నిన్న అర్దారాత్రి ఉన్నట్టు ఉండి, ఐటి అధికారులు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ నుంచి విజయవాడలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అవ్వటంతోనే విజయవాడ కమీషనర్, గుంటూరు ఎస్పీకి ఫోన్ చేసి, ఐటి దాడులు చెయ్యబోతున్నాం, అరగంట ముందు ఎక్కడకు వెళ్ళేది సమాచారం ఇస్తాం, మీరు రక్షణ ఇవ్వాలి అని చెప్పారు. దీంతో పోలీసుల నుంచి, ఈ సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందింది. దాదాపు 150 అధికారులు పెద్ద ఎత్తున రావటంతో, తెలుగుదేశం నాయకుల పై దాడులు చేస్తారని అర్ధమైంది. అయితే, అర్దరాత్రి ఈ విషయం తెలిసినా, వెంటనే రాష్ట్రమంతా పాకింది. తెల్లారు ఐటి దాడులు మొదలు పెట్టాల్సి ఉన్నా, సమాచారం అందరికీ తెలిసిపోవటంతో ఐటి అధికారులు షాక్ అయ్యారు. ఆటోనగర్ లో ఐటి కార్యాలయంలో సామవేసం అయ్యారు సమాచారం అందటంతో, మీడియా అక్కడ వాలి పోయింది.
దీంతో ఐటి అధికారులు వ్యూహం మార్చారు. మీడియాను డైవర్ట్ చెయ్యటానికి, రెండు బృందాలు బయలు దేరటంతో, మీడియా వారిని ఫాలో అయ్యింది. వీళ్ళు, బెంజ్ సర్కిల్ లోని నారాయణ కాలేజీ దగ్గరకు రావటంతో, నారయణ పై దాడులు చేస్తున్నారని వార్తా బయటకు వచ్చింది. అయితే, మీడియాను ఇటు డైవర్ట్ చేసి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వ్యాపారవేత్తల పై దాడులు మొదలు పెట్టారు. రాజకీయ నాయకుల పై దాడులు జరుగుతాయిని అందరూ అనుకున్న టైములో, వ్యుహ్యం మార్చి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పారిశ్రామికవేత్తల పై దాడులు మొదలు పెట్టారు.
విజయవాడ, గుంటూరులోని కన్స్ట్రక్షన్ ఆఫీసుల్లో సోదాలు మొదలు పెట్టారు. సదరన్, వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీల్లో, జగ్గయ్యపేట సమీపంలో సిమెంట్ బ్రిక్స్ తయారీ కంపెనీల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ వినాయక్ ధియేటర్ దగ్గర ఒక ఆఫీస్ పై కూడా దాడులు జరుగుతున్నాయి. మరో పక్క ఇప్పటికే నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచే తెలుగుదేశం నాయకుడు బీదా మస్తాన్ రావ్ పై దాడులు జరుగుతున్నాయి. ఈ ఉదయం శ్రీకాకుళం , జిల్లాలో కూడా ఐటి సోదాలు ప్రారంభామయ్యాయి. పలాసలో ఐటి అధికారుల విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నారు. జీడిపప్పు పరిశ్రమ యజమానుల పై ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. అయితే, వీరంతా మా రికార్డు లు అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నందుకే మా పై దాడులు చేస్తున్నారని చెప్తున్నారు.