నిన్న అర్దారాత్రి ఉన్నట్టు ఉండి, ఐటి అధికారులు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ నుంచి విజయవాడలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అవ్వటంతోనే విజయవాడ కమీషనర్, గుంటూరు ఎస్పీకి ఫోన్ చేసి, ఐటి దాడులు చెయ్యబోతున్నాం, అరగంట ముందు ఎక్కడకు వెళ్ళేది సమాచారం ఇస్తాం, మీరు రక్షణ ఇవ్వాలి అని చెప్పారు. దీంతో పోలీసుల నుంచి, ఈ సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందింది. దాదాపు 150 అధికారులు పెద్ద ఎత్తున రావటంతో, తెలుగుదేశం నాయకుల పై దాడులు చేస్తారని అర్ధమైంది. అయితే, అర్దరాత్రి ఈ విషయం తెలిసినా, వెంటనే రాష్ట్రమంతా పాకింది. తెల్లారు ఐటి దాడులు మొదలు పెట్టాల్సి ఉన్నా, సమాచారం అందరికీ తెలిసిపోవటంతో ఐటి అధికారులు షాక్ అయ్యారు. ఆటోనగర్ లో ఐటి కార్యాలయంలో సామవేసం అయ్యారు సమాచారం అందటంతో, మీడియా అక్కడ వాలి పోయింది.

it 051020118 2

దీంతో ఐటి అధికారులు వ్యూహం మార్చారు. మీడియాను డైవర్ట్ చెయ్యటానికి, రెండు బృందాలు బయలు దేరటంతో, మీడియా వారిని ఫాలో అయ్యింది. వీళ్ళు, బెంజ్ సర్కిల్ లోని నారాయణ కాలేజీ దగ్గరకు రావటంతో, నారయణ పై దాడులు చేస్తున్నారని వార్తా బయటకు వచ్చింది. అయితే, మీడియాను ఇటు డైవర్ట్ చేసి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వ్యాపారవేత్తల పై దాడులు మొదలు పెట్టారు. రాజకీయ నాయకుల పై దాడులు జరుగుతాయిని అందరూ అనుకున్న టైములో, వ్యుహ్యం మార్చి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పారిశ్రామికవేత్తల పై దాడులు మొదలు పెట్టారు.

it 051020118 3

విజయవాడ, గుంటూరులోని కన్‌స్ట్రక్షన్ ఆఫీసుల్లో సోదాలు మొదలు పెట్టారు. సదరన్‌‌‌‌, వీఎస్‌ లాజిస్టిక్స్‌ కంపెనీల్లో, జగ్గయ్యపేట సమీపంలో సిమెంట్ బ్రిక్స్‌ తయారీ కంపెనీల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ వినాయక్ ధియేటర్ దగ్గర ఒక ఆఫీస్ పై కూడా దాడులు జరుగుతున్నాయి. మరో పక్క ఇప్పటికే నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచే తెలుగుదేశం నాయకుడు బీదా మస్తాన్ రావ్ పై దాడులు జరుగుతున్నాయి. ఈ ఉదయం శ్రీకాకుళం , జిల్లాలో కూడా ఐటి సోదాలు ప్రారంభామయ్యాయి. పలాసలో ఐటి అధికారుల విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నారు. జీడిపప్పు పరిశ్రమ యజమానుల పై ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. అయితే, వీరంతా మా రికార్డు లు అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నందుకే మా పై దాడులు చేస్తున్నారని చెప్తున్నారు.

ప్రచారం జరుగుతున్నట్టే, అమరావతిలో ఐటి అధికారులు విరుచుకుపడ్డారు. ఉదయం 5 గంటలకు సమావేశం అయిన ఐటి అధికారులు, మొత్తం ప్లాన్ చేసుకుని, కొద్ది సేపటి క్రితం ఆటోనగర్ ఐటి కార్యాలయం నుంచి వీళ్ళు బయలుదేరారు. ముందుగా ఫస్ట్ టార్గెట్ గా మంత్రి నారయణ పై దాడులు మొదలు పెట్టారు. ముందుగా మంత్రి నారయణ కాలేజీలు, ఆయాన ఇంటి పై దాడులు మొదలు అయ్యాయి. మరో బృందం గుంటూరు వెళ్ళింది. వీళ్ళు గుంటూరులో ఎవరి మీద దాడులకు వెళ్తున్నారో తెలియాల్సి ఉంది. స్థానిక పోలేసుల సహాయంతో, మంత్రి నారాయణ కాలేజీల పది దాడులు జరుగుతున్నాయి.

narayana 05102015 2

అయితే నారాయణ వ్యాపారాల పై దాడులు చేస్తున్నారా లేక పొతే, ఈయన శాఖ పై దాడులు జరుగుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. అందరూ అనుకున్నట్టే, దాడులు మొదలు అయ్యాయి. 16 మంది పై దాడులు చేస్తున్నాం అంటూ, ఐటి అధికారులు లీక్ ఇచ్చినట్టు సామాచారం. గుంటూరు జిల్లాలో ఒక కీలక నేత పై దాడులు చెయ్యబోతున్నాం అంటూ లీక్ ఇచ్చారు. ‘రాజధాని’ జిల్లాలు కృష్ణా, గుంటూరులో అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటున్న ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం! దీనికోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ సిబ్బంది సమాయత్తమైనట్లు చెబుతున్నారు.

narayana 05102015 3

ఎలాంటి ఆటంకాలు లేకుండా సోదాలు జరిపేందుకు వీలుగా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు యంత్రాంగాన్ని వీరు కోరినట్లు తెలిసింది. ‘‘ఒక అరగంట ముందు చెబుతాం! ఆ వెంటనే మీరు మాతోపాటు కలిసి రావాలి. బందోబస్తు కల్పించాలి’’ అని అడిగినట్లు సమాచారం! నిజానికి... అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే ప్రముఖులపై ఐటీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిజానికి... రెండు మూడు నెలలుగా రాజధాని జిల్లాలపై ఐటీ కన్నేసింది. రాజధాని ప్రాంతంలోని ఒకే సామాజిక వర్గానికి చెందినా, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలతో జాబితా రూపొందించుకుంది.

నిజామాబాద్ వేదికగా టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో విపక్షాలపై, మహాకూటమి పొత్తులపై తిట్ల దండకం అందుకున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... అయితే కేసీఆర్ తిట్ల పురాణం చూస్తే ఆయనలో ఎన్నికల భయం కనిపిస్తోందన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... 2009లో టీడీపీతో, 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం కేసీఆర్ మరిచారా? పిల్లి శాపనార్దాలకు ఉట్లు తెగుతాయా? కేసీఆర్ శాపనార్ధాలతో రాజకీయం మారుతుందా..? అంటూ మండిపడ్డారు.కేసీఆర్‌ గతంలో చెప్పిన మాటలు మరచిపోయారన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని గతంలో అన్నారని మంత్రి గుర్తుచేశారు.

kcr 004102018

తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయిందంటే కారణం చంద్రబాబేనన్న సోమిరెడ్డి... హైదరాబాద్ అభివృద్ధి జరిగిందంటే కారణం చంద్రబాబే.... బాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అని కేటీఆర్ గతంలో చెప్పిన మాటలు కేసీఆర్ మరచిపోయినట్టున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కేబినెట్‌లో సగం మందిది టీడీపీ బ్రాండే నని గుర్తు చేశారు సోమిరెడ్డి... ఆంధ్రులను తిడితేనే రాజకీయం చేయొచ్చనే కాలం చెల్లిందని... చంద్రబాబును తిడితే కేసీఆర్‌కు నష్టమే తప్ప... లాభం ఉండదన్నారు. ఇక రూ. 500 కోట్లు... మూడు హెలీకాప్టర్లను పంపాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేసిన ఏపీ మంత్రి... మా పోరాటం స్వచ్ఛంగా ఉంటుంది. తెలంగాణలో టీడీపీ లేదన్న కేసీఆర్ ఇప్పుడు టీడీపీని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

kcr 004102018

టీఆర్ఎస్ అంతా టీడీపీ బ్రీడే... ప్రధాని మోడీ దగ్గర నుంచి కేసీఆర్ వరకు అంతా చంద్రబాబుని చూసి భయపడిపోతున్నారని వెల్లడించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలంగాణ ఉన్నన్నాళ్లూ టీడీపీ ఉంటుందని.. నిరాశ, నిస్పృహలతోనే కేసీఆర్ తమ అధినేతపై ఆరోపణలు చేశారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని.. వాటని ప్రజలు హర్షించరని సోమిరెడ్డి అన్నారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో కేసీఆర్ ఎందుకు పొత్తుపెట్టుకున్నారని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చెప్పారు.

ఆపరేషన్ గరుడలో చెప్పిన ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా, షడ్యుల్ ప్రకారం జరుగుతుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, మోడీ పై చంద్రబాబు చేస్తున్న రాజకీయ పోరాటంతో, గుజరాత్ బ్రదర్స్ మోడీ, షాలు చంద్రబాబు పై కక్ష పెంచుకున్నారు. గత మూడు నాలుగు నెలలుగా చంద్రబాబు అంతు చూస్తాం, చంద్రబాబుని జైల్లో పెడతాం, చంద్రబాబుని పదవిలో నుంచి దించేస్తాం అంటూ బహిరంగంగానే బీజేపీ నేతలు మాట్లాడటం చూసాం. దానికి తగ్గట్టుగానే కోర్ట్ ల్లో కేసులు వేసినా, ఏమి లాభం లేకపోవటంతో, ఇప్పుడు తమ చేతుల్లో ఉన్న ఐటి, ఈడీ, సిబిఐ లకు ఢిల్లీ పెద్దలు పని చెప్పారు. ఇప్పటికే తెలంగాణాలో రేవంత్ రెడ్డి పై దాడులు చేసి, దానికి చంద్రబాబుకు లంకె పెట్టే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు.

it 05102018 2

చంద్రబాబు, లోకేష్ మీద డైరెక్ట్ గా దాడి చేస్తే, అది దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యి, అన్ని విపక్షాలు మరింత బలంగా ఏకం అయ్యే అవకాసం ఉండటంతో, తెలుగుదేశం పార్టీలో ఆర్ధికంగా బలంగా ఉన్న నేతల పై, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యాపార వేత్తల పై, దాడులకు ఢిల్లీ నేతలు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా, నిన్న రాత్రి, వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం దాడులకు సిద్ధంగా ఉండాలని పోలీసు అధికారులను ఐటీ బృందాలు కోరడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ దాడులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

it 05102018 3

అయితే ముఖ్యంగా ఒకే సామాజికవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు జరగనున్నాయి. కృష్ణా జిల్లాలో ఒక ఎంపీ, గుంటూరు జిల్లాలో ఒక మంత్రి వారికి మెయిన్ టార్గెట్ అని తెలుస్తుంది. గురువారం నెల్లూరులో తెదేపా నాయకుడు బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విజయవాడకు ఆదాయపు పన్ను శాఖ బృందాలు చేరుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. భారీగా బృందాలు విజయవాడకు చేరుకోవడంతో స్థానికంగా ఉన్న నేతలు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏకకాలంలో పలువురు రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిన్న ఉదయమే చంద్రబాబు కూడా ఈ విషయం పై నేతలను హెచ్చరించారు. మన మీద బాగా కసిగా ఉన్నారు, ఏదైనా జరగోచ్చు సిద్ధంగా ఉండండి అని, చెప్పిన కొద్ది సేపటికే, ఐటి అధికారులు విజయవాడలో వాలిపోయారు.

Advertisements

Latest Articles

Most Read