అమిత్ షా నుంచి వచ్చిన ఆదేశాలు, బీజేపీ పార్టీతో ఉన్న అవగాహన కోసం, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న త్యాగాలు అన్నీ ఇన్నీ కావు... జగన్ పార్టీలో చేరటానికి రెడీ అయిన కన్నా లక్ష్మీ నారాయణని, అమిత్ షా ఆదేశాల ప్రకారం రాత్రికి రాత్రి హాస్పిటల్ లో చేరి, తెల్లారే సరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు, ఈ కన్నా లక్ష్మీ నారాయణను వచ్చే ఎన్నికల్లో గెలిపించటానికి, సొంత పార్టీలో నమ్మిన బంటుకు హ్యాండ్ ఇచ్చాడు. ఇదంతా అమిత్ షా ఆదేశాల ప్రకారమే. ఈ వ్యవహారానికి మూల కారణం గుంటూరు వెస్ట్ సీట్. ముఖ్యంగా గుంటూరు నగరంలో తొలి నుంచి వీర విధేయునిగా వ్యవహరిస్తూ 24 గంటలూ పార్టీ కోసమే పరితపించే నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వటం లేదని ఆ పార్టీ అధినేత తేల్చి చెప్పేశారు.

kanna 02102018 2

గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అప్పిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరుపున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయటంతో ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్‌తో వైసీపీకి పడాల్సిన 20 వేలకు పైగా ఓట్లను చీల్చుకోవటంతో అప్పిరెడ్డి రెండోస్థానంలో నిలవాల్సి వచ్చింది. ఓటమి అనంతరం కూడా అప్పిరెడ్డినే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో నిత్యం ప్రజలతో మమేకమై పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. వాస్తవానికి గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా బలం పుంజుకున్నాడని ఆ పార్టీ శ్రేణులే ఒప్పుకుంటున్నాయి.

kanna 02102018 3

ఇటువంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్పిరెడ్డి లాంటి నేతను కాకుండా, బలహీన అభ్యర్ధి ఏసురత్నంను నియమించటం వెనుక, కన్నా లక్ష్మీ నారయణను గెలిపించే ఎత్తుగడ ఉంది. బీజేపీ, వైసిపీ కలిసి కన్నా లక్ష్మీ నారాయణను గెలిపించే ప్రయత్నంలో భాగంగా జగన్ ఈ ప్లాన్ వేసారు. ఇదంతా అమిత్ షా ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో మరిన్ని సీట్లు, జగన్, పవన్ తో ఇలాంటి అవగాహనే చేసుకుని, చంద్రబాబును ఓడించే ప్రయత్నం చెయ్యనున్నారు. అప్పిరెడ్డి అభిమానులు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసినా, తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఎదురైనా, జగన్ మాత్రం నా చేతుల్లో ఏమి లేదని తేల్చి చెప్పేశారు.

పవన్ కళ్యాణ్ ఏమి సాధించాలనుకుంటున్నారు ? తనకు ఉన్న అత్యధిక మంది యువ ఫాన్స్ కి ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు ? వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా మార్చాలని అనుకుంటున్నారా ? అసలు పవన్ లక్ష్యం ఏంటి ? ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజల్లో తిరిగే సమయంలో, తన పార్టీ గురించి చెప్పుకోవాలి కాని, ఎంత సేపు తన సొంత డబ్బా ఎందుకు కొట్టుకుంటున్నాడు ? ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు ఎందుకు ? వీటి అన్నిటికీ జవాబు ఆపరేషన్ గరుడేనా ? శాంతి బధ్రతల సమస్య లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నాడా ? కులాల గొడవలకు ప్లాన్ చేస్తున్నాడా ? ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం రోజు రోజుకీ రెచ్చిపోతున్నాడా ? పవన్ ప్రసంగాలు, జరుగుతున్న పనులు చూస్తే అవును అనే అనిపిస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా, ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే పార్టీ శ్రేణులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

pk cbn 01102018

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్రాప్‌లో ప‌డ‌కుండా టీడీపీ హైక‌మాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప‌వ‌న్‌ వరుసగా విమ‌ర్శలు చేస్తున్నా టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా వాటిని రాజ‌కీయాంగా తిప్పికొడుతోంది తప్ప ప‌వ‌న్ వ్యక్తిగ‌త విష‌యాల జోలికి వెళ్ళడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఎప్పటిక‌ప్పుడు నిశితంగా గ‌మ‌నిస్తూ పార్టీ నేత‌ల‌కు డైర‌క్షన్ ఇస్తున్నారు. ఎవ‌రి ట్రాప్‌లో పార్టీ నేత‌లు ప‌డ‌కుండా దిశానిర్దేశం చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్రాప్‌లో అస‌లు టీడీపీ నేత‌లు ప‌డ‌కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

pk cbn 01102018

నిన్న మొన్నటి వ‌ర‌కు చంద్రబాబు, లోకేష్‌లే టార్గెట్‌గా జ‌న‌సేనాని విమ‌ర్శలు చేశారు. కానీ తాజాగా ప‌వ‌న్ వ్యూహం మార్చారు. ప్రస్తుతం ప‌శ్చిమ‌లో ప‌ర్యటిస్తున్న ప‌వ‌న్ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శలు చేస్తున్నారు. చింత‌మ‌నేని దూకుడుతో, ఆయన పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారేమో అని అందరూ భావించారు. కాని చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాలతో ఎక్కడా బ్యాలన్సు తప్పలేదు. ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్యలు విమ‌ర్శలు చూస్తుంటే క‌చ్చితంగా అది ప్రాంతాలు, కులాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబ‌ట్టి, ఆయ‌న ఎంత రెచ్చగొట్టే విధంగా ప‌ర్సన‌ల్‌గా టార్గెట్ చేసినా వాటిని రాజ‌కీయంగానే తిప్పికొట్టాలి త‌ప్ప వేరే విధంగా తీసుకోవ‌ద్దని పార్టీ నేత‌ల‌కు సూచిస్తున్నారు చంద్రబాబు. ఇదే ఇప్పుడు పవన్ ను మరింత ఇరిటేట్ చేస్తుంది. అందుకే, రోజు రోజుకీ పవన్ సంయమనం కోల్పుతూ, వ్యాఖ్యలు చేస్తున్నారు.

విశాఖపట్నం ఏజెన్సీ పాడేరులో “మన్యం గిరిజనుల” పేరుతో కనిపిస్తున్న పోస్టర్లు కలకలం రేపాయి. గిరిజన నేతలు కిడారి సర్వేశ్వర్రావు, సివేరి సోమ హత్యలను నిరసిస్తూ ఈ పోస్టర్లు వెలిసాయి. పాడేరు బస్టాండ్‌తోపాటు, అంబేద్కర్ సెంటర్‌లోనూ వీటిని అతికించించారు. మావోలు బలంగా ఉన్న చోట, వారి పై ఇంత ధైర్యంగా, వ్యతిరేక పోస్టర్లు రావటంతో, అందరూ అవాక్కయ్యారు. అమాయక ప్రజల్ని చంపే కర్కశత్వం మావోయిస్టులది.. ప్రజాసేవే పరమావధి మా నాయకులది అంటూ వీటిల్లో రాశారు.

araku 011102018

కిడారి, సివేరి మా హీరోలంటూ పేర్కొన్నారు. పిరికిపంద చర్యలకు పాల్పడిన మావోయిస్టులు జీరోలు అంటూ.. పట్టణంలో ఈ పోస్టర్లు అంటించారు. గిరిజన నేతల్ని చంపడం నూతన ప్రజాస్వామ్యా అంటూ మావోయిస్టులను సూటిగా ప్రశ్నించారు. మావోయిస్టులే అసలైన గిరిజన ద్రోహులంటూ గోడపత్రికల్లో ప్రముఖంగా రాశారు. నక్సలైట్ల ఉన్మాదాల పాపం పండిందని, కర్కసత్వానికి కాలం చెల్లిందని హెచ్చరించారు. రెండు రోజుల క్రితం కూడా, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆత్మఘోష పేరుతో కరపత్రం విడుదలయింది.

araku 011102018

కరపత్రంలో... ‘నేనొక మాజీ ఎమ్మెల్యేని, ఆరుగురు పిల్లలు, భార్య కలవాడిని, ఎదిగొచ్చిన కొడుకులకు ఉద్యోగాలు కూడా లేవు, సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేనేం తప్పు చేశాను? ఒకవేళ తప్పు చేసి ఉంటే ఒక వార్నింగ్‌ అయినా ఇచ్చారా? లేదు. నన్నెందుకు చంపారు? ఇంత వరకు చెప్పలేకపోయారు? నేను ఏవర్గానికి శత్రువుని? మావోయిస్టులారా చెప్పండి? కుహనా హక్కుల సంఘలైనా మీరైనా చెప్పండి ? అంటూ పేర్కొంది. ఈ ప్రశ్నల దిగువున సివేరి సోమ అంటూ హత్యకు గురై రక్తపు మడుగుల్లో చనిపోయిన మృతదేహం ఫొటోతో పాటు పాస్‌పోర్టు ఫొటో కూడా ముద్రించి ఉంది. ఎర్రని పేపర్లో పసుపు అక్షరాలతో కరపత్రం విడుదల చేశారు. ఈ కరపత్రం వాట్సాప్‌ల్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో పూర్వవైభవం కోసం తాపత్రయపడుతోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగిందని తిరస్కరించిన ప్రజల్లో, మళ్లీ విశ్వాసం కల్పించేందుకు సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నారు. నరేంద్ర మోడీ హోదా విషయంలో నమ్మించి మోసం చెయ్యటం, పోరాడాల్సిన ప్రతిపక్షాలు మోడీ కి సరండర్ అవ్వటంతో, వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా ఉన్న రాహుల్ చేత హోదా పై ప్రకటన వచ్చేలా చేసింది. ఏపీకి కేంద్రం బాకీ పడింది. హోదా దయాదాక్షణ్యాల మీద ఇచ్చేది కాదు. ఏపీ ప్రజల హక్కు.. మళ్లీ అధికారంలోకి వస్తే రుణం తీర్చుకుంటామని రాహుల్ కర్నూలు సభలో ప్రకటించారు.

jagan 01102018 2

అంతకుముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా తీర్మానం చేశారు. ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం తొలి సంతకం పెడుతుందని భరోసా ఇస్తున్నారు. తాము చేసిన పొరపాటును దిద్దుకుంటామని ఆ ఛాన్స్‌ ఇవ్వాలని ఏపీ జనాల్లోకి వస్తోంది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ హోదా ఇస్తాం అని చెప్పటం, రాహుల్ గాంధీ కర్నూల్ సభ, కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ తరువాత, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై జగన్ ఒక సర్వే చేపించారు. నిజానికి కాంగ్రెస్ గురించి పెద్దగా లెక్క చేసే పని లేకపోయినా, కాంగ్రెస్ కు పడే ప్రతి ఓటు, తన దగ్గర నుంచే వెళ్తుంది అనేది జగన్ నమ్మకం. అందుకే, కాంగ్రెస్ పరిస్థితి పై జగన్ సర్వే చేపించారు.

jagan 01102018 3

ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 4 శాతం ఓటు బ్యాంకు పెరిగినట్టు తెలుసుకుని, జగన్ అవాక్కయ్యారు. 1 శాతం కూడా లేని కాంగ్రెస్ 4 శాతం వచ్చింది అంటే, అది తన మీద వ్యతిరేకతతో, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేక, కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిన ఓటు బ్యాంక్ గా జగన్ గుర్తించారు. ఇప్పటికే టీడీపీని ఢీ కొట్టగలమా అన్న సందేహాలున్నాయి. ఉన్న బలం చాలదన్న నివేదికలు కళ్లముందున్నాయి. రాష్ట్రానికి అన్యాయం చేశారన్న అభిప్రాయం బలంగా ఉన్న మోడీ ప్రభుత్వానికి దగ్గరయ్యామన్న ప్రచారమూ జనాల్లోకి బాగానే వెళ్లింది. ఇక రాహుల్ రూపంలో కాంగ్రెస్ కూడా ఇక్కడ బలపడితే ఓటు చీలుతుందన్న భయం వైసీపీని నీడలా వెంటాడుతోంది. అందుకే జగన్ ఇప్పుడు కొత్త వ్యూహంతో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్ది పాటి నాయకులని కూడా తన పార్టీలోకి లాగేలా వ్యూహం రచిస్తున్నారు. ఈ బాధ్యత విజయసాయి రెడ్డికి అప్పచెప్పారు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read