ఆయన పేరు ఎస్ఎస్ రావత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా ఎస్ఎస్ రావత్ ఉన్నారు. ఆర్ధిక శాఖ అంటే, ఆయన పైన ఎంతటి ఒత్తిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. కొత్త అప్పులు పుడితేనే రోజు గడిచే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రతి వారం అప్పులు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. అప్పులు మోసం చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీరు కేంద్రం పట్టేసింది. ఇదే సమయంలో కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న ఆర్ధిక అరాచకం పైన, 26 పేజీల లేఖ వచ్చింది. దీని పై వివరణ కోరారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి అస్తవ్య్వస్తంగా మారటం, అప్పుల కోసం ప్రతి వారం కేంద్రం వద్దకు వెళ్లి తిరగటం, ఇలా అనేక సంఘటనలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిన తరుణంలో, 26 పేజీల లేఖ రాసి, వీటి అన్నిటికీ సరైన వివరాలు పంపాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. దీనికి సంతృప్తికరమైన సమాధానాలను, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పోయింది. ఇందులో కూడా తప్పులు తడకలతో, కేంద్రాన్ని కూడా బురిడీ కొట్టించే ప్రయత్నం చేసారు. దీంతో కేంద్రం ఈ విషయాల పై తేలే వరకు కొత్త అప్పులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.
కొత్త అప్పులు ఇవ్వాలి అంటే, ముందు పాత అప్పుల్లో జరిగిన అవకతవకల పై సరైన సమాధానం ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది. నెల రోజుల క్రితం ప్రధాని మోడీని, కలిసిన జగన్ మోహన్ రెడ్డి, తమకు రూ.55 వేల కోట్ల వరకు అదనపు అప్పులు ఇవ్వలేని జగన్ మోహన్ రెడ్డి కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని పైన సానుకూలంగా స్పందించ లేదు. పైగా కేంద్రం ఎదురు రాష్ట్రాన్ని కొన్ని ప్రశ్నలు అడగటం, దానికి సంతృప్తికర సమాధానాలు చెప్పకపోవటంతో, అసలు ఇస్తాను అని చెప్పిన అప్పు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయితే పోయిన వారం కొత్త అప్పు కోసం రావత్, బుగ్గన ఢిల్లీ వెళ్లారు. బుగ్గనను బయటకు పంపించిన కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు, రావత్ కు క్లాస్ పీకినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు చెప్పినట్టు మనం ఆడితే ఎలా ? నిబంధనలు చెప్పాలి కదా అని రావత్ మీద ఫైర్ అవ్వటంతో, అయన మనస్తాపం చెందినట్టు చెప్తున్నారు. ఆయన వారం రోజులు పాటు సెలవు పెట్టి వెళ్ళిపోయినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.