, కెసిఆర్ ఒక్కటే అనే అవగాహనకు వచ్చిన దీదీ, కెసిఆర్ ను పిలవలేదు. అయితే చంద్రబాబుని మాత్రం రమ్మని లేఖ రాసారు. అంతే కాదు, మమత పెట్టబోయే ఫ్రంట్ కు చంద్రబాబు కన్వీనర్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. మోడీని డీ కొట్టే దమ్ము ఉన్న వాడు, చంద్రబాబు మాత్రమే అని మిగతా పక్షాలు కూడా నమ్ముతున్నాయి.

mamata 1010201  3

మమత చంద్రబాబుకి లేఖ రాస్తూ, ‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. లౌకికవాదాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుంది. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దాం. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’’అని లేఖలో వివరించారు.

వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల విడుదలలో కేంద్రం వివక్షపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేసి... ఏపీకి మొండిచేయి చూపడంపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్తా కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నిధులపై మంగళవారం ఇక్కడ సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ వివక్షను ప్రశ్నిస్తూ కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించారు. ఇదే పద్దు కింద గతంలో రూ.350 కోట్లు ఇచ్చి కేంద్రం మళ్లీ వెనక్కు తీసుకోవడాన్ని కూడా లేవనెత్తాలని నిశ్చయించారు. సీఎం లేఖకు ప్రతిస్పందన రానిపక్షంలో టీడీపీ ఎంపీల బృందం వచ్చేవారం ఢిల్లీ వెళ్లి అక్కడ మంత్రులు, అధికారులను కలిసి గట్టిగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

cbn 10102018 2

రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. కేంద్రం వివక్షపై బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు నోరు తెరవకపోవడంపైనా గట్టిగా ప్రశ్నించాలని నిర్ణయానికొచ్చారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు ఇచ్చి.. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించకపోవడం సమంజసమేనా అని రాష్ట్ర భూగర్భ గనుల మంత్రి సుజయకృష్ణ రంగారావు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాలకు వెంటనే రూ.700 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

cbn 10102018 3

రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడంలేదని ప్రశ్నించారు. కేంద్రంతో చేసుకున్న చీకటి ఒప్పందాలను వారు బయటపెట్టాలని మంగళవారం సచివాలయంలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు అన్యాయం గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జగన్‌, పవన్‌ ఏ ముఖంపెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

వివాదాస్పదంగా మారిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, ఈ ఒప్పందం కుదుర్చుకోవడంపై నిర్ణయం తీసుకున్న ప్రక్రియ గురించి వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విమానాల ధర, సాంకేతిక అంశాలకు సంబంధించిన వివరాలు అవసరం లేదని కోర్టు వెల్లడించింది. అక్టోబరు 29లోగా ఆ వివరాలను వెల్లడించాలని చెప్పింది. రఫేల్‌ ఒప్పంద నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారో తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. దేశ రక్షణ అంశమైనందున వ్యయాల విషయాన్ని అడగబోమని కోర్టు స్పష్టం చేసింది.

rafel 10102018 2

భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రూ.59వేల కోట్లతో 36యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన డసో కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మ వాదించారు. ఈ కేసు జాతీయ భద్రతకు సంబంధించిందని, దీన్ని రాజకీయం చేస్తున్నారని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబరు 31న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.

rafel 10102018 3

మరోవైపు రాఫెల్‌కు సంబంధించిన అంశంపై ఎలాంటి అధికార నోటీసులు ఇవ్వడంలేదని స్పష్టం చేసింది న్యాయస్థానం. అంతేకాదు రాఫెల్ ఒప్పందంకు సంబంధించిన పిల్‌లో చేసిన ఆరోపణల ఆధారంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేదని... కేవలం సమాచారం తెలుసుకునేందుకు సీల్డ్ కవర్‌లో వివరాలను అడిగినట్లు ధర్మాసనం వెల్లడించింది. వాదనల సందర్భంగా కేంద్రం తరపున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్- ఇది కేవలం రాజకీయ లబ్ధికోసమే వేశారని ఇందులో దేశ భద్రతా అంశాలు మిళితమై ఉన్నందున బహిర్గతం చేయలేమన్నారు. వెంటనే పిటిషన్‌ను డిస్మిస్ చేయాల్సిందిగా కేకే వేణుగోపాల్ న్యాయస్థానాన్ని కోరారు.

Advertisements

Latest Articles

Most Read